Saturday, October 31, 2015

డ్రా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్



 దక్షిణాఫ్రికా-బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్ల మధ్య ఇక్కడ బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన రెండు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా ముగిసింది. ఇరు జట్లు ప్రాక్టీస్ లో ఆకట్టుకున్నా రెండు రోజులే  కావడంతో ఫలితం తేలలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 296 పరుగులకు ఆలౌట్ కాగా, దక్షిణాఫ్రికా 302 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 46/2 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించింది. 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డివిలియర్స్(112) శతకం సాధించి ఆదుకున్నాడు. డివిలియర్స్ కు తోడుగా వికెట్ కీపర్ డేన్ విలాస్ (54)  రాణించడంతో దక్షిణాఫ్రికా గౌరవప్రదమైన స్కోరును సాధించింది. బోర్డు ప్రెసిడెంట్ ఆటగాళ్లలో శార్దూల్ థాకూర్  నాలుగు వికెట్లు సాధించగా, కులదీప్ యాదవ్, జయంత్ యాదవ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బోర్డు ప్రెసిడెంట్ జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి 30 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేసిన కేఎల్ రాహుల్.. మరోసారి ఆకట్టుకున్నాడు. 90 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతనికి జతగా చటేశ్వర పూజారా(49 నాటౌట్) ఆకట్టుకున్నాడు.

మరో టైటిల్ కు అడుగు దూరంలో...


 వరుస విజయాలతో దూసుకుపోతున్న సానియా మీర్జా(భారత్)- మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్) జోడీ మరో టైటిల్ కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నీలో భాగంగా శనివారం జరిగిన సెమీ ఫైనల్లో సానియా జంట  6-4, 6-2 తేడాతో హావో చింగ్ చాన్-యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ) పై విజయం సాధించి ఫైనల్స్ కు చేరింది. తొలి సెట్ లో కాస్త పోరాడిన సానియా ద్వయం.. రెండో సెట్ ను అవలీలగా చేజిక్కించుకుని మరో టైటిల్ వేటకు సన్నద్ధమైంది. ఈ తాజా గెలుపుతో సానియా జోడి తమ వరుస విజయాల సంఖ్యను 21 కు పెంచుకుంది.  
ఎనిమిది నెలల క్రితం మార్టినా హింగిస్‌తో జతకట్టిన సానియా అద్వితీయ ఫలితాలు సాధించింది. హింగిస్‌తో కలిసి ఈ ఏడాది ఏకంగా ఎనిమిది డబుల్స్ టైటిల్స్ సాధించింది. అందులో రెండు గ్రాండ్‌స్లామ్ (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నమెంట్‌లు కూడా ఉండటం విశేషం. మరో ఒక విజయం సాధిస్తే సానియా-హింగిస్ ఖాతాలో ప్రతిష్టాత్మక డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కూడా చేరుతుంది.

నంబర్ వన్ ర్యాంకు పదిలం

డబ్యూటీఏ ఫైనల్స్ టోర్నమెంట్  ఈ సీజన్ ముగింపు టోర్నీ కావడంతో సానియా-హింగిస్ లు మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకింగ్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత ఏప్రిల్ తొలిసారి ప్రపంచ మహిళల డబుల్స్ విభాగంలో నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న సానియా..  వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ సంవత్సరపు ముగింపు ర్యాంకింగ్స్ లో హింగిస్ తో కలిసి సానియా మీర్జా తన మహిళల డబుల్స్ నంబర్ వన్ ర్యాంకును నిలబెట్టుకుంది.

Friday, October 30, 2015

త్వరలో యువరాజ్ పెళ్లి?


భారత క్రికెట్ ప్లేబోయ్‌గా పేరు తెచ్చుకున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా త్వరలోనే తన బ్రహ్మచారి జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టనున్నాడా? దీపావళి రోజున వివాహ శుభవార్త చెబుతాడా? ఇప్పుడు యువీ అభిమానులంతా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. ఎందుకంటే రెండు రోజుల క్రితం ఓ ఇంటివాడైన హర్భజన్ సింగ్‌తో జరిపిన ట్వీట్స్ ద్వారా యువీ తన పెళ్లిపై ఊహాగానాలకు తెర తీశాడు. ముందుగా తను భజ్జీకి శుభాకాంక్షలు తెలుపుతూ ‘ఇక ఇప్పుడు ఎలాంటి దూస్రాలు వేయకు మిత్రమా.. లైన్‌కు కట్టుబడి ఉండు’ అని సరదాగా ట్వీట్ చేశాడు. పనిలో పనిగా భజ్జీ శ్రీమతి గీతా బస్రా కూడా.. ఇక లైన్లో తర్వాత ఉన్నది మీరే అంటూ యువీకి ట్వీట్ చేసింది. దీనికి వెంటనే స్పందించిన భజ్జీ ‘నీవు కూడా లైన్‌లోకి రా.. ‘స్ట్రెయిట్’గా ఆడు.. పుల్, కట్ ఆడకు’ అని నర్మగర్భంగా స్పందించాడు. యువీ కూడా వెంటనే సమాధానమిస్తూ.. ‘యెస్.. మిస్టర్ హర్భజన్.. దీపావళి నుంచి నేరుగానే ఆడబోతున్నాను’ అని ముగించాడు. దీంతో పండుగ రోజు తన పెళ్లి గురించి ఏమైనా కబురు చెబుతాడా అని సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.

