Saturday, November 29, 2014

మేము సైతం


             హుదూద్‌ తుపాన్‌ బారిన పడి భారీగా నష్టపోయిన వైజాగ్‌ మరియు ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల సహాయార్థం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ' మేముసైతం' పేరుతో ఓ ఈవెంట్‌ నిర్వహించనుంది. నవంబర్‌ 30న జరిగే ప్రోగ్రామ్‌ కోస ప్రత్యేకంగా మేముసైతం డాట్‌ కామ్‌ అనే పేరుతో వైబ్‌సైట్‌ను ప్రారంభిస్తున్నాం. అలాగే ఈ ప్రోగ్రామ్‌ని అందరూ లైవ్‌లో చేసే విధంగా జెమిని, మామూవీ చానల్స్‌ ద్వారా ప్రత్యేక సమాచారం అందిస్తున్నాం.
'' హుదూద్‌ తుపాన్‌ భాధితుల కోసం చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తమ వంతుగా సాయాన్ని అందించారు. ఇప్పుడు మరికొంత సాయాన్ని ఇండిస్టీ నుంచి అందించాలన్న ఉద్దేశంతో నవంబర్‌ 30న మేము సైతం అనే ఈవెంట్‌ని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నాం. ఈ ప్రోగ్రామ్‌ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరుగుతుంది. ఈ షోలో మ్యూజికల్‌ షోలు, గేమ్‌షోలు వుంటాయి. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్‌ను ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారు చూసేవిధంగా ఫ్లాన్‌ చేస్తున్నాం.

క్రికెట్‌ టోర్నమెంట్‌                        హుదూర్‌ తుపాన్‌ బాధితులకు తమ వంతు సాయం అందించేందుకు నవంబర్‌ 30న '' మేము సైతం '' కార్యక్రమాన్ని తెలుగు చలనచిత్ర పరిశ్రమ చేపట్టిన విషయం తెలిసిందే. నవంబర్‌ 30 మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి హైదరాబాద్‌లోని కోట్ల విజయబాస్కర్‌రెడ్డి స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రికెట్‌ ట్రోఫీ మ్యాచ్‌లలో నాలుగు టీమ్‌లు పాల్గొంటున్నాయి. ఈ టీమ్‌లను డ్రా పద్దతిలో సెలెక్ట్‌ చేశారు. నాలుగు టీమ్‌లకు కెప్టెన్‌గా నాగార్జున, వెంకటేష్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కెప్టెన్లుగా వ్యవహారించనున్నారు. ఒక్కో టీమ్‌లో 16 మంది సభ్యులుంటారు.
నాగర్జున జట్టుకి అఖిల్‌ వైస్‌ కెప్టెన్‌ : కల్యాణ్‌రామ్‌, నిఖిల్‌, నరేష్‌, సాయికుమార్‌, శర్వానంద్‌, సచిన్‌జోషి, నాగశౌర్య, రాజీవ్‌ కనకాల, శివాజీరాజా, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రణీత, సోనియా, దిశాపాండే, మధుశాలిని ప్లేయర్స్‌గా ఉంటారు.
వెంకటేష్‌ జట్టుకి మంచు విష్ణు వైస్‌ కెప్టెన్‌ : నారా రోహిత్‌, డా. రాజశేఖర్‌, నితిన్‌, మనోజ్‌ దాసరి, అరుణ్‌ నవీన్‌చంద్ర, సుశాంత్‌, మాదాలరవి, సమంత, ఆదర్శ్‌, మంచు లక్ష్మీ, సంజన, ప్రియబెనర్జీ, తేజస్వి, ప్లేయర్స్‌గా ఉంటారు.

ఎన్టీఆర్‌ జట్టుకి శ్రీకాంత్‌ వైస్‌కెప్టెన్‌ : రవితేజ, నాని, సాయిధరమ్‌తేజ, తనీష్‌, థమన్‌, ప్రిన్స్‌, సందీప్‌కిషన్‌, రఘు, సమీర్‌, అనుష్క, దీక్షాసేథ్‌, శుభ్రఅయ్యప్ప, నిఖిత, అస్మితాసూద్‌ ప్లేయర్స్‌గా ఉంటారు. 

