టీమ్‌ఇండియా
పేసర్ ఇషాంత్‌శర్మ బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమసింగ్‌ను డిసెంబర్
9న పెళ్లి చేసుకోబోతున్నాడు. జూన్ 19న ఈ జోడీకి నిశ్చితార్థం జరిగింది. వారణాసికి
చెందిన ప్రతిమ.. పలు అంతర్జాతీయ టోర్నీలతో పాటు ఆసియాకప్‌లోనూ భారత
బాస్కెట్‌బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. ‘సింగ్ సిస్టర్స్’గా పేరు
సంపాదించిన ఐదుగురు అక్కాచెల్లెళ్లలో ప్రతిమ చిన్నది. ఆమె అక్కలందరూ
జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణులే.
Friday, November 4, 2016
Thursday, November 3, 2016
ఇటలీలో పెళ్లి.. అతిథులెందరంటే..
Wednesday, November 2, 2016
విడిపోవడంపై ఇప్పుడేం చెప్పను
గౌతమితో
విడిపోవడం విషయంపై ఇప్పట్లో తానేం చెప్పబోనని నటుడు కమల్ హాసన్
ప్రకటించారు. గౌతమి ప్రకటనపై కమల్ స్పందించి ప్రకటన విడుదల చేశారని
వార్తలు వచ్చాయి. అయితే తాను ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదని కమల్‌హాసన్
తన ట్విట్టర్ ఖాతా ద్వారా తాజాగా స్పష్టం చేశారు. ‘ఇలాంటి సమయంలో.. కొందరు
నా పేరుతో నకిలీ ప్రకటనను ప్రచారం చేస్తున్నారు. అది అనాగరిక చర్య,
అసంబద్ధమైనది. ఇప్పట్లో నేను ఏ ప్రకటనను జారీ చేయడం లేదు’ అని కమల్‌హాసన్
తమిళంలో ట్వీట్ చేశారు.
విడిపోవడానికి కారణం అదేనా?
కమల్‌హాసన్, నటి గౌతమి తమ 13 ఏళ్లసహజీవన బంధానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. కమల్‌హాసన్‌తో విడిపోతున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా చెప్పిన గౌతమి అందుకు కారణం చెప్పలేదు. అయితే ఇటీవల ‘శభాష్‌నాయుడు’ చిత్రం షూటింగ్ సమయంలో కమల్‌హాసన్ కుమార్తె శ్రుతిహాసన్, గౌతమిల మధ్య విబేధాలు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా శ్రుతిహాసన్ వస్త్రధారణ తదితర విషయాల్లో గౌతమి కల్పించుకోవడం ఆమెకు నచ్చలేదని, ఈ విషయంలో కమల్ తన కుమార్తె వైపు నిలిచారని సమాచారం. కమల్, గౌతమి విడిపోవడానికి ఇదో కారణం అని కొన్ని పత్రికలు రాశాయి. అయితే అలాంటిదేం లేదని శ్రుతి అధికార ప్రతినిధి తాజాగా ప్రకటించారు. ఆమె ఇతరుల వ్యక్తిగతవిషయాల్లో జోక్యం చేసుకోరని స్పష్టంచేశారు.
అయితే మరో కారణం కూడా వీరిద్దరు వేరుకావడానికి దారితీసిందని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కమల్‌హాసన్ కాలికి కొన్నాళ్ల క్రితం ప్రమాదవశాత్తు గాయమైంది. ఈ విషయాన్ని కమల్‌హాసన్ కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరా హాసన్‌లకు గౌతమి వెంటనే తెలియజేయలేదట. దీంతో ఇద్దరు కుమార్తెలకు, గౌతమికి మధ్య మాటామాటా పెరిగిందని, ఆ సంఘటనే గౌతమి నిర్ణయానికి కారణమని వార్తలు వస్తున్నాయి.