Thursday, October 29, 2015

ఓ ఇంటి వాడైన హర్భజన్


 టీమిండియా క్రికెటర్ హర్భజన్ సింగ్ ఓ ఇంటి వాడయ్యాడు. స్నేహితురాలు గీతా బాస్రాను అతడు పెళ్లాడాడు. పంజాబ్‌లోని ఫగ్వారాలోని గురుద్వారాలో గురువారం వీరి వివాహం జరిగింది. తెలుపు రంగు షెర్వానీ, ఎరుపు టోపీ ధరించి భజ్జీ మెరిశాడు. పెళ్లికూతురు సంప్రదాయ ఎరుపు రంగు చీర ధరించింది. వీరి వివాహానికి దగ్గరి బంధువులు, సన్నిహితులు హాజరయ్యారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, అతడి సతీమణి అంజలి విచ్చేసి భజ్జీ-బాస్రా దంపతులను ఆశీర్వదించారు. అంతకుముందు హర్భజన్ నివాసంలో మెహందీ, సంగీత్ కార్యక్రమాలు నిర్వహించారు.  నవంబర్ 1న ఢిల్లీలో భజ్జీ-బాస్రా  వివాహ రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్ కు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశముంది. క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు రిసెప్షన్ కు రానున్నారు



Wednesday, October 28, 2015

హర్భజన్‌ పెళ్లి కొడుకైన వేళ ... చిత్రాలు



 ఐదురోజులపాటు అట్టహాసంగా జరుగనున్న క్రికెటర్ హర్భజన్ సింగ్, నటి గీతా బస్రా పెళ్లికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం వీరి పెళ్లి జరుగనుంది. దీంతోపాటు మెహిందీ, సంగీత్, రిసెప్షన్ వంటి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వధూవరులకు ప్రముఖ డిజైనర్ అర్చన కొచ్చర్ వస్త్రాలను రూపొందిస్తున్నారు. పెళ్లిరోజున భజ్జీ, గీత వేసుకునే దుస్తులను అత్యంత సంప్రదాయ శైలితో సరికొత్తగా రూపొందిస్తున్నట్టు ఆమె తెలిపారు.
 'గీత బాగా సంప్రదాయబద్ధంగా డిజైన్ ను కోరుకుంటున్నారు. ఆమె కోసం భారతీయ వర్క్ తో కూడిన లెహెంగా, దుపట్టా, బ్లౌజ్ సిద్ధం చేస్తున్నాం. భజ్జీ కూడా సంప్రదాయ డిజైన్ కు ప్రాధాన్యమిస్తున్నారు. పెళ్లిరోజున ఆయన భారతీయతో ఉట్టిపడే చుడిదార్ ధరించనున్నారు. మెహిందీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా వివిధ వేడుకలకు వధూవరులు మెచ్చేరీతిలో డిజైన్ వస్త్రాలను రూపొందిస్తున్నాం' అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఐదురోజుల ఈ పెళ్లి వేడుకలో భాగంగా నవంబర్ 1న జరుగనున్న రిసెప్షన్ కు క్రికెటర్లు యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లి, బాలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు.










Tuesday, October 27, 2015

మూడు దేశాల్లో భూవిలయం

పాకిస్తాన్‌లో 200 మంది, అఫ్ఘానిస్తాన్‌లో 63 మంది మృత్యువాత
 అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ సరిహద్దులు భారీ భూకంపంతో విలవిల్లాడాయి. హిందూకుష్ పర్వతశ్రేణుల్లో సోమవారం మధ్యాహ్నం సంభవించిన భూకంపం పాక్, అఫ్ఘాన్‌లలో పెను విధ్వంసం సృష్టించి 263 మంది ప్రాణాలను బలిగొంది. 1,300 మందికి పైగా ప్రజలను గాయాలపాల్జేసింది. పెద్దఎత్తున ఆస్తులను ధ్వంసం చేసింది. భూకంప భయంతో భారత్‌లోని కశ్మీర్‌లో ముగ్గురు చనిపోగా, ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో ప్రజలు ప్రాణభయంతో వణికారు. అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌కు 250 కి.మీ. దూరంలోని జుర్మ్‌లో హిందూకుష్ పర్వతాల కింద 213 కిలోమీటర్ల లోతులో మధ్యాహ్నం 2.39 గంటలకు(భారత కాలమానం ప్రకారం) భూకంపం సంభవించినట్లు అమెరికన్ జియోలాజికల్ సర్వే  తెలిపింది.
అన్ని విధాలా సహకరిస్తాం: మోదీ
 ‘ఎక్కడ ఎలాంటి సాయం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించాను. పాక్, అఫ్ఘాన్‌తో సహా అందించటానికి సిద్ధంగా ఉన్నాం. జమ్మూకశ్మీర్ సీఎం సయీద్‌తో ఫోన్‌తో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నా. అఫ్ఘాన్ అధ్యక్షుడు ఘనీ, పాక్ ప్రధాని  షరీఫ్‌లతో మాట్లాడి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చాను. అఫ్ఘాన్‌లో స్కూలు పిల్లలు చనిపోవటం నాకు చాలా ఆవేదన కలిగించింది’అని  ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


ప్రాణభయంతో పరుగులు...
  హింద్‌కుష్ పర్వత శ్రేణుల్లో సంభవించిన భూ ప్రకంపనలు ఉత్తర, వాయవ్య భారత ప్రాంతాలన కుదిపేశాయి. మధ్యాహ్నం 2.39 గంటలకు సంభవించిన భూకంపం, జమ్మూకశ్మీర్‌తో పాటు, దేశ రాజధాని ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాలను వణికించింది. ఆఫీసులు, ఆస్పత్రులు, సినిమాహాళ్లల్లోంచి ప్రజలు ఒక్కసారిగా భయంతో బయటకు పరుగులు తీశారు. కశ్మీర్‌లో ముగ్గురు చనిపోయారు. భూకంప వార్తలు వచ్చిన మరుక్షణమే ప్రధానిమోదీ పరిస్థితిని సమీక్షించారు.

