భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ కు తాను పెద్ద అభిమానినని ముంబై
ఇండియన్స్ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా స్పష్టం చేశాడు. యువరాజ్ ఆటను ఎక్కువ
ఇష్టపడటం కాకుండా, అతనినే ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొన్నాడు.'నేను తరచు
యువరాజ్ సింగ్ క్రికెట్ ను చూస్తూ ఉంటా. నేను యువరాజ్ కు అతి పెద్ద అభిమాని
కావడంతోనే అతని ఆటపై మక్కువ పెంచుకున్నా. నాకు యువరాజ్ సింగే స్ఫూర్తి'
అని కృనాల్ తెలిపాడు. ఆల్ రౌండర్లలో ఎవర్నీ ఎక్కువ ఇష్టపడతారు అనే
ప్రశ్నకు కృనాల్ పై విధంగా స్పందించాడు.
ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కృనాల్ 37 బంతుల్లో 86 పరుగులు చేసి ముంబై భారీ విజయంలో సహకరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తన ప్రస్తుత ఐపీఎల్ ఆట తీరు పట్ల కృనాల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ తనకు అప్పజెప్పిన పనిని సమర్ధవంతంగా నిర్వర్తించినట్లు కృనాల్ అభిప్రాయపడ్డాడు. భవిష్యత్తులో కూడా ఇదే ఆట తీరును కొనసాగిస్తానని తెలిపాడు. మన ప్రతిభ బయట తీసిన మరుక్షణమే ఫలితం మనకు అనుకూలంగా వస్తుందని కృనాల్ వేదాంత ధోరణిలో మాట్లాడాడు.

No comments:
Post a Comment