ప్రముఖ సినీ నటుడు నూతన ప్రసాద్ ఈ రోజు ఉదయం ఆఫోలో హస్పటల్‌లో మృతి చెందారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ రోజు ఉదయం పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుముశారు. అందాల రాముడు చిత్రంలో నటుడిగా కెరీర్ ప్రారంభించిన నూతన ప్రసాద్ ముత్యాలముగ్గుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2005లో నూతన ప్రసాద్ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. నూతన ప్రసాద్ 1945 డిసెంబరు 12న కృష్ణాజిల్లాలోని కైకలూరులో జన్మించారు. ఆయన అసలు పేరు తాడివాడ వరప్రసాద్. నూతన ప్రసాద్‌కు ఒక కూమారుడు, ఇద్దరు కుమారైలు ఉన్నారు. పలువురు ప్రముఖులు నూతన ప్రసాద్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.
No comments:
Post a Comment