జట్టులో చోటు కోల్పోయిన సమయంలో రంజీల్లో ఆడటం తనకు చాలా కలిసి వచ్చిందని
టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అన్నాడు. జట్టులో చోటు కోల్పోయిన
అనంతరం సౌరాష్ట్ర తరఫున జడేజా రంజీల్లో అద్భుతంగా రాణించాడు. రంజీల్లో
బౌలింగ్ చేసిన మాదిరిగానే సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫ్రీడమ్ సిరీస్‌లోనూ
చేస్తున్నాను పునరాగమనంలో నా బౌలింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను.
అశ్విన్, అమిత్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేయడం నా అదృష్టం. నాపై ఎలాంటి
ఒత్తిడి లేకుండా పోయింది. అందుకే వికెట్లు తీస్తున్నాను అని జడేజా ఆనందం
వ్యక్తం చేశాడు.
No comments:
Post a Comment