Sunday, October 9, 2016

సీనియర్స్‌తో సై...

 అక్షరా హాసన్ సెలైంట్‌గా తమిళంలో బిజీ అయిపోతోంది. ‘షమితాబ్’ చిత్రం ద్వారా హిందీ తెరకు నాయికగా పరిచయమైన అక్షర ఆ తర్వాత అక్కడ వేరే సినిమాలు కమిట్ కాలేదు. ఈ మధ్యే తమిళంలో అజిత్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో ఓ కథానాయికగా నటించడానికి అంగీకరించింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ నాయిక. తాజాగా విశాల్ హీరోగా రూపొందుతోన్న ‘తుప్పరివాలన్’ అనే చిత్రంలో నటించడానికి అంగీకరించింది. తుప్పరివాలన్ అంటే డిటెక్టివ్ అని అర్థం.
ఇందులో  కథానాయికగా రకుల్ ప్రీత్‌సింగ్ నటిస్తోంది. రకుల్ కంటే కాజల్ సీనియర్. రకుల్ వచ్చి నాలుగైదేళ్లవుతోంది. ఈ ఇద్దరితో పోల్చితే అక్షర జూనియర్. మరి.. ఇద్దరు సీనియర్ నాయికలున్న సినిమాలో ఓ నాయికగా నటించడమంటే అక్షరకు సవాలే. అయినా.. లోక నాయకుడు కమల్‌హాసన్ కూతురు కదా... సీనియర్స్‌కి ధీటుగా అక్షర నటిస్తుందని ఊహించవచ్చు.

Saturday, October 8, 2016

జాకీచాన్‌ను చూసినప్పుడు మాట రాలేదు!

బాలీవుడ్‌ నటి అమైరా దస్తూర్‌.. మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు, నటుడు జాకీచాన్‌తో కలిసి ‘కుంగ్‌ ఫు యోగా’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించడం కలలాంటి అనుభవమని అమైరా అన్నారు. ‘నేను తొలిసారి జాకీ సార్‌ను కలిసినప్పుడు ఆనందం, ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. మౌనంగా ఉండిపోయా. తర్వాత జాకీచాన్‌ చాలా మంచి వారు, నేను ఏ ఫీలింగ్‌, భయం లేకుండా మాట్లాడగల ఇతర వ్యక్తుల్లాగే ఆయనా ఓ సామాన్య వ్యక్తని గ్రహించా. జాకీచాన్‌ ఆసియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే నటుడైనా తనే గొప్ప అనే విధంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఆయనతో కూడిన సన్నివేశాల్ని మొదట తీయాలని అనుకోరు. అందరు నటీనటులకు జాకీచాన్‌ ఆదర్శం.
ఆయన మాటలతో కాకుండా యాక్షన్‌తో టెక్నిక్స్‌ను చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. సినిమా సెట్‌లో ఆయన సీన్లను షూట్‌ చేయకపోయినా, ఓ వైపు నిల్చుని జోక్యం చేసుకోకుండా షూట్‌ చూస్తుంటారు. షూటింగ్‌లో ఏదైనా లోపం ఉంది అనిపించినప్పుడు మాత్రం సలహా ఇస్తారు’ అని చెప్పారు అమైరా.

Tuesday, October 4, 2016

కొత్త జిల్లాల్లో దసరాకు సెలవు నో

 దసరా పండుగ రోజున ఉద్యోగులు విధిగా విధులకు హాజరుకావాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ రోజున కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నందు న సెలవును రద్దు చేసింది. జిల్లాల  పునర్విభజనతో సంబంధ మున్న ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశాలు జారీ చేశారు.

 జిల్లాల ప్రారంభం రోజున ఉదయం 10:30 గంటలకల్లా కలెక్టరేట్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా వర్క్ టు సర్వ్ ఆర్డర్లను అందజేయాలని సూచించారు. అన్ని విభాగాల ఉద్యోగులకు వర్తించేలా సింగిల్ ఆర్డర్ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక పునర్విభజన పరిధిలోకి రాని ఉద్యోగులు సోమవారం (10వ తేదీ) ఐచ్చిక సెలవును వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు.
 