Monday, October 26, 2015

పెళ్ళికి ఇంకా టైం ఉంది..

 'నవంబర్‌ 26న మా పెళ్ళంట. ఇది నిజంగా నవ్వు తెప్పించే వార్త. మేమింకా ముహూర్తమే పెట్టుకోలేదు. నా పెళ్ళి తేదీపై మీడియా గందరగోళం సృష్టిస్తోంద'ని అంటోంది అశిన్‌. నవంబర్‌ 26న ఢిల్లీలో అశిన్‌ పెళ్ళంటూ మీడియాలో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని ఖరాఖండిగా చెప్పింది. అంతేకాదు 'అంగీకరించిన ప్రాజెక్టులు, కాంట్రాక్టులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతాయి. ఆ తర్వాతే మా పెళ్ళి జరుగుతుంది. పెళ్ళి ఎప్పుడనేది నేను, మా పెద్దలు చెప్పేవరకు మీడియావాళ్ళు ఓపిక పట్టండి' అంటూ ఘాటుగా స్పందించింది. మైక్రో మ్యాక్స్‌ సహస్థాపకుడైన రాహుల్‌శర్మను అశిన్‌ పెళ్ళి చేసుకోబోతున్న విషయం విదితమే. ఇటీవల జరిగిన అశిన్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రాహుల్‌ శర్మ ఆరుకోట్ల విలువైన డైమండ్‌ రింగ్‌ను బహూకరించారు కూడా.

Sunday, October 25, 2015

శతకాలతో చెలరేగిన సఫారీలు... భారత్‌ లక్ష్యం 439


ముంబయిలోని వాంఖడే మైదానంలో భారత్‌,సౌతాఫ్రికా మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 50 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 438 పరుగులు చేసింది. వన్డేల్లో మ్యాచ్‌ల్లో 443 అత్యధికంగా ఉంది. మరో ఆరు పరుగులు చేసి ఉంటే సౌతాఫ్రికా జట్టు నెంబర్‌ వన్‌గా ఉండేది. సఫారీ బ్యాట్‌మెన్లు డికాక్‌ ( 109), డుప్లెసిస్‌ ( 133), డివిలియర్స్‌ (119) శతకాలు బాది జట్టుకు భారీ స్కోరు అందించారు. సఫారీ బ్యాట్‌మెన్ల దాటికి భారత్‌ బౌలర్లు కెరీర్‌లోనే దారుణమైన గణాంకాలు నమోదు చేసుకోన్నాయి. టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్‌ ఎంచుకు ది. ఓపెనరు ఆమాల్ల ( 23) పరుగులకే పెవిలియన్‌ చేరుకఁన్నాడు.మరో ఓపెనరు డికాక్‌ సెంచరీతో జవాజు ఇచ్చాడు.డికాక్‌ ( 109) అతని తోడుగా డుప్లెసిస్‌ కూడా సెంచరీతో అదుకున్నాడు. 133 పరుగులు చేసి రిటైర్డ్‌ హర్డ్‌ వెనుదిగిరాడు. డుప్లెసిస్‌ క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా అడినా శతకం తర్వాత విశ్వరూపం చూపాడు. మరో డైజర్‌అన్‌ బ్యాట్‌మైన్‌ ఎబి డివిలియర్స్‌ మరో సారి తన విశ్వరూపం బౌలర్లపై చూపాడు. డివిలియర్స్‌ ( 119) పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. చివర్లో మిల్లర్‌ (22), బెహార్డీన్‌ (16) దాటిగా ఆడటంతో దక్షిణాఫ్రికా జట్టు 438 పరుగులు చేయగలిగింది. 
దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వన్డేల్లో ఆరోసారి 4 వందల పైచిలుకు స్కోర్ చేశారు.

Tuesday, October 20, 2015

ఐపీఎల్‌కూ గుడ్‌బై...

ఏంటీ షాక్... మనసు జీర్ణించుకోలేకపోతోంది. సెహ్వాగ్ ఆటను ఇక చూడలేమా..? అంతర్జాతీయ క్రికెట్‌లో సరే. ఐపీఎల్‌లోనూ అతను ఆడటం లేదా..? ఎందుకీ కఠిన నిర్ణయం. ఏం వయసైపోయిందని అప్పుడే రిటైరవుతున్నాడు..! తొలి ఓవర్లోనే అలా బంతులు ఎగిరి స్టాండ్‌లో పడుతుంటే మేం తీన్‌మార్ వేయడం ఇష్టం లేదేమో..! జిడ్డురా బాబూ అంటూ టెస్టులకు రాని స్నేహితులు, వీరూ ఉన్నాడురా అంటే ఉరుకుతూ వచ్చేవాళ్లు. 

