Friday, January 14, 2011
ప్రపంచ కప్ తర్వాత రజాక్ రిటైర్మెంట్
పాకిస్తాన్ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ 2012 టి20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ కానున్నట్లు ప్రకటించాడు. 'నా ఆలోచన ప్రకారం టి20 ప్రపంచ కప్ తర్వాత రిటైర్ కావడమే సరైన సమయం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను' అని రజాక్ పేర్కొన్నాడు. రజాక్ పాకిస్తాన్ టీమ్‌కు ఆల్ రౌండర్‌గా ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. రిటైర్‌మెంట్ ప్రకటించడం అనేది ప్రతి సీనియర్ క్రికెటర్‌కు కష్టమైన నిర్ణయం. ఆటగాడి పిట్‌నెస్ ఆటను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని రజాక్ తెలిపాడు. 'నా ఫామ్, ఫిట్‌నెస్‌ను బట్టి నేను 2012 టి20 ప్రపంచ కప్ వరకూ బాగా ఆడగలనని అనుకుంటున్నాను. ఈ సమయం నా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ కెరీర్‌లోనే అత్యుత్తమంగా ఆడాలనుకుంటున్నాను. ు. ఇది నాకు ఎంతో కీలకమైంది' అని రజాక్ అన్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment