జింబాబ్వేతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు వన్డేలను గెలిచి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకఁన్న టీమిండియా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా జాదవ్ కాగా, మ్యాన్ ఆప్ ది సిరీస్ అంబాటి రాయుడు ఎంపికయ్యాడు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 50 ఓవర్లలో 276 పరుగులు చేసింది. ఆట ప్రారంభించిన ఇండియా 84 పరుగులుకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయాయి. ఓపెనర్లు రహానే ( 15), విజరు ( 13), ఉతప్ప ( 31), తివారి ( 10 ) తకఁ్కవ స్కోరు అవుట్ కాగా తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ జాగ్రత పడ్డారు. మనీష్ పాండే, జాదవ్ ఇద్దరు కలిసి ఐదో వికెటుకఁ 144 పరుగుల భాగస్వామ్యాఁ్న నెలకొల్పారు. జాదవ్ 87 బంతులల్లో ఒక సిక్స్, 12 ఫోర్లు సహాయంతో సెంచరీ చేశాడు. వన్డేలలో తొలి శతకం సాధించాడు. జింబాబ్వే బౌలర్లలో మజ్జీవ రెండు వికెట్లు తీయగా చిబాబా, మసకద్జ, ఉత్సేయ తలో వికెటు తీశారు. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 193 పరుగలకే అలౌట్ అయ్యింది. చిబాబా ( 82), చకబ్వ ( 27), ముతుంబి ( 22) పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్‌మెన్ తకఁ్కవ స్కోరు అవుట్ అయ్యారు. భారత్ బౌలర్లులో స్టువర్ట్ బిన్నీ 3 వికెట్లు తీయగా మోహిత్ శర్మ, హర్బజన్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. మురళీ విజరుకఁ ఒక వికెటు లభించింది.
No comments:
Post a Comment