                     పొగరుగా ఎగిరే షోయబ్ అక్తర్ బంతిని అలవోకగా సిక్సర్ బాదుతుంటే... ఎవరినైనా భయపెట్టే బ్రెట్‌లీ బౌన్సర్‌ని స్టాండ్స్‌లోకి పంపిస్తుంటే...  స్టెయిన్ బుల్లెట్ బంతులు కూడా బౌండరీలు దాటుతుంటే... బంతిని ఎలా తిప్పుతాడో తెలియని వార్న్ కూడా తలపట్టుకుంటే... దానర్థం ఒక్కటే. అక్కడ సెహ్వాగ్ ఆడుతున్నాడని.
                      1999లో సెహ్వాగ్ జట్టులోకి వచ్చినా రెండేళ్ల పాటు సాధారణ క్రికెటర్లలో ఒకడు మాత్రమే. 2001లో కొలంబోలో న్యూజిలాండ్‌పై 69 బంతుల్లోనే సెంచరీ బాదినప్పుడు తొలిసారి అనిపించింది... ఆహా... ఏం ఆటగాడు దొరికాడురా అని. అప్పటి నుంచి 12 ఏళ్ల పాటు భారత అభిమాని ఎప్పుడూ వినోదం కోసం వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. సచిన్ లాంటి దిగ్గజంతో సరిసమానంగా షాట్లు ఆడాలంటే ఎంత గొప్ప ఆటగాడై ఉండాలి. ప్రత్యర్థులు 300 లక్ష్యాన్ని ఎదురుగా ఉంచినా... వీరూ పది ఓవర్లు ఉంటే చాలురా బాబూ అనుకునేవాళ్లం. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా అదురూ బెదురూ లేదు. బ్యాటింగ్ చేయడం క్లిష్టంగా ఉన్న పిచ్‌పై కూడా పునరాలోచన లేదు. బాదడం ఒక్కటే తెలుసు. ఉన్నంతసేపు దడదడలాడిస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించడమే తెలుసు.
                        95 పరుగుల మీద ఒక్క బంతి కూడా వృథా చేయకుండా సిక్సర్ కొట్టాలంటే ఎంత ధైర్యం కావాలి. టెస్టు మ్యాచ్‌లో 294 పరుగుల దగ్గర స్పిన్నర్ బౌలింగ్‌లో ముందుకు రావాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి. అందుకే.. వీరూలాంటి విధ్వంసం మరెవరికీ సాధ్యం కాదు. గత దశాబ్ద కాలంలో... ఆ మాటకొస్తే క్రికెట్‌లోనే అత్యంత విధ్వంసకర ఓపెనర్ సెహ్వాగ్. తను రిటైరైతే క్రికెట్ ప్రపంచం రిచర్డ్స్‌ను గుర్తుకు తెచ్చుకుంటోంది. ఈ ఒక్క పోలిక చాలు తను అభిమానులు, సహచరుల గుండెల్లో ఎలాంటి స్థానం సంపాదించుకున్నాడో

                           ప్రశంసల వెల్లువ
  అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కు క్రికెట్ ప్రపంచంతో పాటు   పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు కావలసిన వినోదాన్ని సెహ్వాగ్ అందించాడు. ఎంతోమంది యువ క్రికెటర్లలో స్ఫూర్తిని నింపాడు. అతని భవిష్యత్తు బాగుండాలి’         -శశాంక్ మనోహర్

సెహ్వాగ్‌కు నా అభినందనలు. దేశానికి ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. భారత క్రికెట్‌కు తను రిచర్డ్స్. దిగ్గజాల్లో ఒకడిగా ఆటకు వీడ్కోలు చెబుతున్నాడు. అంకితభావం ఉంటే ఎలా ఎదగొచ్చో వీరూను చూసి నేటి తరం క్రికెటర్లు నేర్చుకోవాలి’     - అనురాగ్ ఠాకూర్

రిచర్డ్స్ బ్యాటింగ్‌ను నేను ప్రత్యక్షంగా చూడలేదు. కానీ ప్రపంచంలోని ఉత్తమ బౌలర్లను సెహ్వాగ్ బాదడం కళ్లారా చూశాను. వీరూలాంటి మైండ్‌సెట్ ఉన్న ఆటగాడిని చూడలేం. మిగిలిన ఆటగాళ్లు సింగిల్ కోసం ఆడే చోట వీరూ బౌండరీ కోసం ప్రయత్నిస్తాడు’      -ధోని
 

వీరూ భాయ్ నీతో కలిసి ఆడగలగడం నా అదృష్టం. నీది అద్భుతమైన కెరీర్. నీ మార్గదర్శకత్వానికి, నువ్విచ్చిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. ఆధునిక క్రికెట్‌లో నువ్వు దిగ్గజం’     -కోహ్లి
 
శుభాకాంక్షలు వీరూ. నువ్వు అద్భుతమైన వినోదాన్ని అందించావు. ఎన్నో గొప్ప జ్ఞాపకాలను అందించినందుకు కృతజ్ఞతలు       -లక్ష్మణ్


ఆటలోనూ, జీవితంలోనూ సెహ్వాగ్ దృక్పథం అంటే నాకు చాలా ఇష్టం. తను ఆడిన ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ను రెండో ఎండ్‌లో నిలబడి చూశాను. మనందరిలో ఇంకా సంతోషాన్ని, నవ్వులను వీరూ తెస్తాడు. తన ప్రదర్శనలతో ఆటపై తన ముద్రను వేసి వెళుతున్నాడు’     -సచిన్



టాపార్డర్‌లో సెహ్వాగ్‌లా బ్యాటింగ్ చేసే క్రికెటర్ మరొకరు లేరు. జట్టు కోసం ఎప్పుడూ కష్టపడేవాడు. తన రెండో ఇన్నింగ్స్ కూడా సంతోషంగా సాగాలి’     -కుంబ్లే


Monday, October 19, 2015

సెహ్వాగ్ వీడ్కోలు?

