Tuesday, April 10, 2012

డేరింగ్‌ విక్టరీ

సెహ్వాగ్, పీటర్సన్ మెరుపులు
ఢిల్లీ ఇరగదీసింది! బౌలింగ్‌లోనా బ్యాటింగ్‌లోనా? ఈ రెంటితో పాటు అద్భుతమైన గ్రౌండ్ ఫీల్డింగ్‌తో! అవును.. నాలుగు రనౌట్లతో చెన్నైకి దిమ్మతిరిగేలా చేసింది. ఫలితం.. భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో చెన్నై రనౌటైంది. నామమాత్ర లక్ష్యా న్ని ఢిల్లీ సునాయాసంగా ఛేదించింది. మంగళవారం పూరి ఏకపక్షంగా జరిగన ఐపీఎల్ రెండో మ్యాచ్‌లో సెహ్వాగ్ జట్టు.. ధోనీమెన్‌పై 8 వికెట్ల తేడా తో భారీ విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ సెహ్వాగ్ తొలుత ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఐతే. అంతకుముందు మ్యాచ్‌లో వెట్టోరి తరహాలో వీరూ నిర్ణయం బెడిసికొట్టదు కదా! అనే సందేహాలకు ఢిల్లీ ఫీల్డర్లు తమ మెరుపు ఫీల్డింగ్‌తో తెరదించారు. ఫలితంగా చెన్నై 20 ఓవర్లలో 8 వికెట్లకు 110 పరుగులకే పరిమితమైంది. మోర్నీ మోర్కెల్ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి 2 వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్యఛేదనలో ఢిల్లీ 13.2 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి గెలిచింది. జట్టులో చేరిన బ్యాట్స్‌మెన్ కెవిన్ పీటర్సన్ (26 బంతు ల్లో 43 నాటౌట్; 4x3, 6x2) మెరుపు బ్యాటింగ్‌తో అలరి స్తే, జయవర్దనే 20 (నాటౌట్) పరుగులు చేశాడు. అంతకుముందు సెహ్వాగ్ (21 బంతుల్లో 33; 4x4; 6x1)... నమన్ ఓఝా (14)తో కలిసి ఢిల్లీకి మెరుపు ఆరంభాన్నిచ్చారు. అల్బీ మోర్కెల్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోని తొలి మూడు బంతుల్ని ఓఝా బౌండ్రీకి తరలిస్తే, తర్వాత అతని ఓవర్లోనే సెహ్వాగ్ వరుసగా 4, 6 కొట్టి హల్‌చల్ చేశాడు. ఈ జంట తొలి వికెట్‌కు 8.2 రన్‌రేట్‌తో 32 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు ఔటయ్యాక జయవర్దనే-పీటర్సన్‌లు అబేధ్యమైన మూడో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. మోర్నీ మోర్కెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.



Raina చెన్నై ‘పరుగో పరుగు’!
దిగ్గజాల చేరిక ఢిల్లీకి ఉత్సాహాన్నిచ్చిందో ఏమోగానీ ఢిల్లీ జట్టు అద్భుత ఫీల్డింగ్‌తో మెరిసింది. ఫలితంగా 4 రనౌట్లు! దీనికి తొలి బంతితోనే బీజంపడింది. సింగిల్ తీసే క్రమంలో డుప్లెసిస్ తడబాటు పాపం ఒక్క బంతి కూడా ఆడకుండానే విజయ్‌ని రనౌట్‌గా బలిగొంది. అంతేనా.. కొద్దిసేపటికే తనూ రనౌటయ్యాడు డుస్లిసిస్. ఫలితంగా 26 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది చెన్నై. ఈ దశలో రైనా రెండు సిక్సర్లతో హల్‌చల్ చేసినా లేని సింగిల్‌కు కక్కుర్తిపడి యోగేశ్ నాగర్ వేసిన అద్భుతమైన త్రోకు అతనూ రనౌటయ్యాడు. మరో మూడు ఓవర్లు ముగిశాయో లేదో బద్రీనాథ్ కూడా రనౌట్‌గానే వెనుదిరగాల్సివచ్చింది. అప్పటికి చెన్నై స్కోరు 9.4 ఓవర్లలో 64. ఇక మ రుసటి ఓవర్లో దక్కన్‌పై పేలిన జడేజా (13) కూడా వెనుదిరగడంతో చెన్నై భారీస్కోరు ఆశలకు గండిపడింది. భారీ హిట్టింగ్‌తో అ లరిస్తాడనుకున్న ధోనీ 18 బం తులో 11 రన్స్ చేసి ఔటయ్యాడు.

