Thursday, March 3, 2016

నేను షారుక్ అభిమానిని!

 ఆ మధ్య వరకూ షారుక్‌ఖాన్, సల్మాన్‌ఖాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. ఆ తర్వాత సీన్ మారింది. సల్మాన్ చెల్లెలు అర్పితా ఖాన్ పెళ్లి నుంచి ఈ ఇద్దరి మధ్య మళ్లీ స్నేహం చిగురించింది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలన్నింటినీ మరిచిపోయి ఇద్దరూ హ్యాపీగా ఉంటున్న సంగతి తెలిసిందే.

  ఇప్పుడు సల్మాన్‌ఖాన్ తాను షారుక్‌ఖాన్ అభిమానిని అని పేర్కొనడం బాలీవుడ్ వర్గాల్లో ఆశ్చర్యం కలిగించింది. షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’ ప్రచార చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా కండలవీరుడు సల్మాన్ ‘‘బీయింగ్ ఎ ఫ్యాన్ ఆఫ్ షారుక్’’ అంటూ ‘ఫ్యాన్’ ట్రైలర్ లింక్‌ను తన ట్విటర్‌లో షేర్ చేశారు. గత ఏడాది సల్మాన్ నటించిన ‘బజరంగీ భాయ్‌జాన్’ చిత్రం ఫస్ట్ లుక్‌ను షారుక్ ట్విట్టర్‌లో ఆవిష్కరిస్తే, ఆ తర్వాత షారుక్ నటించిన ‘దిల్‌వాలే’ చిత్రం డైలాగ్స్‌తో సల్మాన్ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ టీమ్ డబ్‌స్మాష్ చేసింది.

  ఇదంతా చూస్తుంటే, ఎలాంటి ఈగోలు లేకుండా సల్మాన్, షారుక్‌లు చాలా ఫ్రెండ్లీగా ఉంటూ, ఒకరి చిత్రాలను మరొకరు ప్రమోట్ చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పోటీనే... స్నేహం స్నేహ మే అన్న మాట. సల్మాన్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. షారుక్ కూడా అంతే. కొత్తగా చిగురించిన ఈ ఇద్దరి స్నేహం ఎందాకా కొనసాగుతుందో కాలమే చెప్పాలి.

మహిళలకు శ్రుతిహాసన్‌ ప్రత్యేక బహుమతి

 నటి శ్రుతిహాసన్‌ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఓ పాటను అంకితం చేయనున్నారట. సంగీత దర్శకులు ఎహ్‌సాన్‌ నూరానీ, లాయ్‌ మెన్‌డోన్కాలతో కలిసి ఆమె ఈ పాటను విడుదల చేస్తున్నారు. మహిళలను చైతన్య పరిచే దిశగా ఈ పాటను రచించినట్లు శ్రుతి పేర్కొన్నారు. స్త్రీలకు కలలు కనే శక్తి నిస్తూ... ఆత్మహత్యలకు పాల్పడాలనే ఆలోచనలు రాకుండా చేసే దిశగా పాట ఉంటుందని తెలిపారు. ఈ పాటలోని సంగీతం చక్కగా ఉంటుందని, పాట అందరికీ నచ్చుతుందని అభిప్రాయపడ్డారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్న శ్రుతి ఇలా సమయం కేటాయించి మరీ మహిళల కోసం పాట విడుదల చేయడం విశేషమే కదా.
         ప్రస్తుతం శ్రుతిహాసన్‌ తెలుగులో నాగచైతన్యతో ‘ప్రేమమ్‌’లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో ఆమె నటించిన ‘రాకీ హ్యాండ్సమ్‌’ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్‌ అబ్రహం కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకత్వం వహించారు.

Wednesday, March 2, 2016

విడాకులు కోరుతున్న నటి

 తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రేమ తన జీవిత భాగస్వామి జీవన్‌ అప్పచ్చు నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో బుధవారం పిటిషన్‌ దాఖలు చేశారు. విడాకులు తీసుకోవడానికి తన భర్త అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. అభిప్రాయబేధాల కారణంగా వీరిద్దరూ కొద్దికాలంగా విడిగా ఉంటున్నారు.
బెంగుళూరులోని కొడగు ప్రాంతానికి చెందిన ప్రేమ 2006లో పారిశ్రామిక వేత్త జీవన్‌ అప్పచ్చును వివాహం చేసుకున్నారు. 1995లో ‘సవ్యసాచి’ అనే కన్నడ చిత్రం ద్వారాప్రేమ తెరంగేట్రం చేశారు. వెంకటేశ్‌ సరసన ‘ధర్మచక్రం’ చిత్రంతో తెలుగు సినీపరిశ్రమకు పరిచయమయ్యారు.

బాహుబలి 2 రిలీజ్ డేట్


దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ బాహుబలి ది కంక్లూజన్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ముందుగా ఈ ఏడాది చివర్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావించినా, భారీ గ్రాఫిక్స్ తో పాటు షూటింగ్ పార్ట్ కూడా చాలా మిగిలి ఉండటంతో వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. 2017 ఏప్రిల్ 17న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.        ప్రభాస్, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి ద బిగినింగ్ ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించటంతో పాటు 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న బాహుబలి 2 పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునే స్థాయిలో మరింత ప్రతిష్ఠాత్మకంగా బాహుబలి 2 ను తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్.

