Thursday, December 17, 2015

రివ్యూ: లోఫర్‌

రేటింగ్‌: 2.5/5 


కథేంటంటే: కృష్ణ (పోసాని కృష్ణమురళి) పక్కా లోఫర్‌. భార్య లక్ష్మమ్మ (రేవతి)తో గొడవ పడి ఇంటి నుంచి వచ్చేస్తాడు. వస్తూ.. వస్తూ ఉయ్యాల్లోని నెలల పసికందు రాజా (వరుణ్‌తేజ్‌)ని ఎత్తుకు వచ్చేస్తాడు. ‘నీ చిన్నప్పుడే అమ్మ పచ్చ కామెర్లొచ్చి చచ్చిపోయింది’ అంటూ నమ్మిస్తాడు. రాజా కూడా దొంగగా మారి జోథ్‌పూర్‌లో సెటిల్‌ అవుతాడు.
         తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఇంట్లోంచి పారిపోయి జోథ్‌పూర్‌ వస్తుంది పారిజాతం (దిశాపటాని). ఆమెను చూసి ప్రేమిస్తాడు రాజా. పారిజాతం ఎవరో కాదు.. స్వయానా తన మామ (ముఖేష్‌రుషి) కూతురేనని తెలుసుకుంటాడు. అంతేకాదు.. తన అమ్మ బతికే ఉందన్న నిజం పారిజాతం ద్వారా తెలుసుకొంటాడు రాజా. అయితే ఈలోగా పారిజాతాన్ని ఇంట్లోవాళ్లు విశాఖపట్నం తీసుకెళ్లిపోయి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు. మరి.. పారిజాతాన్ని రాజా ఎలా కాపాడాడు? తన తల్లికి ఎలా దగ్గరయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.



ఎలా ఉందంటే: తనకు అలవాటైన కథకు.. ‘అమ్మ’ సెంటిమెంట్‌ అద్దాడు. అదే.. తనను ఆదుకుంటుందని పూరి నమ్మినట్లు కనిపిస్తుంది. కొడుకు దూరమైన బాధలో తల్లి. కళ్ల ఎదుటే అమ్మ ఉన్నా.. ‘నేను నీ కొడుకుని’ అని చెప్పుకోలేని బిడ్డ. వీరి మధ్య భావోద్వేగాలను పూరి పండించాడు. తండ్రిగా పోసాని పాత్రని రాసుకున్న తీరు.. వినోదాన్ని పండిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య నడిచిన ఓ రకమైన కెమిస్ట్రీ ఈ సినిమాకి బలం.
దీనికి తోడు పూరి శైలి హీరోయిజం.. అతని టేకింగ్‌.. పోరాట దృశ్యాల్ని తెరకెక్కించిన పద్ధతి.. ఇవన్నీ ‘లోఫర్‌’కి కాస్తంత మెరుగ్గా ఉండేలా చేశాయి. సున్నితమైన ఈ కథని.. మరికాస్త పద్ధతిగా తెరకెక్కిస్తే మరింతగా ఆకట్టుకునేదేమో? అరుపులు.. కేకలు.. ఏమాత్రం మానవత్వం లేని విలన్‌ ముఠాల మధ్య అమ్మ సెంటిమెంట్‌ నలిగిపోయింది.
కడుపున పుట్టిన బిడ్డే తల్లిని కిరాతకంగా చంపుతుంటే.. ఆ మారణ కాండని చూసే మరో కొడుకు పైశాచికత్వం లాంటి సన్నివేశాలు ఇబ్బంది కలిగించేవే. సినిమాలో విలనిజం.. రక్తపాతం కాస్తంత తగ్గిస్తే బాగుండేదన్న అభిప్రాయం కలుగుతుంది. అలీ.. బ్రహ్మానందం ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. 

ఎవరేం చేశారంటే: తొలి రెండు చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన వరుణ్‌తేజ్‌ తొలిసారి మాస్‌ పాత్ర పోషించాడు. ఇలాంటి తరహా పాత్రల్లోనూ తాను రాణించగలనని నిరూపించుకున్నాడు. ఎమోషన్‌ సన్నివేశాల్లో వరుణ్‌ నటన బాగుంది. ఫైట్స్‌ చాలా ఈజ్‌తో చేశాడు. దిశాపటాని అందంగా కనిపించింది. ఆమె పాత్ర పరిధి అంతంతే. రేవతికి ఎక్కువ మార్కులు పడతాయి. తన అనుభవాన్నంతా రంగరించి నటించింది. ఇక పోసాని కృష్ణమురళి.. ఈ కథని వెన్నుదన్నుగా నిలిచాడు.

