Thursday, October 27, 2016

క్లాసీ లుక్.. కార్ చేజ్!

 హీరో గోపీచంద్ తన స్టైల్ చేంజ్ చేశారు. ఆల్రెడీ ‘లౌక్యం’, ‘జిల్’ సినిమాల్లో చాలా స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న యాక్షన్ సినిమాలో క్లాసీ లుక్‌లో గోపీచంద్ సరికొత్తగా కనిపిస్తారని చిత్ర బృందం చెబుతోంది. శ్రీ బాలజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. నెల రోజుల పాటు బ్యాంకాక్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు.
నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్, ఎయిర్‌పోర్ట్‌లో తీసిన ప్రీ-క్లైమాక్స్ సీన్ అద్భుతంగా వచ్చాయి. గోపీచంద్, హీరోయిన్ క్యాథరిన్ సహా సుమారు 70మంది నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్‌గా తీస్తున్నారు’’ అన్నారు. ముఖేశ్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్, ‘వెన్నెల’ కిశోర్ నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: రామ్-లక్ష్మణ్, సంగీతం: ఎస్.ఎస్.థమన్.

మెగాస్టార్ సినిమా కాదని.. తమిళ్ లో చేస్తున్నాడు

 బాలీవుడ్ యాక్టర్స్ కు  హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్, షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్ లో అలరించారు. తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం విలన్ గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు.
దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్ గా వివేక్ ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్ గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్ గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్ బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్ గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్ ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

Wednesday, October 26, 2016

గాల్లో ఫీట్లు... ఖరీదు కోట్లు..!

 ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థ 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఇది భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ. యాక్షన్ సీక్వెన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట. విశేషం ఏంటంటే... 150 కోట్లలో 30 కోట్లను గాల్లో తీయబోయే ఫైట్‌కి ఖర్చు పెట్టనున్నారట.

  హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్లతో దుబాయ్‌లో ఈ స్కై ఫైట్‌ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ రిస్కీ ఫైట్స్ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘రన్ రాజా రన్’తో దర్శకుడిగా పరిచయమైన సుజీత్, ఆ సినిమా తర్వాత రెండేళ్ల నుంచి ఈ సినిమా స్క్రిప్ట్‌పైనే వర్క్ చేస్తున్నారు.

త్వరలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దృష్టి సారించనున్నారు. ‘బాహుబలి: ద కంక్లూజన్’ షూటింగ్ డిసెంబర్‌కి పూర్తి కానుంది. ఆ తర్వాత సుజీత్ సినిమా ప్రారంభమవుతుందని చిత్రబృందం చెబుతోంది.

మహేష్ మూవీకి భారీ ఆఫర్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్వకత్వంలో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అదే స్థాయిలో భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే బిజినెస్ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్ లు క్రియేట్ చేస్తుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు  ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు సినిమా ఆడియో రిలీజ్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కలిపి ఓ టీవీ ఛానల్ భారీ మొత్తానికి సొంతం చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. అది కూడా బాహుబలి రెండో భాగంగా కన్నా మహేష్ సినిమాకు ఎక్కువ మొత్తం ఆఫర్ చేసి రైట్స్ సొంతం చేసుకున్నారట.

ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఉన్న మహేష్, మురుగదాస్ ల సినిమా ఆడియో, శాటిలైట్ రైట్స్ కోసం ఓ టీవీ ఛానల్ 26 కోట్లు ఆఫర్ చేసిందట. మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ పై ఉన్న అంచనాలతో పాటు ఈ సినిమా 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జరుగుతోంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ వార్తలతో పండుగ చేసుకుంటున్నారు.

Tuesday, October 25, 2016

గెడ్డం గీయించుకున్న హీరోయిన్

  హీరోయిన్లు తమ అందాన్ని కాపాడుకోవడంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు. ఏ చిన్న లోపం కూడా కనిపించకుండా తెరమీద వీలైనంత అందంగా కనిపించాలని చూస్తారు. అందుకోసం మేకప్ నుంచి మేకోవర్ వరకు అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తుంటారు. హీరోయిన్లలో ఎవరికి వాళ్లకు వ్యక్తిగత మేకప్ మెన్ ఉంటారు. వాళ్లతో తమకు కావల్సినట్లుగా మేకప్ చేయించుకుంటూ ఉంటారు. బుజ్జిగాడులో సెకండ్ హీరోయిన్‌గా చేసి, నిన్న మొన్నటి సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్‌కు భార్యగా నటించిన సంజనా గల్రానీ కూడా ఇలాగే మేకప్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుంది. అయితే.. అందరిలా కేవలం మేకప్‌తోనే సరిపెట్టకుండా ఆమె గెడ్డం కూడా గీయించుకుంది!! అదేంటి, హీరోయిన్లు గెడ్డం గీయించుకోవడం ఏంటని మీకు అనుమానంగా వచ్చిందా? 
 
పురుషులకే కాదు, మహిళలలో కూడా కొంతమందికి ముఖం మీద అవాంఛిత రోమాలు వస్తుంటాయి. మామూలు వాళ్లు వాటిని పెద్దగా పట్టించుకోరు గానీ, సినిమా హీరోయిన్లు మాత్రం స్క్రీన్ మీద మెరిసిపోవాలనుకుంటారు కాబట్టి వాటిని పూర్తిగా తీయించేసుకుంటారు. కొంచెం పెరిగినా సరే.. వెండితెరమీద బాగోదన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు నీట్‌గా షేవ్ చేయించుకుంటారు. అలాగే సంజన కూడా తన వ్యక్తిగత మేకప్ మన్‌తో గెడ్డం గీయించుకుంది. ఎక్కడా చిన్న గాటు కూడా పడకుండా.. అలాగే రోమాలు ఏవీ మిగలకుండా జాగ్రత్తగా గీయాలంటూ అతడికి సూచనలు కూడా ఇచ్చింది. అంతా అయిపోయిన తర్వాత మరోసారి జాగ్రత్తగా చూసుకుని అప్పుడు సంతృప్తి పడింది. అయితే.. షేవింగ్ క్రీమ్ ఏదీ పూసుకోకుండానే ఆమె ఈ షేవింగ్ చేయించుకోవడం విశేషం.

Monday, October 24, 2016

అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదు!

సౌతిండియాలో ఏడాదికి నాలుగైదు లేదా కనీసం రెండు సినిమాల చొప్పున రాకెట్ స్పీడుతో ఇలియానా నటించారు. ముంబై వెళ్లిన తర్వాత ఈ గోవా బ్యూటీలో అంత స్పీడు కనిపించడం లేదు. అక్కడ జోరు తగ్గడానికి కారణం... హిందీ సినిమాల్లో అవకాశాలు రాక కాదట, వచ్చిన వాటిలో మంచివి ఎంపిక చేసుకోవడమే అంటున్నారు. అంతే కాదండోయ్.. అవకాశాల కోసం ఎవ్వర్నీ అడుక్కోవలసిన ఖర్మ నాకు లేదని ఇలియానా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘‘ఇక్కడ (బాలీవుడ్‌లో) చాన్సులు, మీ సెలక్షనే కీ రోల్ పోషిస్తాయి. మీకో మంచి అవకాశం వచ్చిందనుకోండి.. నటించాలా? వద్దా? అనేది మీ చేతుల్లో ఉంటుంది.                   మీ సెలక్షన్ మంచిదయితే మీరు ఇండస్ట్రీలో ఉంటారు. చెత్తగా ఉంటే.. కెరీర్ క్లోజ్ అవుతుంది’’ అని ఇలియానా స్పష్టం చేశారు. బాలీవుడ్‌లో వచ్చిన అవకాశాలు, అందులో ఆమె సెలక్షన్ పట్ల హ్యాపీగా ఉన్నారట. ‘‘నా వరకూ నేను మంచి సినిమాలే సెలక్ట్ చేసుకున్నా. నా హార్డ్ వర్క్ వల్లే ఈ స్థాయికి చేరుకున్నానని గర్వంగా చెప్పగలను. ఇప్పటివరకూ ఎవర్నీ ఫేవర్ చేయమని అడగలేదు. అవకాశాల కోసం ఎవర్నీ అడుక్కోను. నా డిగ్నిటీ నాకుంది’’ అన్నారామె. ప్రస్తుతం రెండు హిందీ సినిమాల్లో ఇలియానా నటిస్తున్నారు.

