Tuesday, March 29, 2016

ఆ హీరోయిన్ పెళ్లైపోయింది

  హీరోయిన్ అంకిత సోమవారం పెళ్లి చేసుకుంది. పుణేకు చెందిన వ్యాపారవేత్త విశాల్ జగ్తాప్ ను ఆమె వివాహమాడింది. ముంబై వర్లీ ప్రాంతంలో ఓ స్టార్ హోటల్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
రస్నాబేబీగా పాపులర్ అయి ఆ తరువాత బాలతారగా పలు చిత్రాలలో నటించింది. 'లాహిరి లాహిరి లాహిరి' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది. తెలుగు తమిళ, కన్నడ భాషాల్లో 20 పైగా చిత్రాల్లో నటించింది. సింహాద్రి, విజయేంద్రవర్మ, అందురూ దొంగలే దొరికితే, మనసు మాట వినదు, ఖతర్నాక్, సీతారాములు, నవ వసంతం, అనసూయ, వినాయకుడు, అర్జునుడు, పోలీస్ అధికారి తదితర తెలుగు సినిమాల్లో కనిపించింది.

కొంత కాలం క్రితం నటనకు దూరం అయిన అంకిత న్యూయార్క్ వెళ్లి అక్కడ సినిమాకు సంబంధించిన కోర్స్ చేసింది. ఆ సమయంలో పరిచయం అయిన వ్యాపారవేత్త విశాల్‌తో అంకిత లవ్ లో పడింది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించి పెళ్లి చేయడంతో ప్రేమకథ సుఖాంతం అయింది.

కొత్త లుక్‌తో... దిల్ ఖుష్!

 ఎర్రటి పంజాబీ డ్రెస్‌లో, చందమామ లాంటి మోముతో తళతళలాడుతున్న అందాల తార ఐశ్వర్యారాయ్ ‘సరబ్‌జిత్’ సిన్మా లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఐష్‌ది మెయిన్ రోల్ కాకపోయినా ఆమే ఈ చిత్రానికి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.

 అందుకే చిత్ర బృందం ఐష్ స్టిల్స్‌ను ఎక్కువగా విడుదల చే సి, సినిమాకు మరింత ప్రచారం కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. భారత గూఢచారి అనే అభియోగంతో జీవితాంతం జైల్లోనే మగ్గిపోయిన ‘సరబ్‌జిత్’ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. తమ్ముడికి జరిగిన అన్యాయం గురించి పోరాడిన సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనున్న సంగతి తెలిసిందే.

 అందుకు తగ్గట్టే సహజత్వానికి దగ్గరగా లుక్స్ విషయంతో చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సరబ్‌జిత్‌గా రణదీప్‌హుడా, ఆయన భార్యగా రిచా చద్దా కనిపించనున్నారు. ఆ మధ్య ‘జజ్బా’ చిత్రం అనుకున్న ఫలితమివ్వకపోవడంతో, ఈ సినిమాతోనైనా హిట్ సాధించాలని ఐశ్వర్య శ్రమిస్తున్నారు.

మరో ఇద్దరు స్టార్‌ వారసుల ఎంట్రీ!


బాలీవుడ్ స్టార్ దర్శకుడు కరణ్ జోహర్‌ తీసిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌' సినిమా ఇండస్ట్రికి ఏకంగా ముగ్గురు వారసులను అందించింది. ఈ సినిమా ద్వారా అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్టార్లుగా తమను తాము ఫ్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ రాబోతున్నది. ప్రస్తుతం ఇండస్ట్రిలో వినిపిస్తున్న మాట నిజమైతే.. ఈ స్వీకెల్ ద్వారా సైఫ్‌ అలీఖాన్‌, ఆయన మొదటి భార్య అమృతా సింగ్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సవతి సోదరుడు ఇషాన్ ఖట్టర్‌ హీరోహీరోయిన్‌లుగా ఇండస్ట్రికి పరిచయం కాబోతున్నారు.










అంతేకాదండోయ్‌.. ఈ సినిమాలో శ్రీదేవి కూతురు జాహ్నావి కపూర్‌ను కూడా తీసుకోవాలనే ఆలోచన ఉందట. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్టులతో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో తన కెరీర్‌ మొదలు పెట్టాలని భావిస్తోందట. అయితే  'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌'కు సీక్వెల్ లో సైఫ్ కూతురు సరా, ఇషాన్‌ను ఇప్పటికే తీసుకున్నట్టు వార్తలు వినిస్తున్నాయి. మరోవైపు కరణ్ జోహర్ మాత్రం ఈ సినిమా నటినటులపై ఎక్కడా నోరువిప్పడం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని ఇటీవల కరణ్ అధికారికంగా ప్రకటించాడు. దీంతో స్టార్ వారసులు చాలామంది తమను లాంచింగ్ చేయమని కరణ్‌ను కోరుతున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు. ఇక షాహిద్ కపూర్ మాజీ ప్రియురాలైన కరీనా సైఫ్‌ అలీఖాన్‌ను పెళ్లాడింది. తాజాగా కరీనా, షాహిద్ 'ఉడ్తా పంజాబ్' సినిమాలో కలిసి నటిస్తున్నారు.

