Friday, December 30, 2011

చాలా కారణాలున్నాయి

 తొలిటెస్టులో తమ జట్టు విజయం సాధించడానికి చాలా కారణాలున్నాయని ఆసీస్‌ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌ అన్నాడు. టాపార్టర్‌ నుంచి టెయిలెండర్ల వరకు అందరూ విజయంలో ఉన్నారన్నాడు. మైక్‌ హస్సీ, పాంటింగ్‌ ఒత్తిడిలోనూ విలువైన పరుగులు అందించారన్నాడు. తొలి ఇన్నింగ్స్‌ లో ఎడ్‌ కోవాన్‌తో, రెండో ఇన్నింగ్స్‌ లో హస్సీ తో పాంటింగ్‌ నెలకొల్పిన భాగస్వామ్యాలు చలా కీలకంగా మారాయని చెప్పాడు. టెయిలెండర్లు కూడా విలువైన పరుగులు రాబట్టడంలో సఫలమయ్యారని చెప్పాడు.

పటిష్టమైన భారత బ్యాటింగ్‌ లైనప్‌ ను కుప్పకూల్చడంలో తమ బౌలర్లపాత్ర ఎంతో ఉందన్నాడు. భారత్‌ ను తొలి ఇన్నింగ్స్‌ లో 282పరుగులకు రెండో ఇన్నింగ్స్‌ లో 169పరుగులకు ఆలౌట్‌ చేయడంలో సక్సెస్‌ అయ్యారని చెప్పాడు. పాటిన్సన్‌, హిల్ఫెన్హాస్‌, పీటర్‌ సిడిల్‌ ప్రదర్శన ఆనందకరంగా ఉందని చెప్పాడు. ఇంకా తాము మెరుగుపర్చుకోవాల్సింది చాలా ఉందన్నాడు. టాపార్డర్‌ ఇంకా పరుగులు రాబడితే భారత్‌ ను ఓడించడం మరింత సులువౌతుందని క్లార్క్‌ చెప్పాడు. జనవరి 3 నుంచి జరుగనున్న సిడ్నీ టెస్టులో మంరింత మెరుగైన ప్రదర్శనను అందిస్తామని మైఖేల్‌ క్లార్క్‌ తెలిపాడు.

Sunday, December 25, 2011

‘కాంగారు’ పెట్టాలి.. చరిత్ర సృష్టంచాలి!

ఆరున్నర దశాబ్దాలుగా సుదీర్ఘ నిరీక్షణ.. ఆసీస్ గడ్డపై సిరీస్ నెగ్గాలని!
ఒకటికాదు రెండుకాదు.. తొమ్మిది
సిరీస్‌లు ఆడాం! లాలా అమర్‌నాథ్ నుంచి మొదలుపెడితే కుంబ్లే వరకు.. ఇలా గండరగండల్లాంటి సారథుల హయాంలోని జట్లన్నీ రిక్తహస్తాల్తో
తిరిగొచ్చిననవే! మరి ఈ సారి? ధోనీసేనా మునుపెన్నడూలేనంత
పటిష్ఠంగా అగుపిస్తోంది! అందుకే ఆశలు చిగురిస్తున్నాయ్.. తొలిసారిగా అక్కడ సిరీస్ విక్టరీ కొట్టి చరిత్ర సృష్టిస్తామని! 

ఈ అంచనాకు తగ్గట్టుగానే...
ఓపెనింగ్‌లో సెహ్వాగ్, గంభీర్‌లు
శుభారంభాలతో కదంతొక్కాలని ఆశిద్దాం!
బిగ్ త్రయం సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లు
హిట్టవ్వాలని కోరుకుందాం!
పేసర్లు జహీర్, ఇషాంత్, ఉమేశ్‌లు ప్రత్యర్థిని చిత్తుచేయాలని ఆశిద్దాం!!

ఇరుజట్ల మధ్య ఎంతో తేడా!
ఆస్ట్రేలియాకు సొంతగడ్డపై ఆడడం ఒక్కటే అత్యంత అనుకూలం కావొచ్చు. కానీ బలాబలాల దృష్ట్యా ధోనీసేనతో క్లార్క్‌మెన్ ఏ రకంగానూ సరిజోడు కాదు. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన మాజీలూ అంగీకరించారు. సెహ్వాగ్, గంభీర్‌ల రూపంలో మన ఓపెనింగ్ జోడీ అత్యంత పటిష్టంగా ఉంది. వీరూ వంద టెస్ట్ (92)లకు దగ్గరవుతుంటే.. గంభీర్ (44) యాభై టెస్టులకు సమీపిస్తున్నాడు. అదే ఓపెనర్ల విషయానికొస్తే.. వారిది అనుభవలేమి. వార్నర్ ఆడింది కేవలం 2 టెస్టులే అయితే, కొవాన్ ఇంకా బోణీయే చేయలేదు. ఇక ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్‌ల రూపంలో మన మిడిలార్డర్ అత్యంత బలోపేతం. ఈ విషయంలో పాంటింగ్, క్లార్క్, హస్సీల రూపంలో ఆసీస్‌కూ అనుభవజ్ఞులే ఉన్నారు. కానీ మన దిగ్గజ త్రయం అద్భుత ఫామ్‌లో ఉంటే.. ఈ ముగ్గురు మాత్రం వారి వారి కెరీర్‌లలోనే అత్యంత పేలవఫామ్‌లో కొనసాగుతున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలోనూ ఆసీస్‌తో పోలిస్తే, జహీర్, ఇషాంత్‌ల రూపంలో అనుభవజ్ఞులతో భారత్ పేస్ విభాగం బలంగానే ఉంది. వారి జట్టులో సిడిల్ ఒక్కడే అనుభవజ్ఞుడు. హిల్ఫెన్హాస్, ప్యాటిన్సన్‌లు.. ఉమేశ్‌కుమల్లే కొత్తే. స్పిన్ విభాగంలో అశ్విన్ కొత్తేఅయినా ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలనని ఇప్పటికే నిరూపించుకున్నాడు.


జహీర్, ఇషాంత్‌లకు పరీక్ష
భారత్ బౌలింగ్ ఆశలన్నీ జహీర్, ఇషాంత్‌లపైనే ఉ న్నాయి. ఐతే.. వీరికి ఫిట్‌నెస్సే అసలు సమస్య. వరుస గా రెండు టెస్టులాడితే.. మూడో టెస్ట్‌కు అందుబాటులో ఉంటారో లేదో తెలియదు. భారత్ బౌలింగ్ హిట్టా... ఫట్టా? అనేది వీరిద్దరి ఫిట్‌నెస్‌పైనే ఆధారపడివుంటుందనేది విశ్లేషకుల అభివూపాయం. ఆస్ట్రేలియా పిచ్‌లు పేసర్లకే సహకరిస్తాయి కాబట్టి ఈ అంచనాను ఏ మాత్రం తక్కువచేయలేం. ఇంగ్లండ్ టూర్ నుంచి గాయంతో అర్ధంతరంగా వైదొలిగిన జహీర్‌కు ఆ తర్వాత ఇదే తొలి టెస్ట్ సిరీస్. విండీస్‌తో సిరీస్‌లో ఇషాంత్ ఆడినా.. స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు. ఈ ఇద్దరి ఫిట్‌నెస్, ఫామ్ స్పష్టమయ్యేది తొలి టెస్ట్ ముగిశాకే!

2012 సంవత్సరంలో జనవరి ప్రస్తుతం నాలుగు సినిమాలు తెరపైకి వస్తున్నాయి ...

 2012 సంవత్సరంలో టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి ఉండబోతుంది. సంక్రాంతి ముందు రోజు అతర్వాత రోజు, మరుసటి రోజు, ఇలా నాలుగు రోజుల పాటు సినిమా సందడి వుంటుంది. జనవరి 11న మహేష్‌ బాబు, కాజోల్‌ నటించిన ' బిజినెస్‌ మేన్‌తో సందడి కాబోతుంది. ఆ తరువాత రోజు 12న వెంకటేష్‌, త్రిష్‌ కాంబినేషన్‌లో ' బాడీగార్డ్‌ ' బారీ అంచనాలతో విడుదల అవుతుంది. ఇప్పటికే వీరిద్దరు కాంబినేషన్‌లో రెండు సినిమాలు విడుదల కాగా ఇంకా మూడో సినిమా హిట్‌ కోట్టి హాట్రిక్‌ సాదించాలని అశిస్తున్నారు. ఇంకా మరుసటి రోజు రవితేజ, థీక్షాసేధ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ' నిప్పు' విడుదల సిద్దం అవుతుంది. వీటితో పాటు మరో సినిమా విడుదల సిద్దం కాన్నుంది. ' పులరంగడు' సునిల్‌ హీరోగా నటించిన సినిమా వీటితో పాటు విడుదలకు ' సై ' అంటున్నాడు. జనవరి 11 నుంచి 14 వరకు ధియేటర్లు మంచి కలెక్షన్‌లు, రికార్డులు బద్దలు కోట్టుకునే అవకాశం ఉంది. వీటి కన్నా ముందుగానే డిసెంబర్‌ 29న నందమూరి తారక్‌ నటించిన ' నందీశ్వరుడు' విడుదల సిద్దం కాన్నునంది. అలాగే 30న విక్రమ్‌ నటించిన సినిమా ' వీడింతే ' కూడా రిలీజ్‌ అవుతుంది.

