Monday, August 22, 2011

ఇంగ్లాండ్‌ చేతిలో భారత్‌ వైట్‌వాష్‌

ఇంగ్లాండ్‌ 4-0 కైవసం
సచిన్‌ సెంచరీ మిస్‌ 
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్‌లో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులకు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ ఎనిమిది పరుగులతో ఇన్నింగ్స్‌ విజయం సాధించింది. సిరిసీను 4-0తో ఇంగ్లాండ్‌ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌ 300 పరుగులు చేసిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 283 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 129/3తో బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగో వికెటుకు 144 పరుగులు జోడించింది. సచిన్‌, మిశ్రా ఇద్దరు మరో వికెటు పడకుండా జాగ్రత పడ్డారు. కనీసం ఈ మ్యాచ్‌నైనా డ్రా చేసుకోవాలిని భారత జట్టు భావిస్తోంది. చివరికి ఆశ నిరాశగా మిగిలిపోయింది. లంచ్‌ వరకు భారత్‌ మూడు వికెట్ల నష్టానికి 216/3 పరుగులు చేసింది. సచిన్‌ 72, మిశ్రా 57 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు మరో వికెట్టు పడ్డకుండా జాగ్రత పడ్డారు. చివరికి అమిత్‌ మిశ్రా స్వాన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. 141 బంతులలో 10 ఫోర్లు సహయంతో 84 పరుగులు చేశాడు. 16 పరుగులు తేడాతో సెంచరీ మిస్‌ అయ్యాడు. మరుసటి ఓవర్లలో బెన్నస్స్‌ బౌలింగ్‌లో ఎల్‌ బిడబ్యూగా సచిన్‌ అవుట్‌ అయ్యారు. 172 బంతులలో 11 ఫోర్లు సహయంతో 91 పరుగులు చేశాడు. తోమ్మిది పరుగుతో సెంచరీ కోల్పోయ్యాడు. సచిన్‌ తన 100వ సెంచరీ చేసి డ్రాగా ముగించాలిన భావించాడు. కాని సచిన్‌ సెంచరీ చేయలేదు. అతరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు కనీసం ఒక్కరు కూడా క్రీజులో ఉండాలని ప్రయత్నించాల లేదు. సురేష్‌ రైనా 0, కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని 3, ఆర్‌ పి సింగ్‌ 0, గంభీర్‌ 3, శ్రీశాంత్‌ 6 పరుగులు చేసి అలౌట్‌ అయ్యారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో స్వాన్‌ 6, బ్రాడ్‌ 2, బెన్నస్‌ , అండర్సన్‌ చెరో వికెటు లభించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇయాన్‌ బెల్‌, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ బ్రాడ్‌ లభించింది. దీంతో భారత్‌ మూడవ స్థానానికి దిగజారింది. ఇంగ్లండ్‌ నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంది.

Thursday, August 18, 2011

దర్శకుడు బిజీ, హీరో బిజీ కాని, ఇద్దరి కాంబినేషన్‌లో మరొ సినిమా

ఎన్టీఆర్‌- పూరీ కాంబినేషన్‌లో మరో సినిమాకి రెడీ అయ్యారు. ఇంతక ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ' ఆంధ్రావాలా' వచ్చింది. ఈ జోడీ మరోసారి సినిమాకి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ' ఊసరవెల్లి' , ' దమ్ము' చిత్రాలలో బిజీగా ఉండగా, దర్శకుడు పూరీ కూడా ' బిజినెస్‌ మ్యాన్‌ ' ' ఇండియట్‌ -2' చిత్రాలలో అంతే బిజీగా ఉన్నారు. కాబట్టి వీరి సినిమా దాదాపు 2012 సంవత్సరంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్యాయి.

రజనీకాంత్‌కు మరోసారి వైద్యపరీక్షలు

రాణా చిత్రం ఘాటింగ్‌ సమయంలో రజనీకాంత్‌ అనారోగ్యానికి గురైన సంగంతి తెలిసిందే. రజనీకాంత్‌కు మరో సారి వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ తన పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు రజనీకాంత్‌కు వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు.

Wednesday, August 17, 2011

చికిత్స కోసం ఆస్ట్రేలియా వెళ్తుతున్న అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ హీరోగా ఇటీవలే ' వరుడు ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘాటింగ్‌ సమయంలో అల్లు అర్జున్‌ చేతికి గాయమైంది. ఆ గాయాన్ని ఏ విధంగా లెక్క చేయకుండా ఆ సినిమాను పూర్తి చేశాడు. ఆ గాయంతోనే మరో చిత్రం ' బద్రీనాథ్‌ ' సినిమా కూడా పూర్తి చేశాడు. అ తరువాత తెలిసింది గాయం పెద్దది. గాయం కోసం ఆస్ట్రేలియా తగిన శస్త్ర చికిత్స చేయించుకోనున్నాడు. ఆగస్టు 20న తేదీన అల్లు అర్జున్‌ గాయానికి తగ్గిన ఆపరేషన్‌ కోసం ఆస్ట్రేలియా వెళ్లనున్నాడు. అక్కడే వారం రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకొని, తిరిగి సెప్టెంబర్‌ మొదటి వారంలో ఇండియాకు రానున్నాడు.

