Wednesday, March 2, 2011

మొదలైంది ఫిక్సింగ్‌ గోల ..

లంక క్రికెటర్లు మహేలా జయవర్థనే, సమరవీరపై ఒక టివి ఛానల్‌ చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు నిరాధారమైననవి, ఆ ఛానల్‌ ప్రచారం చేసిన కథానాల్లో వాస్తవం లేదని శ్రీలంక క్రికెట్‌ ఆసోసియేషన్‌ పేర్కొంది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌- ఎలో పాకిస్థాన్‌, లంక మధ్య ఫిబ్రవరి 26న కొలంబోలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో లంక 11 పరుగుల తేడాతో ఓడిపాయిన సంగతి తెలిసిందే. 277 పరుగుల లక్ష్య చేదనలో లంక ఇన్నింగ్స్‌ 266/9 వద్ద ముగిసింది. లంక బ్యాట్స్‌మెన్‌ మహేల జయవర్థనే, తిలాన్‌ సమరవీరలు ఉద్వేశపూర్వ కంగానే ఔటయ్యారని లంక అధికారిక టీవీ ఛానెల్‌ ఆరోపించింది. లంక మ్యాచద్‌ ఓడిపోతుందని 18 వేల డాలర్లు పందెం కాశాడని, దీనికి తగ్గట్టుగానే జయవర్థనే 2 పరుగులకు ఔట్‌ కాగానే ఇండిపెండెంట్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ( ఐటీఎస్‌) ఛానెల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఖండించింది.
ఆస్ట్రేలియా, జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌, హాడిన్‌ తొలి 10 ఓవర్లలో ఆసీస్‌ ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడిన్‌ ఆడిన తీరుపై సందేహాలు నెలకొన్నాయి. ఇద్దరు ఓపెనర్లు కలిసి 11 ఓవర్లలో కేవలం 28 పరుగుల మాత్రమే చేశారు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 53 మాత్రమే. ఓపెనర్లు నెమ్మదిగా ఆడడంపై సందేహాలు తలెత్తడంతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం మ్యాచ్‌ను సమీక్షించినట్లు తెలుస్తోంది.

బికినీలో ఇలియానా .!

 ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ' శక్తి' సినిమాలో ఇలియాన హీరోయిన్‌ నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఈసినిమాలో ఇలియానా బికినీతో దర్శనమివ్వబోతోందిట. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతున్నా. రిలీజ్‌ నాటికి ఇలియానా బికినీ ఫొటోల్ని విడుదల చేసి, సినిమాపై హైప్‌ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. అప్పుడెప్పుడో ' ఆట' సినిమాలో బికినీతో కన్నించిన ఈ గోవా బ్యూటీ, ఆడపా దడపా చాలీచాలని దుస్తుల్లో తన గ్లామర్‌ని తడి తడిని అరబోసేస్తూనే వుంది వెండితెరపై. చూద్దాం. ' శక్తి ' సినిమా కోసం బికినీలో ఇలియానా, ఎన్టీఆర్‌ని ఏ రెంజ్‌లో వేడెక్కించిందో...!

Monday, February 28, 2011

వెంకటేష్‌తో ' సావిత్రి '

 వెంకటేష్‌ హీరోగా ..... తేజ దర్శకత్వంలో ' సావిత్రి' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. గతంలో లక్ష్మీ, తులసీ, మల్లీశ్వరి, నాగవల్లి వంటి టైటిల్స్‌తో సినిమాలు చేసిన వెంకీ... ఈసారి మాత్రం ' సావిత్రి' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్‌, తేజ కాంభినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగినట్లుగా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Sunday, February 27, 2011

నేడు పైనల్‌ మ్యాచ్‌ జరిగింది ....

 నేడే పైనల్‌ మ్యాచ్‌ జరినంత పని అయ్యింది. మ్యాచ్‌ చూస్తుంటే ప్రపంచకప్‌లో ఇదే చివరి మ్యాచ్‌లా పీల్‌ అనిపించింది. ఇరు జట్లు రా రీగా పోటిపడి చివరికి సమానంగా నిలిచియి. ఇప్పటి వరకు జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో ఇంత ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లు లేవు. ఇరు జట్టు బ్యాట్స్‌మెన్‌లు సెంచరీలతో స్వాగతం పలికారు. ముఖ్యంగా సచిన్‌ టెండ్కూలర్‌ తొలి మ్యాచ్‌లో 28 పరుగులు మాత్రమే చేసినా రెండో మ్యాచ్‌లో రెచ్చిపోయి అడాడు. అతని థీటుగా ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ స్ట్రాస్‌ నేనేం తకువ కాదు నీతో ' ఢ ' అని పోటికి దిగాడు. అతను కూడా 158 పరుగుల చేసి సవాలుగా నిలిచాడు. ఇంగ్లాండ్‌ జట్టు సెహ్వాగ్‌ని త్వరగా అవుట్‌ చేయాలని వూహ్యం పలిచింది. మరో ఓపెనరు సచిన్‌ అతనికి తోడు గంభీర్‌ ఇద్దరు మంచి బిగ్‌ బ్యాట్స్‌మెన్‌లు. రెచ్చిపోయి సచిన్‌ సెంచరీ, గంభీర్‌ అర్థ సెంచరీ చేశారు. యువరాజ్‌ సింగ్‌ 58 పరుగులు చేశాడు. భారత్‌ 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసి అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ 339 పరుగుల లక్ష్యాంతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్‌ చివరి బంతి వరకు అడి మ్యాచ్‌ టైగా ముగిసింది. ఇరు జట్టు సమానంగా నిలవడంతో చెరోక పాయింట్‌ లభించింది.

