పాకిస్థాన్ టెన్నిస్ ప్లేయర్ ఆసిమ్ ఉల్ హక్ ఖురేషి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందులో భాగంగానే అతని నిశ్చితార్ధం గురువారం నాడు లాహోర్‌లో ఘనంగా జరిగింది. భారత, పాక్ టెన్నిస్ ద్వయంలో ఒకరైన ఖురేషి, రోహన్ బోపన్నతో కలిసి అనేక విజయాల్లో పాలుపంచుకున్నారు. 2007 నుంచి భారత,పాక్ మైత్రికి చిహ్నంగా వెలుగొందుతున్న ఈ జంట గత నెలలోనే విడిపోతున్నట్లు ప్రకటించింది.ఖురేషి నిశ్చితార్ధకార్యక్రమానికి అతని మిత్రుడు రోహన్ కూడా విచ్చేసాడు. పాకిస్థాన్‌కు రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అతను పేర్కొన్నాడు. 2011లో పురుషుల డబుల్స్ ఈవెంట్‌లో 10వ స్థానాన్ని సంపాదించిన ఈ జంట కలసి ఆడలేకపోయినా ఎప్పటికీ మేము మిత్రులుగానే ఉంటామని స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే పాకిస్థాన్‌లో ఎక్కడైనా టెన్నిస్ ఆడటానికి నాకు అభ్యంతరం లేదు. ఇరుదేశాల మధ్య స్నేహాన్ని పెంపొందిచటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ప్రత్యేకంగా నాకు వాఘా సరిహద్దుల్లో ఆటను ఆడాలని ఉన్నది. అని లాహోర్‌లోని జింఖానాలో టెన్నిస్ ఆడిన అనంతరం బొపన్న తెలిపాడు. డిసెంబర్ 17 నాడు లాహోర్‌లోని మోడల్‌టౌన్‌లో ఖురేషి వివాహం జరగనున్నది. వచ్చే సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ పోటీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న రోహన్, భారత ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ మహేష్ భూపతితో కలసి డబుల్స్‌లో భారత తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇటీవలే మహేష్ భూపతి కూడా లియాండర్ పేస్‌తో తెగతెంపులు చేసుకున్న విషయం విదితమే.
No comments:
Post a Comment