Tuesday, December 6, 2016

లక్షాధికారులు!

  రామ్‌చరణ్ లక్షాధికారి అయ్యాడండీ. ఈ హీరోగారు 40 లక్షలకు అధిపతి. హన్సిక ఏకంగా 60 లక్షలకు అధిపతి అయ్యారు. త్రిష 30, ఇలియానా 40 లక్షలు... ఇలా లక్షాధికారులు అయినందుకు వీళ్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. కోట్లు కోట్లు పారితోషికం తీసుకునే వీళ్లు లక్షాధికారులైనందుకు ఆనందపడటమేంటి? అనేగా మీ డౌట్! అయితే అసలు విషయంలోకి వెళదాం...
 
 కరెన్సీ కష్టాల కారణంగా ఎవరెవరు తమ బ్యాంక్ ఖాతాల్లో ఎంతుందో చూసుకుని హ్యాపీగా ఫీలవుతున్నారు అనుకుంటున్నారా? కాదండి! ఈ లెక్క సోషల్ మీడియాల్లోని తమ ఖాతాల్లో అభిమానుల సంఖ్య. ఈ లెక్క ఆల్ ఇండియాకి సంబంధించినది కాదు.. హోల్ వరల్డ్‌ది అన్న మాట. సెలబ్రిటీలంతా అభిమానులతో నేరుగా తమ విశేషాలు పంచుకోవడానికి సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే. అభిమాన నటీనటులతో నేరుగా మాట్లాడకపోయినా.. ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా అభిప్రాయాలు పంచుకోవచ్చు కాబట్టి, వీళ్ల ఎకౌంట్స్‌ని ఫ్యాన్స్ ఫాలో అవుతుంటారు. ఒక్కో సెలబ్రిటీ ఎకౌంట్‌లో లక్షల్లో ఫాలోయర్స్ ఉంటారు. గడచిన పది రోజుల్లో... 40, 60, 30 లక్షలకు చేరుకున్న సెలబ్రిటీల ఖాతాల వివరాల్లోకి వెళితే...
 
 మీకోసం ఎంత కష్టపడుతున్నానో
 రామ్‌చరణ్‌కి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలున్నాయి. ఫేస్‌బుక్ ఖాతాను ఇప్పుడు ‘40 లక్షల’ మంది అనుసరిస్తున్నారు. ‘‘మన ఫ్యామిలీ మొత్తం నాలుగు మిలియన్లు (40 లక్షలు). చాలా ఆనందంగా ఉంది. చూడండి.. ఫేస్‌బుక్‌లో మీకు అప్‌డేట్స్ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నానో’’ అంటూ షూటింగ్ సమయాల్లో ఫోన్ ద్వారా ఫేస్‌బుక్‌లో తాను అప్‌డేట్ చేస్తున్న ఫొటోను రామ్‌చరణ్ పోస్ట్ చేశారు. తాను చేస్తున్న సినిమాల విశేషాలతో పాటు అడపా దడపా ఫేస్‌బుక్ ద్వారా ఫ్యాన్స్‌తో ప్రత్యేకంగా ‘చాట్’ చేస్తుంటారు రామ్‌చరణ్. అభిమానులు అడిగిన ప్రశ్నలకు లైవ్‌లో ఓపికగా సమాధానాలిస్తుంటారు.
 
 మీ ప్రేమకో మంచి ఉదాహరణ
 బబ్లీ బ్యూటీ హన్సిక తమిళంలో కూడా సినిమాలు చేయడం మొదలుపెట్టాక అభిమానుల సంఖ్య బాగా పెరిగిపోయింది. పైగా తమిళనాడులో ‘చిన్న ఖుష్బూ’ అనిపించుకున్నారు కాబట్టి, అభిమానుల సంఖ్య సినిమా సినిమాకీ పెరుగుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ ఫేస్‌బుక్ ఖాతాలో 60 లక్షలు ఫాలోయర్స్ చేరారు. ఫేస్‌బుక్‌లో ఎప్పట్నుంచో ఆమెకు ఎకౌంట్ ఉంది. ‘‘అభిమానులు నన్నెంతగా ప్రేమిస్తున్నారో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం’’ అని హన్సిక పేర్కొన్నారు.
 