ఎంత కొట్టామన్నది కాదు, ఎంత వేగంతో కొట్టామన్నది ముఖ్యం... సెహ్వాగ్‌కు మాత్రమే సరిపోయే డైలాగ్ ఇది.
సిక్సర్‌తో ట్రిపుల్ సెంచరీని అందుకోవడం ఎలా ఉంటుంది... వీరూకి మాత్రమే తెలిసిన మజా.
టెస్టు ఓపెనర్ అంటే వికెట్ కాపాడుకోవడం కాదు...
వీర విధ్వంసం సృష్టించడం ఎలాగో సెహ్వాగ్ మాత్రమే చూపించిన విద్య.\

 ఒకటా, రెండా ఎన్నో అద్భుతాలు వీరేంద్ర సెహ్వాగ్ బ్యాటింగ్ నుంచి జాలువారాయి. సచిన్ అంతటివాడిని కావాలని క్రికెట్‌లోకి వచ్చిన సెహ్వాగ్ ఒక దశలో మాస్టర్‌నే మించిపోయాడు. దూకుడు అంటూ ఇప్పుడు కొందరు వల్లె వేయవచ్చు గాక... కానీ అసలు దూకుడు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా మైదానంలో నేర్పించిన ఘనత సెహ్వాగ్‌దే. అతను క్రీజ్‌లో ఉన్నంతసేపు ఎంతటి భారీ లక్ష్యమైనా చిన్నదిగానే కనిపిస్తుంది. బ్యాటింగ్ చేసేటప్పుడు ఆ బంతిని బౌండరీ దాటించడంపైనే దృష్టి పెట్టే ఈ ‘నజఫ్‌గఢ్ నవాబ్’కు ఫుట్‌వర్క్, సాంప్రదాయ షాట్లు లాంటివి పట్టవు.
ఎవరైనా దానిని గుర్తు చేసినా అతను పట్టించుకోడు! తక్కువ శ్రమ-ఎక్కువ ఫలితం అనే సిద్ధాంతంతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించే శైలి అతడిని స్టార్‌ను చేసింది. భారత్‌కు అరుదైన, అనూహ్య విజయాలు అందించింది. సాధారణంగా టెస్టుల్లో ఒక రోజు ఆటంతా ఆడితే జట్టు మొత్తం చేయగలిగే స్కోరు 284. కానీ సెహ్వాగ్ ఒక్కడే దీనిని ఒక్కరోజులో కొట్టి పడేశాడు.

భారత్ టెస్టుల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఏ బ్యాట్స్‌మన్‌కూ అందని ‘ట్రిపుల్ సెంచరీ’ అతను పాకిస్తాన్ గడ్డపై సాధించిన రోజున గర్వించని భారతీయుడు లేడు. మరో నాలుగేళ్లకు మరో ‘ట్రిపుల్’ను బాది ఎవరికీ అందని ఎత్తులో నిలిచిన అతను వన్డేల్లోనూ ‘డబుల్’తో తన విలువను చూపించాడు. టెస్టుల్లో ఊహించడానికే సాధ్యం కాని 82 స్ట్రయిక్‌రేట్ అతనికే చెల్లింది.


అంతర్జాతీయ క్రికెటర్‌గా సెహ్వాగ్‌ది మహోజ్వల కెరీర్! 12 ఏండ్ల కెరీర్‌లో 104 టెస్టుల్లో 49.34 సగటుతో 8586 పరుగులు చేసిన వీరూ 23 సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు కొట్టాడు. అలాగే 251 వన్డేల్లో 35.05 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 అర్ధ సెంచరీలు, 38 అర్ధ సెంచరీలున్నాయి. టెస్టుల్లో సెహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీలు కొట్టాడు. భారత తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన మొదటి ఆటగాడు సెహ్వాగే. అత్యంత వేగంగా త్రిశతకం సాధించిన ఘనత (278 బంతుల్లో) కూడా సెహ్వాగ్‌దే! వన్డేల్లో సచిన్ తర్వాత డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మన్ సెహ్వాగే!  

హాస్య నటుడు కళ్లు చిదంబరం కన్నుమూత

  ప్రముఖ హాస్య నటుడు కళ్లు చిదంబరం(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన విశాఖ పట్నం కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కొల్లూరు చిదంబరం ఆయన అసలు పేరు, 1989లో ఆయన నటించిన కళ్లు చిత్రంతో ఆయనకు కళ్లు చిదంబరంగా పేరు వచ్చింది. ఆయన స్వస్థలం విశాఖపట్నం జిల్లా అక్కయ్యపాలెం. కళ్లు సినిమాలో నటనకు నందు పురస్కారం అందుకున్నారు.300లకు పైగా సినిమాల్లో ఆయన నటించారు. విశాఖపట్నం పోర్టులో చిదంబరం ఉద్యోగిగా పనిచేశారు. కళ్లు, కొండవీటి దొంగ, చంటి, గోవిందగోవిందా, అమ్మోరు, మనీ, ఎదురులేని మనిషి, మృగరాజు, శ్వేతనాగు, గ్లామర్, సివంగి, గంగపుత్రులు, కాలచక్రం, తొలిపాట, మైత్రి, ప్రేమకు సై సహా పలు చిత్రాల్లో నటించారు.

Saturday, October 17, 2015

ఏపీ రాజధాని శంకుస్థాపన ఆహ్వానం

గవర్నర్‌ నరసింహన్‌తోనూ ప్రత్యేక సమావేశం 
తెలంగాణ, ఆరధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదివారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర శంకుస్థాపనకు రమ్మని ఆహ్వానించేందుకు చంద్రబాబు కెసిఆర్‌ను కలవబోతున్నారు. ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఆయన కెసిఆర్‌ నివాసానికి వెళ్లనున్నారు. దీనికి సంబంధించి శనివారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కార్యాలయం కెసిఆర్‌ అపాట్‌మెంట్‌ కోరింది. ఏడాది తర్వాత వారిద్దరూ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటుకు నోటు కేసు తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి నెలకొంది. ఇక భవిష్యత్తులో భేటీ అయ్యే పరిస్థితులు ఉండవని అనుకున్న నేపథ్యంలో ఏపీ నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన వారిని కలపబోతుంది. కెసిఆర్‌ను కలిసి ఆహ్వానించే బాధ్యతను ఏపీ సెక్రటేరియట్‌ చంద్రబాబుకు అప్పగించిన విషయం తెలిసిందే.