విక్టరీ వెంకటేష్‌తో నిత్యా మీనన్‌

 వెంకటేష్‌ తాజా చిత్రంలో హీరోయిన్‌గా నిత్యామీనన్‌ ఎంపికయ్యింది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం విక్టరీతో డి.వి.వి. దానయ్య నిర్మించే చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశాని నిత్యామీనన్‌ స్వంతం చేసుకుందని సమాచారం. నిత్యామీనన్‌ తన మొదటి సినిమా అలా మొదలైయింది. తరువాత రెండో సినిమాల విక్టరీ వెంకటేష్‌ సరసన నటించండం అమెకు కలిసివచ్చిన అవకాశం. మరి ఇంత పెద్ద స్టార్‌ పక్కన చేయడం చిన్న విషయం కాదు.

మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్‌, రెండో మ్యాచ్‌లో సచిన్‌

ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ మొదటి మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 175 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో సచిన్‌ సెంచరీతో బ్యాట్‌తో రూచి చూపించాడు. సచిన్‌ వన్డేలో 47 సెంచరీ నమోదు చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో ఇది ఐదో సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 35 పరుగులు చేశాడు. సచిన్‌ 120, గంభీర్‌ 51, యువరాజ్‌ సింగ్‌ 58 ధోనీ 31 పరుగులు చేశారు. భారత్‌, ఇంగ్లాండ్‌కు ఒక సవాల్‌గా ఎదురైయింది. భారత్‌ 338 పరుగుల లక్ష్మాఁ్న ఇంగ్లాండ్‌ ముందుంచింది.

Saturday, February 26, 2011

పాక్‌ జయభేరి

 పాక్‌స్థాన్‌, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్‌ 11 పరుగుల తేడాతో గెలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాక్‌ 50 ఓవర్లలో 277 పరుగుల చేసింది. పాక్‌ బ్యాట్‌మైన్‌లు మిస్బావుల్‌ హక్‌ ,యూనిస్‌ ఖాన్‌ ఇద్దరు రాణిచండంతో పాక్‌ 277 పరగులు చేసింది. కమ్రాన్‌ అక్మల్‌ 39, హఫీజ్‌ 32 పరుగులు చేశారు. కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిద్‌ 12 బంతులలో 16 పరుగులు చేశాడు. అతడు బ్యాటింగ్‌ కన్నా బౌలింగ్‌కు ఎకువ ప్రాదన్యత వహిస్తున్నారు. అంతక ముందు మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌లో నాలుగు వికెట్లు తీసుకఁన్నాడు. ఇప్పుడు జరిగినా మ్యాచ్‌లో నాలుగు కీలక వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన లంక ఓపెనర్లు ఇద్దరు తరంగ 33, దిల్షాన్‌ 41 పరుగులు చేశారు. వీరిద్దరు మొదటి వికెట్టుకు 71 పరుగుల భాగ్యస్వామ చేశారు. వన్‌డౌన్‌గా వచ్చిన కెప్టెన్‌ 49 పరుగుల చేసి అఫ్రీద్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. అప్పటికైనా లంక వైపు మ్యాచ్‌ ఉంది. ఒక్కసారిగా వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయిన తరువాత మ్యాచ్‌ పాక్‌ దిశగా నడిచింది.జయవర్థన్‌, సమరవీర ఇద్దరు తకువ స్కోరుకే అవుట్‌ అయ్యారు. అతరువాత వచ్చిన మాథ్యుస్‌, స్లిల్వా ఇద్దరు స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇద్దరు మంచిగా అడుతున్న సమయంలో మ్యాథ్యూస్‌ను అఫ్రిద్‌ అవుట్‌ చేశాడు. చివరిలో కఁలశేఖర్‌ 14 బంతులో 24 పరుగులు చేసి పాక్‌ భయం పుట్టించాడు. చివరికి పాక్‌ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ప్రపంచకప్‌లో నాలుగో వికెట్‌ .....

 ప్రపంచకప్‌ ప్రారంభమైయిన ఎనిమిది రోజులకే మరో వికెట్టు పడిపోయింది. అంతక ముందు మూడు వికెట్లు పడిపోయినవి ఇది నాల్గొవ వికెట్టు. ఆస్ట్రేలియా పాస్‌ బౌలర్‌ బోలింగర్‌ గాయంతో ఈ ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. ఎడమకాలి మడమకు గాయం కావడంతో మిగితా మ్యాచ్‌లకు ఆడకుండానే స్వదేశానికి పయనం కానున్నాడు. ఇండియాలో అడుగుపెట్టినప్పటి నుండే బొలింగర్‌ మడమ గాయంతో బాధపడుతున్నాడు. అనుకోకుండా ఆ గాయం రానురాను పెద్దదయ్యింది. ప్రస్తుతం ఆయన బౌలింగ్‌ చేయలేని స్థితిలో ఉన్నాడు. బొలింగర్‌ స్థానంలో మైకెల్‌ హసి ఎంపిక కావొచ్చని సమాచారం.