Friday, December 23, 2011

సిక్స్‌ప్యాక్‌తో అదరగొడుతున్న సునీల్‌


బిజినెస్‌ మేన్‌ ఆడియో విడుదల మూడు బాషల్లో

మహేష్‌బాబు, కాజల్‌ అగర్వాల్‌ జంటగా ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ పతాకంపై వెంకట్‌ నిర్మిస్తున్న ' బిజినెస్‌ మేన్‌' ఆడియో వేడుక హైదరాబాదులో జరిగింది. మూడు బాషల్లో ఆడియోను విడుదల చేశారు. తమిళ వర్షన్‌ ఆడియోను కృష్ణ, విజయనిర్మల ఆవిష్కరించారు. మలయాళం ఆడియోను డి. రామానాయుడు, రాజమౌళి విడుదల చేయగా, తెలుగు వెర్షన్‌ పాటలను మహేష్‌, శ్రీను వైట్ల ఆవిష్కరించారు.

2011తెలుగు సినిమా పరిశ్రమలో వివాదాలు ...

టాలీవుడ్‌ వివాదాపై ఓసారి లుక్కేద్దాం. రామ్‌ గోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమా తెలుగు సినిమా పరిశ్రమలో ఓసంచలనం సృష్టించింది. సీమ ఫ్యాక్షన్‌ గొడవల యదార్ధ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో..నిజ జీవితంలో వ్యక్తులమధ్య జరిగిన రియల్‌ ఇన్సిడెంట్‌ను సినిమా రూపంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలై కొన్ని రోజులకే సూరి హైదరాబాద్‌ నడి ఒడ్డున జనవరి 3న హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత చెప్పకోదగ్గది టాలీవుడ్‌ డ్రగ్‌ రాకెట్‌! పలువురు నిర్మాతలకు, నటులకు మాదక ద్రవ్యాల కేసులో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించడమే కాదు, పలువురిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు కూడా. రవితేజ సోదరుడు రఘుబాబు, భరత్‌ డ్రగ్స్‌ కొంటూ పట్టబడగా, ఇద్దరు నిర్మాతలు డ్రగ్స్‌ అమ్ముతూ పట్టబడ్డారు.
నటి జీవిత సోదరుడు కూడా ఈకేసులో పోలీసులకు చిక్కాడు. ఇక హీరో వరుణ్‌ సందే్‌శకు డ్రగ్స్‌ కేసులో సంబంధం ఉన్నట్లు వచ్చిన వార్తలు సర్వత్రా చర్చనీయాంశం అయింది.మగధీర చిత్రం ద్వారా టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ గా ఎదిగిన కాజల్‌ అగర్వాల్‌ ఎఫ్‌ హెచ్‌ఎం పురుషుల మ్యాగజైన్‌ పై టాప్‌లెస్‌ గా దర్శనం ఇచ్చింది. కాజల్‌ చర్యపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాజల్‌ మాత్రం అది నాఫోటోకాదు మార్ఫింగ్‌ అంటూ ఓ ప్రకటన చేసి ఈ వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.
ఇక... వాన, బంగారం చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన మీరా చోప్రా హత్య కేసులో ఇరుక్కుంది ఇటీవల మరణించిన ప్రముఖ నిర్మాత, రచయిత ఎంఎస్‌ రెడ్డి రాసిన తన ఆత్మకథ పుస్త్తకం ాఇది నా కథ్ణ... ఈ పుస్త్తకంలో సీనియర్‌ ఎన్టీఆర్‌ నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌, చిరంజీవి, గుణశేఖర్‌, రాజశేఖర్‌ తదితరుల మీద ఆయన రాసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి. ఆ మధ్య రామ్‌చరణ్‌ తేజ్‌ దాసరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం సృష్టించాయి.
నిర్మాతలకు, కార్మికులకు మధ్య ఏర్పడ్డ విబేధాలతో కొంత కాలం సినిమా షూటింగులు ఆగిపోయాయి. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో పలు సినిమా షూటింగులపై దాడులు జరిగాయి. ఎన్నడూలేని విధంగా ఈ సంవత్సరం నందమూరి, మెగా కుటుంబ హీరోల అభిమానుల వివాదాలు రచ్చకెక్కాయి. రామ్‌చరణ్‌, మహేష్‌బాబుల సినిమాల రికార్డుల విషయంలో కూడా రచ్చజరిగాయి.హీరో నాగార్జున తన పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఓ మహిళా జర్నలిస్ట్‌ కోర్టులో పిటీషన్‌ దాఖలు చేయగా వివరణ ఇమ్మంటూ నాగార్జునకు కోర్టు కోరింది.

Tuesday, December 20, 2011

వెంకటేష్‌ చిత్రంలో జగపతిబాబు

తెలుగు సినిమా పరిశ్రమలో మల్టీస్టారర్‌ చిత్రాల హవా మొదలైనట్లు కనిపిస్తోంది. ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' చిత్రంలో వెంకటేష్‌, మహేష్‌బాబు నటిస్తుండగా రామ్‌చరణ్‌ హీరోగా నిర్మిస్తున్న ' ఎవడు ' చిత్రంలో అల్లు అర్జున్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నా విషయం తెలిసిందే. వెంకటేష్‌ కథానాయకుడుగా మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటించడానికి జగపతిబాబు అంగీకరించనట్లు సమాచారం. జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. గతంలో ' హనుమాన్‌ జంక్షన్‌ ' , మనసులో మాట ' లాంటి మల్టీస్టారర్‌ చిత్రాల్లో జగపతిబాబు నటించారు.

Saturday, December 17, 2011

ఇద్దరూ... ఇద్దరే ( వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ )

ఈనెల 26న భారత, ఆస్ట్రేలియా మధ్య ప్రారంభమవుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వగ్‌, జహీర్‌ఖాన్‌ ఎంతో విలువైన పాత్రను పోషిస్తారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ ఇయాన్‌ చాపెల్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ భారీ స్కోరు చేయటానికి సెహ్వాగ్‌ ఉన్నాడు. ఐదువికెట్లు తీయటానికి జహీర్‌ సిద్ధం. ఇద్దరు తురుపుముక్కలు భారత జట్టులో ఉన్నారు.’ అని చాపెల్‌ తెలిపాడు. అయితే ఆసీస్‌ బౌలర్‌ పాటిన్‌సన్‌ సీరీస్‌ను ప్రభావితం చేయగలడని చాపెల్‌ అన్నాడు. ఇటీవల పాటిన్‌సన్‌ బౌలింగ్‌ గణాంకాలు చూస్తుంటే రాబోయే టెస్టు సీరీస్‌లోనూ అతను రాణిస్తాడని ఇయాన్‌ చెప్పాడు. స్వదేశీ పిచ్‌లు ఆస్ట్రేలియాకు అనుకూలంగానే ఉన్నా, జట్టు గాయలతో ఉండటం మూలంగా భారత్‌ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ పరమచెత్తగా కూడా ఊహించుకోలేకపోతున్నామని చాపెల్‌ ఘాటుగా విమర్శించాడు. బౌలింగ్‌ను మెచ్చుకున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌, ఆసీస్‌ బ్యాటింగ్‌పై తీవ్రంగా విమర్శించాడు. అసలు ఫామ్‌లోనే లేని రికీ భవితవ్యాన్ని ఈ సీరీస్‌యే నిర్ణయిస్తుందని ఇయాన్‌ అన్నాడు.

ధోనికి సిఎన్‌ఎన్‌ - ఐబిఎన్‌ అవార్డు

ఈ సంవత్సరం క్రికెట్‌ ప్రపంచ కప్‌ గెలుచుకున్నప్పుడు భారత జట్టు సారథి మహేంద్ర సింగ్‌ ధోని ఎంతగా భావోద్వేగానికి గుర య్యాడంటే ఫైనల్‌ మ్యాచ్‌ తరువాత జట్టు సహచరులతో పాటు అతను కూ డా ఏడ్చే శాడు. ‘ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం క్రీడాకారులందరూ ఏడ్చేశారు. నేనూ ఏడ్చాను. అయితే, ఆ ఫుటేజ్‌ ఎక్కడా లేదు. ప్రపంచ కప్‌ గెలుచుకోవాలన్నది మా అందరి కల అయినందున భావోద్వేగాలను అణచు కోవడం చాలా కష్టమైంది’ అని ధోని చెప్పా డు. శుక్రవారం రాత్రి ధోనికి ‘సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌ స్పోర్స్‌పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రకటించారు.

ఈ నెలలో ప్రారంభం కానున్న టెస్ట్‌ సీరీస్‌ కోసం ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లే ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ధోని ఈ విషయం తెలియజేశాడు. ‘నేను ఏడ్చేశాను. నేను తలెత్తి చూస్తే తక్కిన క్రీడాకారులు నా చుట్టూ చేరారు. నేను డ్రెస్సింగ్‌ రూమ్‌కు పరుగెత్తాను. అని ధోని తెలిపాడు.ఈ అవార్డుకు ఇతర నామి నీలలో క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్‌, ఆర్చర్‌ దీపికా కుమారి, షూటర్‌ రంజన్‌ సోధి, బాక్సర్‌ వికాస్‌ కృష్ణన్‌, బ్యాడ్మింటన్‌ జోడి జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప ఉన్నారు. సోధికి, క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు ప్ర త్యేక ఘనత అవార్డులు ప్రదానం చేశారు.