 ఆ ఫొటోలకు బోల్డంత క్రేజ్
 గోవా బ్యూటీ ఇలియానా హిందీ సినిమాలు చేయడం మొదలుపెట్టాక సౌత్‌కి దూరమయ్యారు. కానీ, అభిమానులకు మాత్రం దూరం కాలేదు. ముఖ్యంగా ఈవిడగారి ‘ఇన్‌స్టాగ్రామ్’కి ఫాలోయర్ల సంఖ్య ఎక్కువ. ఎందుకంటే.. ఎప్పటిప్పుడు తన పర్సనల్ ఫొటోలను అందులో పొందుపరుస్తుంటారు. ‘వామ్మో.. చాలా హాట్ గురూ’ అనే స్థాయిలో ఆ ఫొటోలు ఉంటాయి. బికినీలో ఉన్న ఫొటోలను, వీడియోలను సైతం ఆమె పెడుతుంటారు. ఆ ఫొటోలకున్న క్రేజ్ ఎలాంటిదింటే ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌ని 40 లక్షల మంది ఫాలో అవుతున్నారు. 
 
 థర్టీ ప్లస్.. థర్టీ లాక్స్!
 త్రిష వయసు 30. నటిగా ఆమె కెరీర్ వయసు దాదాపు 15. ఇన్నేళ్లుగా కథానాయికగా రాణించడం అంటే చిన్న విషయం కాదు. పైగా చేతిలో రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం అంటే మాటలు కాదు.  ఈ చెన్నై చందమామ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకంటే ఈవిడగారి ట్విట్టర్ ఎకౌంట్‌ను 30 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ‘‘థ్యాంక్యూ.. నా మనసులో మీకు (ఫ్యాన్స్) ప్రత్యేకమైన స్థానం ఉంది’’ అని ఆనందం వ్యక్తం చేశారామె.
 
 కోట్లు తీసుకునే తారలకు వందల్లో ఫ్యాన్స్ ఉంటే లాభం లేదు. లక్షల్లో ఉండాలి. అప్పుడే లైమ్‌లైట్‌లో ఉన్నట్లు లెక్క. కెరీర్ మంచి ఊపు మీద ఉంటుంది. అందుకే ఈ కోటీశ్వరులందరూ తమను ఫాలో అవుతున్న లక్షలాది అభిమానులకు ‘బిగ్ థ్యాంక్స్’ అంటున్నారు.