Tuesday, November 1, 2016
నేనంటే యువరాజ్ తల్లికి హడల్
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ కుటుంబం గురించి అతని సోదరుడు జొరావర్ భార్య ఆకాంక్ష శర్మ రోజుకో బాంబు పేలుస్తోంది. యువీ కుటుంబంపై వరుసగా తీవ్ర ఆరోపణలు చేస్తోంది. యువీ తల్లి షబ్నం సింగ్ కు తానంటే భయమని, వాళ్ల కుటుంబం గురించి తాను ఏమి చెబుతానోనని హడలిపోతోందని ఆకాంక్ష చెప్పింది. అయితే తాను జొరావర్ నుంచి విడాకులు మాత్రమే కోరుకుంటున్నానని వెల్లడించింది.
జొరావర్, ఆకాంక్ష రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. కాగా మనస్ఫర్థల కారణంగా పెళ్లయిన నాలుగు నెలలకే విడిపోయారు. రియల్టీ టీవీ షో బిగ్ బాస్ లో పాల్గొన్న ఆకాంక్ష సంచలన విషయాలు వెల్లడించింది. జొరావర్ కు, తనకు విభేదాల్లేవని, షబ్నం కారణంగానే తాము విడిపోయామని ఇటీవల ఆకాంక్ష ఆరోపించింది. ఇదే షోలో ఆమె మాట్లాడుతూ యువరాజ్ సింగ్ గంజాయి తాగేవాడంటూ మరో బాంబు పేల్చింది. 'నేను చేస్తున్న ఆరోపణలు నిజంకాబట్టే షబ్నం భయపడుతోంది. నేను అబద్ధాలు చెప్పినట్టయితే ఆమె అంత తీవ్రంగా స్పందించేది కాదు. షబ్నం కుటుంబం నుంచి నేనేమీ కోరుకోవడం లేదు. కేవలం విడాకులు ఇవ్వాలని చెబుతున్నా. నా జీవితం నేను గడపాలని భావిస్తున్నా' అని ఆకాంక్ష చెప్పింది.
కాగా ఆకాంక్ష ఆరోపణల్ని యువీ కుటుంబం ఖండించింది. ఆకాంక్ష తప్పుడు ఆరోపణలు చేస్తోందని, తమ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని షబ్నం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆకాక్ష ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పింది.
Monday, October 31, 2016
అనుష్కకు కల్యాణ ఘడియలు?
మూడు పదుల వయసు పైబడిన నటీమణులకు ఇంటా బయట పెళ్లి ఒత్తిడి పెరగడం
సర్వసాధారణం. 34 ఏళ్ల నటి అనుష్కకు అలాంటి తాకిడి ఉంటుందనడం అనూహ్యమేమీ
కాదు. ఉన్నత విద్యను పూర్తి చేసిన అనుష్క ఆదిలో యోగా శిక్షణ పొంది, తర్వాత
యోగా టీచర్‌గా పలువురికి శిక్షణ ఇచ్చారు. అలాంటి బ్యూటీని విధి నటిని
చేసింది. అనుష్క 2005లో వెండితెరకు పరిచయం అయ్యారు.
అలా తొలి రోజుల్లో అందాలారబోస్తూ అవకాశాలు పెంచుకుంటూ వచ్చిన అనుష్కకు అరుంధతి చిత్రం ఆమె నట దిశను ఒక్కసారిగా మార్చేసింది. స్టార్ నాయకిగా తమిళం, తెలుగు భాషల్లో అగ్రనాయకిగా రాణిస్తున్నారు. ఈ రెండు భాషల్లో అగ్రనాయకులందరితోనూ డ్యూయెట్లు పాడేసి ఆ సరదాను తీర్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఎస్-3 చిత్రంలో సూర్యతోనూ, ద్విభాషా చిత్రం బాహుబలి-2, హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం భాగమతి, భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో నటిస్తున్నారు.
వీటిలో ఎస్-3 చిత్రం డిసెంబర్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి-2 వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇలా ఉండగా అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం జోరందుకుంది. కారణం ఈ అమ్మడి కి కల్యాణ ఘడియలు దూసుకొస్తున్నాయని సమాచారం. నటిగా ప్రశంసలు అందుకుంటున్న అనుష్క వ్యక్తిగతంగా పలు వదంతులను ఎదుర్కొంటున్నారన్నది గమనార్హం.
