బాలీవుడ్
కథానాయిక అనుష్క శర్మ నటించిన థ్రిల్లర్ సినిమా ‘ఎన్‌హెచ్ 10’. ఫిమేల్
ఓరియెంటెడ్‌గా 2015లో మార్చిలో విడుదలైన ఈ సినిమా విజయం అందుకుంది.
అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు
సమాచారం. అనుష్క శర్మ పాత్రలో నటించడానికి త్రిషను నిర్మాతలు కలిసినట్లు
తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇటీవల ‘నాయకి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిష ప్రస్తుతం‘మోహిని’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ధనుష్‌తో కలిసి ఆమె నటించిన ‘కోడి’ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రాన్ని ‘ధర్మయోగి’ టైటిల్‌తో తెలుగులో విడుదల చేస్తున్నారు.

No comments:
Post a Comment