బాలీవుడ్ యాక్టర్స్ కు హీరో, విలన్ అన్న తేడా ఉండదు. కథలో తమ పాత్రకు
ఇంపార్టెన్స్ ఉంటే చాలు ఏ పాత్రకైనా రెడీ అయిపోతారు. అందుకే అమితాబ్,
షారూఖ్, ఆమిర్ లాంటి టాప్ స్టార్లు కూడా నెగెటివ్ రోల్స్ లో అలరించారు.
తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా రోబో సినిమా సీక్వల్ కోసం
విలన్ గా మారిపోయారు. అదే బాటలో మరో బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్, హృతిక్
రోషన్ హీరోగా తెరకెక్కిన క్రిష్ 3 సినిమాలో విలన్ గా ఆకట్టుకున్నాడు.
దీంతో తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా ఖైదీ నంబర్ 150లో విలన్ గా వివేక్ ను నటించాల్సిందిగా కోరారు. కానీ అప్పట్లో చిరుకు విలన్ గా చేసేందుకు నో చెప్పిన వివేక్ ఇప్పుడు అజిత్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాలో విలన్ గా నటించేందుకు అంగకీరించాడట. ఇప్పటికే అజిత్ హీరోగా వరుస సూపర్ హిట్స్ అందించిన శివ మరోసారి తలాతో కలిసి మ్యాజిక్ రిపీట్చేయాలని భావిస్తున్నాడు. ఈ కాంబినేషన్ పై ఉన్న నమ్మకంతో పాటు జేమ్స్ బాండ్ తరహా సినిమా కావటంతో విలన్ పాత్ర స్టైలిష్ గా ఉండబోతోందని వివేక్ ఈ ఆఫర్ ను ఓకె చేశాడన్న టాక్ వినిపిస్తోంది.

No comments:
Post a Comment