నటుడు ఆర్యతో ప్రేమకలాపాలంటూ అప్పట్లో గాసిప్స్ హల్‌చల్ చేశాయి. ఇక ఒక తెలుగు నటుడితో డేటింగ్ అంటూ ప్రచారం హోరెత్తింది. ఇటీవల వివాహితుడైన నిర్మాతను పెళ్లాడబోతున్నట్టు ప్రచారం కలకలం పుట్టించింది. కాగా వీటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెట్టే విధంగా అనుష్క కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూడడంలో వేగం పెంచినట్లు తాజా సమాచారం. అదే విధంగా హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్తతో అనుష్క పెళ్లిని నిశ్చయించినట్లు సినీ వర్గాల టాక్. బాహుబలి-2 విడుదల తరువాత అనుష్కకు డుండుండుం...పీపీపీనేననే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Saturday, October 29, 2016
రివ్యూ: ధర్మయోగి
కథేంటంటే?: ధర్మ, యోగి (ధనుష్) కవల పిల్లలు. ధర్మకి బుద్ధిబలం ఎక్కువ. యోగి మొండివాడు. చిన్నప్పట్నుంచే తండ్రితో తిరుగుతూ రాజకీయాలపై మమకారం పెంచుకొంటాడు యోగి. ధర్మ మాత్రం బాగా చదువుకొని కళాశాలలో అధ్యాపకుడు అవుతాడు. బాపట్ల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు రావడంతో వూహించని రీతిలో ప్రజాస్వామ్య పార్టీ తరపున యోగికి ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుంది. అధికారంలో ఉన్న ప్రగతిశీల పార్టీ తరపున యోగి ప్రియురాలు అయిన అగ్నిపూల రుద్ర (త్రిష)కి టికెట్టు వస్తుంది. ప్రేయసి, ప్రియుడు ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇంతలో యోగి హత్యకి గురవుతాడు. ఆ హత్య చేసిందెవరు? యోగి హత్య తర్వాత రుద్ర ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఏం చేసింది? యోగి హత్యకి కారకులైన వాళ్లకి ఎవరు శిక్ష విధించారు? తదితర విషయాల్ని తెరపైనే చూడాలి.
ఎలా ఉందంటే?: ధనుష్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రమిది. ఒక పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఇదే కథలో ఫ్యామిలీ డ్రామా కూడా మిళితమైంది. అధికారం కోసం రాజకీయ నాయకులు వేసే ఎత్తులు, పైఎత్తులు ఇదివరకు చాలా సినిమాల్లోనే చూశాం. ఇది కూడా ఆ బాపతు కథే. కాకపోతే ఓ యువజంట నేపథ్యంలో ఆ కథని తీర్చిదిద్దడమే ఇందులో కొత్తదనం. బలహీనుడైన ఓ తమ్ముడు అన్న చనిపోయాక మొండివాడిగా ఎలా మారాడు? అన్న ఆశయాన్ని ఎలా నెర వేర్చాడనే అంశం కూడా ఇందులో కొత్తగా అనిపిస్తుంది. తొలి సగభాగం కథంతా కూడా ధర్మ, అతడిని ఇష్టపడే అమ్మాయి మాలతి (అనుపమ)ల పరిచయం, ప్రేమ.... అలాగే యోగి, ఆయన ప్రియురాలైన అగ్నిపూల రుద్రల ప్రేమాయణం, రాజకీయ ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాల చుట్టూనే సాగుతుంది. మధ్యమధ్యలో పార్టీ ఆఫీసులు, రాజకీయ పరిణామాలతో సన్నివేశాలన్నీ సున్నితంగానే సాగిపోతాయి. విరామానికి ముందు నుంచే కథలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొంటాయి. అప్పటికప్పుడు యోగిని ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ప్రకటించడం, అదే సమయంలో అవతలి పార్టీ నుంచి కూడా అగ్నిపూల రుద్ర కూడా బరిలోకి దిగుతుండటంతో కథ రక్తి కడుతుంది. ప్రేమలో ఉన్న ఓ జంట పోటీ పడుతుండటంతో తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనే ఆసక్తి ఏర్పడుతుంది. దానికి తగ్గట్టుగానే దర్శకుడు ద్వితీయార్ధంలో బోలెడంత డ్రామా ఉండేలా చూసుకొన్నాడు.