Monday, December 5, 2016

తలైవీ.. సెలవ్

దేశ రాజకీయాల్లో ఓ శకం ముగిసింది.. అలుపెరుగక పోరాడిన ‘విప్లవ నాయకి’ విశ్రమించింది...అభిమానుల ‘అమ్మ’ అస్తమించింది.. తమిళనాట ఓ ధ్రువతార నేలరాలింది.. ముఖ్యమంత్రి జయలలిత రెండునెలలకుపైగా మృత్యువుతో జరిపిన పోరాటంలో అలిసిపోయారు. ఆమె అభిమానులు చేసిన పూజలు.. దేశవిదేశాలకు చెందిన అత్యంత నిపుణులైన వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు..
75 రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన జయలలిత సోమవారం రాత్రి 11.30కు మృతి చెందినట్లు అపోలో వైద్యులు ప్రకటించారు. ‘అమ్మ’ మృతితో తమిళనాడు శోకసంద్రంలో మునిగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం వారం రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది. మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద నేటి సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. జయ మృతికి రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖులంతా సంతాపం తెలిపారు.
 చెన్నై: తమిళనాడు శోకసంద్రమైంది.. రాష్ట్రమంతా విషాదఛాయలు అలుముకున్నాయి.. ముఖ్యమంత్రి జయలలిత (68) సోమవారం రాత్రి కన్నుమూశారు. రాత్రి 11.30 గంటలకు కన్నుమూసినట్లు చెన్నై అపోలో ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఆసుపత్రి నుంచి పార్థివదేహాన్ని అర్ధరాత్రి పోయెస్‌ గార్డెన్‌లోని ఆమె స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం అక్కడినుంచి మంగళవారం ఉదయం మౌంట్‌రోడ్‌లోని రాజాజీ హాల్‌కు తరలిస్తారు. అత్యవసరంగా సమావేశమైన పార్టీ శాసనసభాపక్షం తదుపరి ముఖ్యమంత్రిగా పన్నీర్‌సెల్వంను ఎన్నుకుంది. ఆ వెంటనే ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి అర్ధరాత్రి 1.20 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రంలో వారంరోజులపాటు సంతాప దినాలు ప్రకటించారు. మూడురోజుల పాటు రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేస్తారు. ఆమె అంత్యక్రియలను మెరీనా బీచ్‌లోని ఎంజీఆర్‌ సమాధి వద్ద మంగళవారం సాయంత్రం నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయ సన్నిహితురాలైన శశికళను ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ప్రణబúముఖర్జీ, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తదితర ప్రముఖులంతా జయ మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు.
ఆదివారం సాయంత్రం తీవ్రమైన గుండెపోటు రావడంతో జయలలిత పరిస్థితి విషమించింది. అపోలో ఆసుపత్రిలోనే సాధారణ ప్రత్యేక గదిలో ఉంటున్న ఆమెను వెంటనే క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి వైద్యులు రేయింబవళ్లు శ్రమించారు. ‘ఎక్మో’ యంత్రం ద్వారా కృత్రిమ శ్వాస, రక్త ప్రసరణ జరిగేలా చూశారు. దిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వైద్య బృందం కూడా ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చింది. లండన్‌ నుంచి డాక్టర్‌ రిచర్డ్‌ బాలే వైద్యసేవలపై సలహాలు ఇస్తూ సమీక్షించారు. వైద్యుల ప్రయత్నాలు విఫలమవడంతో ఆమె సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం మళ్లీ విషమించినట్లు తెలియగానే అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. రెండురోజుల నుంచి అక్కడ తీవ్ర ఉద్వేగపూరితమైన వాతావరణం కొనసాగింది. సోమవారం రాత్రి జయ మృతిచెందినట్లు తెలియగానే అభిమానులంతా కన్నీరుమున్నీరయ్యారు. తమిళనాడు మొత్తం విషాదంలో మునిగిపోయింది. పార్టీలకు అతీతంగా నాయకులు, కార్యకర్తలు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాపాడలేకపోయాం..
రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు
అపోలో ఆసుపత్రుల అధికారిక ప్రకటన
ఈనాడు, చెన్నై: ‘ఇది వ్యక్తం చేయలేని దుఃఖం (ఇన్‌డిస్‌క్రైబబుల్‌ గ్రీఫ్‌), మన ప్రియతమ నేత, తమిళనాడు ముఖ్యమంత్రి, విప్లవనాయకి అమ్మ(జయలలిత) ఈ రోజు రాత్రి (సోమవారం) 11.30 గంటలకు కన్నుమూశారు. సెప్టెంబర్‌ 22న తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌ సమస్యలతో గౌరవ ముఖ్యమంత్రి ఆసుపత్రిలో చేరారు. ఆమెకు క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో వివిధ విభాగాల నిపుణులతో చికిత్స అందించాం. వాటికి ఆమె బాగా స్పందించారు. క్రమంగా కోలుకున్నారు, ఆహారమూ తీసుకునేవారు. వీటన్నిటి ఆధారంగా ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ నుంచీ హై డిపెండెన్సీ యూనిట్‌కు తరలించాం. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో ఆమె పరిస్థితి మెరుగయ్యే సూచనలు కనిపించాయి. దురదృష్టవశాత్తు 4వ తేదీ(ఆదివారం) సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రికి తీవ్రమైన గుండెపోటు(మాసివ్‌ కార్డియాక్‌ అరెస్ట్‌) వచ్చింది. వెంటనే వైద్య నిపుణులు ఆమెను క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌కు తరలించారు. వెనువెంటనే ఎక్మో సహాయం అందించి పరిస్థితిని పర్యవేక్షించాం. ఎక్మో అనే చికిత్స ప్రక్రియ అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన చికిత్స ప్రక్రియ. ఆమెకు అవసరమైన ప్రతి చిన్న చికిత్సను కూడా అందించి కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేశాం. అయినా.. అప్పటికే విషమించిన ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి ఆమెను కోలుకోలేకుండా చేశాయి. చివరకు ఆమె సోమవారం రాత్రి 11.30 గంటలకు తుది శ్వాస విడిచారు. అపోలో ఆసుపత్రిలోని సిబ్బంది గౌరవ ముఖ్యమంత్రికి అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అవిశ్రాంత వైద్య సపర్యలు అందించారు. ఆమె మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆమెను పోగొట్టుకుని విచారంలో మునిగిపోయిన తమిళనాడు ప్రజలు, జాతి దుఃఖంలో మేము సైతం పాలు పంచుకుంటున్నాం’
- అపోలో ఆసుపత్రుల యాజమాన్యం

