వెంకటేష్ హీరోగా నటించిన 'నాగవల్లి' అన్ని ముఖ్యకేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకుంది. పి.వాసు దర్శకత్వంలో శ్రీసాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మించారు. 50 రోజులు పూర్తి చేసుకొని శతదినోత్సవానికి పరుగులు తీస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ...'మా నాగవల్లి చిత్రాన్ని ఆదరించి సూపర్‌హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అని కేంద్రాల్లో దిగ్విజయంగా 50 రోజులు పూర్తి చేసుకొని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్నందుకని హ్యాపీగా వుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌గారు ఈ సినిమా చూసి మేకింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వుందని ఫోన్ చేసి చెప్పడం ఎంతో థ్రిల్ కలిగించింది' భారీ చిత్రాని తీసే అవకాశం ఇచ్చిన వెంకటేష్‌బాబుకి, సురేష్‌బాబుకి థాంక్స్' అనిఅన్నారు.
No comments:
Post a Comment