 
సాంకేతికంగా..: సునీల్‌ సంగీతంలో ప్రతి పాటా ఒకేలా వినిపించింది. ‘సువ్వి సువ్వాలమ్మా’ పాట మాత్రం ఆకట్టుకొంది. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. సెంటిమెంట్‌ పరమైన సన్నివేశాలు పూరి బాగా తీశాడు. పెప్పర్‌ స్ప్రే డైలాగ్‌ పేలుతుంది.  

చివరిగా.. కాస్త సెంటిమెంట్‌.. మరికాస్త హింస కలిపితే.. ‘లోఫర్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.



 

Wednesday, December 16, 2015

హర్రర్‌ నేపథ్యంలో రేష్మి సినిమా

 'జబర్దస్త్‌' రేష్మి, ఆనంద్‌బాబు జంటగా డి.దివాకర్‌ దర్శకత్వంలో బాలాజీ నాగలింగం సమర్పణలో వి సినీ స్టూడియోస్‌ పతాకంపై వి.లీన నిర్మిస్తున్న చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథిగా విచ్చేసిన దర్శకుడు బి.గోపాల్‌ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వడంతోపాటు గౌరవ దర్శకత్వం వహించారు. కెమెరామెన్‌ జి.ప్రభాకర్‌రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, 'ఇదొక డిఫరెంట్‌ హర్రర్‌ కామెడీ చిత్రం. ఆద్యంతం సస్పెన్స్‌గా సాగుతుంది. ఇందులో ఉండే ఒక ట్విస్ట్‌ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. 'అనగనగా ఒక చిత్రమ్‌' దర్శకుడు జి.ప్రభాకర్‌రెడ్డి ఈ చిత్రానికి కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ బుధవారం నుంచి ప్రారంభించి జనవరిలో పూర్తి చేయనున్నాం' అని అన్నారు. 'దర్శకుడు దివాకర్‌ ఏడాదిన్నరగా ఈ చిత్ర కథపై వర్కౌట్‌ చేశారు. ఫైనల్‌గా మంచి స్క్రిప్టు వచ్చింది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది' అని ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. రేష్మి మాట్లాడుతూ, 'వైజాగ్‌కు చెందిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు చేస్తున్న చిత్రమిది. ఇందులో నటించే ఛాన్స్‌ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు' అని తెలిపారు. 'హర్రర్‌ కామెడీగా సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం' అని నిర్మాత లీన తెలిపారు. వైజాగ్‌ ప్రసాద్‌, పూర్ణిమ, కాశీ విశ్వనాథ్‌, సప్తగిరి
ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

Tuesday, December 15, 2015

'చిరంజీవితో కచ్చితంగా సినిమా తీస్తా'

భవిష్యత్ లో మెగాస్టార్ చిరంజీవితో కచ్చితంగా సినిమా తీస్తానని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. కాగా చిరు 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పూరి చేజారింది. చిరంజీవి 150వ సినిమాకు తొలుత పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ గతంలో ఓ కథను రెడీ చేశారు. చిరంజీవికి సెకండాఫ్ నచ్చకపోవడంతో బ్రేక్ పడింది. చివరకు తమిళ చిత్రం కత్తిని రీమేక్ చేయాలని నిర్ణయించగా, ఆ అవకాశం వీవీ వినాయక్ కు దక్కింది. చిరు సినిమాకి సంబంధించిన వార్తను రామ్‌చరణ్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తమిళ చిత్రం 'కత్తి' రీమేక్‌లో తన తండ్రి నటిస్తారనీ, వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ చరణ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పూరి జగన్నాథ్ ఓ వార్త ఏజెన్సీతో మాట్లాడుతూ.. ఈ అవకాశం చేజారడం దురదృష్టకరమని, అయితే చిరంజీవితో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పారు.

