కష్టించి
పని చేయడంలో అనుష్క ముందు వరసలో ఉంటుంది. ఆమె గురించి పరిశ్రమలో
ఎవర్ని అడిగినా సరే... హార్డ్‌వర్కర్ అనే మాటతోనే మొదలుపెడతారు.
ఇటీవలి కాలంలో ఆమె చేస్తున్న పాత్రల్ని గమనించినా అనుష్క ఎంతగా చెమటోడుస్తుందో
ఇట్టే అర్థమవుతుంది. ప్రతి సినిమాకీ అలా శక్తికి మించి కష్టపడటం ఎలా
సాధ్యమవుతుందని అడిగితే అనుష్క ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.
‘‘వ్యక్తిగతంగా నాకు తెలిసిన వాళ్లను వేళ్లమీద లెక్కపెట్టొచ్చు.
కానీ నన్ను అభిమానించే వాళ్లు మాత్రం కోకొల్లలు. వాళ్లందరికీ నేనొక నటిని
మాత్రమే. నాలోని నటిని చూసే వాళ్లంతా అభిమానించడం మొదలు పెట్టారు.
నా పనితీరే నాపైన అభిమానానికి కారణమైనప్పుడు ఆ విషయంలో రాజీపడాలా?
ఛాన్సే లేదు. అందుకే నా పాత్ర కోసం ఏం కావాలన్నా చేయాలనుంటుంది. మనసులో
ఆ భావన ఉండటంతోసెట్‌లోకి వెళ్లేసరికి పాత్రలో లీనమైపోతుంటా. ఇక
ఆ తర్వాత నేనెంత కష్టపడుతున్నానన్నది నాకే గుర్తుండదు’’ అని చెప్పుకొచ్చింది
అనుష్క.
No comments:
Post a Comment