Thursday, October 15, 2015

అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్‌ఖాన్‌ వీడ్కోలు


అంతర్జాతీయ క్రికెట్‌కు జహీర్‌ఖాన్‌ గురువారం వీడ్కోలు పలికారు. 2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌ సాధించడంలో జహీర్‌ ఖాన్‌ కీలక పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో జహీర్‌ఖాన్‌ ఒక్కడే 21 వికెట్లను పడగొట్టాడు. జహీర్‌ఖాన్‌ భారత్‌ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న జహీర్‌ఖాన్‌ గాయాల కారణంగా జట్టులో స్థానంలో కోల్పోయాడు. ఐపీఎల్‌లో ఢిల్లీడేర్‌ డెవిల్స్‌ తరపున ఆడుతున్నాడు. 2000 అక్టోబర్‌ 3న నైరోబీలో కెన్నాతో జరిగిన వన్డేతో అరంగేట్రం చేసిన జహీర్‌ఖాన్‌ సుదీర్ఘ కాలం పాటు భారత క్రికెట్‌కు ఎనలేని సేవలందిచాడు. వన్డేలో 200 మ్యాచ్‌ల్లో 282 వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్లో 92 మ్యాచ్‌ల్లో 311 వికెట్లు నేలకూల్చాడు. టీ20 మ్యాచ్‌ల్లో 17 మ్యాచ్‌లు ఆడిన జహీర్‌ఖాన్‌ 17 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. గత నాలుగేళ్లుగా తరచూ జట్టులోకి వస్తూ వెళ్తూ ఉన్నాడు. జహీర్‌ఖాన్‌ వీడ్కోలు పలువురు హృదపూర్వకంగా అతడి భవిష్కత్‌ కెరీర్‌ బాగా సాగాలని కోరుకుటున్నారు.
హీరో ప్రభాస్‌ క్రికెట్‌లో నాకు బాగా ఇష్టమైన బౌలర్లలో జహీర్‌ఖాన్‌ ఒకడుడని పేర్కొన్నాడు.

Wednesday, October 14, 2015

ఉత్కంఠ పోరులో భారత్‌ విజయం

మ్యాన్‌ ఆప్‌ ద మ్యాచ్‌ ధోని
బ్యాటింగ్‌లో తడబడిన బౌలింగ్‌లో ఎదురుదాడి
 

భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డేలో భారత్‌ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్టు 1-1 సమానంగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 9 వికెట్ల నష్టాఁకి 247 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన సౌతాఫ్రిక జట్టు 225 పరుగులకు అలౌట్‌ అయ్యింది. చివరి వికెటు వరకు పోరాడిన సౌతాఫ్రిక జట్టు 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. డుప్లెసిస్‌ 51, డికాక్‌ 34 పరుగులు చేశారు. మిగితా బ్యాట్‌మెన్స్‌ చెప్పుకోదగ స్కోరు చేయలేకపోయారు. మిడిల్డార్‌ బ్యాట్‌మెన్‌ డెవిడ్‌ మిల్లర్‌ (0) అవుట్‌ అయ్యాడు. బారత్‌ బౌలింగ్‌ భూవనేశ్వర్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ చెరో మూడు వికెట్లు తీయగా, హర్బజన్‌ సింగ్‌ 2, ఉమేష్‌ యాదవ్‌, మోహిత్‌ శర్మ చెరో వికెట్టు లభించింది. భారత్‌ బౌలింగ్‌లో మంచి హర్బజన్‌ సింగ్‌, అక్షర్‌ పటేల్‌ ఇద్దరు మంచిగా బౌలింగ్‌ చేశారు. అంతక ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత్‌ అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (3) పరుగులకు రబాడా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా రహనే వచ్చాడు. ధావన్‌ (23), పరుగులు చేయగా, కోహ్లి అనవసరంగా పరుగు కోసం వెళ్లి రనౌట్‌గా అయ్యాడు. ( 12), రైనా (0) నిరాశపరిచాడు. కెప్టెన్‌ ఈ మ్యాచ్‌లో ఓంటరి పోరాటం చేశాడు. బౌలర్లతో కూడి ఒక్కోక పరుగు కోసం వెచ్చి చూశాడు. 86 బంతులల్లో నాలుగు సిక్స్‌లు, ఏడు పోర్లు సహయంతో 92 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలింగ్‌లో స్టెయిన్‌ మూడు వికెట్లు తీయగా, మోర్కెల్‌, తాహిర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, రబాడా ఒక వికెటు లభించింది.

Tuesday, October 13, 2015

నేడు ఇండోర్‌లో రెండో వన్డే

 టి20 సిరీస్‌ను కోల్పోయి, తొలి వన్డేలోనూ ఓటమిపాలైన భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైంది. ఇక్కడి హోల్కర్ స్టేడియంలో నేడు (బుధవారం) జరిగే రెండో వన్డేలో దక్షిణాఫ్రికాతో ధోని సేన తలపడుతుంది. ఈ మ్యాచ్ గనక చేజారితే సిరీస్‌లోని చివరి మూడు వన్డేలూ నెగ్గాల్సిన సవాల్ భారత్‌కు ఎదురవుతుంది. ప్రస్తుతం జట్టు ఫామ్‌తో అది అంత సులభం కాదు. కాబట్టి ఈ మ్యాచ్‌లో గెలిస్తే తర్వాతి దశలో సిరీస్ విజయంపై దృష్టి పెట్టవచ్చు. మరో వైపు దక్షిణాఫ్రికా తమ జోరును కొనసాగించాలని పట్టుదలగా ఉంది.