వేడుకలు నిర్వహించండి
నూతన జిల్లా, డివిజన్, మండలాలకు అవసరమైన ఫైళ్లు, స్టేషనరీ, ఫర్నిచర్ ఇతర సరంజామాను ఆయా కార్యాలయాలకు తక్షణం చేరవేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆవిర్భావ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించేందుకు ఆయా విభాగాల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యమైన ఫైళ్లను మాత్రం మాతృ (ప్రస్తుత) జిల్లా కార్యాలయాల్లోనే ఉంచాలని.. పరిపాలన కుదుటపడ్డాక సంబంధిత కార్యాలయాలకు బదిలీ చేయాలని పేర్కొంది. నూతన మండలాల్లో ఆవిర్భావ వేడుకలను ఇన్‌చార్జి అధికారులు నిర్వహించాలని కోరింది. కొత్త జిల్లాలకు కొత్త వెబ్‌సైట్, ఫేస్‌బుక్ ఖాతాలను అదే రోజున ఆవిష్కరించాలని స్పష్టం చేసింది.
 
తొలి రోజునే పని విభజన
జిల్లాల ఆవిర్భావం రోజునే ఏ అధికారి ఏ విధులు నిర్వహించాలి, ఏయే విభాగం ఏయే దస్త్రాలను పరిశీలించాలన్న అంశంపై పని విభజన జరగాలని సర్కారు ఆదేశించింది. దానివల్ల ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం ఉండదని స్పష్టం చేసింది. ప్రజల నుంచి అందే అర్జీలను పరిష్కరించేందుకు సిటిజన్ చార్టర్ అమలు పక్కాగా జరిగేం దుకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక మండలాలను ఏ, బీ, కేటగిరీ లుగా విభజించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా ఉద్యోగులను కేటాయించనుంది. ‘ఏ’ కేటగిరీలోని మండలాలకు ఉద్యోగుల కేటాయింపులో కోత ఉండదు. బీ కేటగిరీ మండలాలకు సిబ్బందిని కుదించనున్నారు. ఆయా మండలాలకు డిప్యూటీ తహసీల్దార్ పోస్టు ఉండదని అధికారవర్గాలు తెలిపాయి.

తాగి కారు నడిపిన నటుడి కుమారుడు

ప్రముఖ నటుడు అలోక్‌నాథ్‌ కుమారుడు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుపడ్డాడు. సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత అలోక్‌నాథ్‌ కుమారుడు శివాంగ్‌నాథ్‌, ఓ స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి మిగిలిన స్నేహితులతో కలిసి తిరిగి వస్తుండగా, ట్రాఫిక్‌ పోలీసులు అతడి కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే అతడు కారు ఆపకుండా ఇంకా వేగాన్ని పెంచి, పారిపోవాలని ప్రయత్నించాడు. శాంతాక్రజ్‌ పోలీసులు వెంబడించి పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
శివాంగ్‌ వద్ద కనీసం డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదు. అయితే అతడి వెంట వున్న మహిళా స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగి, తామే వాహనాన్ని నడిపామని తెలిపినట్లు పోలీసులు తెలిపారు.అనంతరం బాంద్రా ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసు, పోలీసులతో నిర్లక్ష్యంగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ అశోక్‌ దుదే తెలిపారు. అనంతరం వాహనాన్ని సీజ్‌ చేసి, జరిమానా రూ.2,600 విధించినట్లుగా తెలిపారు.