యువరాజ్ వచ్చేశాడు

yuviభారత స్టార్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కీమోథెరపీ చికిత్సను పూర్తి చేసుకొని సోమవారం స్వదేశానికి తిరిగి వచ్చాడు. తల్లి షబ్న మ్, భారీ సంఖ్యలో అభిమానుల స్వాగతం మధ్య యువరాజ్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాక్షిశయంలో అడుగుపెట్టాడు. కీమోథెరపీ కారణంగా జుత్తు పూర్తిగా కోల్పోయిన యువీ.. ఎరుపు రంగు స్పోర్ట్స్ క్యాప్, టీ షర్ట్, ఖాకీ ప్యాంటు ధరించి ఎయిర్‌పోర్టు వెనక గేటు గుండా బయటికి వచ్చాడు. అభిమానుల్ని చూడగానే ఉబికివచ్చిన ఉద్వేగాన్ని కళ్లద్దాల వెనక అణచుకుంటూ చిరునవ్వుతో విక్టరీ చిహ్నాన్ని చూపుతూ కారులో ఇంటికి బయలుదేరాడు. బుధవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి చికిత్స తీరుతెన్నుల్ని, తన భవిష్యత్ ప్రణాళికను వివరించనున్నాడు. కాగా, గుర్గావ్‌లోని తన నివాసానికి చేరుకున్నాక అతని రాకకోసం నిరీక్షిస్తున్న అభిమానులకు బాల్కనీ నుంచి యువీ అభివాదం చేయగా, అతని తల్లి షబ్నమ్ మీడియాతో మాట్లాడారు.

సినిమాలకు గుడ్‌బై?

ముగ్ధమనోహర సౌందర్యంతో భారతీయ సినీ ప్రేమికుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ త్వరలో సినిమాలకు గుడ్‌బై చెప్పనున్నట్లు తెలిసింది. ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐష్ గత కొంతకాలంగా సినిమాలకు పూర్తి దూరంగా వుంటోంది. ‘హీరోయిన్’ చిత్రం నుంచి అర్థాంతరంగా తప్పుకున్న తర్వాత ఐశ్వర్య మరే చిత్రంలోనూ నటించలేదు. డెలివరీ తర్వాత ఓ సంవత్సరం విరామం తీసుకొని సినిమాల్లో నటిస్తానని ఐష్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఐశ్వర్య పరిస్థితిని గమనిస్తే ఇక ఏ మాత్రం సినిమాల్లో నటించే అవకాశం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ మధ్యన రెండు భారీ చిత్రాల్లో నటించడానికి ఐశ్వర్యకు ఆఫర్లు వచ్చాయి. తల్లి కావడం వల్ల ఐశ్వర్య కొంచెం ఒళ్లు చేసి బొద్దుగా తయారైంది. దీంతో ఆఫర్లతో ముందుకొచ్చిన నిర్మాతలు ఈ సుందరి మళ్లీ మునుపటిలా ఒక్కపల్చగా తయారవ్వాలనే షరతులు ముందుంచారట. అయితే చక్కటి డైటింగ్‌తో నాజూకు అందాల్ని సొంతం చేసుకునే వీలున్న, ఆ సమయంలో తన పాప ఆలనాపాలనకు దూరమౌతానేమోనన్న బెంగపట్టుకుందట ఐష్‌కు. దీంతో భారీ పారితోషికాలతో వచ్చిన ఆఫర్లను కూడా ఈ మద్దుగుమ్మ తిరస్కరించిందని తెలిసింది. ఈ సమయంలో తనకు పాపే ముఖ్యమని భావిస్తున్న ఐశ్వర్య పాప కోసం సినిమాల్ని వదులుకోవడానికి సిద్ధంగా వుందని ఆమె సన్నిహితులు అంటున్నారు. దీంతో వెండితెరపై ఈ సుందరి సమ్మోహన రూపం చూసే అదృష్టం ఇక వుండబోదని ఆమె అభిమానులు నిరుత్సాహపడుతున్నారు.

Saturday, April 7, 2012

పూలరంగడు 50రోజుల

సునీల్‌ హీరోగా నటించిన 'ఫూలరంగడు' శనివారంతో 50 రోజు లకు చేరుకుటుంది. ఈ సందర్భం గా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లా డుతూ... మా ఆర్‌ఆర్‌మూవీ మేకర్స్‌ బేనర్‌లో సంక్రాంతికి బిజినెస్‌మేన్‌ సూపర్‌ హిట్‌కాగా, మహాశివ రాత్రికి వచ్చిన పూలరంగడు సూపర్‌ హిట్‌ అయింది. ఏప్రిల్‌ 7కు 50 రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ చిత్ర విజయానికి సిక్స్‌ప్యాక్‌, అనప్‌ మ్యూజిక్‌ బాగా ప్లస్‌ అయ్యాయి. ప్రేమకావాలి తర్వాత మా బేనర్‌లో పూలరంగడు మరో సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియ జేశారు.

