Tuesday, July 14, 2015

చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల నిషేధం


 ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లకు సంబంధించి చెన్నై సూప్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లను ఐపీఎల్‌ నుంచి రెండేళ్లపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. సుప్రీం కోర్టు మాజీ ఛీఫ్‌ జస్టిస్‌ రాజేంద్ర మాల్‌ లోధా సారథ్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ తీర్పు ఖరారు చేసింది. అలాగే చెన్నై సూపర్‌ కింగ్స్‌ యజమాని శ్రీనివాసన్‌ అల్లుడు గురునాథ్‌ మేయప్పన్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ సహభాగస్వామి రాజ్‌ కుద్రాపై జీవితకాల నిషేదం విధించింది. వీరిద్దరూ క్రికెట్‌ సంబంధిత వ్యవహారాల్లో పాల్గొనకుడా నిషేధం పెట్టింది. వీరిద్దరూ బీసీసీఐ, క్రికెట్‌కు చెడ్డపేరు తెచ్చారని కమిటీ అభిప్రాయపడింది.
రానున్న ఐపీఎల్‌పై ప్రభావం ?
        
ఐపీఎల్‌లో మొత్తం 8 జట్టు వున్నాయి. వీటిలో రెండు జట్లు చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌పై రెండేళ్ల సస్పెన్షన్‌ విధించడంతో ఆరు జట్లు మాత్రమే వున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు ఐపీఎల్‌ కార్యవర్గం తర్వలో సమావేశం కానుంది. కొత్త జట్లను కూడా తీసుకఁనే అవకాశాన్ని పరిశీలించే అవకాశముంది.
' ధోని లేకుడా ఐపీఎల్‌ ను ఊహించుకోవడం కష్టం'
         
చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ జట్లపై రెండేళ్ల నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో మహేంద్ర సింగ్‌ ధోని ఐపీఎల్‌ దూరమైతే దాన్ని ఊహించుకోవడం కష్టసాధ్యమని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ స్ఫష్టం చేశాడు.

No comments:

Post a Comment