వేలంలో ఆటగాళ్లను ఎంచుకున్న పుణే, రాజ్‌కోట్‌ ఫ్రాంచైజీలు



కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్‌ల కోసం ఐపీఎల్‌ మంగళవారం ప్రత్యేక వేలం నిర్వవహించింది. వచ్చే రెండు ఐపీఎల్‌ సీజన్ల కోసం నిర్వవహించిన ఈ వేలంలో పుణే, రాజ్‌కోట్‌ జట్లు ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. ఈ రోజు జరిగిన వేలంలో పుణే జట్టుకు ధోని, ఆశ్విన్‌, రహానే, స్టీవెన్‌ స్మిత్‌, డుప్లెసిస్‌ ఎంపికయ్యారు. రాజ్‌కోట్‌ జట్టు సురేశ్‌రైనా, రవీంద్ర జడేజా, మెక్‌కల్లమ్‌, జేమ్స్‌ ఫాల్క్‌నర్‌, డ్వేన్‌ బ్రావోలను దక్కించుకఁంది. మిగతా ఆటగాళ్లను ఫిబ్రవరి 6న జరిగే ఐపీఎల్‌ వేలంలో ఎంపిక చేయనున్నారు.

Monday, December 14, 2015

కొత్త ఫ్రాంఛైజీల కోసం వేలం నేడు

 ధోని అంటే చెన్నై .. చెన్నై అంటే ధోని. ఐపీఎల్‌ మొదలైనప్పటి నుంచీ అభిమానులకఁ ఇది అలవాటైపోయింది. రాజస్థాన్‌ అంటే రహానే గుర్తొస్తాడు. కానీ ధోని, రహానే కొత్త జట్ల వాళ్లు కాబోతున్నారు. సరికొత్త జెర్సీలో కఁపించబోతున్నాడు. చెన్నై జట్టులో అనేక మంది మారబోతున్నారు. ఎందుకంటే కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్‌ల కోసం ఐపీఎల్‌  నిర్వహిస్తున్న ప్రత్యేక వేలం మంగళవారం నాడు ప్రకటించనున్నారు. 
                    చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ జట్లు మంగళవారం పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్‌లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్‌ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి.
                           కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి.

Rohit Sharma with his wife Ritika marriage photos

Rohit Sharma With His wife Ritika photos




















Sunday, December 13, 2015

సూపర్‌స్టార్‌తో నటించడానికి ఎదురు చూస్తున్నా ...

 సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో జత కట్టడానికి చాలా ఎగ్జైట్‌గా ఎదురుచూస్తున్నానని అంటోంది ఇంగ్లీష్ బ్యూటీ ఎమిజాక్సన్. ఈ అమ్మడు నిజంగా లక్కీ నటే అని చెప్పక తప్పదు. ఏదో ఒక చిత్రంలో (మదరాసు పట్టణం) నటించి కనుమరుగవుతుందిలే అని ఊహించుకున్న సినీ వర్గాలను విస్మయ పరిచేలా ఎమిజాక్సన్ తన కెరీర్‌ను కోలీవుడ్‌లో సుస్థిరం చేసుకుంది. ఐ చిత్రంలో అందాలను ఆరబోసి అమితమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ బహుభాషా నాయకిగా ఎదుగుతోంది. ఎమిజాక్సన్ ధనుష్‌తో నటించిన తంగమగన్ చిత్రం అనుభవాలను పత్రికల వారితో పంచుకుంటూ నటుడు ధనుష్‌తో నటించడం తీయని అనుభవం అంది. ఆయన చాలా క్వైట్ పర్సన్ అని పేర్కొంది. తంగమగన్ చిత్రంలో తనది చాలా మంచి పాత్ర అని చెప్పింది.
17, 18 ఏళ్ల టీనేజ్ యువతిగా ఈ చిత్రంలో నటించానని చెప్పింది. సహనటి సమంతతో తనకు వేవ్‌లెంగ్త్ బాగా కుదిరిందని అంది. అలాగే పార్టనర్ షిప్ వర్కౌట్ అయ్యిందని చెప్పింది. గ్లామర్ గురించి ప్రశ్నించగా అదిఇప్పుడు సినిమాలో ఒక భాగం అయిపోయిందని అంది. మల్టీ చిత్రాల ట్రెండ్ పెరుగుతోంది, ఆ తరహా చిత్రాలలో నటిస్తారా? అన్న ప్రశ్నకు నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.
అయితే ఏ చిత్రంలో అయినా తన పాత్ర స్ట్రాంగ్‌గా తాను ఎంజాయ్ చేసేది గాను ఉండాలని అంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎందిరన్-2 చిత్రంలో నటించనుండడం ఎలా ఫీలవుతున్నారన్న ప్రశ్నకు చాలా ఎగ్జైటింగ్‌గా ఆయన సరసన నటించడానికి ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మరో విషయం ఏమిటంటే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఒక్క చిత్రంలో నటించే అవకాశం రావడమే గొప్పగా భావిస్తారని అలాంటిది రెండో సారి ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పింది.

