ధోని అంటే చెన్నై .. చెన్నై అంటే ధోని.
ఐపీఎల్ మొదలైనప్పటి నుంచీ అభిమానులకఁ ఇది అలవాటైపోయింది. రాజస్థాన్ అంటే
రహానే గుర్తొస్తాడు. కానీ ధోని, రహానే కొత్త జట్ల వాళ్లు కాబోతున్నారు.
సరికొత్త జెర్సీలో కఁపించబోతున్నాడు. చెన్నై జట్టులో అనేక మంది
మారబోతున్నారు. ఎందుకంటే కొత్త ఫ్రాంచైజీలు పుణే, రాజ్‌కోట్‌ల కోసం ఐపీఎల్
నిర్వహిస్తున్న ప్రత్యేక వేలం మంగళవారం నాడు ప్రకటించనున్నారు.
చెన్నై, రాజస్తాన్ రాయల్స్ జట్ల స్థానాల్లో వచ్చిన కొత్త జట్లు పుణే, రాజ్‌కోట్ జట్లు మంగళవారం పదిమంది క్రికెటర్లను ఎంచుకోనున్నాయి. చెన్నై, రాజస్తాన్ జట్లకు గత సీజన్‌లో ఆడిన మొత్తం 50 మంది క్రికెటర్లు అందుబాటులో ఉండగా... ఈ రెండు జట్లు ఐదుగురేసి ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ధోని, అశ్విన్, సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, బ్రెండన్ మెకల్లమ్, అజింక్య రహానే, షేన్ వాట్సన్, స్టీవ్ స్మిత్, డ్వేన్ బ్రే వో, డ్వేన్ స్మిత్‌ల మీద అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఇంకా మిగిలిన 40 మంది క్రికెటర్లు ఫిబ్రవరిలో జరిగే వేలంలోకి వెళతారు. అక్కడ వీరితో పాటు మరింత మంది క్రికెటర్లు ఉంటారు. ఆ వేలంలో అన్ని జట్లూ పాల్గొంటాయి.
కొత్త జట్టు ఆటగాళ్ల కోసం కనిష్టంగా రూ.40 కోట్లు, గరిష్టంగా రూ.60 కోట్లు ఖర్చు చేయాలి. ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో తొలి క్రికెటర్‌ను తీసుకోగానే ఇందులో నుంచి రూ.12.5 కోట్లు తగ్గిపోతాయి. ఆ తర్వాత నలుగురు క్రికెటర్లను తీసుకోగానే వరుసగా రూ.9.5 కోట్లు, రూ.7.5 కోట్లు, రూ.5.5 కోట్లు, రూ.4 కోట్లు తగ్గిపోతాయి. ఫిబ్రవరిలో జరిగే వేలంలో ఈ మొత్తాన్ని తగ్గించుకుని మిగిలిన ఆటగాళ్లను కొనుక్కోవాలి.

No comments:
Post a Comment