Monday, March 28, 2016

అమితాబ్‌ × ఫ్లింటాఫ్‌

 ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌పై భారత్‌లోని రెండు మతాల వాళ్లు ఒకేసారి విరుచుకుపడ్డారు. అదేనండి క్రికెట్‌, సినిమా మతాలకు చెందిన వాళ్లు. ఆస్ట్రేలియాపై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్‌ కోహ్లీని పొగుడుతూనే.. ‘‘విరాట్‌ ఇలాంటి ఆటతీరునే కొనసాగిస్తే ఏదో ఒక రోజు ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ రూట్‌ అంతటివాడవుతాడు’’ అంటూ ట్వీట్‌ చేసి ఓ చురక అంటించాలని ప్రయత్నించాడు ఫ్లింటాఫ్‌. దీనికి విరాట్‌ అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తుండగానే.. ఏకంగా అమితాబ్‌ బచ్చన్‌ రంగంలోకి దిగాడు. ‘‘రూట్‌ (వేరు) ఏంటీ రూట్‌? రూట్‌ను కుదుళ్లతో సహా పీకేస్తాం’’ అంటూ రివర్స్‌ పంచ్‌ ఇచ్చాడు. ఈసారి బిగ్‌ బీనే ఆటపట్టిద్దామని ‘‘ఇంతకీ మీరెవరూ?’’ అనేశాడు ఫ్లింటాఫ్‌. ఇక అభిమానులు వూరుకుంటారా! యువీ ఆరు సిక్సర్లు, లార్డ్స్‌లో గంగూలీ చొక్కా విప్పడం లాంటి అనుభవాలు గుర్తు చేసి మరీ ఫ్లింటాఫ్‌ను వాయించేశారు. ‘‘బంధుత్వంలో ఆయన మీ బాప్‌ (తండ్రి) లాంటి వారు. పేరు షెహన్‌షా’’ అంటూ ఓ అభిమాని.. ‘‘వెళ్లి మేడమ్‌ టుసాడ్స్‌ మ్యూజియం చూడు. ఇంగ్లాండ్‌లో నీకన్నా ఆయనే ప్రముఖుడు’’ అంటూ మరో ఔత్సాహికుడు ఫ్లింటాఫ్‌కు బిగ్‌-బిని పరిచయం చేశాడు.

ఐసీసీ ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ గ్రూప్‌ జట్లు వివరాలు ...





Sunday, March 27, 2016

ఆ హీరో 16 సినిమాలు కాదన్నాడా..?

 భలే భలే మగాడివోయ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన నాని, ప్రస్తుతం సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటున్నాడు. స్టార్ డైరెక్టర్ల నుంచి కొత్త దర్శకుల వరకు అందరూ నానితో సినిమా చేయడానికి రెడీగా ఉన్నా.. అతడు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ముఖ్యంగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మంచి విజయం సాధించినా, ఆ సినిమా బ్లాక్ బస్లర్స్ లిస్ట్ లో చేరకపోవటంతో నెక్ట్స్ సినిమా విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు.            ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు నాని. ఆ తరువాత ఉయ్యాల జంపాల దర్శకుడు విరించి వర్మతో ఓ సినిమా చేస్తాన్న టాక్ వినిపిస్తున్నా, అఫీషియల్ గా మాత్రం ఎనౌన్స చేయలేదు. దీంతో తరువాత నాని చేయబోయే సినిమాపై ఇంత వరకు ఎలాంటి క్లారటీ రాలేదు. ఇప్పటికే 16 కథలు విన్న నాని వాటిలో ఏ ఒక్క కథకు ఓకె చెప్పలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇలా నాని కాదన్న కథల్లో స్టార్ డైరెక్టర్లు తెచ్చినవి కూడా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి.

Thursday, March 24, 2016

రనౌట్ కు ముందు ధోని ఏం చేశాడంటే...

టీ20 ప్రపంచకప్ లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ లో చివరికి రనౌట్ తో టీమిండియా విజయం సాధించింది. రనౌట్ చేయాలని 'మిస్టర్ కూల్' మహేంద్ర సింగ్ ధోని ముందుగానే సిద్ధమైనట్టు కనబడుతోంది. హార్ధిక్ పాండ్యా చివరి బంతిని వేసే ముందు ధోనిని నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది.
బంతి వేయడానికే ముందే ధోని తన కుడిచేతి గ్లౌజ్ తీసేశాడు. సాధారణంగా వికెట్ కీపర్లు చేతులకు రెండేసి గ్లౌజులు వేసుకుంటారు. చేతికి అంటిపెట్టుకుని గ్లౌజులతో పాటు వదులుగా ఉండే గ్లౌజులు ధరిస్తారు. బంతిని ఒడిసిపట్టిన తర్వాత దాన్ని విసిరే క్రమంలో చేతికున్న పెద్ద గ్లౌజును తీసేస్తుంటారు. వదులుగా ఉండే పెద్ద గ్లౌజులు ధరించి వికెట్లను కొట్టడం కష్టం. కాబట్టి ధోని ముందుగానే రనౌట్ కు ప్లాన్ చేసుకున్నట్టు కనబడుతోంది.
ఇక రెండో ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ వచ్చేలోపే 15 గజాల దూరం పరుగెత్తి ధోని రనౌట్  చేయడం విశేషం. దూరం నుంచి బంతి విసిరితే అది వికెట్లకు తగలకపోతే మ్యాచ్ చేజారిపోయే ప్రమాదముందని గ్రహించిన టీమిండియా కెప్టెన్ సమయస్ఫూర్తితో వ్యవహరించి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తి పరుగులు తీయడంలో ధోని ఎక్స్ పర్ట్  అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ విశ్వాసంతోనే ధోని వికెట్ల దగ్గరకు పరుగెత్తికొచ్చి రనౌట్ చేయగలిగాడని కామెంటేటర్లు వ్యాఖ్యానించారు.

Wednesday, March 23, 2016

వేడుకగా చలాకీ చంటి నిశ్చితార్థం


బుల్లితెర కార్యక్రమం ‘జబర్దస్త్‌’ ద్వారా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్న నటుడు చలాకీ చంటి. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నారు.