Tuesday, March 1, 2016

'24' టీజర్ రిలీజ్ కు ముహుర్తం కుదిరింది

 సౌత్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్ టైనర్ 24. ఇష్క్, మనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డిఫరెంట్ మూవీలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ లు అభిమానులను ఆకట్టుకోగా త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్.
తొలి రోజు నుంచి సినిమా ప్రమోషన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న చిత్రయూనిట్ టీజర్ లాంచ్ చేయబోతున్న విషయాన్ని కూడా క్రియేటివ్ గా ఎనౌన్స్ చేశారు. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా జానర్ ను రివీల్ చేసే విధంగా సైంటిస్ట్ ఉపయోగించే పరికరాలతో పోస్టర్ ను రిలీజ్ చేశారు. మార్చి 4, సాయింత్రం 6గంటలకు టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా పోస్టర్ తో ఎనౌన్స్ చేశారు.  ఈవిషయాన్ని సూర్య తన ట్విట్టర్ లో వెల్లడించారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 16 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

బాయ్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకున్న ప్రీతి జింతా



బాలీవుడ్ సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింతా ఎట్టకేలకు పెళ్లి కూతురైంది. ప్రీతి తన ప్రేమికుడు, అమెరికాకు చెందిన ఆర్థిక విశ్లేషకుడు జీని గుడెనఫ్ ను వివాహం చేసుకుంది. ఫిబ్రవరి 29న లాస్ ఏంజిలెస్ లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వివాహానికి ప్రీతి, గుడెనఫ్ కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్టు సమాచారం.            ఏడాదిన్నరగా ప్రీతి జింతా, గుడెనఫ్ చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నట్టు కొంతకాలంగా వార్తలు వచ్చినా ప్రీతి వీటిని ఖండించింది. అయితే లాస్ ఏంజిలెస్ లో ప్రీతి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహం చేసుకున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రీతికి సన్నిహితంగా ఉండే సుజానే ఖాన్, సురిలీ గోయెల్ లాస్ ఏంజిలెస్ వెళ్లారు. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రీతి ఏప్రిల్ లో ముంబైకు రానుంది.            ఈ దిల్ సే  హీరోయిన్  ప్రముఖ  వ్యాపారవేత్త నెస్ వాడియాను వివాహం చేసుకోనున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ ఐపీఎల్ ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ను కొనుగోలు చేశారు. అనంతరం వారిద్దరి మధ్య వివాదం ఏర్పడటం, పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. 

Monday, February 29, 2016

'ఫ్యాన్' వర్సెస్ సూపర్ స్టార్

తన లుక్ తో ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్ చేసిన షారూఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ఫ్యాన్, తొలి ట్రైలర్ తో ఆ అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పటి వరకు కేవలం డ్రామాగా మాత్రమే ఈ సినిమాను చూపిస్తూ వచ్చిన చిత్రయూనిట్ ఫస్ట్ ట్రైలర్ లో ఇదో యాక్షన్ డ్రామగా రివీల్ చేశారు. ముఖ్యం రెండు విభిన్న పాత్రల్లో షారూఖ్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు.             ట్రైలర్ తోనే సినిమా కథను కూడా రివీల్ చేశారు చిత్రయూనిట్. తన అభిమాన నటుడి కోసం ఎంతకైన తెగించే వ్యక్తి ఆ నటుడికే శత్రువుగా మరటం, ఆ తరువాత పరిణామాలే ఈ సినిమా కథగా కనిపిస్తోంది. యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఫ్యాన్ సినిమాకు మనీష్ శర్మ దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఏప్రిల్ 15న రిలీజ్ కు రెడీ అవుతోంది.

మరో యంగ్ హీరో మూవీలో అనసూయ?

 క్షణం మూవీ సాధించిన విజయంతో జోరుమీదున్న  యాంకర్ అనసూయ మరింత  దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.  తాజాగా రామ్ చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కే మూవీ కోసం అనూయను సంప్రదించినట్లు సమాచారం. అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో చిత్రం తెరకెక్కబోతున్న  సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు కొంత పెర్ఫార్మెన్స్ కు అవకాశం ఉన్న పాత్ర కావడంతో ఆమె ఓకే చెప్పినట్లు  టాలీవుడ్ టాక్.

రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ ప్రారంభోత్సవం ఇటీవలే గీతా ఆర్ట్స్ ఆఫీసులో జరిగింది. తమిళంలో  ఘనవిజయం సాధించిన తనీఒరువన్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. అల్లు అరవింద్, రాంచచరణ్ కాంబినేషన్లో గతంలో వచ్చిన మగధీర చిత్రం ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే. దీంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. .

రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ వెర్షన్లో విలన్ పాత్ర చేసిన అరవింద్ స్వామి ఈ చిత్రంలో కూడా అదే పాత్రలో కనిపించబోతున్నారు. నాజర్, పోసాని కృష్ణమురళి కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు.  షూటింగ్   కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయ. దాదాపుగా 'ధ్రువ' అనే టైటిల్ ఖరారు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా సోగ్గాడే చిన్ని నాయనా' క్షణం మూవీలలో పెర్ఫార్మెన్స్, గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ అమ్మడు దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి ప్రకటన చేయలేదు.