పరుగు ఆపేశా

 ఇన్నాళ్లూ ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క... అంటూ ప్రభాస్‌ ‘మిర్చి’లో ఓ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతాడు. కథానాయిక కాజల్‌ కూడా ఇంచుమించు అదే చెబుతోంది. కాకపోతే ఇక్కడ కాజల్‌ చెబుతున్నది సినిమా కోసం కాదు, తన కెరీర్‌ గురించే. ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో కొనసాగుతున్న సీనియర్‌ కథానాయికల్లో కాజల్‌ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమె అవకాశాల్ని అందుకొంటోంది. సుదీర్ఘమైన ఈ ప్రయాణం కోసం మీరు అనుసరించిన వ్యూహాలు ఎలాంటివి? అని అడిగితే... ‘‘కథానాయికగా ఇంత దూరం నేను ప్రయాణం చేయాలని, ఇన్నేళ్లు నటిగా కొనసాగాలని నేనెప్పుడూ ప్రణాళికలు వేసుకోలేదు. అయినా చిత్రసీమలో వ్యూహాలు, ప్రణాళికలు చెల్లుబాటవుతాయంటే నేను నమ్మను. మనం ఒకటి వూహిస్తే, వాస్తవంలో మరోటి జరుగుతుంటుంది. అందుకే తొలినాళ్లల్లో ఇదే నా చివరి సినిమా అనుకొనేదాన్ని. కొన్నాళ్ల తర్వాత కెరీర్‌పై పట్టు పెరిగింది. వరుసగా అవకాశాలొస్తున్నప్పుడు ఇక దేని గురించీ ఆలోచించే అవసరం రాలేదు. అయితే అంతా సీనియర్‌ కథానాయిక అని పిలుస్తున్నప్పట్నుంచే నా ఆలోచనల్లో మార్పులొచ్చాయి. వ్యూహం అంటారో, ఇంకేమంటారో తెలియదు కానీ.. ఇక నుంచి మాత్రం కొత్త లెక్కలతో ప్రయాణం చేయాలనుకొంటున్నా. చేసే ప్రతి పాత్ర నటిగా ఆత్మ సంతృప్తినిచ్చేలా ఉండాలనే ఆలోచనతో సినిమాల్ని ఎంపిక చేసుకొంటున్నా. ఇదివరకటి పరుగుని ఆపేశా. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ పనిచేస్తున్నా’’ అని చెప్పుకొచ్చింది కాజల్‌.

Sunday, October 2, 2016

ముందు ఎవరితో?


మహేశ్‌బాబుతో మూడో సినిమా కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ ‘జన గణ మణ’ అనే టైటిల్ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు. మహేశ్-పూరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మేన్’.. రెండూ హిట్టే. దాంతో ‘జన గణ మణ’ ప్రకటించినప్పట్నుంచే అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సంబంధించిన పనులు చేస్తూనే మరోవైపు ఎన్టీఆర్‌తో సినిమా కోసం కూడా పూరి రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్‌తో ఆయన తీసిన ‘ఆంధ్రావాలా’ ఆశించిన విజయం ఇవ్వలేదు.

  కానీ, ఎన్టీఆర్-పూరిలు ‘టెంపర్’తో టార్గెట్ రీచ్ అయ్యారు. పూరి మార్క్ హీరోయిజంలో ఎన్టీఆర్ యాక్టింగ్ ప్రేక్షకులకు నచ్చింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇజం’ విడుదలకు సిద్ధమైంది.

 ఈ నెల 5న ఆడియో, 20న సినిమా రిలీజ్. ఈ నేపథ్యంలో మహేశ్‌బాబు, ఎన్టీఆర్.. ఇద్దరితోనూ తదుపరి సినిమాలు చేయబోతున్నట్టు ఆదివారం పూరి చెప్పారు. ముందు ఎవరితో చేస్తారు? అనేది ఇక్కడి ప్రశ్న. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్నారు. ఆ తర్వాత కొరటాల శివ లైన్‌లో ఉన్నారు. ‘జనతా గ్యారేజ్’ తర్వాత చిన్న ఎన్టీఆర్ మరో సినిమా అంగీకరించలేదు. సో, ముందు మొదలయ్యేది ఎన్టీఆర్ సినిమానేనా? వెయిట్ అండ్ సీ!

ఆ విషయం రానాకు ముందే తెలుసు..!

 ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన చైతూ, సమంతల పెళ్లి విషయంలో మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు నాగచైతన్య. ఇప్పటికే తను పెళ్లి చేసుకోబోయేది సమంతనే అంటూ ప్రకటించేసిన ఈ యంగ్ హీరో ఈ విషయం తన తల్లి దండ్రుల కన్నా ముందే మరోకరికి తెలుసని చెప్పాడు.
తాను సమంతను ఇష్టపడుతున్న విషయం రానాకు ముందే తెలుసని చెప్పాడు. 'రానా నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, తను నా కజిన్ కూడా ఇద్దరం కలిసే పెరిగాం. అందుకే నా ఇష్టా ఇష్లాలన్ని ముందు తనతోనే షేర్ చేసుకుంటాను. అందుకే సమంత విషయం కూడా నాన్న కన్నా ముందే రానాకు తెలుసు' అని చెప్పాడు.

బికినీకి సై


నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి.

  అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది.

 తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు