బాలీవుడ్‌లో
కెరీర్‌ని మొదలు పెట్టినప్పటికీ.. తెలుగులో ‘హార్ట్‌ఎటాక్’.. ‘సన్నాఫ్
సత్యమూర్తి’ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది ఆదా శర్మ. ప్రస్తుతం
బాలీవుడ్‌లో ‘కమాండో2’ చిత్రంలో నటిస్తున్న ఈ అమ్మడికి ఒకే తరహా పాత్రల్లో
నటించడమంటే అస్సలు నచ్చదంట.
‘‘ ఒకే విధమైన పాత్రల్లో నటించడమంటే నచ్చదు. విభిన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నా. అలాంటి పాత్రలు దొరికితే ఎక్కడైనా సంతోషంగా నటిస్తా. దక్షిణాదిలో ఇప్పటివరకు ఎమోషనల్ పాత్రల్లో మాత్రమే నటించా. అయితే ‘కమాండో2’లో మాత్రం ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో నటిస్తున్నా. ఈ చిత్రంలో నాపై యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇందులో నేను ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపిస్తున్నా. ఇంతకముందు ఎప్పుడూ గన్‌ని పట్టుకోలేదు. కానీ ఈ సినిమా కోసం గన్ పట్టుకున్నా. అలాగే ఎన్‌కౌంటర్ స్పెషలిస్టుగా కనిపించేందుకు.. గన్ సరిగ్గా పట్టుకోవడంపై ప్రత్యేక శ్రద్ధపెట్టా. ఇందులో నటించడం చాలా సరదాగా అనిపించింది.’’ అని చెప్పుకొచ్చింది ఆదాశర్మ.

No comments:
Post a Comment