అయితే ఆ డ్రామా కొన్నిసార్లు ప్రేక్షకులని గందరగోళంలోకి నెట్టేసే స్థాయికి వెళ్లింది. ఒక పార్టీలోనే రెండు మూడు వర్గాలు ఉండటం, అసలు ఎవరు ఏ పార్టీకి చెందినవారో, ఎవరు ఎవరెవర్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంటారో అర్థం కాదు. కానీ ఈ రకమైన కథని ఓ ప్రేమజంట నేపథ్యంలో తెరకెక్కించడం మాత్రం ప్రేక్షకులకి కొత్తదనాన్ని పంచుతుంది. ముఖ్యంగా రుద్ర వేసే ఎత్తులు, ఆమె ఎంపీగా ఎన్నికయ్యే విధానం మంచి డ్రామాని పండిస్తాయి. పతాక సన్నివేశాల్లో మాత్రం కొత్తదనం లోపించింది.
చివరిగా: రక్తికట్టించే రాజకీయం నేపథ్యంలో... ‘ధర్మయోగి’
Friday, October 28, 2016
హిందీ-2,తెలుగు-1
హింది రెండు తెలుగు ఒకటి అంటె ఏదో అనుకున్నారు. అచర్య పోవలసిన్న అవసరం
లేదు. ఎందుకంటే ఈ రోజు హింది సినిమాలు రెండు సినిమాలు రిలిజ్ అయ్యాయి.
తెలుగులో ఇక సినిమా విడుదల అయ్యింది.
( హింది )
రివ్యూ: యే దిల్ హై ముష్కిల్
కథేంటి?: అయాన్(రణ్‌బీర్ కపూర్) బాగా డబ్బున్న కుటుంబానికి చెందిన యువకుడు. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేడు. ఇతరులు చెప్పినట్లుగానే ఫాలో అవుతుంటాడు. అలిజె(అనుష్క శర్మ) అతనితో స్నేహంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి పిక్నిక్‌లకు, పబ్‌లకూ వెళ్తారు. ఆ సాన్నిహిత్యాన్నే ప్రేమగా ఫీలవుతాడు అయాన్. కానీ.. అలిజె అప్పటికే మరో వ్యక్తితో లవ్‌లో ఉంటుంది. అతనే అలీ(ఫవాద్ ఖాన్). వాళ్ల ప్రేమ పెళ్లి దాకా వెళ్తుంది. దీంతో అయాన్ తీవ్ర వేదనకు గురవుతాడు. ఆ సమయంలోనే అందాల రాశి సబా(ఐశ్వర్య రాయ్)తో ఇన్నింగ్స్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏమైంది? సబాతో అయాన్ పరిచయం ఎంతవరకు వెళ్లింది? అనుష్కతో స్నేహానికి పూర్తిగా కటీఫ్ చెప్పేశాడా? వంటి విషయాలను తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: ప్రేమే ప్రపంచం అనుకునే అయాన్(రణ్‌బీర్ కపూర్).. అన్ని విషయాల్లోనూ తెలివిగా వ్యవహరించే అలిజె(అనుష్క) మధ్య స్నేహం అందరినీ ఆకట్టుకుంది. అతని వ్యక్తిత్వాన్ని మార్చడంలోనూ ఆమె పాత్ర ఉంటుంది. అనుష్క ప్రేమికుడు అలి(ఫవాద్ ఖాన్) అని తెలుస్తుంది. కానీ.. వారి ప్రేమ కథ గురించి మాత్రం తెరపై చూపించలేదు. ఇక ఐశ్వర్యరాయ్ అందాలకు కొదవలేదు. సెకండాఫ్ ఆరంభంలోనే హాట్ లుక్స్‌తో.. దొండపండు లాంటి పెదాలతో కుర్రకారు మతిపోగొట్టడం ఖాయం. ట్రైలర్లు చూసి రణ్‌బీర్ కపూర్‌తో ఐష్ హాట్ సన్నివేశాలు భారీగానే ఉన్నట్లు భావించారు. కానీ సెన్సార్ కత్తిరింపులో ఏమో.. సినిమాలో ఒకటి, రెండుకు మించి హాట్ సన్నివేశాలేమీ కనిపించవు. ఇది ఐష్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించే విషయమని చెప్పాలి. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాగుంది. సంగీతం విషయంలోనూ మంచి మార్కులే పడతాయి.
