ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూనీబోన్‌తో గోవా భామ ఇలియానా ప్రేమాయణం నడుపుతున్న విషయం తెలిసిందే. ముంబయిలో జరిగిన అనేక సినీ వేడుకల్లో ఈ జంట కలిసి సందడి చేశారు. తన ప్రేమ వ్యవహారంపై ఇలియానా ఇంతవరకు పెదవి విప్పలేదు.
వ్యక్తిగత విషయాల్ని బహిర్గతం చేయడం తనకు ఇష్టం వుండదని, సమయం వచ్చినప్పుడు తన లవ్‌ఎఫైర్ గురించి తెలియజేస్తానని చెప్పింది ఇలియానా. ఆమె మాట్లాడుతూ ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల జీవితాలతో ముడిపడి వుంటుంది. పరస్పర సమ్మతి వున్నప్పుడే అలాంటి సున్నితమైన విషయాల గురించి బయట ప్రపంచానికి తెలియజెప్పాలి. నేను వ్యక్తిగత స్వేచ్ఛకు ఎంతో విలువిస్తాను. అనుమతి లేనిదే ఇతరుల పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడను. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలపై ప్రజలకు ఆసక్తి వుండటం సహజం. దానిని అలుసుగా తీసుకొని అదే పనిగా గాసిప్స్ ప్రచారం చేయడం మంచిది కాదు. సరైన సమయంలో కాబోయే జీవిత భాగస్వామి ఎవరనేది అభిమానులకు తెలియజేస్తాను. కొద్దిరోజులు ఓపికి పడితే అందరికీ శుభవార్త చెబుతాను అని తెలిపింది. ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన రుస్తుం చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
No comments:
Post a Comment