Tuesday, August 16, 2011

150 రోజుల తర్వాత మరో అవకాశం


  ' ప్రేమకావాలి' చిత్రంలో హీరోయిన్‌గా నటించిన ఇషాచావ్లా 150 రోజుల తర్వాత మరో అవకాశం వచ్చింది. వీరభ ద్రం దర్శకత్వంలో సునీల్‌ సరసన ఇషాచావ్లా జతకట్టనుంది. ఈ చిత్రం ఆగస్టు 18న లాంఛనంగా ప్రారంభం కానుంది.

ధోని తర్వాత కెప్టెన్‌ ఎవరు ... ?

 టీమిండియాలో కొత్త కోణం వచ్చింది. మూడు టెస్టు సిరీస్‌లు వరుసగా ఓడిపోయిన టీమిండియా కెప్టెన్‌పై భారం పడింది. భారత్‌ బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో ఏది విధమైన రకమైన రాణించలేకపోవడం వల్ల కెప్టెన్‌పై భారం పడింది. వరుసగా మూడు టెస్టు సిరీస్‌లు ఓడిపోయివడం అంటే టీమిండియా జట్టు లోపం వల్లనే, జట్టు సభ్యులు రాణించలేకపోవడం. అందులో వరుసగా గాయలపాలైన వారిని మళ్లీ జట్టులో అనుమతించడం ఇలా చాల అనుమానాలు వస్తున్నాయి. గాయలుపాలైన వారిని మళ్లీ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ అడించడం వంటి ప్రయోగాలు వంటి చేసి జట్టులో అనుమతించాలి.
మాజీ క్రికెటర్లు బీసీసీఐపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే కెప్టెన్‌ సరైన నిర్ణయం తీసుకోపోవడం వల్లనే జట్టు పరిస్థితి చాలా దారుణంగా తయారైయింది. ధోని తర్వాత నాయకత్వ లక్షణాలెవరికైనా వున్నాయి. గంభీర్‌ కెప్టెన్సీకి తగ్గ వ్యక్తి కానే కాదు. సెహ్వాగ్‌ సంగతి సరై సరి. సచిన్‌ అల్‌రెడ్రీ కెప్టెన్సీ చేసి, తన వల్ల కాదని పక్కకు తప్పుకున్నాడు. ఇంకా దావ్రిడ్‌ ఇంతకా ముందు టెస్టు సిరీస్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. లక్ష్మణ్‌ ఇప్పటివరకు కెప్టెన్‌ అన్న సందేహాములు తన దృష్టికి రాలేదు. అతను జట్టు సభ్యుడిలా అందరితో కలసి వుండటటమే తప్ప కెప్టెన్సీపై అలోచన లేదు. యువరాజ్‌సింగ్‌ అతను ఎప్పుడు జట్టు వస్తాడో, వెళ్తుతాడో తెలియదు. ఇంకా కొత్తగా వచ్చిన వారిలో విరాట్‌ కోహ్లీ, రైనా ఇద్దరు జట్టు కొత్త ముఖాలు ఉన్నాయి. వారికి అనుభవం తక్కువ ఉంది. ఇలా జట్టులో అందరీ చూస్తే కెప్టెన్సీపై ఎవరికి అలోచన లేదు.

Saturday, August 13, 2011

కాజల్‌తో ముచ్చటగా మూడోసారి

 'డార్లింగ్‌', మిస్టర్‌ పెర్‌ఫెక్ట్‌' చిత్రాలతో హిట్‌ కొట్టి పేరు తేచ్చుకున్న ఈ జత మరో సారి సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండు సినిమా ఫ్యామిలి ఎంటర్‌మెటర్స్‌గా నిలిచాయి. ' రెబల్‌ ' సినిమాలో అనుష్క నిష్క్రమించిందనే వార్తలు వస్తుండండంతో ఆ సినిమాలో అనుష్క స్థానంలో కాజల్‌ భర్తీ చేయనుందా... లేక ఆ చిత్రం తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించే సినిమా కోసం కాజల్‌ తీసుకుటారా అన్నది తెలియాల్సి వుంది.

Friday, August 12, 2011

మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ గెలుస్తుందా ? సచిన్‌ సెంచరీ చేస్తాడా... ?

 భారత్‌,ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమాయానికి భారత్‌ 35/1 పరుగులు చేసింది. గంభీర్‌ 14, రాహుల్‌ దావ్రిడ్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 710/7 డిక్టెర్‌ చేసింది. స్ట్రాస్‌ 87, కుక్‌ 294, బెల్‌ 34, పీటర్స్‌న్‌ 63, మోర్గాన్‌ 104 , బెన్నస్న్‌ 53 పరుగులు చేసింది. భారత్‌ బౌలింగ్‌లో అమిత్‌ మిశ్రా 3, ప్రవీణ్‌ కుమార్‌ 2, ఇషాంత్‌ శర్మ, రైనా చెరో వికెట్‌ లభించింది. రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ ఒక వికెటు నష్టానికి 35 పరుగులు చేసింది. సెహ్వాగ్‌ డకౌట్‌ అయ్యాడు. ఇంకా రెండు రోజుల సమయం ఉంది. రెండు రోజులలో భారత్‌ 451 పరుగులు చేస్తుందా... ? లేక అలౌట్‌ అవుతుందా. ఇంకా భారత్‌ బ్యాట్స్‌మెన్‌లపై ఆధారపడి వుంది. ఒక వేళ టీమిండియాలో బ్యాట్స్‌మెన్‌లు రాణింస్తే డ్రాగా ముగుస్తుంది. లేకపోతే 0-3 తేడాతో ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తుంది.