రామ్‌చరణ్‌ జట్టుకి తారకరత్న వైస్‌కెప్టెన్‌ :
సుధీర్‌, సుమంత్‌, గోపీచంద్‌ వడ్డేనవీన్‌, వరుణ్‌సందేశ్‌, ఖయ్యూమ్‌, అజరు, కాజల్‌, ఛార్మి, పూనమ్‌కౌర్‌, ఆది, అర్చన, రీతూ వర్మ టీమ్‌ సభ్యులుగా ఉంటారు.



Wednesday, November 26, 2014

బొమ్మరిల్లు హాసినికి కొడుకు పుట్టాడు




  బొమ్మరిల్లులో హాసిని పాత్రలో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన జెనీలియా గుర్తుందా. ఆమె ఈ రోజు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని రితీష్ ట్విట్టర్‌లో తెలిపాడు. తనకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. కాగా 2003లో బాయ్స్ సినిమాలో జెనీలియా నటించినప్పటి నుంచి వీరు ప్రేమించుకుంటున్నారు. 2012లో వీరు వివాహం చేసుకున్నారు.

Sunday, November 23, 2014

ఇదో గొప్ప ఛాన్స్


అందాల శృతిహాసన్‌ ఓ అరుదైన అవకాశం అందుకుంది. తండ్రి కమల్‌హాసన్‌ సరసన నటించిన సీనియర్‌ నాయిక శ్రీదేవితో కలిసి నటించే గొప్ప ఛాన్‌‌స కొట్టేసింది. ఈ అమ్మడు విజయ్‌ హీరోగా చింబుదేవన్‌ దర్శకత్వంలో అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇదే చిత్రంలో విజయ్‌ సరసన ప్రధాన నాయికగా హన్సిక నటిస్తోంది.హనీకి తల్లి పాత్రలో శ్రీదేవి కనిపిస్తోంది. ఈ సినిమాలో శృతి కూడా ఓ కీలకపాత్రలో నటిస్తోంది. అయితే ఈ చిత్రంలో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్‌‌స. శ్రీదేవితో కలిసి ఒకే ఫ్రేములో మాత్రం కనిపించే ఛాన్సుందని సమాచారం. అతిలోక సుందరి శ్రీదేవి ఇప్పటికే సినిమాలు వదిలేసి 26 సంవత్సరాలైంది. రీఎంట్రీ సినిమా ఇంగ్లీష్‌ వింగ్లీష్‌ తర్వాత ఇప్పుడిలా ఓ పూర్తి స్థాయి క్యారెక్టర్‌లో నటిస్తోంది. ఇదే తరుణంలో శ్రీదేవితో కలిసి నటించే అవకాశం శృతిని వరించింది. ఇది నిజంగానే అమ్మడికి ఓ మధుర క్షణం. ఇలాంటి క్షణాల్ని ఆస్వాధించే అదృష్టం, అవకాశం వేరెవరికీ రానేరావు. ఇటీవలే విజయ్‌-హన్సిక జంటపై ఓ పాటను కూడా చిత్రీకరించారు. ఇటీవలే శృతితో సన్నివేశాల చిత్రీకరణకు రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం అమ్మడు ఆన్‌సెట్‌‌స ఉంది. ఇదో చక్కని ఫాంటసీ చిత్రం. కాబట్టి శృతి యాంజెల్‌లా కనిపిస్తుందేమో చూడాలి.

నాకు నేనే పోటీ!