ఎవరెలా..?: సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా రణ్‌బీర్ కపూర్ నటన అద్భుతంగా ఉంది. ఈ సినిమాలోని నటీనటుల్లో ఎక్కువ మార్కులు రణ్‌బీర్‌కే పడతాయి. అందాల రాశి ఐశ్వర్యరాయ్‌లో గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదు. కొన్ని సన్నివేశాల్లో అనుష్క శర్మలో గ్లామర్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఐశ్వర్య కంటే అనుష్కనే తెరపై ఎక్కువసేపు కనిపిస్తుంది. ఫవాద్‌ఖాన్ తన పరిధి మేరకు నటించాడు. షారుక్‌ఖాన్.. ఆలియా భట్‌లు గెస్ట్ రోల్‌లో అలా వచ్చి ఇలా వెళ్లిపోతారు. కొన్ని సన్నివేశాలను సాగదీసినట్లు అనిపిస్తుంది.
చివరిగా.. విడుదలకు ముందు ‘ముష్కిల్ హై’.. తెరపై ప్రేమికులకు ‘దిల్ కుష్ హై’
రివ్యూ: శివాయ్
కథేంటి?: శివాయ్(అజయ్ దేవగణ్) భోళా మనిషి. ఎంత శక్తివంతుడైనా ఎవ్వరి జోలికి వెళ్లేరకం కాదు. సాహసాలతోనే తన సావాసం. పర్వాతారోహణను ఇష్టపడే శివాయ్ హిమాలయ పర్వతాలను అధిరోహించే పనిలో ఉంటాడు. ఓసారి బల్గేరియా నుంచి వచ్చిన యువతి ఓల్గా(ఎరికా కార్) పర్వతారోహణ సమయంలో ప్రమాదంలో పడితే రక్షిస్తాడు. ఈ క్రమంలో ఒకరినొకరు ఇష్టపడతారు. శారీరకంగానూ దగ్గరవుతారు. దీంతో ఓల్గా గర్భం దాల్చుతుంది. కానీ ఇదంతా ఇష్టం లేని ఓల్గా ఓ పాపకు జన్మనిచ్చి బల్గేరియా వెళ్లిపోతుంది. అప్పట్నుంచి కూతురే ప్రాణంగా జీవిస్తుంటాడు శివాయ్.
అలా తొమ్మిదేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు కూతురు(అబిగేల్ ఏమ్స్) కోరిక మీద ఓల్గాను వెతికేందుకు ఇద్దరు కలిసి బల్గేరియా వెళ్తారు. అక్కడ కొంతమంది ఆ పాపను కిడ్నాప్ చేస్తారు. ఇంతకీ పాపను కిడ్నాప్ చేసింది ఎవరు? ఆ దుర్మార్గుల నుంచి శివాయ్ కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు? ఈ తండ్రీకూతుళ్లు ఓల్గాను కలిశారా? ఇంతకీ శివాయ్‌కి.. సాయేషా సైగల్‌కి ఉన్న సంబంధమేంటి? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..: కథపై నమ్మకంతో అజయ్ దేవగణ్ ఈ చిత్రానికి నిర్మాతగానూ మారారు. అందుకే సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా నిడివి ఎక్కువైనప్పటికీ ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్‌ప్లేతో కట్టిపడేశారు. కాకపోతే స్క్రిప్టుకి ఇంకాస్త పదును పెట్టాల్సింది. ఛాయాగ్రహణం సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. మంచు పర్వతాల నేపథ్యంలో జరిగే పోరాట ఘట్టాలు.. బల్గేరియా.. పోలాండ్.. ఉత్తరాఖండ్‌ల్లోని ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించారు. గ్రాఫిక్స్ కూడా బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. మోతాదు కొంచెం ఎక్కువైంది.
కథపరంగా సినిమా మొత్తం అజయ్ దేవగణ్ చుట్టూనే తిరుగుతుంది. ఇందులో అజయ్ సరికొత్త లుక్‌లో ఆకట్టుకున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో తనదైన శైలిలో అలరించారు. పోలాండ్‌కి చెందిన నటి ఎరికా కార్ కూడా పర్లేదు గానీ.. ఆమె సంభాషణలు చెప్పే విధానం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. సాయేషా సైగల్ పాత్ర చాలా చిన్నది. అయినప్పటికీ పరిధి మేరకు ఆకట్టుకుంది. అజయ్‌దేవగణ్ కూతురుగా నటించిన అబిగేల్ ఏమ్స్ తన పాత్రకు న్యాయం చేసింది. గిరీష్ కర్నాద్.. వీర్ దాస్‌ల పాత్రలకు పెద్దగా ప్రాధాన్యమేమీ లేదు.
చివరగా.. యాక్షన్ అభిమానులకు నచ్చే ‘శివాయ్’.
తెలుగు
రివ్యూ: కాష్మోరా!
కథేంటంటే?: ప్రేతాత్మల నుంచి విముక్తి కల్పిస్తానంటూ మేజిక్కులు చేస్తూ బతికేస్తుంటాడు క్యాష్ అలియాస్ కాష్మోరా(కార్తీ). తనకి శక్తులేవీ లేకపోయినా ఉన్నట్టు అందరినీ నమ్మిస్తుంటాడు. అతడికి సొంత కుటుంబం కూడా తోడుంటుంది. ఆత్మల పేరుతో చేతివాటం ప్రదర్శించే కాష్మోరా ఒకసారి టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ తమ కుటుంబ సభ్యులంతా రోహిణి నక్షత్రంలో పుట్టామని, అందుకే తమకి ఈ శక్తులు అబ్బాయని చెబుతాడు. అదే విషయాన్ని పత్రికల్లోనూ ప్రకటనలు ఇస్తూ ప్రచారం చేసుకొంటుంటాడు. నిజంగానే ప్రేతాత్మ అయిన రాజ్‌నాయక్ (కార్తీ)కి ఆ ప్రకటన గురించి ఎలా తెలుస్తుంది? రాజ్‌నాయక్ ప్రేతాత్మలా మారిపోవడానికి కారణమేమిటి? 700 యేళ్ల క్రితంనాటి అతని చరిత్ర ఎలాంటిది? రోహిణి నక్షత్రంలో పుట్టిన కాష్మోరా కుటుంబాన్ని రాజ్‌నాయక్ ఆత్మ తన దగ్గరికి రప్పించుకొని ఏం చేసింది? ఈ కథతో యామిని (శ్రీదివ్య) అనే పరిశోధక విద్యార్థినికీ, రత్నమహాదేవి (నయనతార)కీ మధ్య సంబంధమేమిటి? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే?: ఇదొక ఫాంటసీ కథ. 700 ఏళ్ల క్రితం నాటి కథకీ, అప్పటి ఓ శాపానికీ, ప్రస్తుతం భూత వైద్యుడిగా చెప్పుకొంటూ కాలం వెళ్లదీసే ఓ కుటుంబానికీ మధ్య ముడిపెట్టి కథని అల్లారు. తొలి సగభాగం కథంతా ఆత్మల్ని పైకి పంపిస్తానంటూ కాష్మోరా పాత్రలో కార్తీ, ఆయన తండ్రి పాత్రలో వివేక్ చేసే మేజిక్కులతోనే సాగిపోతుంది. ఆ సన్నివేశాలన్నీ కడుపుబ్బా నవ్వించేలా తీర్చిదిద్దారు. భూతం ఉందంటూ నమ్మించేందుకు రిమోట్ కంట్రోల్‌తో కూడిన పరికరాలతో కాష్మోరా కుటుంబమంతా చేసే విన్యాసాలు కూడా ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతాయి. కాష్మోరా కుటుంబమంతా రాజ్‌నాయక్ బంగ్లాకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. రాజ్‌నాయక్ ఎందుకు ప్రేతాత్మగా మారాడో, అతనికి పునరుజ్జీవం రావడానికి తమ కుటుంబం ఎలా కీలకమో కాష్మోరాకి తెలిసే క్రమం ఆసక్తిని రేకెత్తిస్తుంది. 