Friday, December 16, 2011

హుషారుగా త్రిష

 2011 త్రిషకు తీన్‌మార్‌ రూపంలో టాలీవుడ్గలో నిరాశే మిగిల్చినా కోలీవుడ్గలో ‘మాంగత్తై’ రూపంలో హిట్‌ ఇచ్చి ఊరటనిచ్చింది. అరుుతే 2012లో త్రిష ఒక్కసారిగా టాలీవుడ్గలో కొత్త హీరోరుున్లందరికీ ఝలక్‌ ఇవ్వబోతోంది. హీరో వెంకటేష్‌తో ముచ్చటగా మూడోసారి ‘బాడీగార్డ్‌’తో జతకడుతున్న త్రిష జూనియర్‌ ఎన్టీఆర్‌ చిత్రం ‘దమ్ము’లో కూడా తన పాత్ర ఎంతో దమ్మున్నదంటోంది. పైగా యంగ్‌ టైగర్‌తో పోటీపడి క్యూట్‌గా కనిపించేందుకు చాలా స్లివ్గుగా తయారరుుంది. ఈ మధ్య ‘బాడీగార్డ్‌’ ఫంక్షన్‌లో రెడ్గ ఫ్రాక్‌లో చాలా క్యూట్‌గా కనిపించింది. ‘సీతమ్మ వాకిట్లో ...’ చిత్రంలో ప్రిన్స్‌ మహేష్‌ పక్కన వదినగా చేయనని నిక్కచ్చిగా చెప్పేసింది. అందుేక రాబోయే సంవత్సరంలో హుషారుగా మరిన్ని చిత్రాలలో చేయాలనుకుంటోంది త్రిష.

మేము ఎప్పటికీ మిత్రులమే


పాకిస్థాన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆసిమ్‌ ఉల్‌ హక్‌ ఖురేషి త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇందులో భాగంగానే అతని నిశ్చితార్ధం గురువారం నాడు లాహోర్‌లో ఘనంగా జరిగింది. భారత, పాక్‌ టెన్నిస్‌ ద్వయంలో ఒకరైన ఖురేషి, రోహన్‌ బోపన్నతో కలిసి అనేక విజయాల్లో పాలుపంచుకున్నారు. 2007 నుంచి భారత,పాక్‌ మైత్రికి చిహ్నంగా వెలుగొందుతున్న ఈ జంట గత నెలలోనే విడిపోతున్నట్లు ప్రకటించింది.ఖురేషి నిశ్చితార్ధకార్యక్రమానికి అతని మిత్రుడు రోహన్‌ కూడా విచ్చేసాడు. పాకిస్థాన్‌కు రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని అతను పేర్కొన్నాడు. 2011లో పురుషుల డబుల్స్‌ ఈవెంట్‌లో 10వ స్థానాన్ని సంపాదించిన ఈ జంట కలసి ఆడలేకపోయినా ఎప్పటికీ మేము మిత్రులుగానే ఉంటామని స్పష్టం చేసింది.
భారత ప్రభుత్వం అనుమతి ఇస్తే పాకిస్థాన్‌లో ఎక్కడైనా టెన్నిస్‌ ఆడటానికి నాకు అభ్యంతరం లేదు. ఇరుదేశాల మధ్య స్నేహాన్ని పెంపొందిచటానికి నేను ఎప్పుడూ సిద్ధమే. ప్రత్యేకంగా నాకు వాఘా సరిహద్దుల్లో ఆటను ఆడాలని ఉన్నది. అని లాహోర్‌లోని జింఖానాలో టెన్నిస్‌ ఆడిన అనంతరం బొపన్న తెలిపాడు. డిసెంబర్‌ 17 నాడు లాహోర్‌లోని మోడల్‌టౌన్‌లో ఖురేషి వివాహం జరగనున్నది. వచ్చే సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్‌ పోటీ కోసం తీవ్ర కసరత్తు చేస్తున్న రోహన్‌, భారత ప్రముఖ టెన్నిస్‌ ప్లేయర్‌ మహేష్‌ భూపతితో కలసి డబుల్స్‌లో భారత తరపున ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇటీవలే మహేష్‌ భూపతి కూడా లియాండర్‌ పేస్‌తో తెగతెంపులు చేసుకున్న విషయం విదితమే.

Thursday, December 15, 2011

క్రికెట్‌ చిచ్ఛరపిడుగు

ముంబయికి చెందిన ముషీర్‌ ఖాన్‌ అనే చిచ్చరపిడుగు క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. 114 ఏళ్ల గైల్స్‌ షిల్డ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఆడిన అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆరు సంవత్సరాల తొమ్మిది నెలల వయస్సున్న ముషీర్‌ ఖాన్‌ మంగళవారం ముంబయిలో జరిగిన అండర్‌ -14, ఇంటర్‌ స్కూల్‌ గైల్‌ షీల్డ్‌ పోటీల్లో పాల్గొని అందరిని ఆశ్చర్య పరిచాడు. ఓపెనింగ్‌ బ్యాటింగ్‌కు దిగిన ముషీర్‌ 28 బంతులాడి మూడు పరుగులు సాధించాడు. అంతేకాదు ఇతను మంచి లెఫ్‌ ఆర్మ్‌ స్మిన్నర్‌ కూడా. ఐదు ఓవర్లు వేసిన ముషీర్‌ 12 పరుగులిచ్చాడు. తొలి మ్యాచులో పెద్దగా రాణించనప్పటికీ ఈ బుల్లి క్రికెటర్‌ అందరిని ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ డానియల్‌ వెటోరి తన ఆదర్శమంటున్నాడు ఈ బుడతడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్‌ కావాలన్నదే తన లక్ష్యమంటున్నాడు. ముషీర్‌ అంజుమన్‌ -ఈ- ఇస్లాం అల్లెనా ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ లో చదువుతున్నాడు. ముషీర్‌ తండ్రి నౌషద్‌ ఖాన్‌ క్రికెట్‌ కోచ్‌ కాగా, అన్నయ్య సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌ రెండేళ్ల క్రితం హరిస్‌ షీల్డ్‌ టోర్నమెంట్‌లో 438 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.

Wednesday, December 14, 2011

అరడజను సినిమాలు : సమంత

 టాలీవుడ్ ప్రస్తుతం సమంత మాయలో పడిపోయింది. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో తన మాయని మొదలు పెట్టిన సమంత ఈ మధ్య మహేష్‌తో నటించిన ‘దూకుడు’ చిత్రంతో హీరోయిన్‌గా తన జోరు పెంచేసింది. ఈ చిత్రంతో టాలీవుడ్ దర్శక నిర్మాతలతో పాటు హీరోలనీ తన మాయలో పడేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఐదు తెలుగు చిత్రాలు వుండటం విశేషం. అవి ఎస్8.ఎస్8. రాజమౌళి దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న ‘ఈగ’, గౌతమ్‌మీనన్ మూడు బాషల్లో నిర్మిస్తున్న ‘నిత్య’, నాగచైతన్యతో దేవాకట్టా తెరకెక్కిస్తున్న ‘ఆటోనగర్ సూర్య’, దిల్‌రాజు నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, అలాగే రామ్‌చరణ్‌తో వంశీపైడిపల్లి తెరకెక్కిస్తున్న ‘ఎవడు’, సిద్ధార్థ హీరోగా ‘అలామొదలైంది’ చిత్ర దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించనున్న చిత్రంలోనూ నటించడానికి సమంత అంగీకరించింది.

ఈ చిత్రాలతో పాటు ‘ఏమాయ చేసావె’ చిత్రం ఆధారంగా బాలీవుడ్‌లో రీమేక్ అవుతున్న ‘ఏక్ దీవానా థా’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న సమంత తన డైరీని పూర్తిగా ఫుల్ చేసేసింది. ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఈ చిత్రాలకు డేట్స్ సర్దుబాటు చేసుకోవడం సమంతకు తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆరు చిత్రాలు అంగీకరించిన సమంత ఈ ఆరు చిత్రాల్లో ఏ చిత్రానికి ఎన్ని డేట్స్ కేటాయించాలో తేల్చుకోలేక ఇబ్బందిపడుతోందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

కెరీర్‌లో ఇదే చివరి అవకాశం ...

సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌ వీరి కెరీర్‌లో ఇదే చివ రి ఆసీస్8 పర్యటన కావొచ్చు! అక్కడ తొలిటెస్ట్ సిరీస్8 విజయమనే చారివూతక ఘట్టంలో భాగస్వాములయ్యేందుకు చివరి అవకాశమన్నమాట! ఈ క్రమంలో ఇప్పటివరకు ఆసీస్8 టూర్‌లో వీరి రికార్డులు.. ఆపై తాజా ఫామ్‌పై ఓ లుక్కేద్దామా!