             
          సినీ పరిశ్రమలో నాకు ఎవరూ పోటీకాదు. మరొకరితో పోటీపడి నటించడం నాకు ఇష్టం ఉండదు అని చెబుతోంది బాలీవుడ్ సొగసరి కత్రినాకైఫ్. బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా చెలామణి అవుతోంది ఈ సుందరి. కమర్షియల్ సినిమాలతో పాటు ఆడపాదడపా ప్రత్యేక గీతాల్లో సత్తా చాటుతోంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆమె ఇతర హీరోయిన్లకు గట్టిపోటీనిస్తోంది.
                 అయితే కత్రినా కైఫ్ మాత్రం నాకు ఎవరూ పోటీకాదని చెబుతోంది. ఆమె మాట్లాడుతూ పోటీ అనేది మరోకరి ఎదుగుదలను అడ్డుకునే విధంగా ఉండకూడదని నా అభిప్రాయం. మంచి చేయకపోయినా... కానీ చెడు చేయకూడదన్నదే నా సిద్దాంతం. ఇతరులకు చెడు చేయాలన్న ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించను. అయినా సినిమాల పరంగా నేను ఎవరికీ పోటీకాదు. నాకు నేనే పోటీ.నా దృష్టిలో కాంపిటిషన్ అనేది నెగెటివ్ అంశమేమికాదు. పోటీ ఉంటేనే మనలోని తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం లభిస్తుంది. కెరీర్‌ను మరింత ఉన్నంతంగా తీర్చిదిద్దుకునేందుకు ఉపయోగపడుతుంది. నా మటుకు నేను ఇతర హీరోయిన్లు నటించిన సినిమాలు చూసే స్ఫూర్తి పొందుతాను. అలా ఉండటమే మంచిది అని చెబుతోంది. ప్రస్తుతం కత్రినాకైఫ్ ఫాంటమ్ జగ్గాజాసూస్ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.

Tuesday, November 18, 2014

అమ్మాయి ప్రేమకోసం...

 జీవితం, ప్రేమపట్ల నిశ్చితాభిప్రాయాలున్న యువకుడతను. ధైర్యం, సమయస్ఫూర్తి అతని సొంతం. అలాంటి యువకుడు వలచిన చిన్నదాని ప్రేమకోసం ఏం చేశాడు? ప్రేమప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలేమిటి? అనే అంశాల సమాహారంతో చిన్నదాన నీ కోసం చిత్రాన్ని రూపొందిస్తున్నాం అని చెప్పారు కరుణాకరన్. ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా నటిస్తున్న చిత్రం చిన్నదాన నీ కోసం. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై విక్రమ్‌గౌడ్ సమర్పణలో సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. మిస్త్రీ కథానాయిక. అనూప్ స్వరపరచిన పాటలు ఈ నెల 27న విడుదలకానున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఈ చిత్రానికి అనూప్ అద్భుతమైన సంగీతాన్నందించారు. ప్రేమకథల్ని అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కరుణాకరన్ తనదైన శైలిలో అన్ని వర్గాలను అలరించేలా చిత్రాన్ని తెరకెక్కించారు. ఆడియో వేడుకకు పలువురు సినీహీరోలు హాజరవుతారు అన్నారు.

Sunday, November 16, 2014

సిరీస్‌ భారత్‌ క్లీన్‌ స్వీప్‌

మ్యాన్‌ ఆప్‌ ది సిరీస్‌ విరాట్‌ కోహ్లీ
మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా మ్యాథస్‌
1982 తర్వాత శ్రీలంకను భారత్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఇదే తొలిసారి
5-0తో లంక ఘోరపరాజయం
సెంచరీలతో సమదానం చెప్పిన భారత్‌
ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన రోహిత్‌ శర్మ
మ్యాథస్‌ వన్డేలో తొలి శతకం