Tuesday, March 20, 2012

ఆసియా కప్‌లో ముఖ్యాంశాలు ...

పైనల్‌లో పాక్‌, బంగ్లాదేశ్‌
భారత్‌ :సచిన్‌ 100వ శతకం పూర్తి చేశారు.
విరాట్‌ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌తో కోనసాగిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు చేశాడు. ఆసియా పర్యటనలో మొత్తంలో విరాట్‌ తన విశ్వరూపాన్ని చూపించాడు. రెండు సెంచరీలు, ఒక అర్థసెంచరీ చేశాడు.
భారత్‌, బంగ్లాదేశ్‌పై ఓడిపోయి చివరికి నిరాశమిగిలింది. శ్రీలంక , పాకిస్థాన్‌ జట్లుపై గెలిచి బంగ్లాదేశ్‌ జట్టుపై ఓడిపోయింది. అత్యునమైన జట్టుపై గెలిచి బంగ్లాదేశ్‌పై ఓడిపోవడం చాలా దూరదృష్టంకరం. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంక గెలిస్తే పైనలో అవకాశం భారత్‌కు దక్కుతుంది. కాని బంగ్లాదేశ్‌ లంకపై ఐదు వికెట్ల తేడాతో గెలిచి ఫైనలో పాక్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది.

పాకిస్థాన్‌ :
ఆసియా కప్‌ భాగంగాలో శ్రీలంక, బంగ్లాదేశ్‌తో గెలిచి పాక్‌ తొమ్మిది పాయ్లింటతో మొదటి స్థానంలో ఉంది.
పాకిస్థాన్‌ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 330 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ 13 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. విరాట్‌ కోహ్లీ 183 పరుగులు చేసి విజయం సాధించాడు.


బంగ్లాదేశ్‌ : బంగ్లాదేశ్‌ తొలి మ్యాచ్‌ పాక్‌పై తలపడింది. అందులో పాకిస్థాన్‌ గెలిచింది. అతరువాత మ్యాచ్‌ భారత్‌తో ఢ కొంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తెలికగా తీసుకున్న బంగ్లాదేశ్‌ మాత్రం గెలిచి తీరాలి అన్ని నిర్ణయించుకుంది. అనుకున్న లక్ష్యం సాధించి నాలుగు పాయింట్లుతో ముందు అడుగు వేసింది. అతరువాత మ్యాచ్‌ బంగ్లాదేశ్‌, శ్రీలంక ఉంది. లంక మ్యాచ్‌తో గెలిస్తే ఏకంగా పైనలో మళ్లీ పాక్‌పై తలపడనుంది. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో లంకపై బంగ్లాదేశ్‌ ఐదు వికెట్లు తేడాతో గెలిచి పైనల్‌లో అవకాశం దక్కిచుకుంది. లంకతో మ్యాచ్‌ ఓడిపోయింటే భారత్‌ పైనల్‌ చేరేఅవకాశం ఉంది. కాని బంగ్లాదేశ్‌ మాత్రం అటు బ్యాటింగ్‌లో ఇటు బౌలింగ్‌లో మాత్రం రాణించడంతో పైనల్‌ చేరుకుంది. ఈ నెల 22న పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ తలపడనుంది. చివరి మ్యాచ్‌లో పాక్‌పై బంగ్లాదేశ్‌ గెలిచి కప్‌ కోసం తహతహలాడుతుంది.
శ్రీలంక : ఆసియా కప్‌ భాగంగా లంక మూడు పరాజయాలు చూసింది. తొలి మ్యాచ్‌ భారత్‌, అతరువాత మ్యాచ్‌ పాకిస్థాన్‌ ఓడిపోయింది. చివరికి పరువు అయినా దక్కించుకోవాలన్ని అనుకున్న లంక చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఆసియా కప్‌ పరాజయం పాలైయింది. 

Wednesday, March 14, 2012

ముచ్చటగా మూడు...