 సచిన్: మాస్టర్‌కు ఆసీస్8 అత్యంత ప్రియమైన ప్రత్యర్థే! సచిన్ కెరీర్‌లో 51 టెస్ట్ సెంచరీలుంటే అందులో అత్యధికంగా 11 శతకాలు ఆసీస్8పైనే వచ్చా యి. ఓవరాల్‌గా ఆ జట్టుపై 31 టెస్టులాడాడు మాస్టర్. ఇందులో ఏకంగా 60.59 సగటుతో 3151 పరుగులు చేశాడు. ఇక కంగారుగడ్డపై 16 టె స్టుల్లో దాదాపు ఇంతే సగటు (58.53)తో 1522 పరుగులు రాబట్టాడు. మరోమాట.. ఆసీస్8పై చేసిన 11 సెంచరీల్లో ఆరింటిని సచిన్ వారిదేశంలోనే కొట్టాడు. ఇక గత ఏడాది కాలంగా కూడా సచిన్ ఫామ్ అద్భుతంగానే ఉంది. ఏడు టెస్టుల్లో దాదాపు యాభై సగటు (49.91)తో 599 పరుగులు చేశాడు. ఆసీస్8 పర్యటనలో ఈ సారి అందరి కళ్లూ నూరో శతకం వేటలో ఉన్న సచిన్‌పైనే ఉంటాయి. మరి.. గత 15 ఇన్నింగ్స్‌లు (టెస్టులు, వన్డేల్లో కలిపి)గా వందో వంద కోసం ఊరిస్తూవస్తున్న సచిన్ ఈ సిరీస్8లోనై నా అభిమానుల ఎదురుచూపులకు ముగింపు పలుకుతాడా? చూడాల్సిందే!

 ద్రవిడ్: మన బ్యాట్స్‌మెన్‌లో ఈ ఏడాది అత్యంత నిలకడగా రాణిస్తున్నాడీ దిగ్గజం! ఈ ఏడాది ఇప్పటివరకు 13 టెస్టులాడిన ద్రవిడ్.. 52.31 సగటుతో 1151 పరుగులు సాధించాడు. ఇందులో ఏకంగా 5 సెంచరీలు బాదడం వి శేషం. ఇక ఆస్ట్రేలియాపై ద్రవిడ్ ఫామ్ అద్భుతంగా లేకున్నా.. పేలవంగా మాత్రం లేదు. ఆ జట్టుపై రాహుల్ ఓవరాల్‌గా 29 టెస్టులాడాడు. 41.08 సగటుతో 1972 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఇక ఆసీస్8 గడ్డపై మాత్రం ద్రవిడ్‌కు కాస్త మెరుగైన గణంకాలే ఉన్నాయి. అక్కడ 12 టెస్టుల్లో 48.60 సగటుతో 972 పరుగులు చేశాడు. ఆ జట్టుపై ద్రవిడ్‌కు ఏకైక డబుల్ సెంచరీ (233) వారి దేశంలోనే రావడం మరో విశేషం. ఆసీ స్8 పర్యటన నేపథ్యంలో గతకొంతకాలంగా అద్భుతఫామ్‌లో కొనసాగుతున్న ద్రవిడ్‌పై ఈ సారి భారీ అంచనాలున్నాయి.




వీవీఎస్ లక్ష్మణ్: ఆస్ట్రేలియా వర్సెస్8 లక్ష్మణ్! ఆసీస్8తో భారత్ తలపడినప్పుడల్లా విశ్లేషకుల నుంచి తరచుగా వినిపించే మాట ఇది. గణాంకాలు పరిశీలిస్తే, ఇవి ఎంతమావూతమూ అతిశయోక్తి కాదనిపిస్తుంది. ఆసీస్8పై ఇంటాబయటా కలిపి లక్ష్మణ్ 25 టెస్టులాడాడు. 55.58 సగటుతో 2279 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలున్నాయి. ఇక వారి దేశంలో ఆడిన టెస్టులు 11. పరుగులు 54.05తో 1081. అత్యుత్తమ స్కోరు 175తో కలిపి 4 సెంచరీలు బాదాడు. ఓ జట్టుపై ఇంటాబయటా ఈ స్థా యి రికార్డున్న బ్యాట్స్‌మన్ అరుదుగా కనిపిస్తారు. ఈసారి కూడా లక్ష్మ ణ్ ఇవే గణాంకాల్ని న మోదు చేస్తే, ప్రత్యర్థికి ‘కంగారు’ తప్పదు. గత 12 నెలల్లో ఆడిన టెస్టు ల్లో వీవీఎస్8 ఫామ్ కూడా సంతృప్తికర స్థాయిలోనే ఉంది. 13 టెస్టుల్లో 43.76 సగటుతో 919 పరుగులు చేశాడు. అన్న ట్టు... టెస్టులో 9 వేల పరుగులకు 374 పరుగుల దూరంలో ఉన్న వీవీఎస్8 ఈ సిరీస్8లోనే ఆ మైలురాయిని అధిగమించొచ్చు.

Tuesday, December 13, 2011

2011 రౌండప్‌

డిసెంబర్‌ సగం రోజులు పూర్తరుుపోరుుంది. కొత్త సంబరాల నవ ఉత్సాహంతో 2012 సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం. ఈ సంవత్సరం అనూహ్యంగా పెద్ద హీరోలు నటించిన చిత్రాలకు కలెక్షన్ల రికార్డులు సృష్టించడం ఒక విశేషమైతే తెలుగు సినిమా స్టామినా పెంచిన చిత్రంగా ‘దూకుడు’ రికార్డుల పరంపర కొనసాగించింది.
pavvann
బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో ఎలమంచిలి సాయిబాబు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ నెమ్మదిగా వసూళ్లు పెంచుకుంటూ మ్యాజిక్‌ను ప్రారంభించింది. ఈ చిత్రానికి యువత ఆదరణ రోజురోజుకి పెరుగుతుండడంతో థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయని సమాచారం. మనవైన పురాణేతిహాసాలను, మరుగున పడుతున్న సంస్కృతిని పునశ్చరణ చేసుకోవాలన్న యూత్‌ ఆలోచన..ఈ సినిమాకి అస్సెట్‌గా నిలుస్తోంది.తెలుగు సినిమాలలో టాప్‌ 5 సినిమాలలో అగ్రశ్రేణి వరుసలో నిలిచిపోయిన చిత్రంగా ‘దూకుడు’ నిలిచింది. హిట్టు కోసం 5 సంవత్సరాలుగా నిరీక్షించిన మహేష్‌కు పోకిరిని మించిన హిట్టుగా దూకుడు చిత్రం నిలిచిపోయింది.

ఇక మిగిలిన హీరోలను తీసుకుంటే బాలకృష్ణ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరమవీరచక్ర’ అంచనాలను అందుకోలేపోయింది.కాగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ హిట్‌ మూవీగా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని స్టడీగా సాగిపోతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ‘శక్తి’ చిత్రం పరాజయం కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచింది. ప్రభాస్‌కు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘తీన్‌మార్‌’ చిత్రం ఫ్లాప్‌ కాగా ‘పంజా’ చిత్రం డివైడ్‌ టాక్‌తో నడుస్తోంది.

మరో వారం రోజులు గడిస్తేగానీ ఆ చిత్రం నిలబడిందో లేదో అనేది తెలియదు. నాగార్జున నటించిన ‘గగనం’ చిత్రం ప్రయోగాత్మకంగా ప్రశంసలందుకుందిగానీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నాగచైతన్యకు విడుదలైన మూడు చిత్రాలలో ఒకటి హిట్టుకాగా రెండు ఫ్లాపులయ్యాయి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100%లవ్‌’ హిట్టుకాగా ‘దడ’, ‘బెజవాడ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మరి కొందరు హీరోల జయాపజయాల గురించి తర్వాత తెలుసుకుందాం....

భజ్జీ కారులో దొంగతనం

భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పాస్‌పోర్టు, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఎవరో దొంగిలించారు. కర్నాల్‌ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. భజ్జీ, అతని స్నేహితుడు కలసి ఢిల్లీకి సోమవారం సాయంత్రం బయలుదేరిన సమయంలో వారు మధుబన్‌ దగ్గరే ఉన్న కర్నాల్‌లో ఆగారు. కాఫీ తాగుదామని ఇద్దరు ఆలా లోపలకి వెళ్లి పనిముగించుకుని వచ్చి చూస్తే కారు అద్దాలు పగిలిపోయి ఉండటం గమనించారు. సరికదా అనుకుని కారులోపలకెళ్లి చూస్తే పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాయం చేశారు. ఈ సంఘటన మధుబన్‌ పోలీస్‌ అకాడమీ సమీపంలోనే జరగటం విశేషం. ‘ నేను , నా స్నేహితుడు మధుబన్‌ పోలీస్‌ అకాడమీ దగ్గరలో ఉన్న ‘ కేఫ్‌ కాఫీ డే’ లో కాఫీ తాగుదామని కారు దిగాం. కారుకు లాక్‌ వేసి కాఫీ షాపులోకి ప్రవేశించాం. 

ఐదు నిమిషాల తరవాత వచ్చే చూస్తే షాక్‌. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. బ్యాగ్‌లో ఉన్న వస్తువులన్ని కూడా మాయమైయిపోయాయి. ’ అని దొంగతనం అనంతరం భజ్జీ వాపోయాడు. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు భజ్జీకి చెందిన 10 క్రెడిట్‌కార్టులు దొంగలు ఎత్తుకుపోయారు. విషయాన్ని గ్రహించిన భజ్జీ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనీసం తన పాస్‌పోర్టునైనా వెంటనే తిరిగి తనకు అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.