              వెస్టిండీస్‌ పర్యటన అర్థంతరంగా ముగిసిందని బాధపడిన వాళ్ళలో సరికొత్త హుషారు. ధోని గైర్హాజరీలో టీమిండియా ఎలా ఆడుతుందోనని సందేహించిన వాళ్లలో చెప్పలేని సంతోషం.. కుర్ర జట్టు ఏం చేస్తుందోనని ఆందోళన చెందిన వాళ్లలో పట్టలేని ఆనందం? బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో మూడు విధంలో భారత్‌ పూర్తిస్థాయి రాణించి శ్రీలంకను 5-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది.
భారత్‌, శ్రీలంక మధ్య ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు శతకాలతో చెలరేగిపోయారు. మొదటి వన్డేలో శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానే, రెండో వన్డేలో అంబటి రాయుడు, మూడో వన్డేలో ధావన్‌ (91), కోహ్లీ ( 54) పరుగులు చేసి 3-0 తేడాతో సిరీస్‌ కైవసం చేసుకోంది.
నాల్గొవ వన్డేలో రోహిత్‌ శర్మ వచ్చిన ఆవకాశం వదులు కోలేక జట్టులో స్థానం మళ్లీ ఏలా అని సందేహం లేకుండా లంకపై ఏకంగా డబులు సెంచరీ చేశాడు. అంతర్జాతీయ వన్డేల్లో అతడిదే అత్యధిక స్కోరు. ప్రపంచ క్రికెట్లో మాత్రం రోహిత్‌ది రెండో స్థానం. అలె బ్రౌని ( 268), సర్రే) ముందున్నాడు. ఐదో వన్డేలో ఇరు జట్టు కెప్టెన్‌ సెంచరీలతో చెలరెగిపోయారు. చివరికి మాత్రం టిమిండియాదే పైచెయ్యి సాధించింది. మ్యాథస్‌ ( 139), కోహ్లి ( 139) పరుగులతో సమానంగా నిలిచారు.
ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన లంక జట్టు చివరి మ్యాచ్‌లనైనా గెలిచి పరువు దక్కించుకోవాలనుకున్న ఆశలు నిరాశగా మారిపోయింది. భారత్‌, లంక మధ్య జరిగిని చివరి వన్డేలో భారత్‌ ఎనిమిది బంతులు మిగిలిఉండగానే విజయలక్ష్యం సాధిచింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అంబటి రాయుడు అర్ధసెంచరీ రాణించడంతో చివరి వన్డేలో గెలిచింది. లంక బ్యాట్స్‌మెన్‌ మ్యాథస్‌ 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇరు జట్ల కెప్టెన్‌లు సెంచరీతో కదం తొక్కారు. లంక చివరి మ్యాచ్‌లో నైనా గెలిచి పరువు దక్కించుకోవాలన్న ఆశలు నిరాశగా మిగిలాయి. లంక కెప్టెన్‌ మ్యాథస్‌ వన్డే మ్యాచ్‌లో తొలి సెంచరీ నమోద్‌ చేశాడు.
లంక బోర్డు సభ్యులు నిరాశగామిగిలింది. అనుకోకుండా అట్టహస్థంగా మారిన ఓప్పదం కనుకనే ఈ వన్డే మ్యాచ్‌ టి20 మ్యాచ్‌గా నిలిచింది. ప్రత్యర్థి జట్టు లంకపై అవలోక గెలిచింది. కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా గెలువకూడా భారత జట్టు లంకను క్లీన్‌స్వీప్‌గా చేసింది. భారత జట్టు ప్రయోగాలతో బరిలోకి దిగింది. అనుకోని రీతిలో జట్టులో ఒకరు కాకపోతే మరోకరుగా రాణించి విజయం సాధించారు. శ్రీలంక జట్టు మాత్రం ప్రత్యర్థి జట్టుకు మంచి స్కోరు కూడా నమోదు చేయలేకపోయింది.