 హర్భజన్‌కు చాన్స్!
 ఈ పర్యటనలో దక్షిణాఫ్రికాను ఇబ్బంది పెట్టిన ఏకైక బౌలర్ అశ్విన్. పక్కటెముకల గాయంతో గత మ్యాచ్‌లోంచి మధ్యలోనే తప్పుకున్న అశ్విన్ ఈ మ్యాచ్‌లోగా కోలుకోనే అవకాశం కనిపించడం లేదు. దీనిపై అధికారికంగా మేనేజ్‌మెంట్‌నుంచి ప్రకటన లేకపోయినా...అతను ఆడకపోతే హర్భజన్‌కు తుది జట్టులో స్థానం లభిస్తుంది. టి20ల్లాగే గత వన్డేలోనూ పేసర్ల వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. ఉమేశ్, భువీ ఇద్దరూ సమష్టిగా విఫలమయ్యారు. భువీ స్థానంలో మోహిత్‌కు అవకాశం దక్కవచ్చు. బ్యాటింగ్ విషయంలో భారత్ ఎప్పుడూ పటిష్టంగానే కనిపిస్తుంది. కానీ గత మ్యాచ్‌లో కీలక సమయంలో మిడిలార్డర్ రాణించలేకపోయింది.

           రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌లో ఉండగా, మరో ఓపెనర్ ధావన్ మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. రహానే మళ్లీ మూడో స్థానంలో ఆడటం ఖాయం. కానీ కోహ్లి, రైనాలు ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేదు. గత మ్యాచ్‌లో అనూహ్యంగా కోహ్లి తడబడ్డాడు. ఆల్‌రౌండర్‌గా రెండు రంగాల్లోనూ విఫలమైన స్టువర్ట్ బిన్నీ ఇక్కడైనా రాణిస్తాడా చూడాలి. అయితే అన్నింటికంటే మరోసారి అందరి దృష్టి కెప్టెన్ ధోనిపైనే ఉంది. విమర్శకులు మళ్లీ తమ కత్తికి పదును పెడుతుండటంతో అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు కెప్టెన్‌గా కూడా అతను సత్తా చాటాల్సి ఉంది.

 జట్ల వివరాలు (అంచనా)
 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, బిన్నీ, హర్భజన్, మిశ్రా, ఉమేశ్, భువనేశ్వర్/మోహిత్.
 దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, బెహర్దీన్, మిల్లర్/మోరిస్, స్టెయిన్, రబడ, మోర్కెల్, తాహిర

Monday, October 12, 2015

నేటి నుంచి పాకిస్థాన్‌- ఇంగ్లాండ్‌ తొలి టెస్టు ప్రారంభం

 పాకిస్థాన్‌- ఇంగ్లాండ్‌ మధ్య మూడు టెస్టు కొనసాగుతుంది. తొలి టెస్టు నేటి నుంచి ఆరంభంకానున్నంది. ఇంగ్లాండ్‌ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. అలాగే బౌలింగ్‌లో జెమ్స్‌ అండర్సన్‌, బ్రాండ్‌ ఫిన్‌, రహిద్‌, ఆలీ బౌలింగ్‌లో మంచి హిట్‌ల్లతో ఉంది. పాకిస్థాన్‌ జట్టులో ముఖ్యంగా మిసాబుల్‌ హాక్‌, షోయబ్‌ మాలిక్‌, యునిస్‌ ఖాన్‌ మహ్మమద్‌ హఫీజ్‌ వీళ్లు సీనియర్‌ వాళ్లు ఇంకా జట్టులో ఉన్నారు. వారిని తక్కువ అంచనా వేయకూడదని ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ కుక్‌ అన్నారు.

Saturday, October 10, 2015

సినీ నటి మనోరమ ఇక లేరు


 ప్రముఖ సినీ నటి మనోరమ (78) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో శనివారం అర్థరాత్రి మనోరమ తుదిశ్వాస విడిచారు. 1958 లో మాలిట్టా మంగై అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసిన మనోరమ వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించారు.1980లో శుభోదయం సినిమాతో తెలుగు రంగంలోకి ప్రవేశించారు. తమిళం, తెలుగు, మళయాళం, హిందీ భాషల్లో మనోరమ నటించారు. 1955 లో ఫిలిం ఫేర్ లైఫ్ అఛీవ్ మెంట్ అవార్డు సాధించారు. 2002లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ  పురస్కారంతో సత్కరించింది. 1937, మే 26న తమిళనాడులోని మన్నార్ గుడిలో మనోరమ జన్మించారు.  


మనోరమ అసలు పేరు గోపీశాంత. 
మనోరమకు ఒక కుమారుడు. ఆమె నటించిన చివరి చిత్రం సింగం-2.

మనోరమ నటించిన తెలుగు చిత్రాలు:
♦  శుభోదయం
  జెంటిల్ మేన్
♦  రిక్షావోడు
♦  పంజరం
బావనచ్చాడు
♦  మనసున్నమారాజు
♦  అరుంధతి
♦  నీప్రేమకై
కృష్ణార్జున

Thursday, October 8, 2015

పొట్టి కప్‌ను సొంతం చేసుకున్న సౌతాఫ్రికా

కోల్‌కతాలోని భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య గురువారం రాత్రి జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దెంది. సాయంత్రం కురిసిన వర్షానికి మైదానం చిత్తడిగా మారడంతో అంపైర్లు మూడు సార్లు మైదానాన్ని పరిశీలించారు. క్యూరేటరు నేతృత్వంలోని స్టేడియం సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఆటకు మైదానం సిద్దం కాలేదు. దీంతో అంపైర్లు ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడి మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 2-0తో దక్షిణాఫ్రికా సొంతం చేసుకుంది. 





