Tuesday, December 13, 2011

2011 రౌండప్‌

డిసెంబర్‌ సగం రోజులు పూర్తరుుపోరుుంది. కొత్త సంబరాల నవ ఉత్సాహంతో 2012 సంవత్సరం రాబోతోంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే తెలుగు సినిమా 80 సంవత్సరాలు పూర్తిచేసుకోవడం. ఈ సంవత్సరం అనూహ్యంగా పెద్ద హీరోలు నటించిన చిత్రాలకు కలెక్షన్ల రికార్డులు సృష్టించడం ఒక విశేషమైతే తెలుగు సినిమా స్టామినా పెంచిన చిత్రంగా ‘దూకుడు’ రికార్డుల పరంపర కొనసాగించింది.
pavvann
బాలకృష్ణ హీరోగా బాపు దర్శకత్వంలో ఎలమంచిలి సాయిబాబు నిర్మించిన ‘శ్రీరామరాజ్యం’ నెమ్మదిగా వసూళ్లు పెంచుకుంటూ మ్యాజిక్‌ను ప్రారంభించింది. ఈ చిత్రానికి యువత ఆదరణ రోజురోజుకి పెరుగుతుండడంతో థియేటర్లు ఫుల్‌ అవుతున్నాయని సమాచారం. మనవైన పురాణేతిహాసాలను, మరుగున పడుతున్న సంస్కృతిని పునశ్చరణ చేసుకోవాలన్న యూత్‌ ఆలోచన..ఈ సినిమాకి అస్సెట్‌గా నిలుస్తోంది.తెలుగు సినిమాలలో టాప్‌ 5 సినిమాలలో అగ్రశ్రేణి వరుసలో నిలిచిపోయిన చిత్రంగా ‘దూకుడు’ నిలిచింది. హిట్టు కోసం 5 సంవత్సరాలుగా నిరీక్షించిన మహేష్‌కు పోకిరిని మించిన హిట్టుగా దూకుడు చిత్రం నిలిచిపోయింది.

ఇక మిగిలిన హీరోలను తీసుకుంటే బాలకృష్ణ హీరోగా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ‘పరమవీరచక్ర’ అంచనాలను అందుకోలేపోయింది.కాగా బాపు దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ హిట్‌ మూవీగా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుని స్టడీగా సాగిపోతోంది. జూనియర్‌ ఎన్టీఆర్‌కు ‘శక్తి’ చిత్రం పరాజయం కాగా ‘ఊసరవెల్లి’ చిత్రం మాత్రం కలెక్షన్ల పరంగా యావరేజ్‌గా నిలిచింది. ప్రభాస్‌కు ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రం హిట్‌గా నిలిచింది. ఇక పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘తీన్‌మార్‌’ చిత్రం ఫ్లాప్‌ కాగా ‘పంజా’ చిత్రం డివైడ్‌ టాక్‌తో నడుస్తోంది.

మరో వారం రోజులు గడిస్తేగానీ ఆ చిత్రం నిలబడిందో లేదో అనేది తెలియదు. నాగార్జున నటించిన ‘గగనం’ చిత్రం ప్రయోగాత్మకంగా ప్రశంసలందుకుందిగానీ కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నాగచైతన్యకు విడుదలైన మూడు చిత్రాలలో ఒకటి హిట్టుకాగా రెండు ఫ్లాపులయ్యాయి. సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘100%లవ్‌’ హిట్టుకాగా ‘దడ’, ‘బెజవాడ’ చిత్రాలు పరాజయం పాలయ్యాయి. మరి కొందరు హీరోల జయాపజయాల గురించి తర్వాత తెలుసుకుందాం....