భారత్‌ బ్యాటింగ్‌లో అందరు ఫామ్‌లో కోనసాగుతున్నారు. భారత్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుతున్న సమయంలో భారత్‌ ఆటగాళ్లు అందరు ఫామ్‌లో ఉండడం విశేషం. ప్రపంచకప్‌ సమీపిస్తున్న తరుణంలో... అదిరిపోయే ప్రదర్శన చేసింది. భారత్‌ ఓపెనింగ్‌ సమస్యలతో కుడుకున్న సమయంలో ఏకంగా ముగ్గురు ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌లు సెంచరీతో లంకపై చెలరెగిపోయారు. గత కొని రోజులుగా రోహిత్‌ శర్మ గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడు నాల్గొవ వన్డే మ్యాచ్‌లో డబ్బులు సెంచరీతో జట్టులో స్థానం సంపాధించాడు.
వన్డేలో టాప్‌ -5
రోహిత్‌ శర్మ 264 కోల్‌కతా శ్రీలంక నవంబర్‌ 2014
సెహ్వాగ్‌ 219 ాండోర్‌ వెస్టిండీస్‌, డిసెంబర్‌ 2011
రోహిత్‌ శర్మ 209 బెంగళూరు ఆస్ట్రేలియా, నవంబర్‌ 2013
సచిన్‌ 200 గ్వాలియర్‌ దక్షిణాఫ్రికా, ఫిబ్రవరి 2010
కొవెంట్రి 194 బులవాయో బంగ్లాదేశ్‌, ఆగస్టు 2009


ఉప్పల్‌ స్టేడియంలో 6వేల పరుగులు దాటిన కోహ్లీ


ఉప్పల్‌ భారత్‌, శ్రీలంక మూడో వన్డేకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మరో విశిష్ఠ అతిధి వచ్చారు. అది మరెవరో కాదు. విరాట్‌ కోహ్లి ప్రేయసి, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ. కొన్నాళ్లుగా కోహ్లితో కలిసి అందరికీ తెలిసేలా చెట్టాపట్టాలేసుకు తిరిగేస్తున్న అనుష్క. ఆదివారం మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టాండ్స్‌లో కూర్చుని శ్రద్దగా మ్యాచ్‌ చూసిన అనుష్క. కోహ్లి షాట్లు ఆడినపుడల్లా కేరింతలు కొట్టింది. కోహ్లీ 60 బంతులల్లో నాలుగు పోర్లు, ఒక సిక్స్‌ సహాయంతో అర్థ సెంచరీ చేశాడు. అ సమయంలో అనుష్క లేచి నిలబడి చప్పట్లతో అతణ్ని అభినందిచింది. అ సమయంలో విరాట్‌ కూడా అనుష్కను మరిచిపోలేదు. అనుష్క వైపు బ్యాటు చూపిస్తూ.. ఫ్లయింగ్‌ కిస్‌ కూడా ఇచ్చాడు?








Saturday, November 15, 2014

చీపురు పట్టి ఊడ్చిన సమంత

అందాల హీరోయిన్‌ సమంతా రూత్‌ ప్రభు చీపురు పట్టి చెత్త ఊడ్చింది. హీరో రామ్‌ ఆమెను స్వచ్చ భారత్‌ కార్యక్రమానికి నామినేట్‌ చేయడంతో ఆమె ప్రతిస్పందిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంది. ఓ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో, పరిసరాల్లో చీపురు పట్టుకుని ఊడ్చిన సమంత ఆ ఫోటోలను తన ట్విట్టర్‌ అకౌంట్లో పోస్టు చేసింది. స్వచ్చ భారత్‌లో భాగంగా సమంత తమ స్కూలు వద్దకు వచ్చి చీపురు పట్టుకుని తుడుస్తుండటంతో విద్యార్థులు, చుట్టుపక్కల వాళ్లు అంతా ఆశ్చర్యంలో మునిగిపోయి ఆమె చుట్టూ చేరారు. ట్విట్టర్లో ఈ ఫోటోలు షేర్‌ చేసిన సమంత స్వచ్చ భారత్‌ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొంది. పారిశుద్ద్య కార్మికులతో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్‌ చేసింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి సంబంధించిన చెత్త వారే శుభ్రం చేసుకోవాలని పిలుపు కూడా ఇచ్చింది.

