Friday, January 14, 2011
17న ప్రపంచ కప్‌కు భారత జట్టు ఎంపిక
ఉపఖండంలో జరగనున్న ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌కు 15మంది భారత ఆటగాళ్లను చెన్నరులో జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ ఈ నెల 17న ఎంపిక చేయనుంది. తొలిదశలో ఎంపిక చేసిన 30మంది ఆటగాళ్లలో నుంచి తుది జట్టును కృష్టమాచారి శ్రీకాంత్ నేతృత్వలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. పరిమిత ఆటగాళ్లను ఐసిసి నిబంధనల ప్రకారం ఎంపిక చేస్తారు. 2011 ప్రపంచ కప్ భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగుతుంది. భారత జట్టు గ్రూపు బి లో ఆడుతుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఐర్లండ్, నెదర్లండ్స్ ఈ గ్రూపులో ఆడే మిగతా జట్లు.సమర్థవంతమైన అల్‌రౌండరల్లకోసం సెలక్షన్ ప్యానల్ అన్వేషిస్తోంది.
Subscribe to:
Post Comments (Atom)
మీకు, మీ కుటుంబానికి, బంధు మిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ReplyDeleteశి. రా. రావు
సంక్రాంతి లక్ష్మి_శిరాకదంబం