Thursday, October 7, 2010

2010 ఐసిసి క్రికెటర్‌ సచిన్‌ టెస్టు క్రికెటర్‌ సెహ్వాగ్‌


మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఐసిసి క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును గెలుచుకున్నాడు. బుధవారం నాడు బెంగళూరులో అవార్డులను ప్రకటించారు. సచిన్‌కు పీపుల్స్‌ ఛాయిస్‌ అవార్డు కూడా లభించింది. ఈ అవార్డును ఐసిసి ఈ సంవత్సరం కొత్తగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఐదుగురు క్రికెటర్ల జాబితా నుండి ఆన్‌లైన్‌లో సచిన్‌ను ఈ అవార్డుకు ఎన్నుకున్నారు. ఈ సంవత్సరం టెస్టు క్రీడాకారుని అవార్డును వీరేంద్ర సెహ్వాగ్‌ గెలుచుకున్నాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ డివిల్లీర్స్‌ వన్డే క్రీడాకారుని అవార్డు కైవసం చేసుకున్నాడు. అతడికి సచిన్‌, షేన్‌ వాట్సన్‌, ర్యాన్‌ హారిస్‌ నుండి గట్టి పోటీ ఎదురైంది. ఓటింగ్‌ కాలంలో డివిల్లీర్స్‌ 16 వన్డే మ్యాచ్‌లు ఆడి 71.25 సగటుతో మొత్తం 855 పరుగులు చేసాడు. ఇందులో నాలుగు సెంచరీలు, నాలుగు అర్ధసెంచరీలున్నాయి. భారత్‌ ఈ సంవత్సర టెస్టు టీం అవార్డును, ఆసీస్‌ వన్డే టీం అవార్డును దక్కించుకున్నాయి. ఇంగ్లండ్‌ ఫాస్ట్‌బౌలర్‌ స్టీవెన్‌ ఫిన్‌ ఈ సంవత్సరపు ఐసిసి వర్థమాన క్రికెటర్‌ అవార్డును సొంతం చేసుకున్నాడు. 21 ఏళ్ల ఫిన్‌ ఓటింగ్‌ కాలంలో ఆరు టెస్టులు ఆడి 27 వికెట్లు తీసుకున్నాడు. ప్రముఖ అంపైర్‌ డేవిడ్‌ షెప్హర్డ్‌పేర నెలకొల్పిన పాకిస్తాన్‌ అంపైర్‌ అలీమ్‌ దర్‌కు లభించింది.
ఆయనకు ఈ అవార్డు లభించడం ఇది రెండోసారి. ఐసిసి అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఆయన సొంతం చేసుకున్నాడు. హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో వెస్టిండీస్‌ మాజీ బౌలర్‌ జోయల్‌ గార్నర్‌కు చోటు దక్కింది. ఎల్‌జి- ఐసిసి అవార్డులను ప్రకటించడం ఇది ఏడోసారి. ఇంతకుముందు లండన్‌ (2004), సిడ్నీ (2005), ముంబయి (2006), జోహన్నెస్‌బర్‌ ్గ(2007, 2009), దుబారు (2008) నగరాల్లో ఈ అవార్డు ఉత్సవాలను నిర్వహించారు.ఐదుగురు సభ్యుల సెలెక్షన్‌ ప్యానెల్‌ ఏడు అవార్డులకు నామినేషన్లను ఖరారు చేసింది. ఈ ప్యానెల్‌కు క్లయివ్‌ లాయిడ్‌ ఛైర్మన్‌గా ఉన్నారు. రవిశాస్త్రి, ఆంగస్‌ ఫ్రేజర్‌, డంకన్‌ ఫ్లెచర్‌; మాథ్యూ హెడెన్‌ సభ్యులుగా ఉన్నారు.

No comments:

Post a Comment