మహేష్‌బాబు,
మురుగదాస్ కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్
కథానాయిక. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ దీపావళికి టీజర్‌ని విడుదల చేసే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబరు
నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో
కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. చెన్నైలోనూ కొంత మేర షూటింగ్
జరిగింది. ప్రస్తుతం చిత్రబృందం టైటిల్ వేటలో ఉంది. ‘వాస్కోడిగామా’,
‘ఎనిమీ’, ‘అభిమన్యుడు’ ఇలా చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే
ఇవేం కాదని చిత్రబృందం స్పష్టం చేసింది. తెలుగు, తమిళ భాషలు రెండింటికీ
సరిపోయేలా టైటిల్ ఉండాలని మహేష్ భావిస్తున్నారట. దీపావళిలోగా టైటిల్
విషయంలోనూ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
No comments:
Post a Comment