700 ఏళ్ల క్రితం నాటి రాజ్యాన్ని, అప్పటి యుద్ధాన్ని, రాజ్‌నాయక్ పరాక్రమాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా అప్పటి రాజ్యాన్ని విజువల్ ఎఫెక్ట్స్‌తో కళ్లకు కట్టిన తీరు చాలా బాగుంది. ‘బాహుబలి’ స్థాయి ఎఫెక్ట్స్ ఆ సన్నివేశాల్లో కనిపిస్తాయి. ఒక ఆత్మ కథని... ఫాంటసీతో ముడిపెట్టి తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. దర్శకుడు కథని అల్లుకొన్నవిధానం, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానం కూడా మెచ్చుకోదగ్గ స్థాయిలో ఉంది. అయితే తొలి సగభాగంలోని కామెడీలో కొంచెం కూడా మలి సగభాగంలో లేకపోవడమే ప్రేక్షకులకి కాస్త లోటు అనిపిస్తుంది. కథంతా కూడా మలి సగభాగంలో చెప్పాల్సి రావడమే అందుకు కారణం. అక్కడక్కడా సన్నివేశాల్లో స్పష్టత లోపించినట్టు అనిపించినా ఆసక్తి మాత్రం చివరి వరకు కొనసాగుతుంది.
ఎవరెలా చేశారంటే?: కార్తీ నటనే సినిమాకి ప్రధాన బలం. ఆయన మూడు కోణాల్లో కనిపిస్తూ ప్రతీ సన్నివేశంలోనూ సందడి చేస్తుంటారు. కానీ కథానాయికలకి అసలేమాత్రం ప్రాధాన్యం లేదు. రెండో సగభాగంలోనే నయనతార తెరపైకొచ్చినా ఉన్నంతలో ఆమే ఎక్కువసేపు కనిపిస్తుంది. శ్రీదివ్యకి చెప్పుకోదగ్గ ప్రాధాన్యం లేదు. కార్తీ తండ్రిగా కనిపిస్తూ వివేక్ చాలా సన్నివేశాల్లో నవ్వించారు. ఇక మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవాల్సినంత ఏమీ లేదు. రాజ్‌నాయక్ పాత్రలో కార్తీ చేసే సందడి చాలా బాగుంది. కాష్మోరా పాత్రలో మంచి టైమింగ్‌ని ప్రదర్శించి నవ్వించారు. సాంకేతికంగా సినిమాకి మంచి మార్కులే పడతాయి. ఓం ప్రకాష్ ఛాయాగ్రహణం, సంతోష్ నారాయణ్ సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగా కుదిరాయి. దర్శకుడు గోకుల్‌కి ఇది మూడో సినిమానే అయినా ఎంతో పరిణతిని కనబరుస్తూ తెరకెక్కించారు. నిర్మాణ విలువలు అడుగడుగునా కనిపిస్తాయి.

Thursday, October 27, 2016
క్లాసీ లుక్.. కార్ చేజ్!
హీరో గోపీచంద్ తన స్టైల్ చేంజ్ చేశారు. ఆల్రెడీ ‘లౌక్యం’, ‘జిల్’
సినిమాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో
నటిస్తున్న యాక్షన్ సినిమాలో క్లాసీ లుక్‌లో గోపీచంద్ సరికొత్తగా
కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై
జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్
పూర్తయింది. నెల రోజుల పాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను
తెరకెక్కించారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్, ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ప్రీ-క్లైమాక్స్ సీన్ అద్భుతంగా వచ్చాయి. గోపీచంద్, హీరోయిన్ క్యాథరిన్ సహా సుమారు 70మంది నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్‌గా తీస్తున్నారు’’ అన్నారు. ముఖేశ్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.థమన్.

Subscribe to:
Posts (Atom)