మహేష్‌ సినిమాకు పేరు ఖాయం!

 సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివ కాంబినేషన్లో సినిమా అనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ టైటిల్‌పై పుకార్లు వస్తున్నాయి. మహేష్‌ ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారని, ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్‌ వచ్చింది. అయితే దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం నుంచి దాదాపు స్పష్టత వచ్చింది. ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సోమవారం ‘భరత్‌ అను నేను’ అనే పేరును రిజిస్టర్‌ చేయించారు. మరి టైటిల్‌పై దాదాపు స్పష్టత వచ్చినా, మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారా? అన్న ప్రశ్నకు సమాధానం కోసం వేచి చూడాలి. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఫిబ్రవరి నుంచి జరగనున్నట్లు తెలుస్తోంది.
మహేష్‌ కథానాయకుడిగా ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.

Sunday, December 4, 2016

ఆయన చిన్న కమలహాసన్!

  నటుడు జయంరవిని చిన్న కమలహాసన్‌గా ప్రభుదేవా అభివర్ణించారు. ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు, దర్శకుడు  ప్రభుదేవా ఇటీవల దేవి చిత్రంలో నిర్మాతలా కూడా అవతారమెత్తిన విషయం తెలిసిందే. ఆయన తన ప్రభుదేవా స్టూడియోస్ పతాకంపై నిర్మిస్తున్న తాజా చిత్రం బోగన్. జయంరవి, హన్సిక జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఇంతకు ముందు ఇదే జంటతో రోమిమో జూలియట్ వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన లక్ష్మణ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు అరవిందస్వామి ముఖ్య పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అం దిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం సాయంత్రం చెన్నై శివారు ప్రాంతం ఇంజిమ్‌బాక్కమ్‌లో గల వేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలోని ఐసరి వేలన్ ఆవరణలో జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర కథానాయకుడు జయంరవి మా ట్లాడుతూ బోగన్ పక్కా కమర్షియ ల్ ఫార్ములాలో తెరకెక్కిన మాస్ రొమాంటిక్ ఎంటర్‌టెయినర్ అని తెలిపారు.
ఇందులో అరవిందస్వామితో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ చిత్రంలో యువ సంగీత దర్శకుడు అనిరుద్ పాడిన పాటకు తాను చిందేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. తనిఒరవన్ చిత్రం తరువాత అంత మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని అన్నారు. చిత్ర నిర్మాత ప్రభుదేవా మాట్లాడుతూ సినిమాకు చెందిన చాలా విషయాలు ఆయనకు తెలుసని, అందుకే తాను జయంరవిని కుట్టి(చిన్న) కమలహాసన్ అని పిలుస్తానని అన్నారు. ఇక నటి హన్సిక నటన బోగన్ చిత్రంలో తనను చాలా ఇంప్రెస్ చేసిందన్నారు. ఎంగేయుమ్ కాదల్ చిత్రం నాటి నుంచి ఇప్పటి వరకూ ఆమె ఎదుగుదలను తాను చూస్తున్నానని తెలిపారు. ఈ బోగన్ చిత్రం అని వరా్గాలను అలరించే మంచి కమర్షియల్ ఎంటర్‌టెరుునర్‌గా ఉంటుందని ప్రభుదేవా ఆశాభావం వ్యక్తం చేశారు.

