బాలీవుడ్
నటి అమైరా దస్తూర్.. మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు, నటుడు జాకీచాన్‌తో కలిసి
‘కుంగ్ ఫు యోగా’ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో జాకీచాన్‌తో కలిసి నటించడం
కలలాంటి అనుభవమని అమైరా అన్నారు. ‘నేను తొలిసారి జాకీ సార్‌ను కలిసినప్పుడు
ఆనందం, ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. మౌనంగా ఉండిపోయా. తర్వాత జాకీచాన్
చాలా మంచి వారు, నేను ఏ ఫీలింగ్, భయం లేకుండా మాట్లాడగల ఇతర వ్యక్తుల్లాగే
ఆయనా ఓ సామాన్య వ్యక్తని గ్రహించా. జాకీచాన్ ఆసియాలోనే అత్యధిక పారితోషికం
తీసుకునే నటుడైనా తనే గొప్ప అనే విధంగా ఎప్పుడూ ప్రవర్తించరు. ఆయనతో
కూడిన సన్నివేశాల్ని మొదట తీయాలని అనుకోరు. అందరు నటీనటులకు జాకీచాన్
ఆదర్శం.
ఆయన మాటలతో కాకుండా యాక్షన్‌తో టెక్నిక్స్‌ను చూపించడానికి ప్రాధాన్యం ఇస్తారు. సినిమా సెట్‌లో ఆయన సీన్లను షూట్ చేయకపోయినా, ఓ వైపు నిల్చుని జోక్యం చేసుకోకుండా షూట్ చూస్తుంటారు. షూటింగ్‌లో ఏదైనా లోపం ఉంది అనిపించినప్పుడు మాత్రం సలహా ఇస్తారు’ అని చెప్పారు అమైరా.

No comments:
Post a Comment