Wednesday, November 12, 2014

కేరాఫ్‌ కాజల్‌ అనాల్సిందే

కొందరికి మోడ్రన్‌ డ్రెస్సుల్లో లుక్‌ అదిరిపోతుంది. మరికొందరికి చీరల్లో సింగారం రెట్టింపవుతుంది. ఇంకొందరికేమో సాదాసీదాగా కనిపించినా అందం ఇనుమడిస్తుంది. ఈ మూడు రూపాల్లోనూ అందంగా కనిపించే భామలూ ఉన్నారు. టాలీవుడ్‌లో ఉన్న అరడజను ముద్దుగుమ్మల్ని పరిశీలిస్తే ఏ డ్రెస్సు వేసినా ఆ డ్రెస్సుకే కేరాఫ్‌ అడ్రస్‌ అనిపించే ముద్దుగుమ్మ కాజల్‌. అందుకే ఈ అమ్మడు ఎక్కువగా సాదాసీదా దుస్తుల్లోనే కనిపించడానికి ప్రయత్నిస్తుంటుంది. ప్రస్తుతం ఈ భామ తమిళ్‌లో ఓ సినిమాలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ మొదలైంది. లవ్‌ ఫెయిల్యూర్‌ ఫేం బాలాజీ మోహన్‌ ఈ చిత్రానికి దర్శకƒత్వం వహిస్తున్నారు. చెన్నయ్‌లో శరవేగంగా షూటింగ్‌ జరుగుతోందిప్పుడు. ఆన్‌సెట్‌‌స ఈ అమ్మడు ధరించిన ఓ కాస్టూ్యమ్‌ని ఆన్‌లైన్‌లో రివీల్‌ చేసింది. ఈ లుక్‌ చాలా బావుందని ప్రశంసలొస్తున్నాయి. కాజల్‌ వల్ల ఆ డ్రెస్సుకి అందం వచ్చిందా? డ్రెస్సు వల్ల కాజూకి అందం వచ్చిందా? అంటూ ఆన్‌లైన్‌లో అంతా పోటీ పెట్టుకున్నారు. ఈ తమిళ సినిమాతో పాటు పూరి, ఎన్టీఆర్‌ సినిమా కూడా ఆన్‌సెట్‌‌స ఉంది. కాజల్‌ రెండు చోట్లా బిజీగా ఉంది.

Saturday, November 8, 2014

తల్లి పాత్రలో శ్రీదేవి

 నటిగా అందరి మనసులను దోచేసుకున్న శ్రీదేవీ ఇక తల్లి పాత్రలో కనిపించబోతోంది. హీరోయిన్ హన్సికకు తల్లిగా నటించబోతోంది శ్రీదేవి. హన్సిక తమిళ చిత్ర పరిశ్రమలో బిజీబిజీగా ఉంది. తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన హన్సిక ఈ మూవీలో మహారాణి పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మహారాణి తల్లి శ్రీదేవి. వచ్చే వారం షూటింగ్ ప్రారంభం కానుంది. చింబుదేవ్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో విజయ్‌తో కలిసి హన్సిక నటించబోతోంది. చెన్నై శివార్లలో చిత్ర షూటింగ్ కోసం భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శృతిహాసన్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది.

Friday, November 7, 2014

వెంకటేష్ సరసన నదియా?

ప్రభాస్ నటించిన మిర్చి చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ కథానాయిక నదియా ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో కీలక పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. త్వరలో ఆమె హీరో వెంకటేష్‌కు జోడీగా కనిపించనుందని తెలిసింది. గోపీచంద్‌తో సాహసం వంటి వినూత్న చిత్రాన్ని అందించిన చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా త్వరలో ఓ చిత్రం తెరకెక్కనుంది. 


           వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ సినిమాలో వెంకటేష్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడని, ఒక పాత్రకు జోడీగా నదియా నటించనుండగా మరో పాత్ర సరసన ఓ యంగ్ హీరోయిన్ నటించనుందని చిత్ర వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.