Friday, December 2, 2016

బెంగళూర్ వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి?

 యోగా టీచర్ అనుష్కకు వరుడు దొరికాడా..? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారుు సినీ వర్గాలు. తమిళ, తెలుగు భాషల్లో అగ్ర నాయకిగా రాణిస్తున్న నటి అనుష్క. 2005లో నటిగా రంగప్రవేశం చేసిన ఈ భామ ప్రముఖ కథానాయకులందరితోనూ నటించారు. ప్రస్తుతం 35వ ఏట అడుగుపెట్టారు. దీంతో అనుష్క పెళ్లి గురించి చాలా రోజులుగా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రాకు చెందిన ఒక వ్యాపారవేత్తను అనుష్క పెళ్లాడబోతున్నారనే ప్రచారం ఆ మధ్య హల్‌చల్ చేసింది. అయితే నిజంగానే అనుష్క పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో బెంగళూర్‌కు చెందిన వ్యాపారవేత్తతో బొమ్మాళి పెళ్లి నిశ్చయం అయింయందని తాజా సమాచారం. ఆయనకు బెంగళూర్, ఆంధ్రాలో భారీగా ఆస్తులున్నట్లు టాక్. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనుందని సినీ వర్గాల సమాచారం. అనుష్క సూర్యకు జంటగా నటించిన ఎస్-3 చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ప్రస్తుతం బాహుబలి-2, భాగమతి చిత్రాలతో పాటు నాగార్జున సరసన నమో వెంకటేశాయ అనే భక్తిరస కథా చిత్రంలో నటిస్తున్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత పెళ్లి పీటలెక్కనున్నారని, ఆ తరువాత నటనకు స్వస్తి చెప్పే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Thursday, December 1, 2016

దేని దారి దానిదే!

మాంచి ఘుమఘుమలాడే భోజనం ముందుంటే... లొట్టలేసుకుంటూ తినేస్తారు తప్ప ఎవరూ చూస్తూ కూర్చోరు కదా! కానీ, హీరోయిన్ల పరిస్థితి ఇందుకు భిన్నమనే చెప్పాలి. ముందున్న ప్లేటులో ఫుడ్ నోరూరిస్తున్నా.. ఇది తింటే కొవ్వు పెరుగుతుందేమో? ఇందులో కేలరీలు ఎన్నున్నాయో? రేపు జిమ్‌లో ఎంతసేపు ఎక్స్ట్రా వర్కౌట్స్ చేయాలో? అని సవాలక్ష ప్రశ్నలతో తినడానికి భయపడతారు. కానీ, రకుల్‌ప్రీత్ సింగ్  అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా గుజరాతీ ఫుడ్‌ను ఫుల్లుగా లాగించేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేశ్‌బాబుకు జోడీగా నటిస్తున్న సినిమా షూటింగ్ కోసం రకుల్ అహ్మదాబాద్ వెళ్లారు.
 
  షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన వెంటనే... వ్యక్తిగత సహాయక బృందంతో కలసి దగ్గరలోని ఓ రెస్టారెంట్‌కి వెళ్లారు. సంప్రదాయ గుజరాతీ వంటకాలు బాగున్నాయని ఫుల్‌గా తినేశారు. మరి, వర్కౌట్స్ సంగతేంటి? ఆల్రెడీ జిమ్‌లో ఉన్నారా! ఏంటి? అనడిగితే... రకుల్ గట్టిగా నవ్వేశారు. ‘‘ఓ పక్క ఫుడ్ దారి ఫుడ్‌ది. మరోపక్క వర్కౌట్స్ దారి వర్కౌట్స్‌ది’’ అన్నారు. ఏం తిన్నా, ఎంత తిన్నా వెయిట్ పెరగని రకుల్ స్లిమ్ బ్యూటీ వెనుక సీక్రెట్ ఇదన్నమాట! 

Wednesday, November 30, 2016

రజనీతో ఆ ఛాన్స్ ఎవరికో?

  రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శ్వాశత శత్రువులు ఉండరంటారు. ఈ నానుడి సినిమా రంగానికీ వర్తిస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు పూసుకుని తిరిగిన వారు రేపు మాటల కత్తులు దూసుకుంటారు. ఇదీ ఇక్కడి నైజం. ఇక వృత్తి రీత్యా పోటీ అన్నది ఎటూ ఉంటుంది. ఈ విషయంలో సొంతం లేదు, స్నేహం లేదు. కథానాయికల విషయానికి వస్తే ఒకప్పుడు నటి విజయశాంతి చిత్రానికి పూజ జరిగిందంటే చాలు తెలుగు, తమిళ భాషల్లో బిజినెస్ జరిగిపోయేది. లేడీ సూపర్‌స్టార్‌గా వెలిగిపోయారు. ఆ స్టేజీకి నటి నయనతార చేరుకున్నారు. ఈ మాలీవుడ్ సంచలన నటి చిత్రం ప్రారంభ దశలోనే అన్ని ఏరియాలు వ్యాపారం పూర్తయిపోతోంది.
ఆరంభంలో అయ్యా, చంద్రముఖి చిత్రాల్లో పక్కింటి అమ్మారుు ఇమేజ్‌ను సంపాదించుకున్నా, ఆ తరువాత గజిని, వల్లవన్ చిత్రాల్లో అంగాంగ ప్రదర్శనలతో గ్లామర్ డాల్‌గా మారిపోయారు. అలా కమర్షియల్ చిత్రాల నాయకిగా పేరు తెచ్చుకున్న నయనతారను మాయ చిత్రం హీరోరుున్ ఓరియెంటెడ్ చిత్రాల నాయకిగా మార్చేసింది. అది మొదలు లేడీ సూపర్‌స్టార్ పట్టంతో వెలిగిపోతున్నారు.

ప్రస్తుతం దోర, ఇమైక్కా నోడిగళ్, ఆరమ్, కొలైదీర్ కాలం చిత్రాలన్నీ హీరోరుున్ సెంట్రిక్ కథా చిత్రాలే నయనను వరించడం విశేషం. అరుుతే స్టార్ హీరోల నుంచి యువ నటుల సరసనా నటిస్తూ ఆల్‌రౌండర్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. కోలీవుడ్‌లో తన రెండో చిత్రమే సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జంటగా నటించిన నయనతార, ఆ తరువాత శివాజీ చిత్రంలో బల్లేలక్క పాటలో మెరిశారు. తాను టాప్ హీరోరుున్‌గా వెలుగొందుతుండగానే మరోసారి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో రొమాన్స్‌ చేయాలని నయన్ ఆశపడుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్.
అంతే కాదు కబాలి చిత్ర ఫేమ్ పా. రంజిత్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ధనుష్ నిర్మించనున్న తాజా చిత్రంలో చాన్స్‌ కొట్టేయడానికి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. సూపర్‌స్టార్ సరసన ఒక్క చిత్రంలో అరుునా నటించాలని చాలా కాలంగా తహతహలాడుతున్న చెన్నై చిన్నది త్రిష ఈ సారి ఆయనతో నటించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. విశేషం ఏమిటంటే ఈ ముద్దుగుమ్మలిద్దరూ నటుడు ధనుష్‌కు సన్నిహితులే.
ఇంతకు ముందు నయనతార యారడీ నీ మోహినీ చిత్రంలో ధనుష్‌తో రొమన్స్‌ చేశారు. అంతే కాదు ఆయన నిర్మించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో నాయకి నయనతారే. ఇక త్రిష ఇటీవలే ధనుష్‌తో కలిసి కొడి చిత్రంలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరిలో ఎవరిని రజనీకాంత్‌కు జంటగా ఎంచుకోవాలన్న విషయంలో ధనుష్ జుట్టు పీక్కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏమిటంటే నయనతార, త్రిషలిద్దరూ నెచ్చెలిలే. అయినా వృత్తి విషయంలో పోటీనే అని ఈ ముద్దుగుమ్మలిద్దరి భావన.

ఇలాంటి పరిస్థితుల్లో ఇక సూపర్ చాన్స్‌ ఎవరు కొట్టేస్తారో చూద్దాం. నయనతార గురించిన కొత్త వార్త ఏమిటంటే ఇటీవలే స్థానిక ఎగ్మూర్‌లో పలు అంతస్తులు గల అధునాతన భవన సముదాయంలో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివతో కలిసి అందులో నివసిస్తున్న నయనతార ఉదయం షూటింగ్‌కు బయలుదేరినప్పటి నుంచి మళ్లీ షూటింగ్ ముగించుకుని తిరిగి ఇంటికి చేరే వరకూ బాడీగార్డులు రక్షణ బాధ్యతలను చూసుకుంటున్నారట. మధ్యలో ఈ బ్యూటీ దగ్గరకు ఎవరూ కూడా రాలేరట. ఈ ఏర్పాట్లను నయనతారను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారంలో ఉన్న యువ దర్శకుడు విఘ్నేశ్‌ శివనే చేశారన్నది కోలీవుడ్‌లో వినిపిస్తున్న గుసగుసలు.

Tuesday, November 29, 2016

నా మనసులో ప్రేమకు చోటు లేదు

  నా మనసులో ప్రేమకు చోటు లేదు అంటున్నారు నటి తమన్నా భాటియా. సాధారణంగా గాసిప్స్‌కు దూరంగా ఉండే ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ప్రభుదేవాతో చెట్టాపట్టాల్ అంటూ వదంతులు హల్‌చల్ చేయడం చాలా మందికి ఆసక్తిని కలిగించింది. అయితే తాను మాత్రం ప్రస్తుతానికి ప్రేమ కోసం సమయాన్ని కేటాయించే పరిస్థితిలో లేనని తమన్నా అంటున్నారు.
 
దీని గురించి ఈ బ్యూటీ కాస్త విపులంగా తెలుపుతూ తాను ఇంకా పలు హీరోలతో నటించాల్సి ఉందన్నారు. అదే విధంగా తన బయోగ్రఫీ కథలో, మరిన్ని కథా బలం ఉన్న చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నానని అన్నారు. స్టార్ హీరోలకు జంటగా, భారీ బడ్జెట్ కథా చిత్రాలలో నటిస్తున్నప్పటికీ, స్టార్‌డమ్ లేని నటులతో మంచి కథా చిత్రాలలో నటించాలన్న ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపారు. 
   తనకు తానే ఛాలెంజ్ చేసుకునే విధంగా నటించాలని, అప్పుడే తనలో నిద్రాణమై ఉన్న నటనా ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. ఈ ఏడాదిలో నటించిన ఊపిరి, ధర్మదురై, దేవి చిత్రాలు ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు. ఇక పోతే ఒకే ఛాయలున్న కథా పాత్రల్లో నటించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అదే విధంగా ద్విభాషా చిత్రాల్లో నటించడానికి తనకు అభ్యంతరం లేదు గానీ, త్రిభాషా చిత్రాల్లో నటించనని చెప్పారు. అలాంటి చిత్రాల్లో ఆయా భాషల నేటివిటీకి తగ్గట్టుగా నటించాల్సి ఉంటుందని, అలా నటించడం చాలా చాలా కష్టమని, అలసటకు గురి కావాల్సి ఉంటుందని అన్నారు.