Monday, December 12, 2011

జీవితంలో ఎలాంటి లక్షాలు పెట్టుకోలేదు


venkatesh talangana patrika telangana culture telangana politics telangana cinemaవెంక ముచ్చటిస్తే ఆయన మాటల్లో సినిమా సంగతులకంటే ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో జీవితం తాలూకు తాత్విక చింతన తొంగిచూస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాని ప్రేమిస్తారాయన. విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాలో కుటుంబ చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు వెంక ‘మనం చేసే పనిని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వున్నా స్వీకరించాలి’ అన్నది ఆయన నమ్మిన ఫిలాసఫీ. తాజాగా ఆయన ‘బాడీగార్డ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. నేడు వెంక జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివి...

ఈ పుట్టిన రోజుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. అయితే ఈ మధ్యే మూడు వారాల పాటు కాశీలోని నందిదేవా ఆలయాన్ని, బుద్దుడు సంచరించిన సారనాథ్ ప్రాంతాన్ని, ఆయన సమాధి అయిన ప్రదేశాల్ని సందర్శించి వచ్చాను. ఈ యాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నాను. మనిషి వేటిని వదులుకున్నా ఫర్వాలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్ని నిరంతరం నేర్చుకోవాలన్నది నా ఫిలాసఫీ.

‘బాడీగార్డ్’ సినిమా విశేషాలేమిటి?
ఇంట్రడక్షన్ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్‌తో పాటు సినిమాలో మంచి సెంటిమెంట్ వుంటుంది. చివరి ముఫ్పై నిమిషాల ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా కొత్త తరహాలో వుంటుంది. నా శైలి వినోదం కూడా వుంటుంది.
‘బాడీగార్డ్’ మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విజయం సాధించింది. కథాంశం అందరికీ తెలిసిందే!..

ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?
మూడు భాషల్లో హిట్ అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్ల్లు సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీ కొత్తగా వుండేలా తీర్చిదిద్దాం. అదీగాక చాలా కాలం విరామం తర్వాత నేను ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను. సంగీతపరంగా కూడా మిగతా మూడు భాషల కంటే తెలుగులో పాటలు బాగా వచ్చాయి. సంగీత దర్శకుడు థమన్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ అంశాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

‘నాగవల్లి’ తర్వాత బెల్లంకొండ సురేష్‌తో రెండో సినిమా చేస్తున్నారు. మేకింగ్ పరంగా సినిమా ఎలా వుంటుంది?
ఉన్నత నిర్మాణ విలువలతో ‘బాడీగార్డ్’ తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని లొకేషన్స్ చాలా కొత్తగా వున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో అలాంటి లొకేషన్స్ చూసి వుండరు.

సల్మాన్‌ఖాన్ హిందీ ‘బాడీగార్డ్’ చిత్రంలో షర్ట్ విప్పేస్తాడు. మీరు కూడా ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా?
మనకంత సీన్‌లేదు... షర్ట్ విప్పడం లాంటి సన్నివేశాలేం వుండవు. నా కెరీర్‌లో ఇంతవరకూ షర్ట్ విప్పి నటించలేదు. ఇప్పుడు కొత్తగా విప్పితే బాగుండదు.

మహేష్‌బాబుతో కలసి చేస్తోన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఈ కథలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. మహేష్, నేను అన్నదమ్ముల్లుగా నటిస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఒకరికొకరు ప్రాణంగా సాగే వారి జీవిత ప్రయాణమే ఈ చిత్రం.
మహేష్‌బాబుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
హీరోగా ఆయనకంటూ ప్రత్యేకమైన సై్టల్ వుంది. తెలుగు సినిమా హీరోలందరిలో అందగాడు. మహేష్‌బాబు మంచి కామెడీని పండిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం మేమిద్దరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

మల్టీస్టారర్ సినిమాలపై మీ అభివూపాయమేమిటి?
హిందీలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేయాలి. మల్టీస్టారర్ సినిమాల వల్ల మంచి కథలు వస్తాయి. పరిక్షిశమ కూడా బాగుంటుంది.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్ వివేకానందను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?
స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. వివేకానందుని తాత్విక చింతన, ఫిలాసఫీని నేను బాగా ఇష్టపడతాను. వివేకానందుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రవచనాలు మనల్ని జాగృత పరుస్తాయి. ఆయన జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది. వివేకానందుడు చెప్పినట్లు... మనలో ఏమైనా అశాంతి, బాధ వుంటే ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని బిగ్గరగా ఏడవండి...అలా చేయడం ద్వారా మీ మనసు కుదుటపడుతుంది. ఎందుకంటే నిరంతరం వేదనలతో మనం ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాం.

మీరు అలవర్చుకున్న ఆధ్యాత్మిక ధోరణి ఎలాంటి అనుభవాలనిస్తోంది?
ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అవసరమని నా అభివూపాయం. బుద్దుడినే తీసుకోండి..ఆయన మనలాంటి సాధారణ మనిషి. మనుషుల్లో మహాత్ముడు ఎందుకయ్యాడు? కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయగలిగాడు? అనే విషయాల్ని అందరూ ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే అందరూ బుద్దుడి అంతటి స్థాయికి చేరుకోవచ్చని నా నమ్మకం.

జయాపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు?
నిజాయితీగా మానవ ప్రయత్నం చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ప్రయత్నం చేయడం వరకే మన పని. అలాగే నేను జీవితంలో ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోను. ఎందుకంటే లక్ష్యాల్ని నిర్ధేశించుకోవడం వల్ల అనవసర ఆందోళనలు వెంటాడుతాయి.

మీ తనయుడు అర్జున్‌ని వెండితెరకు ఎప్పుడు పరిచయం చేస్తారు?
జాకీచాన్ ‘కరాటే కిడ్’ సినిమా అంటే వాడికి చాలా ఇష్టం. ఆ సినిమా చూసి నన్ను జాకీచాన్‌లా నటించమంటున్నాడు. వాడు నా శిష్యుడిగా నటిస్తాడట. అయితే అర్జున్ ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో రావడానికి చాలా టైముంది.

రానా కెరీర్ ఎలా వుందని భావిస్తున్నారు?
రానాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పాషన్. నా కన్నా ఎక్కువగా సినిమాని ప్రేమిస్తాడు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుతాడు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌పై కూడా దృష్టి పెడుతున్నాడు. ఏ విషయంలోనైనా రానా కొత్తగా ఆలోచిస్తాడు.

అగ్రహీరోలందరూ ఎక్కువ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా వచ్చే ఏడాది మూడు సినిమాలు చేయబోతున్నారు. మారుతున్న ఈ ధోరణిపై మీరెమంటారు?
ఇలా ఎప్పటినుంచో అగ్రహీరోలందరూ సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసి వుంటే ఇండస్ట్రీ ఎప్పుడో సెట్ అయ్యేది. ఈ పరిణామం పరిక్షిశమకు చాలా మంచిది. అదే సమయంలో బడ్జెట్ కంట్రోల్‌పై కూడా హీరోలు దృష్టి పెట్టాలి.

పౌరాణిక సినిమాలు చేసే ఆలోచన వుందా?
ఇప్పటి వరకు పౌరాణిక సినిమాలు చేద్దామని నన్నెవరూ సంప్రదించలేదు. ఎవరైనా నన్ను మంచి స్క్రిప్ట్‌తో ముందుకొస్తే చేయడానికి ఇబ్బందేమిలేదు.

మీ తదుపరి చిత్రం?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్ట తర్వాత మోహర్ రమేష్ దర్శకత్వంలో ఓ చిత్రం వుంటుంది. ఫుల్‌పూంగ్త్ యాక్షన్ చిత్రమది. ఎప్పటి నుంచే సై్టలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి స్క్రిప్ట్‌తో ముందుకొచ్చాడు దర్శకుడు మోహర్ రమేష్.

నేడు రజనీకాంత్‌ పుట్టిన రోజు


 దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 62వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. పసి వయస్సు నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శివాజీరావ్‌గైక్వాడ్‌ స్వయం కృషితో రజనీకాంత్‌గా ఎదిగిన వైనం ఓ సినిమానే తలపిస్తుంటుందని సినీ విమర్శకులే అంటుంటారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తే, ఓ విజయవంతమైన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయపడుతుంటారు. ఐదేళ్ల వయస్సులోనే తల్లిని పొగొట్టుకున్న రజనీకాంత్‌ కడుపు నింపుకునేందుకు అనేక కష్టాలు పడ్డాడు. గవర్నమెంట్‌ స్కూల్‌లో కన్నడ మాధ్యంలో చదువుకున్నారు. అనంతరం జీవన సమరం చేశాడు. చివరకు మూటలు మోసే కూలీగా అవతారమెత్తారు. అనంతరం బస్సు కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. రజనీకాంత్‌కు నాటకాలంటే పిచ్చి అభిమానం. ఎన్నో నాటకాల్లో నటించారు. సన్నిహితుల ప్రోత్సహంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్‌ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ాఅపూర్వ రాగంగల్‌్ణ సినిమాలో నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడంతో శివాజీరావుగైక్వాడ్‌కు మంచి పేరు వచ్చింది. శివాజీరావుగైక్వాడ్‌ నుంచి రాజనీకాంత్‌గా పేరు మార్చింది బాలచందరే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్‌తో దక్షిణాదిలో దూసుకెళ్లారు రజనీకాంత్‌. ఆయన స్టైల్‌ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. విదేశాల్లో రజనీకాంత్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రష్యన్లకు రాజ్‌కపూర్‌ అంటే ఎంతో ఇష్టం. అలానే జపనీస్‌కు రజనీ అంతే ఇష్టంగా మారారు. రజనీకాంత్‌ ప్రతి చిత్రం జపాన్‌లో విడుదల కావాల్సిందే. అతిసామాన్యంగా ఉంటూ అందరికీ ఆయన ఆదర్శనీయంగా కనిపిస్తారు. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారని, మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Sunday, December 11, 2011

మల్లెమాల ఇక లేరు

 ప్రముఖ నిర్మాత, రచయిత ఎం.ఎస్‌.రెడ్డి (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం.ఎస్‌.రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీపరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు. నేడు మల్లెమాల అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎం.ఎస్‌.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. నెల్లూరు జిల్లా..అలివిరి అనే గ్రామంలో 1952లో జన్మించారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎం.ఎస్‌.రెడ్డి ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్‌ చేయకుండా నిలిపేశారు.

