ఇప్పుడిప్పుడే
టాలీవుడ్లో నటిగా ఎదుగుతోంది రెజీనా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస
సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ నటి.. త్వరలోనే బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్‌తో
కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందిస్తూ బిగ్‌బితో
నటించేందుకు ఆతృతగా ఉన్నానంటోంది రెజీనా.
అమితాబ్‌బచ్చన్..
అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో 2002లో వచ్చిన ‘ఆంఖేన్’ బాక్సాఫీసు వద్ద
హిట్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆంఖేన్-2’ వస్తోంది. ఇందులో
నటించడంపై మాట్లాడిన రెజీనా.. ‘‘ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి
భయపడటం లేదు. సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల నుంచి చాలా విషయాలు
నేర్చుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా.
కాకపోతే ఇక్కడ ఇదే నా మొదటి చిత్రం కాబట్టి అందరి దృష్టి నాపై ఉంటుంది.
వారంతా నా నటనపై దృష్టిపెడతారు.. కాబట్టి వారిని మెప్పించగలగాలి.
ఇక్కడ నాకంటూ గుర్తింపు తెచ్చుకోగలగాలి. ఆ విషయంలోనే కొద్దిగా భయంగా
ఉంది.’’ అని చెప్పుకొచ్చింది.

‘బర్మా’, ‘జాక్సన్ దురై’ ఫేమ్
ధరణిధరన్ దర్శకత్వంలో తాజాగా
తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా
రంగుస్కి’. ‘మెట్రో’ ఫేమ్ హిరీష్,
‘విల్ అంబు’ నాయిక శాంథిని
జంటగా నటిస్తున్నారు. శక్తివాసన్,
బర్మా టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న
ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా
సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే
తొలిషెడ్యూల్ చిత్రీకరణను
పూర్తి చేశారు. సోమవారం నుంచి
రెండో షెడ్యూల్ చిత్రీకరణ
ప్రారంభం కానుంది. ఇందుకోసం
తరమణిలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం
చేశారు. సినిమా గురించి దర్శకుడు
మాట్లాడుతూ మేం అనుకున్నదానికన్నా
సినిమా చిత్రీకరణ శరవేగంగా
సాగుతోంది. 50 శాతం పైచిలుకు చిత్రీకరణ
పూర్తయింది. ఇదేవేగంతోనే సినిమా
చిత్రీకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం.
కథా నాయకుడు హిరీష్ తన పాత్రను
అద్భుతంగా పోషిస్తున్నారు.
ప్రేమ సన్నివేశాల్లో కూడా మేం
ఆశించినట్లుగానే నటించారు.
కానీ కథానాయికకు ముద్దుపెట్టే
సన్నివేశంలో మాత్రం ఆయన చాలా
ఇబ్బందికరంగా నటించారు. కానీ
మేం అనుకున్నట్లుగా రాలేదు.
అందువల్ల ముద్దు సన్నివేశానికి
ఏకంగా 19 టేకులు తీసుకున్నారు.
ఇతర సన్నివేశాలకు సంబంధించిన
పనులన్నీ సిద్ధమయ్యాయి. రెండో
షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నామన్నారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్
లీగ్(ఐపీఎల్)లో తాను పాల్గొనాలని అనుకోవడం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన క్రికెట్ షెడ్యూల్ బిజీగా
ఉండటంతో, ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. గతేడాది రైజింగ్
పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడిన పీటర్సన్.. ఆ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడిన
తరువాత గాయం కారణంగా దూరమయ్యాడు.
అయితే గత డిసెంబర్ లో పీటర్సన్ ను పుణె సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. ఈ
నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడాలంటే ఫిబ్రవరి నెలాఖరున జరిగే వేలంలో ఏదొక
ప్రాంఛైజీ పీటర్సన్ ను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, తాను ఐపీఎల్ కు
సిద్ధంగా లేనని పీటర్సన్ ముందుగానే ఓ ప్రకటన విడుదల చేశాడు.
'ఐపీఎల్ వేలానికి నేను రావాలని అనుకోవడం లేదు. ఈ శీతాకాలపు సీజన్ లో అనేక
మ్యాచ్ లతో బిజీగా ఉన్నా. ఒకవైపు ప్రయాణాలు, మరొకవైపు మ్యాచ్ లతో తీరిక
లేకుండా ఉన్నా. దాంతో వచ్చే వేసవిలో ప్రయాణాలకు దూరంగా ఉండి విశ్రాంతి
తీసుకుంటా' అని పీటర్సన్ తెలిపాడు.
ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్‌పై ఆమె కూతురు కౌంటర్లు వేస్తోంది. సోషల్
మీడియా ఇన్ స్టాగ్రమ్లో వివిధ హావభావాలతో కూడిన ఫొటోను కాజోల్
పెట్టినందుకు తన 13 ఏళ్ల కూతురు నిసా కామెంట్ చేసింది. ‘మామ్.. ఎందుకు
నువ్వు చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు? అంటూ తన ఫొటోకు కామెంట్‌పెట్టి
కాజోల్‌ను అవాక్కయ్యేలా చేసింది. అయితే, నిసా ఇలా చేయడం ఇదేం తొలిసారి
కాదు. గతంలో కూడా ఇలాంటి షాకింగ్ వ్యాఖ్యలు తల్లి ఫొటోకు ప్రతిస్పందనగా
పెట్టింది. కాజోల్ (42), అజయ్ దేవగన్ (47) 1999లో వివాహం చేసుకున్నారు.
వారికి నిసా(13), యుగ్ అనే ఆరేళ్ల బాబు ఉన్నారు.
నిసా తల్లితో చాలా చనువుగా ఉంటుంది. ఈ మధ్య తన ఇద్దరు పిల్లలను చూస్తు
సంబరాల్లో మునిగిన సమయంలో తన మొఖంలో ఏర్పడిన హావభావాలతో కూడిన ఫొటోను ఇన్
స్టాగ్రమ్లో పెట్టింది. అందులో ట్యాగ్‌లైన్‌గా నా పిల్లలను జతగా
చూసినప్పుడు.. అంటూ పెట్టింది. దీనికే పై విధంగా నిసా బదులిచ్చింది. గతంలో
కాజల్ దివాళీ పండుగకు సంబంధించిన తన ఫొటో ఒకటి పెట్టినప్పుడు కూడా నిసా
ఇలాగే స్పందించి ‘ఇదేం ఫొటో.. నాకు చాలా బ్యాడ్‌గా అనిపిస్తోంది’ అంటూ
కామెంట్ పెట్టి అందరినీ ఆకర్షించింది. అయితే, తల్లికూతుర్ల మధ్య
చనువుకొద్దే తనలా స్వేచ్ఛగా వ్యాఖ్యలు చేయగలుగుతుందని ఆమె మురిసిపోతుందట.
అక్కినేని నాగచైతన్య, సమంతల నిశ్చితార్థం ఆదివారం రాత్రి ఎన్ కన్వెన్షన్
సెంటర్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు ఈ
వేడుకకు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే వీరందరికీ
నాగచైతన్య మంగళవారం ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో
దగ్గుబాటి కుటుంబం, అక్కినేని కుటుంబంతో కలిసి దిగిన చక్కని ఫొటోలను పోస్ట్
చేశారు. అది మర్చిపోలేని రాత్రని, కొత్త ఆరంభమని పేర్కొన్నారు. అందరికీ
ధన్యవాదాలు చెప్పారు.
చైతూ, సమంతల
నిశ్చితార్థం పట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా
ఆనందం వ్యక్తం చేశారు. జంట చక్కగా ఉందంటూ.. ఇద్దరికీ శుభాకాంక్షలు
చెప్పారు. వీరిద్దరి పెళ్లి త్వరలోనే హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎంగేజ్ మెంట్ వార్తను ఒక్కసారిగా చెప్పి
అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది యాంకర్ లాస్య. అంతే కాకుండా భారీ
సస్పెన్స్ మూవీని తలపించేలా తనకు కాబోయే జీవిత భాగస్వామి వివరాలను
వెల్లడించింది. తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించి పోస్ట్ పెట్టిన కొద్ది
వ్యవధిలోనే కాబోయే భర్తకు సంబంధించి చిన్న క్లూను ఓ ఫోటో ద్వారా ఇచ్చింది
లాస్య.
ఒకరి చేతి పై మరొకరి ముద్దు పేరుతో పచ్చబొట్టు వేసి ఉన్న ఫోటోను లాస్య తన
ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసింది. చిన్ని, మంజూ అని రాసున్న ఆ రెండు చేతుల
పక్కనే రెండు ఎంగేజ్ మెంట్ రింగులు కూడా ఉన్నాయి. దీన్నే లాస్య తన వాల్
పోస్ట్ గా కూడా పెట్టింది. ఈ ఫోటోను ఫేస్ బుక్ పేజీలో పెట్టిన కొద్ది
సేపటికే పెద్ద ఎత్తున లైకులు వచ్చాయి. ఎంగేజ్ మెంట్ ఎవరితో అయింది..ఈ మంజూ
ఎవరు అంటూ.. అభిమానులు భారీగా కామెంట్లు చేశారు.