నాన్నకు ప్రేమతో...

మన కలలను నెరవేర్చుకోవడంలో ఆనందం ఉంటుంది. అయితే తల్లిదండ్రుల కలలను సాకారం చేయడంలో కలిగే సంతృప్తే వేరు. అందానికి ప్రతిరూపం లాంటి నటి త్రిష ఇప్పుడు రెండో రకం సంతోషాన్ని అనుభవించ డానికి దగ్గరగా ఉన్నారు. తొలి నుంచి కమర్శియల్ చిత్రాల్లో నటిస్తూ గ్లామర్‌తో నాయకిగా నెట్టుకొచ్చిన త్రిష ఇటీవల తన బాణిని మార్చారన్నది ఆమె చిత్రాల ఎంపిక చూస్తేనే అర్థం అవుతుంది. నాయకి చిత్రంతో హీరోయిన్ సెంటరిక్ పాత్రకు మారారు. ఆ చిత్రం నిరాశ పరచినా అదే బాణీలో మోహిని చిత్రంలో నటిస్తున్నారు.నాయకి చిత్రం అందించలేని ఆనందాన్ని మోహిని ఇస్తుందనే ఆశతో ఉన్నారు.
మోహిని చిత్ర ఫస్ట్‌లుక్‌కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ధనుష్ జంటగా కొడి చిత్రంలో ప్రతినాయకి చాయలున్న పాత్ర దుమ్మురేపేలా నటించారనే టాక్ వినిపిస్తోంది. ఆ చిత్రం దీపావళి సందర్భంగా ఈ నెల 28న తెరపైకి రానుంది. ఈ చిత్ర విజయం నటి త్రిషతో పాటు, ధనుష్‌కు చాలా అవసరం. కాగా త్రిష ప్రస్తుతం మోహిని చిత్రంలో నటిస్తున్నారు. గర్జనై, చతురంగవేట్టై, సామి-2 చిత్రాల్లో నటించనున్నారు. ఇకపై వైవిధ్యభరిత కథా పాత్రల్లోనే నటించాలని ఈ బ్యూటీ నిర్ణయించుకున్నారట. కాగా ప్రముఖ హీరోయిన్లు ఇప్పుడు ఒక పక్క నటిస్తూనే మరో పక్క ఇతర వ్యాపారాల్లో ఆదాయాన్ని గడిస్తున్నారు.
  అదే విధంగా 14 ఏళ్ల సినీ వయసులోనూ నాయకిగా బిజీగా ఉన్న నటి త్రిష హోటల్ బిజినెస్‌లోకి దిగుతున్నారు. బెంగళూర్‌లో 60 గదులతో కూడిన ఆధునిక స్టార్ హోటల్‌ను నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. త్రిష ఈ హోటల్ నిర్మించడానికి కారణం ఉందట. తన తండ్రి కృష్ణ ఒక నక్షత్ర హోటల్‌లో పని చేసేవారు. ఆయనకు తాను హోటల్ యజమానిని కావాలని కలల కనేవారట. అయితే ఆ కల నెరవేరకుండానే ఆయన తనువు చాలించారు. దీంతో తన తండ్రి కలను సాకారం చేయడానికే త్రిష స్టార్ హోటల్‌ను కట్టిస్తున్నారట.

Sunday, October 23, 2016

డార్లింగ్‌ ప్రభాస్‌ పూర్తి పేరు ఏంటో తెలుసా?

  తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్‌. ’బాహుబలి’ సినిమాతో జాతీయ స్టార్‌గా ఎదిగిన ఆయన ఆదివారం 37వ వసంతంలో అడుగుపెట్టారు. ఆయన జన్మదిన కానుకగా ఇప్పటికే ’బాహుబలి-2’ పోస్టర్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌ విడుదల సందర్భంగా 18వ ముంబై చిత్రోత్సవం సందర్భంగా ప్రభాస్‌కు స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇచ్చి గౌరవించారు.
14 ఏళ్ల నట ప్రస్థానంలో అసాధారణమైన అద్భుతాలను ఈ యంగ్‌ హీరో సొంతం చేసుకున్నాడు. ప్రభాస్‌ ఖాతాలో పలు విజయవంతమైన సినిమాలు ఉన్నప్పటికీ ‘బాహుబలి’ ప్రాంచైజ్‌తో ఒక్కసారిగా గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిపోయాడు. వంద కోట్లు వసూళ్లు సాధించడమే కష్టం అనుకునే టాలీవుడ్‌ రేంజ్‌ ను దాటి ప్రభాస్‌ నటించిన ‘బాహుబలి’  సినిమా ఏకంగా రూ. 600 కోట్లు వసూలు చేసింది. ’బాహుబలి-2’ మీద అనేక అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ఆసక్తికరమైన కబుర్లు ఇవి..
  • ప్రభాస్‌ పూర్తి పేరు వెంకట సత్యనారాయణ ప్రభాస్‌ రాజు ఉప్పలపాటి. చెన్నైలో సూర్యనారాయణ రాజు, శివకుమారి దంపతులకు జన్మించారు. టాలీవుడ్‌ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు ప్రభాస్‌కు పెద్దనాన్న.
     
  • ’బాహుబలి’  సూపర్‌ సక్సెస్‌తో ఇక ప్రభాస్‌ బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తాడని వినిపిస్తోంది. కానీ, 2014లోనే ప్రభాస్‌ బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. అజయ్‌ దేవగణ్‌ హీరోగా ప్రభుదేవా తెరకెక్కించిన ‘యాక‌్షన్‌ జాక్సన్‌’ సినిమాలో అతిథి పాత్ర పోషించాడు.
     
  • ప్రభాస్‌కు ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థినితో నిశ్చితార్థం అయింది. తల్లిదండ్రులు సెలెక్ట్‌ చేసిన అమ్మాయినే ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడు. ఆ అమ్మాయి గురించి పెద్దగా వివరాలు తెలియదు. గత ఏడాది డిసెంబర్‌లోనే ప్రభాస్‌ పెళ్లి జరగాల్సి ఉండగా.. ’బాహుబలి’ ప్రాజెక్టు కారణంగా వాయిదా వేసుకున్నాడు. అది ప్రభాస్‌కు పనిపట్ల అంకితభావమని సన్నిహితులు చెప్తారు.
     
  • ప్రభాస్‌ బాగా నచ్చిన సినిమా తన పెద్దనాన్న కృష్ణంరాజు నటించిన 'భక్తకన్నప్ప'. బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ సినిమాలు అన్నా పడిచస్తాడు. మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, త్రి ఇడియట్స్‌ సినిమాలను 20సార్లకుపైగా చూశాడట. ఇక హాలీవుడ్‌ విషయానికొస్తే రాబర్ట్‌ డీనీరో నటన అంటే ఇష్టం.
     
  • ప్రభాస్‌కు వాలీబాల్‌ అంటే ఇష్టం. బాహుబలి సినిమా కోసం మిస్టర్‌ వరల్డ్‌ 2010 లక్ష్మణ్‌ రెడ్డి ప్రత్యేకంగా దేహాదారుఢ్యంపై ప్రభాస్‌కు శిక్షణ ఇచ్చారు. కండలు తిరిగిన దేహసౌష్ఠవం కోసం చిత్ర నిర్మాతలు ప్రత్యేకంగా రూ. 1.5 కోట్లు విలువచేసే జిమ్‌ ఎక్విప్‌మెంట్స్‌ ఇచ్చారు.
     
  • చాలామంది నటులు వరుసగా సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపుతుండగా ప్రభాస్‌ మాత్రం ఒక సినిమా పూర్తయిన తర్వాతే మరో సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ఆయన మాటల్లో చెప్పాలంటే.. 'బాహుబలి' సముద్రం లాంటి సినిమా. ఒక్క బాహుబలి వంద సినిమాలతో సమానం. కాబట్టి మధ్యలో నదిలాంటి సినిమాలను ఇవ్వడం ఆయనకు ఇష్టంలేదు.