Thursday, December 10, 2015

బెంగాల్ టైగర్ రివ్వూ

రేటింగ్ : 3/5
 
మాస్ మహరాజా “రవితేజ” కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది . రచ్చ చిత్రం తో మాస ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపత్ నంది చాలా గ్యాప్ తీసుకొని మరీ తీసిన చిత్రం “బెంగాల్ టైగర్ “. రవితేజ లో చాలా ఎనర్జీ ఉంటుంది దాన్ని సరిగా స్క్రీన్ మీద ప్రజంట్ చెయ్యగలిగితే అది ప్రేక్షకులకు తప్ప ఆదరిస్తారు . సంపత్ నంది ఆ ప్రయత్నం లో దాదాపుగా సక్సెస్ అయ్యాడు అనే చెప్పుకోవాలి. నిజానికి సంపత్ నంది సినిమాలలో చెప్పుకోవటానికి పెద్ద గొప్ప కథ ఏమి ఊండదు, కానీ మాస్ ప్రేక్షకులకు ఏమీ కావాలో సరిగా అది మాత్రం స్క్రీన్ మీద చూపించగలడు . అదే ఫార్ములా ని ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు . దానికి రవితేజ లాంటి ఎనర్జిటిక్ నటుడు ప్లస్ అయ్యాడు
 కథాంశం :
మాస్ మహరాజా “రవితేజ” కి ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది . రచ్చ చిత్రం తో మాస ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపత్ నంది చాలా గ్యాప్ తీసుకొని మరీ తీసిన చిత్రం “బెంగాల్ టైగర్ “. రవితేజ లో చాలా ఎనర్జీ ఉంటుంది దాన్ని సరిగా స్క్రీన్ మీద ప్రజంట్ చెయ్యగలిగితే అది ప్రేక్షకులకు తప్ప ఆదరిస్తారు . సంపత్ నంది ఆ ప్రయత్నం లో దాదాపుగా సక్సెస్ అయ్యాడు అనే చెప్పుకోవాలి. నిజానికి సంపత్ నంది సినిమాలలో చెప్పుకోవటానికి పెద్ద గొప్ప కథ ఏమి ఊండదు, కానీ మాస్ ప్రేక్షకులకు ఏమీ కావాలో సరిగా అది మాత్రం స్క్రీన్ మీద చూపించగలడు . అదే ఫార్ములా ని ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు . దానికి రవితేజ లాంటి ఎనర్జిటిక్ నటుడు ప్లస్ అయ్యాడు