Tuesday, October 6, 2015

హజ్‌ విషాదంలో 74 మంది భారతీయులు మృతి

 గత నెలలో హజ్‌ యాత్ర సందర్భంగా మక్కాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య రోజురోజూకి పెరిగిపోతుంది. ఇప్పటి వరకు భారతీయుల సంఖ్య 74కి చేరిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్కారాజ్‌ అధికారిక ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. సెప్టెంబర్‌ 24న మినాలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో మొత్తం మృతుల సంఖ్య 769కి చేరిందని సౌదీ ప్రభుత్వం అధికారంగా ప్రకటించింది.

Monday, October 5, 2015

టీ20 సిరీస్‌ సఫారీలదే

దక్షినాఫ్రికాతో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో భారత్‌ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 17.2 ఓవర్లలో 92 పరుగులకు అలౌట్‌ అయ్యింది. దక్షిణాఫ్రికా జట్టు 17.1 ఓవర్లలో నాలుగు వికెట్ల కోల్పోయి 96 పరుగులు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. 
 స్టేడియంలోకి బాటిళ్లను విసిరిన ప్రేక్షకులు
భారత్‌ ఓటమికి చేరువుతున్న దశలో స్టేడియంలోకి ప్రేక్షకులు ఒక్కసారిగా సహనాన్ని కోల్పోయారు. స్టేడియం నుంచి మైదానంలోకి వరుసగా బాటిళ్లను విసురుతూ మ్యాచ్‌కి అంతరాయాన్ని కలిగించారు. దీంతో మ్యాచ్‌ని అంపైర్లు రెండు సార్లు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే చివరికి పోలీసు సిబ్బంది బౌండరీ లైన్‌ వద్ద ఉంచి మ్యాచ్‌ని పూర్తి చేశారు.

చేతులెత్తేసిన భారత్‌ టాప్‌ అర్డర్‌
దక్షిణాఫ్రికా బౌలర్ల దెబ్బకు భారత్‌ టాప్‌ అర్డర్‌ కుప్పకూలింది. మొదటి మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటామని అనుకున్న టీమిండియా ఆటగాళ్లు రెండో మ్యాచ్‌ల్లో 92 పరుగులకే అలౌట్‌ అయ్యాంది. టాస్‌ గెలిచిన సఫారీ జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకున్నది. రోహిత్‌ (22), సురేశ్‌ రైనా (22) మాత్రమే ఫర్వాలేదనింపిచారు. ఆరుగురు బ్యాట్స్‌మెన్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయ లేకపోయారు. మరో ముగ్గురు డకౌట్‌గా అయ్యారు. సఫారీ బౌలర్లలో మోర్కెల్‌ 3, మోరీస్‌ 2, తాహిర్‌ 2, రబాడ ఒక వికెట్‌ తీశారు.




Friday, October 2, 2015

వార్మప్‌ మ్యాచ్‌ను తిరగేసిన సౌతాఫ్రికా

రోహిత్‌ శర్మ సెంచరీ వృధ్దా
ఏబి డివిలర్‌ అర్థసెంచరీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌ డుమిని


                 వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. ఇప్పుడు సౌతాఫ్రికా జట్టు టి20 మ్యాచ్‌లో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యం సాధించింది. భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు మధ్య జరిగిన మొదటి టి20 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యం సాధించింది. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్‌మెన్‌ జె.పి. డుమిని కేవలం 34 బంతులల్లో ఏడు సిక్స్‌లు, ఒక ఫోరు సహయంతో 68 పరుగులు చేసి విజయం జట్టుకు విజయం అందించాడు. అతని తోడు బిహర్‌డిన్‌ 23 బంతులల్లో ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లుతో సహయంతో 32 పరుగులు చేసి జట్టుకు సహయ పడ్డాడు. వీరిద్దరు కలసి నాల్గొవికెట్టుకు 105 పరుగుల బాగ్యస్వామం నెలకోల్పారు. అంతక ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేశారు. ఓపెనరు శిఖర్‌ ధావన్‌ 3 పరుగులకే రనౌట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు. రోహిత్‌కు తోడుగా విరాట్‌ కోహ్లి జతకలిశారు. రెండో వికెట్లుకు 138 పరుగులు చేశారు. రోహిత్‌ శర్మ మొదటి ఓవర్‌ నుంచి సౌతాఫ్రికాపై ఎదురుదాడి చేశాడు. ఆవాకాశం దొరికినప్పుడల్లా ఫోర్లు, సిక్స్‌లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎడ్‌లో విరాట్‌ కోహ్లి కూడా అతని సమానంగా అడ్డాడు. ఇమ్రాన్‌ తాహిర్‌ బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్స్‌లతో రోహిత్‌ చేలరెగిపోయాడు. రోహిత్‌ సెంచరీ చేసి తర్వాత ఓవర్లల్లో అబాట్‌ బౌలింగ్‌లో ఔట్‌ అయ్యాడు. అదే ఓవర్లల్లో విరాట్‌ కోహ్లి   ( 43) ఔట్‌ అయ్యాడు. అతరువాత వచ్చిన బ్యాట్‌మైన్‌ తక్కువ పరుగులు చేశారు. భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. సౌతాఫ్రికా జట్టు ముందు భారీ లక్షాన్ని ఉంచింది. టీమిండియా మంచి స్కోరు రాబట్టింది. దక్షిణాఫ్రికా బౌలింగ్‌లో అబాట్‌ రెండు వికెట్లు తీయగా మౌరిస్‌ ఒక వికెటు లభించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టు మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. డివిలర్‌ 42 బంతులల్లో ఒక సిక్స్‌, ఏడు ఫోర్లులతో అర్థసెంచరీ చేశాడు. ఆమ్లా 36 పరుగులు చేసి రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. డుమిన్‌ 68, బిహర్‌డిన్‌ 32 పరుగులు చేసి విజయం సాధించారు.