neelimaపవన్‌కల్యాణ్‌తో ఇటీవలే ‘పంజా’ చిత్రాన్ని నిర్మించిన సంఘమిత్ర ఆర్ట్స్ సంస్థ త్వరలో మూడు చిత్రాల నిర్మాణానికి పూనుకుంటోంది. కొత్త రచయితలను ప్రోత్సహించాలనే ఉద్ధేశ్యంతో ఇటీవలే ఈ సంస్థ కొత్త కథలకు స్వాగతం పలుకుతూ కాంటెస్ట్‌ను నిర్వహించింది. దీనికి రచయితల నుంచి మంచి స్పందన లభించిందని ,మొత్తం వేయికిపైగా కథల్లోంచి మూడు కథల్ని ఎంపికచేసుకున్నామని నిర్మాతలు నీలిమా తిరుమలశెట్టి, నగేష్ ముంతా తెలిపారు.
త్వరలో నిర్మించబోయే మూడు చిత్రాల విశేషాలను వారు తెలియజేస్తూ ‘అత్యద్భుతమైన మూడు కథల్ని ఎంపిక చేశాం. ‘అలియాస్ జానకి’ చిత్రానికి టెన్త్‌క్లాస్ చిత్రానికి దర్శకత్వం వహించిన చందు దర్శకత్వం వహిస్తాడు. ప్రేమకథా చిత్రమిది. చక్కటి సందేశం వుంటుంది. ‘ఏ శ్యామ్ గోపాల్ వర్మ ఫిలిం’ అనే చిత్రాన్ని ఐటీ రంగానికి చెందిన రాకేష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తాడు. కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం వుంటుంది. ‘అరే...అరెరే..’ అనే టైటిల్‌తో రానున్న చిత్రాన్ని శేఖర్ కమ్ముల దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన శశికిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తాడు. ఏప్రిల్ నెల నుంచి ప్రతి నెలా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తాం. ఈ మూడు చిత్రాలకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో తెలియజేస్తాం. చిత్రాల ప్రారంభోత్సవ తేదీలను త్వరలో ప్రకటిస్తాం’ అన్నారు.

Tuesday, March 13, 2012

భారత్‌ తొలి విజయం

 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక 254 అలౌట్‌ అయ్యింది. 152కే మూడు వికెట్లు కోల్పోయిన లంక విజయం దిశగా పయనిస్తుంది. సంగక్కర 60, తిరిమానేన్‌ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆశ్విన్‌ ఒకే ఓవర్లలో రెండు వికెట్లు తీసుకోని లంకకు దెబ్బమీద దెబ్బ తీస్తాడు. 35 ఓవర్లలో సంగక్కర 65, తిరిమానేన్‌ 29 అవుట్‌ చేస్తాడు. 38 ఓవర్లలో వినయకుమార్‌ హ్యాట్రిక్‌ మిస్‌ అయ్యాడు. కులశేఖర్‌ 11, కపుదేగారా 0 అవుట్‌ చేస్తాడు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు జయవర్థనే 78, సంగక్కర 65 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్‌లు తక్కువ స్కోరుకు అవుట్‌ అయ్యారు. భారత్‌ బౌలింగ్‌లో పఠాన్‌ నాలుగు, వినరు కుమార్‌, అశ్విన్‌ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు. అంతక ముందు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ 50 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 304 పరుగుల చేసింది. గంభీర్‌ 100, విరాట్‌ కోహ్లీ 108 పరుగులు చేశారు. ఇద్దరు ఒకరు మించి ఒకరుగా పోటి పడి సెంచరీ సాధించారు. సచిన్‌ 6 పరుగులకు అవుట్‌ అయ్యారు. చివరిలో ధోని 46, రైనా 30 పరుగులు చేశారు.

Friday, March 9, 2012

రాహుల్‌ స్థానం భర్తీ చేయలేనిది టీమిండియా ...

రాహుల్‌ ద్రావిడ్‌ స్థానం భర్తీ చేయలేనిదని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌ శ్రీనివాస్‌ అన్నారు. రాహుల్‌ ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడా కారుడు మాత్రమే కాదు. అలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోవడం లేదు.

ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు సిరీస్‌లో రాహుల్‌ ద్రావిడ్‌, లక్ష్యణ్‌, సచిన్‌ సరిగా అడ్డకపోవడం వల్లనే సిరీస్‌ కోల్పోయా అని పలు సమచారం. అలాగే లక్ష్మణ్‌, ద్రావిడ్‌, సచిన్‌ టెస్టు సిరీస్‌లకు గుడ్‌బై చెప్పాలని పలువురు వ్యక్తం చేశారు. మరి ఈరోజు రాహుల్‌ ద్రావిడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పాడు. దీనికి కారణం ...
బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌. శ్రీనివాస్‌ మాట్లాడూతూ ...


రాహుల్‌ ద్రావిడ్‌ ఈరోజు అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అద్భుతమైన క్రికెటర్‌ని చూసే అపురూపమైన అవకాశం మనకు లభించింది. ఆయన ఉత్తమ క్రీడాకారుడు మాత్రమే కాదు... నేటి తరానికి చక్కని ఆద్శరం కూడా. ఆయనలాంటి వ్యక్తి మరొకరుంటారని నేను అనుకోను... అలాంటి వ్యక్తులు ఆట వదిలేసి వెళ్లిపోవాలని ఎవరూ కోరుకోరు. వ్యక్తిగతంగా ఇది నాకు చాలా బాధాకరమైన రోజు అని బీసీసీఐ అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాస్‌ చెప్పారు.