దీనికి స్పందిచిన లాస్య విషెస్ తెలిపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపింది.
తనకు కాబోయే జీవిత భాగస్వామికి సంబంధించి ఫోటోను సరిగ్గా ఐదు గంటలకు ఫేస్
బుక్ పేజీలో పోస్ట్ చేస్తానని లాస్య పేర్కొంది. తాను చెప్పినట్టుగానే
సరిగ్గా సోమవారం సాయంత్రం ఐదుగంటలకు ఎంగేజ్ మెంట్ ఫోటోలను విడుదల చేసింది.
అయితే ఆదివారం రోజే ఈ ఎంగేజ్ మెంట్ కార్యక్రమం జరిగిందని పేర్కొంది.
మంజూనాథ్ మరాఠీ అబ్బాయని తెలిపింది.
బాలీవుడ్లో
కెరీర్‌ని మొదలు పెట్టినప్పటికీ.. తెలుగులో ‘హార్ట్ఎటాక్’.. ‘సన్నాఫ్
సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆదా శర్మ. ప్రస్తుతం
బాలీవుడ్లో ‘కమాండో2’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి ఒకే తరహా పాత్రల్లో
నటించడమంటే అస్సలు నచ్చదంట.
‘‘ ఒకే విధమైన
పాత్రల్లో నటించడమంటే నచ్చదు. విభిన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా.
అలాంటి పాత్రలు దొరికితే ఎక్కడైనా సంతోషంగా నటిస్తా. దక్షిణాదిలో ఇప్పటివరకు
ఎమోషనల్ పాత్రల్లో మాత్రమే నటించా. అయితే ‘కమాండో2’లో మాత్రం ఇప్పటివరకు
చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రంలో నాపై యాక్షన్ సన్నివేశాలు
కూడా ఉన్నాయి. ఇందులో నేను ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తున్నా. ఇంతకముందు
ఎప్పుడూ గన్ని పట్టుకోలేదు. కానీ ఈ సినిమా కోసం గన్ పట్టుకున్నా. అలాగే
ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించేందుకు.. గన్ సరిగ్గా పట్టుకోవడంపై
ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఇందులో నటించడం చాలా సరదాగా అనిపించింది.’’
అని చెప్పుకొచ్చింది ఆదాశర్మ.
కెరీర్లో ఉన్నత దశలో ఉన్న ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తాచాటాడు. ఇటీవల సొంతగడ్డపై పాకిస్తాన్‌తో జరిగిన
ఐదు వన్డేల సిరీస్‌లో శతకాల మోత మోగించిన వార్నర్ 367 పరుగులతో రాణించి,
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. కెరీర్లో
తొలిసారిగా ఆసీస్ ప్లేయర్ ఫస్ట్ ర్యాంకును సాధించాడు. మరోవైపు టీమిండియా
కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు దిగజారి మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
టాప్ ర్యాంక్‌లో ఉన్న దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అగ్రస్థానం
నుంచి రెండో స్థానానికి మారాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఒక స్థానం మెరుగు పరుచుకుని 13వ ర్యాంకు
సాధించగా, గాయాలతో సతమతమవుతున్న రోహిత్ శర్మ మూడు స్థానాలు దిగజారి 12వ
స్థానానికి పరిమితం అయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జాస్ బట్లర్‌తో సంయుక్తంగా
శిఖర్ ధావన్ 14వ ర్యాంకులో నిలిచాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నెగ్గడంలో
కీలకపాత్ర పోషించిన కేదార్ జాదవ్ 57 స్థానాలు మెరుగు పరుచుకుని 47వ ర్యాంకు
దక్కించుకున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్: టాప్ టెన్‌లో నో ప్లేస్
ఏ భారత బౌలర్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో చోటు
దక్కించుకోలేదు. మూడు స్థానాలు దిగజారిన అక్షర్ పటేల్ 12వ స్థానంలో, లెగ్
స్పిన్నర్ అమిత్ మిశ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. టీమిండియా బౌలింగ్ కాస్త
ఆందోళన కలిగిస్తోంది. ఓవరాల్‌గా టీమిండియా వన్డేల్లో మూడో స్థానాన్ని అలాగే
కొనసాగించింది.