సాంకేతికాంశాలు :
సాంకేతికాంశాల విషయానికొస్తే, సినిమాలో పెద్ద కథేమీ లేదు . చాలా సాదాసీదా కథ, కానీ దాని ప్రజంట్ చేసే విధానం లో సంపత్ నంది బాగా సక్సెస్ అయ్యాడు . మామూలు కథ ని స్క్రీన్ ప్లే తో ఒక హిట్ సినిమా గా చేసినందుకు మెచ్చుకోవాలి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమా బాగా రిచ్ గా కనపడటానికి మొదటి కారణం సినిమాటొగ్రఫీ నే. భీంస్ సంగీతం పర్వాలెదు అనిపించిది. చిన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని పర్ఫెక్ట్ మూడ్ లో ఎలివేట్ చెయ్యగలిగింది, అటు ఎంటర్ టైన్ మెంట్ లో కానీ, రొమాంటిక్ , యాక్షన్ అన్ని సన్నివేశాలలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరింత ఎలివేట్ చేసింది అనే చెప్పుకోవాలి
ఇక నటీనటుల పెర్ ఫార్మెన్స్ విషయానికోస్తే రవితేజ ఎప్పటిలాగే తనదైన ఎనర్జీ తో సినిమాని పూర్తి ఎంటర్ టైన్ మెంట్ వేలో నడిపేశాడు. రావు రమేష్ తన చిత్తూరు యాస తో కొత్తగా కనిపించాడు. బోమన్ ఇరాని పాత్ర తన పాత్రకు పూర్తి న్యాయం చేసాదు, కాకపొతే ఆ పాత్రే అతనికి న్యాయం చెయ్యలేకపోయింది. బొమన్ ఇరానీ లాంటి కాపబుల్ నటుడిని రొటిన్ విలన్ పాత్రకు తీసుకోవటం సినిమాకు ఒక హంగు లా అనిపిస్తుంది కానీ, అంత ఉపయోగం ఏమి ఉండదు . పృధ్వి తన కామెడీ తో సూపర్బ్ అనిపించుకున్నడు
                     సాంకేతికాంశాల విషయానికొస్తే, సినిమాలో పెద్ద కథేమీ లేదు . చాలా సాదాసీదా కథ, కానీ దాని ప్రజంట్ చేసే విధానం లో సంపత్ నంది బాగా సక్సెస్ అయ్యాడు . మామూలు కథ ని స్క్రీన్ ప్లే తో ఒక హిట్ సినిమా గా చేసినందుకు మెచ్చుకోవాలి. సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమా బాగా రిచ్ గా కనపడటానికి మొదటి కారణం సినిమాటొగ్రఫీ నే. భీంస్ సంగీతం పర్వాలెదు అనిపించిది. చిన్నా బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని పర్ఫెక్ట్ మూడ్ లో ఎలివేట్ చెయ్యగలిగింది, అటు ఎంటర్ టైన్ మెంట్ లో కానీ, రొమాంటిక్ , యాక్షన్ అన్ని సన్నివేశాలలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరింత ఎలివేట్ చేసింది అనే చెప్పుకోవాలి
                  ఇక నటీనటుల పెర్ ఫార్మెన్స్ విషయానికోస్తే రవితేజ ఎప్పటిలాగే తనదైన ఎనర్జీ తో సినిమాని పూర్తి ఎంటర్ టైన్ మెంట్ వేలో నడిపేశాడు. రావు రమేష్ తన చిత్తూరు యాస తో కొత్తగా కనిపించాడు. బోమన్ ఇరాని పాత్ర తన పాత్రకు పూర్తి న్యాయం చేసాదు, కాకపొతే ఆ పాత్రే అతనికి న్యాయం చెయ్యలేకపోయింది. బొమన్ ఇరానీ లాంటి కాపబుల్ నటుడిని రొటిన్ విలన్ పాత్రకు తీసుకోవటం సినిమాకు ఒక హంగు లా అనిపిస్తుంది కానీ, అంత ఉపయోగం ఏమి ఉండదు . పృధ్వి తన కామెడీ తో సూపర్బ్ అనిపించుకున్నాడు . రావు రమేష్, సోయాజి షిండే తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు . హీరొయిన్స్ ఇద్దరూ తమన్నా, రాశీఖన్నా ఇద్దరు తమ గ్లామర్ తో అలరించారు . వాళ్ళిద్దరికి నటన తో పెద్ద పనిలేని పాత్రలే కాబట్టి సమస్య లేదు
                  మొత్తం మీద సినిమా రోటీన్ సినిమా అయినా, ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగుతుంది కాబట్టి ఎక్కడా బోర్ కొట్టదు . కాకపొతే సెకండాఫ్ లో మైండ్ గేం తోనే సాగాల్సిన స్క్రీన్ ప్లే లో ఎప్పుడూ ఈ బల ప్రదర్శనలు ఎందుకో అర్ధం కాదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తాను ఆకాష్ మీద ఎలాంటి చర్య తీసుకున్నా ,కనీసం అతని మీద ఈగ వాలినా తన మీదకే వస్తుంది, మీడియా కళ్ళు అన్నీ తననే అనుమానంగా చూస్తున్నాయి అని చెప్పిన ముఖ్యమంత్రే తర్వాతి సీన్ లో అతన్ని చంపించటం కోసం ప్రయత్నం చెయ్యటం . అది కూడా తనదగ్గరకు వచ్చినప్పుడు తన ముందే చంపించాలనుకోవటంలో ఎలాంటి లాజిక్ ఉందో దర్శకుడికే తెలియాలి. మొత్తం మీద ఒక రోటీన్ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవాలి .