Sunday, January 16, 2011
ఒకటి - ఒకటి సమానం
భారత్, దక్షిణాఫ్రికా మద్య జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌లో 1-1 సమానంగా ఉన్నాయి. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇంకా రెండో వన్డేలో భారత్ విజయం సాధించింది. తొలి వన్డేలో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో సౌతాఫ్రికా పైచెయి సాధించింది. ఇంకా రెండో వన్డేలో బారత్ 190 పరుగులకే అలౌట్ అయ్యింది. దీనికి బదులు సౌతాఫ్రికా 189 పరుగులు చేసింది. స్మిత్ 77 పరుగులు చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. భారత్ బౌలర్లలు విజృబించి మ్యాచ్ విజయం సాదించారు. ముఖ్యంగా మునాఫ్ పటేల్ నాలుగు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నాడు. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించింది. మురళీ విజరు 16, సచిన్ 24, విరాట్ కోహ్లీ 22, యువరాజ్ సింగ్ 53, ధోని 38, రైనా 11, రోహిత్ శర్మ 9, హర్భజన్ సింగ్ 3, ఖాన్ 0, నెహ్రా 6 పరుగులు చేశారు. మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అర్థ సెంచరీ చేశాడు. ఇంకా రెండో వన్డేలో యువరాజ్ సింగ్ అర్థ సెంచరీ చేసి టాప్ స్కోరుగా నిలిచాడు. మూడో వన్డేలో అర్థ సెంచరీ లేక సెంచరీ ? ఈసారి వంతు ఎవరిది. రైనా, రోహిత్ శర్మ, దోని, విజరు విలలో ఎవరు ?
తీర్పు మార్పు ....
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టెస్టు సిరీస్, టి20 మ్యాచ్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లో రుచి చూపించింది. వాట్సన్ తన సత్తా వన్డేలో చూపించాడు. వాట్సన్ 150 బంతులలో 4 సిక్స్‌లు, 12 ఫోర్లు సహాయంతో 161 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది.
Friday, January 14, 2011
రెండో ఆటలో చూడాలి ఎవరిదో .........
తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత జట్టు రెండో వన్డే ప్రతికారం తీసుకుంటుందా లేదా పెవిలియన్‌కు చేరుకుంటుందా. రేపు సాయంత్రం ఆరు గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. మొదటి వన్డేలో కోహ్లి ఒక్కడే అర్థ సెంచరీ చేశాడు. మిగితా బ్యాట్‌మైన్‌లు రాణించలేకపోయారు. దక్షిణాఫ్రికా అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో పై చెయి సాధించింది. రెండో వన్డేలో ఎవరిపై ఎవరు ప్రతాపం చూపిస్తారో చూడాలి. తొలి వన్డేలో ఓపెనర్లు ఇద్దరు విఫలమయ్యారు. చాలా కాలం తరువాత వన్డేలో సచిన్ ఆడినపప్పటికీ విఫలమై నిరాశ పరిచాడు. ఇంకా రెండు వన్డేలో సచిన్ ప్రతాపం చూపాలి. అలాగే బౌలర్లలు కూడా వారివారి సత్తా చాటాలి. యువరాజ్ సింగ్ కూడా మరో సారి తన సిక్స్‌లా వర్షం కూరిపిచాలి. బౌలింగ్‌లో ఎంతో కొంతో రాణించగలుతున్నాడు. అలాగే బ్యాటింగ్‌లో కూడా సత్తా చాటాలి.
17న ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక
ఉపఖండంలో జరగనున్న ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌కు 15మంది భారత ఆటగాళ్లను చెన్నరులో జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 17న ఎంపిక చేయనుంది. తొలిదశలో ఎంపిక చేసిన 30మంది ఆటగాళ్లలో నుంచి తుది జట్టును కృష్టమాచారి శ్రీకాంత్ నేతృత్వలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. పరిమిత ఆటగాళ్లను ఐసిసి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. 2011 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగుతుంది. భారత జట్టు గ్రూపు బి లో ఆడుతుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లండ్, నెదర్లండ్స్ ఈ గ్రూపులో ఆడే మిగతా జట్లు.సమర్థవంతమైన అల్‌రౌండరల్లకోసం సెలక్షన్ ప్యానల్ అన్వేషిస్తోంది.
ప్రపంచ కప్ తర్వాత రజాక్ రిటైర్మెంట్
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ 2012 టి20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించాడు. 'నా ఆలోచన ప్రకారం టి20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావడమే సరైన సమయం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రజాక్ పేర్కొన్నాడు. రజాక్ పాకిస్తాన్ టీమ్‌కు ఆల్ రౌండర్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. రిటైర్‌మెంట్ ప్రకటించడం అనేది ప్రతి సీనియర్ క్రికెటర్‌కు కష్టమైన నిర్ణయం. ఆటగాడి పిట్‌నెస్ ఆటను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రజాక్ తెలిపాడు. 'నా ఫామ్, ఫిట్‌నెస్‌ను బట్టి నేను 2012 టి20 ప్రపంచ కప్ వరకూ బాగా ఆడగలనని అనుకుంటున్నాను. ఈ సమయం నా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాను. ు. ఇది నాకు ఎంతో కీలకమైంది' అని రజాక్ అన్నాడు.
కివీస్‌తో వన్డే సిరీస్‌కు అఫ్రిదీకే పగ్గాలు
న్యూజిలాండ్ క్రికెట్ ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ప్రస్తుత కెప్టెన్ ఆల్‌రౌండర్ షాహిద్ ఆఫ్రిదీయే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వచ్చే నెల ప్రపంచకప్‌క కూడా అఫ్రిదీనే కెప్టెన్‌గా ఎంపిక చేస్తారా అన్న అంశంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.
జట్టు వివారలు : షాహిద్ ఆఫ్రిదీ ( కెప్టెన్ ), మొహ్దన హఫీజ్, అహ్మద్ షాజాద్, యూనిస్ ఖాన్, ఉమర్ అక్మల్, మిస్బాహుల్ హాఖ్, అసద్ షషీఖ్, అబ్దుల్ రజాక్, కామ్రాన్ అక్మల్, షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, అబ్దుల్ రెహ్మాన్, సయూద్ అజ్మల్.
జట్టు వివారలు : షాహిద్ ఆఫ్రిదీ ( కెప్టెన్ ), మొహ్దన హఫీజ్, అహ్మద్ షాజాద్, యూనిస్ ఖాన్, ఉమర్ అక్మల్, మిస్బాహుల్ హాఖ్, అసద్ షషీఖ్, అబ్దుల్ రజాక్, కామ్రాన్ అక్మల్, షోయబ్ అక్తర్, తన్వీర్ అహ్మద్, ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, అబ్దుల్ రెహ్మాన్, సయూద్ అజ్మల్.
Thursday, January 13, 2011
బెంగాల్ టైగర్ "దాదా గిరి"
ఉట్టిపడే రాజసం.. గ్రౌండ్‌లో అడుగిడుపెడితే ఆటకే ఒక కళ.. తప్పు జరిగితే జూనియర్లు సీనియర్లు అన్న తేడాలేకుండా అందరినీ హెచ్చరించే నైజం. గడ్డు పరిస్థితుల్లో ఉన్న క్రికెటర్లకు వెన్నంటి ఉండి వారిలో మనో మనోస్థైర్యాన్ని నింపి వారు మళ్లీ రాణించేలా ప్రోత్సాహాన్ని అందిచడం. ఎదుటి జట్టును ట్రిక్కులతో.. అవసరమైతే టెక్కులతో.. సైతం అధరగొట్టే తత్వం. అతను ఒక అనితరసాధ్యుడు బ్యాట్‌మెన్‌గా టన్నులకొద్దిపరుగులు సాధించి టెస్టుల్లో వన్డేల్లో అనేక సెంచరీలు, రికార్డులు సాధించి.. అవసరమైతే బాల్‌తోనూ అద్భుతాలు సృష్టించి... కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించి గ్రౌండ్‌లో, డ్రెస్సింగ్‌రూంలో సభ్యులను ఏక తాటిపై నడపడం...
హాయ్ ప్రెండ్స్ తెలుగు బ్లాగులందరికి నాయొక్క సంక్రాంతి శుబాకాంక్షలు.
హాయ్ ప్రెండ్స్ తెలుగు బ్లాగులందరికి నాయొక్క సంక్రాంతి శుబాకాంక్షలు.
ఆదిలోనే షాక్........
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్‌లలో 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నది. దక్షాణాఫ్రికా జట్టు 50 ఓవర్లలో 289 పరుగులు చేసింది. ఆమ్లా 50, డివిలియర్స్ 76, డుమినీ 73లు రాణించి దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించడంలో కీలకపాత్ర వహించారు. కెప్టెన్ స్మిత్ 11, ఇంగ్రామ్ 5 , జొహాన్ బోథా 23, వేన్ పార్నెల్ 21, మిల్లర్ 9, స్టెయిన్ 7, మోర్కెల్ 0 పరుగులు చేసి అవుట్ అయ్యారు. 290 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 13 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు పెవిలియమ్ చేరుకున్నారు. రోహిత్ శర్మ 11, యువరాజ్ సింగ్ 2, కెప్టెన్ దోని 25, రైనా 32, హర్భజన్ సింగ్ 0, జహీర్ ఖాన్ 6, నెహ్రా 1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కోహ్లి ఒక్కడే అర్థసెంచరీ చేశాడు. రైనా కొద్దిసేపు పోరాటం చేసి సొత్సొబె బౌలింగ్‌లో ఇంగ్రామ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
Subscribe to:
Posts (Atom)



