కొన్ని వందల కోట్లు కర్చుపెట్టి, ప్రపంచంలోని వివిద దేశాలు తిరిగి సుందర ప్రదేశాలను అద్భుతంగా చూపించి, ఎండనక వాననక నిద్రాహారాలు మాని ఎంతో శ్రమించి నిర్మించిన సినిమా నేడు విడుదలైన రోజే ఇంటర్‌నెట్టులో ప్రత్యక్షమౌతోంది. దీంతో కోట్లు కర్చుపెట్టిన నిర్మాత కుదేలవుతున్నాడు. భారీ ఖర్చు పెట్టి తీసిన సినిమాని ఏ నయాపైసా కర్చు లేకుండా ఇంటర్నెట్టుల్లో చూస్తూ దానికి తాము ఎంతో పొడిచినట్టు రాసే రివ్యూలు అబ్బో చేసే యాక్షన్‌లు అంతా ఇంతా కాదు. మరి సినిమా తీసిన వారిని విమర్శించే ముందు మనం వారు చేసిన దాంట్లో చిటికెన వేలంత అయినా చేయగలమా అని మనస్ఫూర్తిగా ఆలోచించే ధైర్యం చేస్తే మళ్లీ ఇలాంటి రివ్యూలు, ఎవరు రాయరు రాయలేరు. వీరు చేసే వెకిలి పని, వికారపు పని ఒక్క నిర్మాతనే కాదు అందులో పనిచేసే లైట్ బాయ్ దగ్గర నుంచి వేల మంది క్యారెక్టర్ ఆర్టిస్టుల, మరియు వందల మంది సిబ్బంది జీవితాలతో ఆడుకుంటుందన్న విషయం ఇంకా అర్థం అయినా కానట్టు నాదేం పోతుందిలే అని ఈ ఇంటర్నెట్ సినిమాయలో పడి చాలా మంది థియేటర్లకు వెళ్లకుండానే ఇంట్లోకూర్చుని దర్జాగా సినిమాని చూస్తున్నామని వాళ్లు అనుకుంటున్నారు.
కాని ఎంతో కళాత్మకంగా అందిచిన ఆ సంగీతం 70 ఎంఎం థియేటర్‌లో వినిపిచినంత మధురంగా ఆ డొక్కు కంప్యూటర్‌లో వినిపిస్తుందా. వందల మందితో కలిసి చూసేటప్పుడు కలిగే ఆ థ్రిల్లింగ్, ఈ నాలుగు గోడల మధ్యన ఒంటరిగా కూర్చుని చూస్తే వస్తుందా..? ఆ గ్రాఫిక్స్ మాయ కళ్ల నిండా వెలిగి గుండె నిండా వెదజల్లుతూ... థియేటర్ తెర మన మనసులో చేసే సందడి ఈ 28 ఇంచిల కంప్యూటర్ కలిగిస్తుందా...? అయినా ఒకే సారి రాకుండా ఆగుతూ ఆగుతూ వచ్చే తొస్సు మాటలలా వచ్చే డైలగాలు.... ఒక్కక్కొక్కరిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకే సారి పంపించు అనే గాంభీర్యం గానీ..... వదల బొమాలి వదలా.......అనగానే మనసులో కలిగే ఓ భయంలాంటి ఆనందంగానీ.... ఆ వినీ పిచని స్ట్రక్ అవుతూ వచ్చే మాటలలో ఉంటుందా....? అంటే ఒక్క పర్సెంట్ కూడా ఉండదు కానీ వాటినే చూడటం వాటికోసం వెంపర్లాడటం తర్వాత ఏం బాగోలేదనో.. లేక ఆవరేజ్ అనో సైట్‌లలో రాసి పెడితే.. అది సదివిన వెర్రి ప్రేక్షకుడు సినిమాహాలుకు వెళ్లకుండా సినిమా బాగోలేదని కూర్చోవడం ఇదంతా సినిమా ఇండిస్టీ పతనానికి దారి తప్ప ఇంకోటి కాదు. ఇలా కంప్యూటర్ల మానిటర్లపై సినిమా చూడటం ఆరంభిస్తే ముందుముందు కాలంలో భారీ బడ్జెట్‌తో మగధీరా, రోబో లాంటి విన్యాసాలు, చూపేందుకు నిర్మాతలు ముందుకు రారు అలాంటప్పుడు, తెలుగు సినీ ఇండిస్టీ, లేదా మరే సినీ ఇండిస్టీ అయినా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రివ్యూలు చదివో, ఇంటర్నెట్‌లోకి సినిమాలు అప్‌లోడ్ చేసి, లేక వాటిని చూస్తూ ఆనందింస్తున్న వాళ్లు కనీస మానవతావాద దృక్ఫథంతో ఆలోచించి మనం చూస్తుంది, ఇంటర్నెట్ సినిమా కాదు వందల మంది నెత్తుటి బొట్టును చెమటచుక్కగా కరిగించి సినిమా తీసిన వారి నోటికాడి ముద్దని లాగేస్తున్నమని మర్చిపోవద్దు. సినిమానే జీవనాదారంగా బ్రతుకుతున్న జీవితాలతో ఆడుకుంటున్నామనే సంగతి కొద్దిగా ఆలోచించాలని ఆశిస్తూ ,,,,,,!
No comments:
Post a Comment