భజ్జీ కారులో దొంగతనం

భారత స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ పాస్‌పోర్టు, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ను ఎవరో దొంగిలించారు. కర్నాల్‌ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. భజ్జీ, అతని స్నేహితుడు కలసి ఢిల్లీకి సోమవారం సాయంత్రం బయలుదేరిన సమయంలో వారు మధుబన్‌ దగ్గరే ఉన్న కర్నాల్‌లో ఆగారు. కాఫీ తాగుదామని ఇద్దరు ఆలా లోపలకి వెళ్లి పనిముగించుకుని వచ్చి చూస్తే కారు అద్దాలు పగిలిపోయి ఉండటం గమనించారు. సరికదా అనుకుని కారులోపలకెళ్లి చూస్తే పాస్‌పోర్ట్‌, క్రెడిట్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ మాయం చేశారు. ఈ సంఘటన మధుబన్‌ పోలీస్‌ అకాడమీ సమీపంలోనే జరగటం విశేషం. ‘ నేను , నా స్నేహితుడు మధుబన్‌ పోలీస్‌ అకాడమీ దగ్గరలో ఉన్న ‘ కేఫ్‌ కాఫీ డే’ లో కాఫీ తాగుదామని కారు దిగాం. కారుకు లాక్‌ వేసి కాఫీ షాపులోకి ప్రవేశించాం. 

ఐదు నిమిషాల తరవాత వచ్చే చూస్తే షాక్‌. కారు అద్దాలు పగిలిపోయి ఉన్నాయి. బ్యాగ్‌లో ఉన్న వస్తువులన్ని కూడా మాయమైయిపోయాయి. ’ అని దొంగతనం అనంతరం భజ్జీ వాపోయాడు. పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు భజ్జీకి చెందిన 10 క్రెడిట్‌కార్టులు దొంగలు ఎత్తుకుపోయారు. విషయాన్ని గ్రహించిన భజ్జీ వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కనీసం తన పాస్‌పోర్టునైనా వెంటనే తిరిగి తనకు అప్పగించాలని పోలీసులను వేడుకున్నాడు.

Monday, December 12, 2011

జీవితంలో ఎలాంటి లక్షాలు పెట్టుకోలేదు


venkatesh talangana patrika telangana culture telangana politics telangana cinemaవెంక ముచ్చటిస్తే ఆయన మాటల్లో సినిమా సంగతులకంటే ఆధ్యాత్మిక విషయాలే ఎక్కువ చర్చకు వస్తాయి. ఆయన మాట్లాడే ప్రతి మాటలో జీవితం తాలూకు తాత్విక చింతన తొంగిచూస్తుంది. జయాపజయాలకు అతీతంగా సినిమాని ప్రేమిస్తారాయన. విలక్షణ పాత్రలతో తెలుగు సినిమాలో కుటుంబ చిత్రాల కథానాయకుడిగా తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నారు వెంక ‘మనం చేసే పనిని నిజాయితీగా చేయాలి. ఫలితం ఎలా వున్నా స్వీకరించాలి’ అన్నది ఆయన నమ్మిన ఫిలాసఫీ. తాజాగా ఆయన ‘బాడీగార్డ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకుడు. త్రిష కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురాబోతోంది. నేడు వెంక జన్మదినం. ఈ సందర్భంగా ఆయన చెప్పిన సంగతులివి...

ఈ పుట్టిన రోజుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు?
పుట్టిన రోజు సందర్భంగా నిర్ణయాలు తీసుకునే అలవాటు లేదు. అయితే ఈ మధ్యే మూడు వారాల పాటు కాశీలోని నందిదేవా ఆలయాన్ని, బుద్దుడు సంచరించిన సారనాథ్ ప్రాంతాన్ని, ఆయన సమాధి అయిన ప్రదేశాల్ని సందర్శించి వచ్చాను. ఈ యాత్రలో చాలా విషయాలు తెలుసుకున్నాను. మనిషి వేటిని వదులుకున్నా ఫర్వాలేదు కానీ ఆధ్యాత్మిక విషయాల్ని నిరంతరం నేర్చుకోవాలన్నది నా ఫిలాసఫీ.

‘బాడీగార్డ్’ సినిమా విశేషాలేమిటి?
ఇంట్రడక్షన్ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. యాక్షన్‌తో పాటు సినిమాలో మంచి సెంటిమెంట్ వుంటుంది. చివరి ముఫ్పై నిమిషాల ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. స్క్రీన్‌ప్లే కూడా కొత్త తరహాలో వుంటుంది. నా శైలి వినోదం కూడా వుంటుంది.
‘బాడీగార్డ్’ మలయాళ, తమిళ, హిందీ భాషల్లో విజయం సాధించింది. కథాంశం అందరికీ తెలిసిందే!..

ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పిస్తుందని అనుకుంటున్నారు?
మూడు భాషల్లో హిట్ అయినా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్ల్లు సినిమా స్క్రిప్ట్‌లో మార్పులు చేశాం. ముఖ్యంగా లవ్‌స్టోరీ కొత్తగా వుండేలా తీర్చిదిద్దాం. అదీగాక చాలా కాలం విరామం తర్వాత నేను ఈ సినిమాలో మంచి యాక్షన్ ఎపిసోడ్స్ చేశాను. సంగీతపరంగా కూడా మిగతా మూడు భాషల కంటే తెలుగులో పాటలు బాగా వచ్చాయి. సంగీత దర్శకుడు థమన్ పాటల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ అంశాలన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తాయి.

‘నాగవల్లి’ తర్వాత బెల్లంకొండ సురేష్‌తో రెండో సినిమా చేస్తున్నారు. మేకింగ్ పరంగా సినిమా ఎలా వుంటుంది?
ఉన్నత నిర్మాణ విలువలతో ‘బాడీగార్డ్’ తెరకెక్కింది. ఈ సినిమాలోని కొన్ని లొకేషన్స్ చాలా కొత్తగా వున్నాయి. ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో అలాంటి లొకేషన్స్ చూసి వుండరు.

సల్మాన్‌ఖాన్ హిందీ ‘బాడీగార్డ్’ చిత్రంలో షర్ట్ విప్పేస్తాడు. మీరు కూడా ఈ సినిమాలో అలాంటి ప్రయత్నం ఏమైనా చేశారా?
మనకంత సీన్‌లేదు... షర్ట్ విప్పడం లాంటి సన్నివేశాలేం వుండవు. నా కెరీర్‌లో ఇంతవరకూ షర్ట్ విప్పి నటించలేదు. ఇప్పుడు కొత్తగా విప్పితే బాగుండదు.

మహేష్‌బాబుతో కలసి చేస్తోన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేమిటి?
ఈ కథలో మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ వున్నాయి. మహేష్, నేను అన్నదమ్ముల్లుగా నటిస్తున్నాం. ఇద్దరు అన్నదమ్ములు జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, ఒకరికొకరు ప్రాణంగా సాగే వారి జీవిత ప్రయాణమే ఈ చిత్రం.
మహేష్‌బాబుతో మీకున్న అనుబంధం ఎలాంటిది?
హీరోగా ఆయనకంటూ ప్రత్యేకమైన సై్టల్ వుంది. తెలుగు సినిమా హీరోలందరిలో అందగాడు. మహేష్‌బాబు మంచి కామెడీని పండిస్తాడు. ఆయన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా కోసం మేమిద్దరం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం.

మల్టీస్టారర్ సినిమాలపై మీ అభివూపాయమేమిటి?
హిందీలో ఎక్కువగా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయి. తెలుగులో కూడా అందరూ మల్టీస్టారర్ సినిమాలు చేయాలి. మల్టీస్టారర్ సినిమాల వల్ల మంచి కథలు వస్తాయి. పరిక్షిశమ కూడా బాగుంటుంది.

మీ డ్రీమ్ ప్రాజెక్ట్ వివేకానందను ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?
స్క్రిప్ట్ సిద్ధమవుతోంది. బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్ దర్శకత్వం వహిస్తాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో షూటింగ్ ప్రారంభమవుతుంది. వివేకానందుని తాత్విక చింతన, ఫిలాసఫీని నేను బాగా ఇష్టపడతాను. వివేకానందుడు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రవచనాలు మనల్ని జాగృత పరుస్తాయి. ఆయన జీవిత చరిత్ర నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా వుంటుంది. వివేకానందుడు చెప్పినట్లు... మనలో ఏమైనా అశాంతి, బాధ వుంటే ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని బిగ్గరగా ఏడవండి...అలా చేయడం ద్వారా మీ మనసు కుదుటపడుతుంది. ఎందుకంటే నిరంతరం వేదనలతో మనం ఈ అందమైన ప్రపంచాన్ని కలుషితం చేస్తున్నాం.

మీరు అలవర్చుకున్న ఆధ్యాత్మిక ధోరణి ఎలాంటి అనుభవాలనిస్తోంది?
ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మికత అవసరమని నా అభివూపాయం. బుద్దుడినే తీసుకోండి..ఆయన మనలాంటి సాధారణ మనిషి. మనుషుల్లో మహాత్ముడు ఎందుకయ్యాడు? కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయగలిగాడు? అనే విషయాల్ని అందరూ ఆలోచించుకోవాలి. ఆధ్యాత్మిక సాధన చేస్తే అందరూ బుద్దుడి అంతటి స్థాయికి చేరుకోవచ్చని నా నమ్మకం.

జయాపజయాల్ని మీరెలా స్వీకరిస్తారు?
నిజాయితీగా మానవ ప్రయత్నం చేయాలి. ఫలితం గురించి ఆలోచించకూడదు. ప్రయత్నం చేయడం వరకే మన పని. అలాగే నేను జీవితంలో ఎలాంటి లక్ష్యాల్ని పెట్టుకోను. ఎందుకంటే లక్ష్యాల్ని నిర్ధేశించుకోవడం వల్ల అనవసర ఆందోళనలు వెంటాడుతాయి.

మీ తనయుడు అర్జున్‌ని వెండితెరకు ఎప్పుడు పరిచయం చేస్తారు?
జాకీచాన్ ‘కరాటే కిడ్’ సినిమా అంటే వాడికి చాలా ఇష్టం. ఆ సినిమా చూసి నన్ను జాకీచాన్‌లా నటించమంటున్నాడు. వాడు నా శిష్యుడిగా నటిస్తాడట. అయితే అర్జున్ ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నాడు. సినిమాల్లో రావడానికి చాలా టైముంది.

రానా కెరీర్ ఎలా వుందని భావిస్తున్నారు?
రానాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే పాషన్. నా కన్నా ఎక్కువగా సినిమాని ప్రేమిస్తాడు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడుతాడు. తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్‌పై కూడా దృష్టి పెడుతున్నాడు. ఏ విషయంలోనైనా రానా కొత్తగా ఆలోచిస్తాడు.

అగ్రహీరోలందరూ ఎక్కువ సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. మీరు కూడా వచ్చే ఏడాది మూడు సినిమాలు చేయబోతున్నారు. మారుతున్న ఈ ధోరణిపై మీరెమంటారు?
ఇలా ఎప్పటినుంచో అగ్రహీరోలందరూ సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేసి వుంటే ఇండస్ట్రీ ఎప్పుడో సెట్ అయ్యేది. ఈ పరిణామం పరిక్షిశమకు చాలా మంచిది. అదే సమయంలో బడ్జెట్ కంట్రోల్‌పై కూడా హీరోలు దృష్టి పెట్టాలి.

పౌరాణిక సినిమాలు చేసే ఆలోచన వుందా?
ఇప్పటి వరకు పౌరాణిక సినిమాలు చేద్దామని నన్నెవరూ సంప్రదించలేదు. ఎవరైనా నన్ను మంచి స్క్రిప్ట్‌తో ముందుకొస్తే చేయడానికి ఇబ్బందేమిలేదు.

మీ తదుపరి చిత్రం?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెటు’్ట తర్వాత మోహర్ రమేష్ దర్శకత్వంలో ఓ చిత్రం వుంటుంది. ఫుల్‌పూంగ్త్ యాక్షన్ చిత్రమది. ఎప్పటి నుంచే సై్టలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చేద్దామనుకుంటున్నాను. అలాంటి స్క్రిప్ట్‌తో ముందుకొచ్చాడు దర్శకుడు మోహర్ రమేష్.

నేడు రజనీకాంత్‌ పుట్టిన రోజు


 దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ఈరోజు తన 62వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. పసి వయస్సు నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న శివాజీరావ్‌గైక్వాడ్‌ స్వయం కృషితో రజనీకాంత్‌గా ఎదిగిన వైనం ఓ సినిమానే తలపిస్తుంటుందని సినీ విమర్శకులే అంటుంటారు. ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తే, ఓ విజయవంతమైన సినిమాగా సినీ చరిత్రలో నిలిచిపోతుందని వారు అభిప్రాయపడుతుంటారు. ఐదేళ్ల వయస్సులోనే తల్లిని పొగొట్టుకున్న రజనీకాంత్‌ కడుపు నింపుకునేందుకు అనేక కష్టాలు పడ్డాడు. గవర్నమెంట్‌ స్కూల్‌లో కన్నడ మాధ్యంలో చదువుకున్నారు. అనంతరం జీవన సమరం చేశాడు. చివరకు మూటలు మోసే కూలీగా అవతారమెత్తారు. అనంతరం బస్సు కండక్టర్‌గా ఉద్యోగం కూడా చేశారు. రజనీకాంత్‌కు నాటకాలంటే పిచ్చి అభిమానం. ఎన్నో నాటకాల్లో నటించారు. సన్నిహితుల ప్రోత్సహంతో మద్రాస్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. బాలచందర్‌ దృష్టిలో పడడంతో ఆయన దశ తిరిగింది. బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ాఅపూర్వ రాగంగల్‌్ణ సినిమాలో నటించారు. 1975లో వచ్చిన ఈ సినిమాకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు రావడంతో శివాజీరావుగైక్వాడ్‌కు మంచి పేరు వచ్చింది. శివాజీరావుగైక్వాడ్‌ నుంచి రాజనీకాంత్‌గా పేరు మార్చింది బాలచందరే. ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేస్తూ తనదైన స్టైల్‌తో దక్షిణాదిలో దూసుకెళ్లారు రజనీకాంత్‌. ఆయన స్టైల్‌ అభిమానులను ఇప్పటికీ అలరిస్తుంది. విదేశాల్లో రజనీకాంత్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రష్యన్లకు రాజ్‌కపూర్‌ అంటే ఎంతో ఇష్టం. అలానే జపనీస్‌కు రజనీ అంతే ఇష్టంగా మారారు. రజనీకాంత్‌ ప్రతి చిత్రం జపాన్‌లో విడుదల కావాల్సిందే. అతిసామాన్యంగా ఉంటూ అందరికీ ఆయన ఆదర్శనీయంగా కనిపిస్తారు. ఆయన ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగారని, మరిన్ని ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Sunday, December 11, 2011

మల్లెమాల ఇక లేరు

 ప్రముఖ నిర్మాత, రచయిత ఎం.ఎస్‌.రెడ్డి (87) ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం ఫిలింనగర్‌లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఎం.ఎస్‌.రెడ్డి మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి సినీపరిశ్రమకి తీరని లోటని పేర్కొన్నారు. నేడు మల్లెమాల అంతిమ సంస్కారాలు హైదరాబాద్‌లో జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.ఎం.ఎస్‌.రెడ్డి పూర్తి పేరు మల్లెమాల సుందర రామిరెడ్డి. నెల్లూరు జిల్లా..అలివిరి అనే గ్రామంలో 1952లో జన్మించారు. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన ఎం.ఎస్‌.రెడ్డి ఐదుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు.
రెడ్డిగారికి చిన్నప్పటినుంచే పఠనాసక్తి ఉంది. ఆ ఆసక్తితో ఎన్నో పుస్తకాలు చదివారు. అభ్యుదయ రచయిత శ్రీశ్రీ అంటే తనకి వల్లమాలిన అభిమానం. విశ్వనాథ సత్యనారాయణ రచనలన్నా ఎంతో ఆసక్తిగా చదివేవారు. ఆ క్రమంలోనే కవిత్వం, పద్యం, పుస్తకం..ఇలా అన్ని విభాగాల్లో రచనలు చేశారు. ఆయన తన ఇంటిపేరునే కలం పేరుగా (మల్లెమాల) మార్చుకుని ఎన్నో రచనలు చేశారు. కవితలు రాశారు. ఆయన రాసిన పద్యకవితలు..మహారచయిత విశ్వనాథ సత్యనారాయణ మెప్పు సైతం పొందాయి. ‘ఇది నా కథ’ పేరుతో ఇటీవల తన ఆత్మకథను విడుదల చేశారు. అయితే అది వివాదాస్పదమైంది. ఇంటా, బయటా వచ్చిన ఒత్తిళ్లతో ఆ పుస్తకాన్ని పూర్తిగా మార్కెట్లోకి రిలీజ్‌ చేయకుండా నిలిపేశారు.

1966లో ‘కన్నెపిల్ల’ అనే అనువాద చిత్రంతో నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. తర్వాత శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా కె.ఎస్‌. ప్రకాశరావు దర్శకత్వంలో ‘భార్య’ చిత్రాన్ని నిర్మించారు. ఎన్టీర్‌తో ‘శ్రీ కృష్ణ విజయం’, చలం హీరోగా ‘ఊరికి ఉపకారి’, శోభన్‌బాబు హీరోగా ‘కోడెనాగు, నాయుడుబావ, రామబాణం, కృష్ణ హీరోగా ‘ఏకలవ్య’, రామకృష్ణ హీరోగా ‘దొరలు-దొంగలు’ నారాయణరావు హీరోగా ‘ముత్యాల పల్లకి’ నిర్మించారు. 1966 నుంచి 1987 వరకు అంటే రెండు దశాబ్దాలపాటు కౌముది పిక్చర్స్‌ పతాకంపై 25కు పైగా చిత్రాలను జయాపజయాలతో సంబంధం లేకుండా నిర్మించారు.

స్వయంగా సహజకవి అయిన ఎం.ఎస్‌.రెడ్డి దాదాపు ఐదువేలకు పైగా కవితలు, పాటలు, పద్యాలు రాశారు. తన సినిమాలలో తాను రాసిన పాటలు ఉపయోగించుకునేవారు. ఎక్కువగా ఆయన పాటలకు సత్యం మాష్టారు ట్యూన్లు కట్టేవారు. బాల రామాయణం చిత్రం ద్వారా జూనియర్‌ ఎన్టీఆర్‌ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ చిత్రంతో జాతీయ అవార్డ్‌ సైతం అందుకున్నారు. ‘అంకుశం’ చిత్రంలో ఆయన చేసిన ముఖ్యమంత్రి పాత్ర నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది.