1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్‌ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.

స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్‌.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్‌ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.

2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్‌ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.


annnrఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
-డా.అక్కినేని నాగేశ్వరరావు
rCMmmmmmరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ..నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి మృతిపట్ల తీవ్ర విభ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం గొప్ప వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
rannnaపరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
-డా డి.రామా నాయుడు
nirmala‘పల్నాటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు స్వయంగా పాటలు రాశారు. పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయింది.
-కృష్ణ, విజయనిర్మల దంపతులు


naiduఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.
-బిజెపి నేత వెంకయ్య నాయుడు


rajuvayyaపరిశ్రమలో నన్నెంతగానో ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాను. ఇది పెద్ద విషాదం. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
-కృష్ణం రాజు
rojaaమల్లెమాలకు అభిమానిని. తనో అద్భుత కవి. ‘భైరవద్వీపం’ సినిమా చూసి రాకుమారి అంటే ఇలా ఉండాలి అని అభినందించారు.
-రోజా

Ram Charan's Yevadu Posters


Saturday, December 10, 2011

ప్రియమణికి తప్పిన ప్రమాదం

 హీరోయిన్‌ ప్రియమణి ఘాటింగ్‌ స్పాట్‌కు వెళ్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కన్నడంలో పునీర్‌ రాజ్‌కుమార్‌ సరసన ప్రియమణి ' అన్నా బాండ్‌ ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఘాటింగ్‌ కోసం బెంగుళూరుకు దగ్గరలోని ముత్తత్తి దుర్గ అటవీ ప్రాతానికి ప్రియమణితో పాటు ఆమె సెక్రటరీ, మేనేజర్‌, స్నేహితురాలు కలిసి కారులో బయలుదేరారు. అటవీ ప్రాంతం ద్వారా వెళ్తున్న సమయంలో వీరి వాహనాన్ని మరో వాహనం ఓవర్‌ టేక్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రియమణి ప్రయాణం చేస్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు.

Friday, December 9, 2011

సచిన్‌ & సెహ్వాగ్‌

 సచిన్‌ : ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ రికార్డుల దీరుడు. వన్డేల్లో , టెస్టుల్లో మొత్తం కలిపి 97 సెంచరీల సాధించి సెంచరీల సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.ఈ వివరాలు చాలు సచిన్‌ ది గ్రేట్‌ అని చెప్పడానికి. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు ఒక్కడే అతడా మన లిటిల్‌ మాస్టర్‌ టెండూల్కర్‌.
సెహ్వాగ్‌ : వీరేంద్ర సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే చాలు పరుగుల వరద జలజలా పారుతుంది. ఫోర్లు సిక్సర్లు అలవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా బాదే సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే ఎదుటి జట్టుకువెన్నులో వణుకు పడుతూనే ఉంటుంది. వీరు ఉన్నత సేపు స్కోరు బోర్డు ఇలా చూస్తూంటే అలా చకచకా వెళ్లిపోతుంది. అతను క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఏ బౌలర్‌ అయినా... స్పిన్‌ అయినా, ఫాస్ట్‌ అయినా..! ఒక్కటే ఃవీరః బాదుడు. ఇందులో ఇంకో విషయం తక్కువ స్కోరు వద్ద వికెట్‌ పడిందంటే అది సెహ్వాగ్‌ అని ప్రతి ఒక్కరు అనుకఁటారు. ఇది కూడా నిజం. అతను అడిన 5 బంతులలో ఒక ఫోరు తప్పని సరిగా వుంటుంది. తక్కువ బంతులలో ఎక్కువ స్కోరు చేసి జట్టుకు వేగంగా పరుగుల అందిస్తాడు.
సెహ్వాగ్‌ ఆడుతున్నంత సేపు ప్రేక్షకుడు టీవి ముందునుంచి కదలడంటే వీరు ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసంరంలేదు.
భారత్‌ బ్యాట్స్‌మెన్లలో ఇంత వరకూ ట్రిఫుల్‌ సెంచరీ చేసిన మొనగాడు సెహ్వాగ్‌ మాత్రమే
సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
వన్డేల్లో 8 వేల పరుగులు దాటిన ఐదో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్ నిలిచాడు.
డబుల్ సెంచరీతో సెహ్వాగ్ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రూ. 10 లక్షలు బహుమానంగా ఇచ్చింది.
సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కూడా భారత్ సరిగ్గా 153 పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాను ఓడించింది.
32 ఒక మ్యాచ్‌లో అత్యధికసార్లు బంతిని బౌండరీ దాటించి (25 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరూ కొత్త రికార్డు
వన్డేల్లో సెహ్వాగ్ సెంచరీల సంఖ్య 15
4 వన్డేల్లో నాలుగుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టు భారత్.
వీరూకు నా అభినందనలు. అతడి రికార్డును చూస్తే సంతోషంగా ఉంది. నా రికార్డును మరో భారతీయుడు అధిగమించడం మరింత సంతృప్తినిచ్చింది
- సచిన్

Thursday, December 8, 2011

సెహ్వగ్‌ టెస్టులో 319, వన్డేలో 219 పరుగులు రికార్డు సొంతం

 సెహ్వగ్‌ టెస్టులో 319, వన్డేలో 219 పరుగులు రికార్డు సొంతం చేసుకున్నాడు. సెహ్వాగ్‌ వన్డేలో ఎనిమిది వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. టెస్టులో మాత్రం 7980 పరుగులు చేశాడు. వన్డేలలో ఎనిమిది వేల పరుగుల పూర్తి చేశాడు. ఇప్పటి వరకు సెహ్వాగ్‌ ఇటు వన్డేలల్లో అటు టెస్టులో మాత్రం రికార్డును సొంతం చేసుకున్నాడు. వన్డేలో 219 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. ఇంతక ముందు డబుల్‌ సెంచరి చేసి సచిన్‌ రికార్డును సెహ్వాగ్‌ తిరగరాశాడు.

Tuesday, December 6, 2011

మురుగుదాస్‌ సినిమా?

పూరి జగన్నాథ్‌, వి.వి.వినాయక్‌,...,మురుగదాస్‌! చిరంజీవి 150వ సినిమాకి దర్శకత్వం వహించే జాబితాలోని పేర్లివి. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా..కచ్ఛితంగా 150వ సినిమా పూర్తిచేయాలని.. సాక్షాత్తూ బిగ్‌బి అమితాబ్‌ స్వయంగా కోరిన నేపథ్యంలో చిరు ‘సరే’నని మాట ఇచ్చారు. అది నిలబెట్టుకుంటూ..ఎట్టకేలకు మురుగదాస్‌ వినిపించే కథ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఫిలినగర్‌లో చర్చ సాగుతోంది. గజని, సెవెన్త్‌సెన్స్‌ -వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన మురుగ..అదే స్థాయి కథ కోసం మరోసారి కసరత్తు చేస్తున్నారని, ఈ మెగాప్రాజెక్టును తనదైన బాధ్యతతో పూర్తి చేయాలని భావిస్తున్నారని వార్తలు వినవస్తున్నాయి.

గోపిచంద్‌ తర్వలో పెళ్లి కొడుకుగా చూడొచ్చు

 గోపీచంద్‌ తర్వలో పెళ్లి కొడుకుగా అవుతున్నాడు. హైదరాబాదుకు చెందిన హరితతో గోపీచంద్‌కు పెళ్లి ఖాయమైనట్లు సమాచారం. హరిత కుటుంబానికి సినిపరిశ్రమతో సంబంధాలు లేవు. వారికి నగరంలో పలు వ్యాపారాలున్నాయి. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమే. తర్వలోనే నిశ్చయ తాంబూలాలు మార్చుకోబోతున్నారు. వచ్చే ఏడాదిలో పెళ్లి ముహూర్తం ఉంటుంది.

Saturday, December 3, 2011

మూడు భాషల్లో బిజినెస్‌...


BUSINESS-MANమహేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా ‘బిజినెస్‌మేన్‌’. కాజల్‌ కథానాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ పతాకంపై డావెంకట్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 10తో షూటింగ్‌ సాంతం పూర్తి కానుంది. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘ఇటీవల బ్యాంకాక్‌, పటాయ, క్రాబిలలో రెండు పాటలు తెరకెక్కించాం. ప్రస్తు తం అనువాదం సహా రీరికార్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. నెలాఖరుకు తొలికాపీ వస్తుంది. ఇదే నెల 22న తెలుగు, తమిళ్‌, మలయాళ వెర్షన్ల ఆడియోలను రిలీజ్‌ చేయనున్నాం. జనవరి 11న అత్యథిక థియేటర్లలో సినిమా రిలీజవుతుంది. మహేష్‌-పూరి ఈ సినిమా కోసం థీమ్‌ సాంగ్‌ పాడడం ఓ విశేషం. ‘పోకిరి’ని మించిన డైలాగులు ఈ చిత్రంలో ఉన్నాయి. అవి రెట్టింపు పాపులారిటీని తెస్తాయని విశ్వసిస్తున్నాం. మహేష్‌ కెరీర్‌కే మరో మేలిమలుపు కాబోతోందీ సినిమా. రికార్డుల కోసం సంక్రాంతి వరకూ ఆగాల్సిందే’’ అన్నారు.

