సూపర్‌స్టార్ మహేష్‌బాబు,
కొరటాల శివ కాంబినేషన్లో సినిమా
అనే ప్రకటన వెలువడినప్పటి నుంచీ
టైటిల్‌పై పుకార్లు వస్తున్నాయి.
మహేష్ ఈ సినిమాలో ముఖ్యమంత్రి
పాత్రను పోషిస్తున్నారని, ‘భరత్
అను నేను’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని
టాక్ వచ్చింది. అయితే దీనికి
సంబంధించి తాజాగా చిత్ర బృందం
నుంచి దాదాపు స్పష్టత వచ్చింది.
ఈ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య
సోమవారం ‘భరత్ అను నేను’ అనే
పేరును రిజిస్టర్ చేయించారు.
మరి టైటిల్‌పై దాదాపు స్పష్టత
వచ్చినా, మహేష్ ముఖ్యమంత్రి
పాత్రను పోషిస్తున్నారా? అన్న
ప్రశ్నకు సమాధానం కోసం వేచి
చూడాలి. ఈ చిత్రం రెగ్యులర్
షూటింగ్ ఫిబ్రవరి నుంచి జరగనున్నట్లు
తెలుస్తోంది.
మహేష్ కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.
మహేష్ కథానాయకుడిగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్ ప్రస్తుతం అహ్మదాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం టైటిల్‌ను ఇంకా ఖరారు చేయలేదు.
No comments:
Post a Comment