2005లో రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. ఈయన తనయుడు శ్యాంప్రసాద్‌ రెడ్డి మల్లెమాల బ్యానర్‌పై సినిమాలు నిర్మిస్తున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తిగా మల్లెమాలకు పేరుంది. ఇటీవలే ఆయన ‘ఇదీ నా కథ’ పేరుతో రాసిన ఆత్మకథ పలు వివాదాలు సృష్టించింది. తన ఆత్మకథలో పలువురు సినీప్రముఖులపై సూటిగా విమర్శించి సంచలనం సృష్టించారు.


annnrఎవరికీ అపకారం చేయని వ్యక్తి. ముక్కుసూటి మనిషి. ఆయన నిష్ర్కమణంతో పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయింది.
-డా.అక్కినేని నాగేశ్వరరావు
rCMmmmmmరాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ..నిర్మాత ఎం.ఎస్‌.రెడ్డి మృతిపట్ల తీవ్ర విభ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని సందర్శించిన అనంతరం గొప్ప వ్యక్తిని సినీపరిశ్రమ కోల్పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
rannnaపరిశ్రమకు అన్నీ తానే అయి తలో నాలుకలా మెలిగేవారు. చివరి రోజుల్లో ఏ బాదరబందీ లేని వ్యక్తిగా స్వర్గస్తులైన గొప్ప వ్యక్తి. మల్లెమాల ధన్య జీవి.
-డా డి.రామా నాయుడు
nirmala‘పల్నాటి సింహం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు స్వయంగా పాటలు రాశారు. పరిశ్రమ నేడు పెద్ద దిక్కును కోల్పోయింది.
-కృష్ణ, విజయనిర్మల దంపతులు


naiduఉత్తమ నిర్మాత, కవి, దార్శనికుడు మల్లెమాల. తెలుగుదనం ఉట్టిపడేలా కవిత్వం రాశారు. రెడ్డిగారి మరణం విచారం కలిగించింది.
-బిజెపి నేత వెంకయ్య నాయుడు


rajuvayyaపరిశ్రమలో నన్నెంతగానో ప్రోత్సహించిన గొప్ప వ్యక్తిని కోల్పోయాను. ఇది పెద్ద విషాదం. ఆయన ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.
-కృష్ణం రాజు
rojaaమల్లెమాలకు అభిమానిని. తనో అద్భుత కవి. ‘భైరవద్వీపం’ సినిమా చూసి రాకుమారి అంటే ఇలా ఉండాలి అని అభినందించారు.
-రోజా

Ram Charan's Yevadu Posters


Saturday, December 10, 2011

ప్రియమణికి తప్పిన ప్రమాదం

 హీరోయిన్‌ ప్రియమణి ఘాటింగ్‌ స్పాట్‌కు వెళ్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. కన్నడంలో పునీర్‌ రాజ్‌కుమార్‌ సరసన ప్రియమణి ' అన్నా బాండ్‌ ' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ ఘాటింగ్‌ కోసం బెంగుళూరుకు దగ్గరలోని ముత్తత్తి దుర్గ అటవీ ప్రాతానికి ప్రియమణితో పాటు ఆమె సెక్రటరీ, మేనేజర్‌, స్నేహితురాలు కలిసి కారులో బయలుదేరారు. అటవీ ప్రాంతం ద్వారా వెళ్తున్న సమయంలో వీరి వాహనాన్ని మరో వాహనం ఓవర్‌ టేక్‌ చేసింది. ఈ నేపథ్యంలో ప్రియమణి ప్రయాణం చేస్తున్న వాహనం అదుపు తప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది. అయితే ఎవరికి గాయాలు కాలేదు.

Friday, December 9, 2011

సచిన్‌ & సెహ్వాగ్‌

 సచిన్‌ : ఇతని గురించి ఎంత చెప్పినా తక్కువ రికార్డుల దీరుడు. వన్డేల్లో , టెస్టుల్లో మొత్తం కలిపి 97 సెంచరీల సాధించి సెంచరీల సెంచరీకి దగ్గరలో ఉన్నాడు.ఈ వివరాలు చాలు సచిన్‌ ది గ్రేట్‌ అని చెప్పడానికి. వన్డే క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకూ డబుల్‌ సెంచరీ చేసిన ఏకైక మొనగాడు ఒక్కడే అతడా మన లిటిల్‌ మాస్టర్‌ టెండూల్కర్‌.
సెహ్వాగ్‌ : వీరేంద్ర సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే చాలు పరుగుల వరద జలజలా పారుతుంది. ఫోర్లు సిక్సర్లు అలవోకగా మంచినీళ్లు తాగినంత సులభంగా బాదే సెహ్వాగ్‌ క్రీజులో ఉంటే ఎదుటి జట్టుకువెన్నులో వణుకు పడుతూనే ఉంటుంది. వీరు ఉన్నత సేపు స్కోరు బోర్డు ఇలా చూస్తూంటే అలా చకచకా వెళ్లిపోతుంది. అతను క్రీజులో ఉన్నంత సేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. ఏ బౌలర్‌ అయినా... స్పిన్‌ అయినా, ఫాస్ట్‌ అయినా..! ఒక్కటే ఃవీరః బాదుడు. ఇందులో ఇంకో విషయం తక్కువ స్కోరు వద్ద వికెట్‌ పడిందంటే అది సెహ్వాగ్‌ అని ప్రతి ఒక్కరు అనుకఁటారు. ఇది కూడా నిజం. అతను అడిన 5 బంతులలో ఒక ఫోరు తప్పని సరిగా వుంటుంది. తక్కువ బంతులలో ఎక్కువ స్కోరు చేసి జట్టుకు వేగంగా పరుగుల అందిస్తాడు.
సెహ్వాగ్‌ ఆడుతున్నంత సేపు ప్రేక్షకుడు టీవి ముందునుంచి కదలడంటే వీరు ఆటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసంరంలేదు.
భారత్‌ బ్యాట్స్‌మెన్లలో ఇంత వరకూ ట్రిఫుల్‌ సెంచరీ చేసిన మొనగాడు సెహ్వాగ్‌ మాత్రమే
సచిన్ (గ్వాలియర్), సెహ్వాగ్ (ఇండోర్) డబుల్ సెంచరీలు సాధించిన రెండు మైదానాలు మధ్యప్రదేశ్‌లోనివే. పరుగుల వరద పారించిన ఈ రెండు పిచ్‌లకు క్యూరేటర్ ఒక్కరే (సమందర్ సింగ్).
బౌండరీల ద్వారా ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్ (142) రెండో స్థానంలో నిలిచాడు. వాట్సన్ (150) ముందు ఉన్నాడు.
ఇన్నింగ్స్‌లో అత్యధిక ఫోర్లు కొట్టిన సచిన్ (25) రికార్డును వీరూ (25) సమం చేశాడు.
వన్డేల్లో 8 వేల పరుగులు దాటిన ఐదో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్ నిలిచాడు.
డబుల్ సెంచరీతో సెహ్వాగ్ చూపిన అద్భుత ప్రదర్శనకు గాను మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ రూ. 10 లక్షలు బహుమానంగా ఇచ్చింది.
సచిన్ డబుల్ సెంచరీ చేసినప్పుడు కూడా భారత్ సరిగ్గా 153 పరుగుల తేడాతోనే దక్షిణాఫ్రికాను ఓడించింది.
32 ఒక మ్యాచ్‌లో అత్యధికసార్లు బంతిని బౌండరీ దాటించి (25 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరూ కొత్త రికార్డు
వన్డేల్లో సెహ్వాగ్ సెంచరీల సంఖ్య 15
4 వన్డేల్లో నాలుగుసార్లు 400 పైచిలుకు స్కోర్లు నమోదు చేసిన ఏకైక జట్టు భారత్.
వీరూకు నా అభినందనలు. అతడి రికార్డును చూస్తే సంతోషంగా ఉంది. నా రికార్డును మరో భారతీయుడు అధిగమించడం మరింత సంతృప్తినిచ్చింది
- సచిన్