Wednesday, November 30, 2011

నేడు సినీ హీరో రామ్‌చరణ్‌ నిశ్చితార్థం


నేడు ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌తేజ, అపోలో గ్రూప్‌ ఛైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి మనుమరాలు ఉపాసనల నిశ్చితార్థం జరుగనుంది. ఈ నిశ్చితార్థనికి మొయినాబాద్‌ మండలం అజీజ్‌ నగర్‌లోని అపోలో ఫాంహౌస్‌లో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఫాంహౌస్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ముందు ప్రతాప్‌రెడ్డి సొంత జిల్లా అయిన నిజామా బాద్‌లోని తన సొంత కోటలో నిశ్చితార్థం నిర్వహించాల నుకున్నారు. అనంతరం హైదరాబాద్‌ నగరా నికి, అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండే విధంగా నిశ్చితార్థ వేదికను ఈ ఫాంహౌస్‌కి మార్చారు. 20 రోజులుగా నిశ్చితార్థ ఏర్పాట్లు చేశారు. సుమారు 30 ఎకరాల విస్తీర్ణంలో నిశ్చితార్థం ప్రాంగణాన్ని తయారు చేశారు. వేదికను భారీ సెట్టింగులతో ఏర్పాటు చేశారు. సుమారు 2000 మంది వరకు రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు రాష్ట్ర నలుమూలల నుంచి రావడంతో పాటు దేశ రాజధాని నుంచి వివిఐపిలు ఈ వేడుకకు హాజరు కానున్నారు. వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు.
హాజరుకానున్న ప్రముఖులు
చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్‌తేజ నిశ్చితార్థానికి రాజకీయ, సినీ ప్రముఖులు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఎఎస్‌ అధికారులు సైతం హాజరవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌ నగరానికి చేరువలో అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు నుంచి కిలోమీటర్‌ దూరంలో నిశ్చితార్థ వేదిక ఏర్పాట్లు చేశారు. వివిఐపిలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. వివిఐపిల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నగరానికి దగ్గరలో ఏర్పాట్లు చేశారు. దేశ రాజధాని నుంచి కొందరు ప్రముఖులు రావడంతో విమానాశ్రయానికి చేరువలో ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. నిశ్చితార్థం ప్రాంగణంలోనికి వివిఐపిలకు ప్రత్యేక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. విలేకర్లను మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించడం లేదు.

Tuesday, November 29, 2011

తొలివన్డేలో భారత్‌ గెలుపు

వెస్టిండీస్‌-భారత్‌ జట్ల మధ్య బారబతి స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఈ పోటీ చూసేందుకు తొలినుంచి ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. టాస్‌నెగ్గిన ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ వెస్టిండీస్‌ను నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు పడగొట్టి 211 పరుగలకే కట్టడి చేసింది. ఆ తరువాత 212 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఒకదశలో 60 పరుగలకే 5 వికెట్లు కోల్పోయి చతికిలపడింది. ఆ దశలో రోహిత్‌శర్మ, జడేజాలు నిలదొక్కుకుని భారత్‌ స్కోరును నెమ్మదిగా పెంచారు. చివర్లో వికెట్లు వడివడిగా పడినప్పటికీ భారత్‌ 9 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి ఒక వికెట్టు వియాన్ని సాధించింది. రోహిత్‌ 72 పరుగులు చేసి వన్డేల్లో 9వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

Monday, November 28, 2011

బాలీవుడ్‌లోకి అల్లరి నరేష్‌

అల్లరి వేషాలతో తెలుగులో టాప్‌ కామెడీ హీరోగా మారిన అల్లరి నరేష్‌ త్వరలో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ దర్శకత్వంలో బాలీవుడ్‌ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయమై నరేష్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నేను చేస్తున్న సినిమా ప్రియదర్శన్‌ దర్శకత్వంలో హిందీలో రీమేక్‌ కాబోతోంది. అందులో నన్ను నటించమని అడిగారు, కానీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని నరేష్‌ చెప్పుకొచ్చారు.

Friday, November 25, 2011

వెస్టిండీస్‌తో మూడు వన్డేలకు భారత జట్టు ఎంపిక , కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌

వెస్టిండీస్‌తో తొలి మూడు వన్డేలకు భారత జట్టును ఎంపిక చేశారు.. కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ని ఎంపిక చేశారు. గంభీర్‌, కోహ్లీ, పార్థివ్‌ పటేల్‌, రహానే, మనోజ్‌తివారీ, రైనా, రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, అశ్విన్‌, వరుణ్‌ ఆరోన్‌, ఉమేష్‌ యాదవ్‌, రాహుల్‌ శర్మ, ప్రవీణ్‌కుమార్‌, వినయ్‌కుమార్‌కు టీమ్‌లో స్థానం కల్పించారు. ధోనీ, సచిన్‌, యువరాజ్‌ సింగ్‌లకు విశ్రాంతి కల్పించారు. హర్భజన్‌కు చోటు దక్కలేదు.

Sunday, November 13, 2011

ఇంటివాడయిన క్రికెటర్‌ అశ్విన్‌

 భారత స్పిన్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ వివాహం ఈరోజు ఘనంగా జరిగింది. ఆదివారం ఉదయం ఇక్కడి రాఘవేంద్ర కల్యాణమండపంలో తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతి నారాయణన్‌ను సంప్రదాయబద్ధంగా అశ్విన్‌ వివాహం చేసుకున్నాడు. గత వారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ 9వికెట్ల తీసిన విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం ఈ జంట కోల్‌కతా వెళ్లే అవకాశం ఉంది. కోల్‌కతాలో సోమవారం నుంచి వెస్టిండీస్‌తో జరిగే రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో అశ్విన్‌ అడాల్సి ఉన్న విషయం విదితమే.

Saturday, November 12, 2011

ఘనంగా 'దూకుడు' అర్థ శతదినోత్సవం

 ప్రముఖ నటుడు మహేష్‌బాబు, నటి సమంత నటించిన 'దూకుడు' అర్థ శతదినోత్సవం శనివారం విజయవాడలో ఘనంగా జరిగింది. వేలాదిగా తరలొచ్చిన అభిమానులతో విజయవాడలోని కానూరు సిద్ధార్థ కళాశాల మైదానం హోరెత్తింది. రాత్రి ఏడు గంటలకు మొదలైన ఈ వేడుకలకు నటుడు మహేష్‌బాబు ముందుగా గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డుమార్గం ద్వారా వచ్చారు. మహేష్‌బాబు, ఇతర సినీనటులను చూసేందుకు వచ్చిన వారితో బందరురోడ్డులో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఒకానొక సమయంలో కళాశాల గేటువద్ద స్వల్ప తొక్కిసలాట జరిగింది. అభిమానులను నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు. హీరో మహేష్‌బాబును అభిమానులు గజమాలతో సత్కరించారు. అనంతరం ప్రముఖ నిర్మాతలు దగ్గుబాటి సురేష్‌బాబు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అశ్వనీదత్‌, రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, సుంకర అనీల్‌ నటీనటులు, సాంకేతికవర్గాన్ని అభినందించారు. సినీరంగంలో ఉన్న సగం మంది కానూరు కళాశాలకు రావడంతో అభిమానులు వారిని చూసేందుకు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్‌ కృష్ణ, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ చిన్నతనంలోనే సినిమారంగంలో 'దూకుడు' ప్రదర్శించిన మహేష్‌బాబు పెద్దయిన తరువాత కూడా అదే ఒరవడి కొనసాగిస్తున్నారని అన్నారు. 75 ఏళ్ల సినీ చరిత్రలో రికార్డులు సృష్టించిన 'పోకిరి' అతని కీర్తిలో కలికితురాయని అన్నారు. దాని రికార్డులకు చేరువగా 'దూకుడు' వెళుతుందని అన్నారు. నటి సమంత మాట్లాడుతూ 'దూకుడు' సినిమా తనకు జీవితంలో గుర్తుండిపోయే విజయాన్ని అందించిందన్నారు.

పెళ్లి పీటలెక్కనున్న మమత


Friday, November 11, 2011

పెళ్లికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన స్నేహ

సినీ నటి స్నేహ పెళ్ళి తెరను అడ్డు తొలగించింది. సుమారు 3, 4 సంవత్సరాల నుండి ప్రేమించుకుంటున్న స్నేహితుడు మరియు కోలివుడ్‌ నటుడు. ప్రసన్నను వివాహమాడనుంది. 2012 మార్చిలో పెళ్ళి చేసుకుంటున్నట్లు స్నేహ అధికారికంగా ప్రకటించింది. స్నేహ ప్రస్తుతం హీరో నాగార్జున చిత్రం ' రాజన్న' సినిమాలో నటిస్తుంది. ఇక ఎంగేజ్‌మెంట్‌ను అంగరంగ వైభవంగా చేసేందుకు త్వరలో తేదిని ప్రకటిస్తామన్నారు.

Thursday, November 10, 2011

11-11-11 నేడు అరుదైన తేదీ

నవంబర్ 10: అన్ని ఒకేరకమైన అంకెలతో, ఎటు నుంచి చూసినా ఒకేలాగ కనిపించే అరుదైన తేదీ 11-11-11.. నేడు అంటే శుక్రవారం ఈ తేదీకి వేదిక కానుంది. వందేళ్లకు ఒక్కసారి మాత్రమే ఇలాంటి తేదీ దర్శనమిస్తుంది. అందులోనూ 11-11-11 తేదీన 11గంటల, 11నిమిషాల. 11 సెకన్లు సమయం మరీ ప్రత్యేకం. అరుదైన అంకెల గారడీ చుట్టూ ఎన్నో అపోహలు, మూఢనమ్మకాలు ముసురుకున్నాయి. ఈ ప్రత్యేక తేదీన ఔత్సాహికులు విహహాలు, వేడుకలు జరుపుతుండగా, హిందూ సంప్రదాయం ప్రకారం ఈ సంఖ్య అంతగా అచ్చిరాదని జ్యోతిష్యులు చెబుతున్నారు. 11-11-11 తరహాలో తదుపరి అంకెలు (22-22-22) కాల్యెండర్‌లో లేకపోవడమే ఇందుకు కారణమని కొన్ని వెబ్‌సైట్లు ప్రవచిస్తున్నాయి. గతం ఈ తేదీ వచ్చినప్పుడు, అంటే 1911, నవంబర్ 11న పర్యావరణంలో అనూహ్య మార్పులు సంభవించాయి

Saturday, October 29, 2011

ఐటమ్‌ సాంగ్‌కి 50 లక్షలు

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో మహేష్‌బాబు హీరోగా ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ హిట్‌ అయిన ' దూకుడు' తర్వాత మహేష్‌ బాబు హీరోగా మరో సినిమా కావడంతో ' ది బిజినెస్‌ మేన్‌' సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా వుంటే, ' ది బిజినెస్‌ మేన్‌ ' సినిమా కోసం మాస్‌ మసాలా ఐటమ్‌ సాంగ్‌ని చిత్రీకరించనున్నారు. ఇందు కోసం ముంబై నుంచి శ్వేతా భరద్వాజ్‌ అనే సెక్సీ భామని టాలీవుడ్‌కి ఇంపోర్డ్‌ చేస్తున్నారు.
ఇక, ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం ఏకంగా శ్వేతా భరద్వాజ్‌కి యాభై లక్షలు చెల్లిస్తున్నారట. పాట పిక్చరైజేషన్‌ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్పెయిన్‌లో ఘాటింగ్‌ జరుపుకుంటోన్న ' ది బిజినెస్‌ మేన్‌ ' విదేశాలనుంచి తిరిగిరాగానే, ఐటమ్‌ సాంగ్‌ చిత్రీకరణ జరగనుందట.

Friday, October 28, 2011

కాజల్‌ ఔట్‌ .. త్రిష ఇన్‌

 జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ' దమ్ము ' సినిమాలో పలువురు సినీ హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నాయి. ఏకంగా రెండు, కాదు మూడు కాదు ఏకంగా నాలుగురు లేక ఐదుగురి పేర్లు విని పిస్తున్నాయి. తొలుత హీరోయిన్‌గా శృతిహాసన్‌ నటించాల్సి వుండగా, అనూహ్యంగా ఆ ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది శృతిహాసన్‌ ప్లేస్‌లో ' జోష్‌ ' ఫేం కార్తీక పేరు వినించింది.. అయితే కార్తీక పేరు తెరమరుగైపోయి.. కొత్తగా కాజల్‌ పేరు తెరపైకొచ్చింది. ' దమ్ము'లో కాజల్‌ హీరోయిన్‌గా నటించడం దాదాపు ఖాయమైపోయిందని అంతా అనుకుంటున్న సమయంలో .. కాజల్‌కి బదులుగా త్రిషని తీసుకున్నారని సమాచారం. ఇంతవరకు జూనియర్‌ ఎన్టీఆర్‌తో త్రిష ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

Thursday, October 27, 2011

గౌతమ్‌ గంభీర్‌కు పెళ్లి కళ ...

   భారత బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ కొత్త ఇన్నింగ్స్‌ ఆరంభించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి నేడు వైవాహిక జీవితంలోకి ఆడుగుపెట్టబోతున్నాడు. ఢిల్లీకే చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌కు గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో శుక్రవారం వివాహం జరగనుంది. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. గౌతమ్‌, నటాషాలకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది.

Tuesday, October 25, 2011

భారత్‌ క్లీన్‌స్వీప్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన ఐదో వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ భారత్‌ 5-0 క్లీన్‌స్వీప్‌ చేసింది. భారత్‌ను భారత గడ్డ మీద ఓడించడం అంతా సులువు కాదు. అన్ని ఇంగ్లాండ్‌కు మరో సారి స్పష్టం చేసింది. మంగళవారం జరిగిన ఐదవ, చివరి వన్డే మ్యాచ్‌లో భారత్‌, ఇంగ్లాండ్‌పై 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్‌ జట్టు ఒక మార్పు జరిగింది. పార్థివ్‌ పటేల్‌ స్థానంలో మనోజ్‌ తివారి జట్టులోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. గంభీర్‌, రెహ్మన్‌ ఓపెనర్లుగా వచ్చారు. ఓపెనర్లు ఇద్దరు మొదటి వికెటుకు 80 పరుగుల జోడించారు. గంభీర్‌ 46 బంతులల్లో నాలుగు బౌండరీల సహాయంతో 38 పరుగులు చేసి ఫిన్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. వన్‌డౌన్‌గా వచ్చిన కోహ్లీ డకౌట్‌గా వెనుదిరిగాడు. రెహ్మన్‌ 61 బంతులల్లో 42 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. తివారి 24, రైనా 38, జాడేజ 21, అశ్విన్‌ 7, ప్రవీణ్‌ కుమార్‌ 16 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ ధోని 75 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు. ఇంగ్లాండ్‌ బౌలింగ్‌లో పాటేల్‌ మూడు వికెట్లు తీసుకోగా, ఫిన్‌ రెండు వికెట్లు తీసుకున్నారు. ఇంగ్లాండ్‌ 272 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ 176 పరుగులు అలౌట్‌ అయ్యింది. ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు అర్థసెంచరీతో నాటౌటుగా ఉన్నారు. ఇంగ్లాండ్‌ విజయం దిశగా పయనిస్తున్న సమయంలో అరోన్‌ కెప్టెన్‌ కుక్‌ను బౌల్డ్‌ చేశాడు.
కుక్‌ 61 బంతులల్లో ఎనిమిది ఫోర్ల సహయంతో 60 పరుగులు చేశాడు. క్విస్టర్‌ 63, బెల్‌ 2, ట్రాట్‌ 5, బైర్‌స్టవ్‌ 2, బోపార 4, బెన్‌సన్‌ 0, పటేల్‌ 18, ఫిన్‌ 1 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. 129 పరుగుల వద్ద తొలి వికెటు కోల్పోయిన ఇంగ్లాండ్‌ మరో 49 పరుగులు జోడించి అలౌట్‌ అయ్యింది. భారత్‌ స్పినర్ల్‌ రవీంద్ర జడేజా 4/33 , రవీంద్ర అశ్విన్‌ 3/28 ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ను కుప్పకూలించారు. ఈ విజయం ద్వారా ఇంగ్లాండ్‌ వైట్‌వాష్‌ అయిన భారత్‌ సొంత గడ్డపై మళ్లీ క్లీన్‌స్వీప్‌ చేసి ప్రతీకారం తీర్చుకుంది.

Thursday, October 20, 2011

సిరీస్‌ భారత్‌ వశం : క్లీన్‌స్వీప్‌ కోసం భారత్‌ ఎదురుచూపు ...

 భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య జరుగుతున్న మూడోవ వన్డేలో భారత్‌ 49.2 బంతులలో 300 పరుగులు చేసి విజయం సాధించింది. ఐదు వన్డే సిరీస్‌లో భారత్‌ 3-0 తేడాతో ఉంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. ఓపెనరు కుక్‌ 3 పరుగులకే అవుట్‌ అయ్యాడు. వన్‌ డౌన్‌గా వచ్చిన ట్రాట్‌ 116 బంతులల్లో ఎనిమది పోర్లు సహయంతో 98 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు చివరికి రెండు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు. పీటర్సన్‌ 64, పటేల్‌ 70, బోపరా 24 పరుగులు చేశారు. భారత్‌ బౌలింగ్‌లో ప్రవీణ్‌ కుమార్‌, వినరుకుమార్‌ , కోహ్లీ , జడేజా చెరో వికెటు తీసుకున్నారు. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ ఇంకా నాలుగు బంతులు మిగిలి వుండగానే విజయం లక్ష్యం సాధించింది. భారత్‌ బ్యాట్స్‌మెన్‌లు అందరు కలిసి కట్టుగా అడి విజయం సాధించారు. పటేల్‌ 38, రెహ్మన్‌ 91, గంభీర్‌ 58, కోహ్లీ 35, రైనా 0 పరుగులు చేశారు. ధోని 35, జడేజా 26 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలారు.