ప్రస్తుతం సినిమా స్టైల్, ఆడియన్స్ టేస్ట్ పూర్తిగా మారిపోయింది. గతంలోలా
ఆరుపాటలు, ఐదు ఫైట్లు అన్న కాన్సెప్ట్ మారిపోయింది. అవసరం ఉంటేనే
సినిమాల్లో పాటలు పెడుతున్నారు. అది కూడా మూడు నిమిషాలకే
ముగించేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో కూడా పాటల పందిరి లాంటి సినిమా ఒకటి
ప్రేక్షకుల ముందుకు రానుంది.
కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదరుచూస్తున్న బాలీవుడ్ యువ నటుడు
రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా జగ్గా జాసూస్. రణబీర సరసన
కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఏకంగా 29 పాటలున్నాయట.
గతంలో 'హమ్ ఆప్ కే హై కౌన్' సినిమాలో 14 పాటలుండగా ఆ రికార్డ్ ను బ్రేక్
చేసి జగ్గా జాసూస్ లో 29 పాటలు పెట్టారు మేకర్స్. ఈ సినిమాకు ప్రీతమ్
సంగీతం అందిస్తున్నాడు.
కమర్షియల్
చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చిన కె.రాఘవేంద్రరావు తనలోని
మరో కోణాన్ని చూపిస్తూ భక్తి ప్రధానమైన చిత్రాల్ని తెరకెక్కిస్తున్నారు.
వాటిలోనూ తనదైన మార్క్‌ని చూపిస్తూ ఆబాల గోపాలాన్ని అలరిస్తున్నారు. అందులో
భాగంగా రూపుదిద్దుకొన్న చిత్రమే ‘ఓం నమో వేంకటేశాయ’. ‘అన్నమయ్య’,
‘శ్రీరామదాసు’, ‘శిరిడిసాయి’ చిత్రాల తర్వాత రాఘవేంద్రరావు-నాగార్జున
కలయికలో వస్తున్న చిత్రమిది. వేంకటేశ్వరస్వామికి పరమ భక్తుడైన
హథీరాం బాబాజీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమాను తీస్తే రాఘవేంద్రరావే
తీయాలి.. చేస్తే నాగార్జునే చేయాలి అన్నట్టుగా ఆ ఇద్దరూ భక్తి ప్రధానమైన
చిత్రాలపై ఓ ప్రత్యేకమైన ముద్రవేశారు. అందుకే ‘ఓం నమో వేంకటేశాయ’కి
కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచే అంచనాలు షురూ అయ్యాయి. మరి ఆ మేజిక్
మరోసారి తెరపై కనిపించిందా? శ్రీవారి భక్తుడు ‘అన్నమయ్య’గా ఒదిగిపోయిన
నాగార్జున, హథీరాం బాబాగా ఎలా నటించాడు.. లాంటి ప్రశ్నలకు సమాధానాలు..
కథేంటంటే?:
దేవుడిని
చూసే విద్య నేర్చుకోవాలంటూ బాల్యంలోనే ఇంటి నుంచి బయటకొస్తాడు రామ(నాగార్జున).
వేద పాఠశాలలో విద్యనభ్యసిస్తూ గురువు(సాయికుమార్) చెప్పిన
మాటతో తపస్సుకు పూనుకుంటాడు. ఆ తర్వాత తిరుమల చేరతాడు. కానీ
స్వామి దర్శనం మాత్రం కాదు. దేవుడ్నే చూడాలంటూ అన్న, పానీయాలు లేకుండా
అయిదురోజుల పాటు గుడిముందే కూర్చుంటాడు. స్వామికోసమే ఈ జీవితం అంటూ
సదా ఆయన ఆరాధనలో మునిగి తేలుతుంటాడు. అలాంటి పరమ భక్తుడికి స్వామి
దర్శన భాగ్యం కలిగిందా? లేదా? తిరుమలలో ఆలయ అధికారి గోవిందరాజులు(రావు
రమేష్) రామపై ఎందుకు కక్ష కట్టాడు? రామను పరీక్షించేందుకు స్వామి
ఏం చేశాడు? ఆ ప్రయత్నంలో రామ జీవితంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి?
ఆయన్ని మనువాడాలనుకొన్న భవానీ (ప్రగ్యాజైస్వాల్) కథేంటి? రామ కోసం
ఆమె చేసిన త్యాగం ఎలాంటిది? శ్రీవారికి మరో భక్తురాలైన కృష్ణమ్మ(అనుష్క)కి
రామకి మధ్య సంబంధం ఏమిటి? రామ.. హథీరాం బాబాగా ఎలా మారాడు? తదితర
విషయాల్ని తెలుసుకోవాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:
భక్తికున్న
శక్తితో వేంకటేశ్వరస్వామిని మురిపించిన మరో పరమ భక్తుడు హథీరాం
బాబా కథ ఇది. బాల్యంలోనే స్వామిని ప్రత్యక్షంగా చూడాలంటూ బయటకొచ్చిన
హథీరాం తిరుమలను కలియుగ వైకుంఠంగా మార్చడంలో కృషి ఎలాంటిది?
స్వామి వారి చేతుల మీదుగానే సజీవ సమాధి ఎలా అయ్యాడు? తదితర విషయాలతో
ఈ చిత్రం సాగుతుంది. వేంకటాచల స్థలపురాణం, హథీరాంబాబా, కృష్ణమ్మల
భక్తి నేపథ్యంలో తొలిసగ భాగం సాగుతుంది. భక్తులపై జరుగుతున్న
దోపిడీని అడ్డుకుంటూ తిరుమలను పరమ పవిత్రంగా ఉంచేందుకు హథీరాం
బాబా ప్రయత్నించడం, స్వామి భక్తులకు పుణ్య క్షేత్రం విశిష్టతను చాటిచెప్పడం
తదితర సన్నివేశాలతో చిత్రం సాగుతుంది. అధికారి గోవిందరాజులు, ఆయన
బృందం చేసే అరాచకాలను అడ్డుకుంటూ హథీరాం బాబా స్వామి సేవలో పునీతమయ్యే
తీరును తెరపై కళ్లకు కట్టారు.
ఎవరెలా: ‘అన్నమయ్య’,
‘శ్రీరామదాసు’లా భక్తుల పాత్రలో ఒదిగిపోయిన నాగార్జున హథీరాం బాబాగా
నటించి ఆ పాత్రకు పూర్తి న్యాయం చేశారు. సౌరభ్‌జైన్ వేంకటేశ్వరుడిగా
చక్కగా నటించాడు. కృష్ణమ్మగా అనుష్క పాత్ర చాలా కీలకం. పతాక సన్నివేశాల
వరకూ ఆమె తెరపై కనిపిస్తూనే ఉంటుంది. వేంకటేశ్వరస్వామి భక్తురాలిగా
పవిత్రత ఉట్టిపడేలా తెరపై కన్పించింది. నాగార్జున కూడా పాత్రలో లీనమై
నటించారు. పతాక సన్నివేశాల్లో ఆయన నటన మరోస్థాయికి చేరిందనే చెప్పాలి.
జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్‌లాంటి నటులు తెరపై కనిపించేది కాసేపే అయినా
ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. రావురమేష్, బ్రహ్మానందం, వెన్నెల
కిషోర్ తదితర పాత్రలు వినోదాన్ని పంచుతాయి.
సాంకేతికంగా
ఈ సినిమా చాలా బాగుంది. ఎస్.గోపాల్‌రెడ్డి కెమెరా పనితనం ప్రేక్షకులను
మంత్ర ముగ్ధులను చేస్తుంది. ముఖ్యంగా శేషగిరులను చూపించిన విధానం, ప్రతీ
సన్నివేశం వర్ణ రంజితంగా ఉంటుంది. కీరవాణి సంగీతం కథకు ప్రాణం పోసింది.
చాలా వరకూ కథ పాటల రూపంలోనే చెప్పారు. ఆ సమయంలో కీరవాణి అందించిన
స్వరాలు కీలక పాత్ర పోషించాయి. నేపథ్య సంగీతం కథను మరింత గుండెకు
హత్తుకునేలా మార్చింది. కిరణ్‌కుమార్ కళా ప్రతిభ అడుగడుగునా
కనిపిస్తుంది. దర్శకుడిగా కె.రాఘవేంద్రరావు మరోసారి తనదైన
మేజిక్‌ను ప్రదర్శించారు. నాగార్జున-ప్రగ్యాజైస్వాల్, జగపతిబాబు-అనుష్కలపై
తెరకెక్కించిన సన్నివేశాలు భక్తిరస చిత్రంలోనూ కె. రాఘవేంద్రరావు
మార్కు కమర్షియల్ ఛాయలు స్పష్టంగా కనిపించేలా చేస్తాయి. మిగిలిన చోట్ల
కూడా పండ్లు, దీపాలు, పుష్పాలతో తెరను వర్ణ శోభితం చేశారు. కథను చెప్పిన
విధానం కూడా చాలా బాగుంది. హథీరాం, కృష్ణమ్మల జీవితాలతో పాటు ఆలయ స్థలపురాణం,
వరాహమూర్తి దర్శనం, స్వామివారికి చేసే సేవల విశిష్టతలను సినిమాలో చూపించిన
విధానం తెలియని వారికి ఎన్నో విషయాలను తెలియజేస్తుంది.
కథేంటంటే?:
సింగం
సిరీస్ తొలి భాగం ‘సింగం’ పల్లెటూరి నేపథ్యంలో సినిమా సాగుతుంది. తర్వాత
భాగం ‘సింగం 2’ సింగం (సూర్య) పట్టణానికి వస్తాడు. మూడో భాగం ‘సింగం
3’లో పట్టణం నుంచి ఆస్ట్రేలియా వెళ్తాడు. ఒక పోలీసు కమిషనర్ హత్యకు సంబంధించిన
విచారణ చుట్టూ సాగే కథ ఇది. నిజాయతీ గల పోలీసు అధికారి సిడ్నీలో ఇండియన్
పోలీసు పవర్ ఎలా చూపించాడన్నది కథ. కథలో కావ్య (అనుష్క).. విద్య (శ్రుతిహాసన్)ల
మధ్య ఉన్న సంబంధం ఏంటి అన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలా ఉందంటే?:
ఈ
సినిమా కేవలం యాక్షన్ ప్రియుల్ని దృష్టిలో ఉంచుకునే తీర్చిదిద్దారు దర్శకుడు
హరి. అందుకు సంబంధించిన సన్నివేశాలు మాస్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
సూర్య పవర్‌ఫుల్ డైలాగ్‌లు.. మేనరిజం.. ఫైట్లపై దర్శకుడు దృష్టి
పెట్టారు. తొలి భాగం నిదానంగా సాగుతుంది. అనవసరంగా ఇరికించిన కామెడీ
సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. అనుష్క.. సూర్యల మధ్య నడిపించిన ట్రాక్
కూడా కథలో ఇమడనట్లుగా ఉందనిపిస్తుంది.
విశ్రాంతికి 20
నిమిషాల ముందు నుంచి థ్రిల్ కలిగించే సన్నివేశాలు మొదలవుతాయి. దాంతో
ప్రేక్షకుడికి ఆసక్తి మొదలవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు
అలరిస్తాయి. ద్వితీయార్ధం ప్రారంభంలో సన్నివేశాల్ని పరుగులు పెట్టించాడు
దర్శకుడు. సిడ్నీ నేపథ్యంలో సాగిన యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకుంటాయి.
ఛేజింగ్‌లు.. సూర్య చేసిన ఫైట్లు.. పోలీసు పవర్‌ను చూపించిన డైలాగ్‌లు
ఇవన్నీ కలిసి ఓ యాక్షన్ ప్యాకేజీలా దర్శకుడు చూపించాడు.
ఆస్ట్రేలియాలో
జరిగే సన్నివేశాలు సినిమా స్థాయిని పెంచేలా ఉన్నాయి. మొత్తంగా చూస్తే ప్రథమార్థం
కన్నా ద్వితీయార్థం పట్టుగా సాగింది. కాకపోతే దర్శకుడు తొలి రెండు భాగాల్లో
చూపించిన చాకచక్యం ఈ సినిమాలో చూపించలేకపోయాడు. కథ బలహీనంగా
ఉండటం.. హీరో పాత్రపై తప్ప మరే పాత్రపైనా దృష్టి పెట్టకపోవడం నిరాశకు
గురి చేస్తాయి. ‘వైఫై..’ పాట కోసం మాత్రమే శ్రుతిహాసన్‌ను తీసుకున్నారా..
అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు మామూలుగా సాగాయి.
ఎవరెలా చేశారంటే:
సూర్య
కోసమే ఈ సినిమా తీశారా.. అనేలా ఉంది. మరోసారి శక్తిమంతమైన పోలీసు పాత్రలో
సూర్య రాణించారు. సూర్య గెటప్.. తను చేసిన పోరాట దృశ్యాలు ఆకట్టుకుంటాయి.
అనుష్క మరీ లావుగా కనిపించింది. ఈ విషయంలో తాను జాగ్రత్తలు తీసుకుంటే
మంచిది. ఆమె పాత్రకు అంత ప్రాముఖ్యత లేదు. శ్రుతిహాసన్‌ది కేవలం గ్లామర్
పాత్ర మాత్రమే. విలన్ పాత్రల్ని పోషించిన వారిని దర్శకుడు స్టైలిష్‌గా చూపించాడు.
రాధిక నటన ఆకట్టుకుంటుంది.
చివరగా.. యాక్షన్
ప్రియులకు ‘ఎస్’3
వరుస
విజయాలతో దూసుకెళుతున్నాడు
నాని. భలే భలే మగాడివోయ్,
కృష్ణగాడివీర ప్రేమగాథ, జెంటిల్‌మన్,
మజ్ను... ఇలా ఆయన జోరు కొనసాగుతూఉంది.
పలువురు స్టార్ దర్శకులు
నానితో కలిసి పనిచేయడానికి
ఉత్సాహం చూపించినా ఆయన మాత్రం
మళ్లీ తనదైన శైలిలోనే కంటెంట్‌కి
ప్రాధాన్యమిస్తూ నేను
లోకల్` చేశాడు. వరుస విజయాల
నాని.. దిల్‌రాజు నిర్మాణ
సంస్థ... దేవిశ్రీప్రసాద్
సంగీతం... ఇలా విడుదలకి ముందే
ప్రేక్షకుల్ని ఆకర్షిస్తూ అంచనాల్ని
పెంచిందీ చిత్రం. మరి సినిమా
అంచనాలకి తగ్గట్టుగానే
ఉందా? నాని విజయాల జోరు కొనసాగినట్టేనా?
తదితర విషయాలు తెలియాలంటేరివ్యూలోకి
వెళ్లాల్సిందే...
కథేంటి:
ఇంజినీరింగ్ పూర్తి చేసి, సరదా
సరదాగా తిరిగే కుర్రాడు బాబు(నాని).
తనలాగే తాను జీవించాలనే భావాలున్న
వ్యక్తి. ఎవరికోసం తనని తాను
మార్చుకోడు. కీర్తి(కీర్తిసురేష్)ని
తొలిసారి చూడగానే మనసు పారేసుకుంటాడు.
తన ప్రేమ విషయం చెబితే అందుకు
కీర్తి నో చెబుతుంది. ‘నువ్వు
ప్రేమించే వరకూ విసిగిస్తా’నని
బాబు ఆమె వెంటపడుతుంటాడు. ఈ
క్రమంలో అతని మనసును తెలుసుకున్న
కీర్తి ప్రేమలో పడుతుంది. ఆ
విషయం రేపు ‘మనం కలుసుకున్నప్పుడు’
చెబుతానని బాబుతో అంటుంది. ఈ
నేపథ్యంలో కీర్తి కిడ్నాప్‌నకు
గురవుతుంది. ఈ విషయం తెలుసుకున్న
బాబు ఆమెను రక్షించేందుకు వెళ్లగా,
అక్కడ అప్పటికే పోలీస్ అధికారి
సిద్ధార్థ వర్మ (నవీన్ చంద్ర)
రౌడీలను చితకబాదుతాడు. కీర్తిని
నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నానని,
ఆమె జోలికి ఎవరైనా వస్తే చంపేస్తానంటూ
వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే
అక్కడకు వచ్చిన బాబు రియాక్షన్
ఏంటి? బాబు, కీర్తిల ప్రేమ కథ
సుఖాంతం అయిందా? పోలీస్ అధికారి
సిద్ధార్థ వర్మ కథ ఏమిటి? తెలియాలంటే
సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?:
నాని సినిమా అంటే కుటుంబం మొత్తం
హాయిగా చూసే సినిమా అని ఓ మార్కు
ఉంది. ఈసారి కూడా అదే ట్రాక్‌లో
నడిచాడు నాని. ప్రథమార్ధం నాని-కీర్తి
సురేష్‌ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో
సరదా సరదాగా గడిచిపోతుంది. ఇక
నాని తల్లిదండ్రుల పాత్రలను
పోసాని కృష్ణమురళి, ఈశ్వరిరావు
పోషించారు. ఈ ముగ్గురి మధ్య
వచ్చే సన్నివేశాలూ కడుపుబ్బా
నవ్విస్తాయి. కీర్తి సురేష్
తన అందాలతో మరోసారి అలరించింది.
సిద్ధార్థ వర్మ పాత్ర ప్రవేశంతో
సరదాగా సాగే కథ ఓ కీలక మలుపు
తీసుకుంటుంది. విరామానంతరం
వచ్చే సన్నివేశాలు అన్నీ సిదార్థ
వర్మ, బాబు నేపథ్యంలో సాగుతాయి.
కీర్తిని ప్రేమించిన ఇద్దరూ
వాళ్ల మనసుల్లో ప్రేమను ఎలా
బయట పెట్టారు? కీర్తి ఎవరిపై
ఎలా మొగ్గు చూపుతుంది అనే విషయాలు
ఆకట్టుకునేలా సాగిపోతాయి. అయితే
ఎవరి ప్రేమలో ఎంత బలముందో నిరూపించాల్సిన
సమయంలో సిద్థార్థ వర్మ ప్రయత్నాలు
పెద్ద ఎత్తున సాగగా, బాబు ‘నేనేం
చేయను’ అంటూ చెప్పే సన్నివేశాలు
సాగతీతగా అనిపిస్తాయి. కథ ఎంతకీ
ముందుకు సాగకపోవడంతో ప్రేక్షకుడిని
ఒకింత అసహనానికి గురిచేస్తాయి.
మళ్లీ పతాక సన్నివేశాల రాకతో
కథ ఆసక్తికరంగా మారుతుంది. ద్వితీయార్ధం
నుంచి ముక్కోణపు ప్రేమ కథలా
ఒక అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల
మధ్య సాగేపోయేలా సన్నివేశాలు
ఉన్నాయి. చివరిలో కూడా ఓ కీలకమైన
మలుపు ఉండటంతో కథ రక్తి కట్టిస్తుంది.
కథ కొత్తది కాకపోయినా కథనంతో
ఆకట్టుకునే ప్రయత్నం తెరపై
కనిపిస్తుంది.
ఎవరెలా
చేశారంటే: నాని తన
నటనతో వన్‌మ్యాన్ షోలా ఆకట్టుకున్నాడు.
సంభాషణలు పలికే సమయంలో తనకున్న
ఈజీనెస్‌ను మరోసారి ప్రదర్శించాడు.
ప్రతీ సన్నివేశంలోనూ సంభాషణలు
పలికే విధానంలోనూ రజనీకాంత్‌ను
అనుసరించినట్టు స్పష్టంగా
అర్థమవుతుంటుంది. ఇదో ప్రేమ
కథ అయినా మాస్ అంశాలు ఉండటంతో
నాని రజనీని అనుసరించే ప్రయత్నం
చేశాడు. కీర్తి అందంగా కన్పించింది.
ఆమెకు నటనా ప్రాధాన్యం ఉన్న
పాత్ర లభించింది. సిద్ధార్థ
వర్మగా నవీన్‌చంద్ర ద్వితీయార్థంలో
కనిపిస్తాడు. అతనికీ మంచి పాత్రే
దక్కింది. సాంకేతికంగా మంచి
మార్కులు పడతాయి. ప్రసన్నకుమార్
మాటలు, త్రినాథరావు దర్శకత్వం
వారి వారి శైలిలో సాగుతాయి.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు
ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.
పాటలన్నీ అలరిస్తాయి. ‘దిల్’రాజు
నిర్మాణ విలువలు అడుగడుగునా
కనిపిస్తాయి.
చివరిగా:
‘లోకల్’ కుర్రాడి
ప్రేమకథ
దొరికిన పాత్రలతోనే చాలామంది సంతృప్తిపడిపోతారు. కానీ దానికి మించి ఏదో చేయాలని ఇంకొంతమంది చూస్తుంటారు. నా దారి మాత్రం దానికి భిన్నమ’’ంటోంది రకుల్‌ప్రీత్ సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ నుంచీ ఆమె కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగంతోనే దూసుకుపోతోంది. ఎప్పుడూ తన చేతిలో నాలుగు సినిమాలైనా ఉండేట్టు చూసుకొంటోంది రకుల్. అటు మహేష్‌బాబు, రామ్‌చరణ్‌లాంటి స్టార్ కథానాయకులతో నటిస్తూనే ఇటు... యువతరం కథానాయకులతోనూ జోడీ కడుతోంది. ఓ పాత్రని ఎంచుకొనేటప్పుడు మీ ఆలోచనలెలా ఉంటాయి? అని అడిగితే ‘‘కెరీర్ కొత్తలో నాకొచ్చిన పాత్రల్నే చేసేదాన్ని. అప్పుడు మరో ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఇప్పుడు రొటీన్ పాత్రలే వస్తున్నా.. అందులోనూ నా మార్క్ ఎలా చూపించాలని ఆలోచిస్తున్నా. నాకోసం కొత్త పాత్రలు సృష్టించండి అని చెప్పే ధైర్యం చేయలేను. ఎందుకంటే ప్రయోగాలు ఎల్లవేళలా విజయాన్ని అందివ్వకపోవొచ్చు. నాలో నటిని సంతృప్తి పరచుకోవడానికి సినిమాలతో ప్రయోగాలు చేసే సాహసాలు చేయను’’అని చెప్పింది రకుల్
ఇప్పుడిప్పుడే
టాలీవుడ్‌లో నటిగా ఎదుగుతోంది రెజీనా. తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస
సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ నటి.. త్వరలోనే బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో
కలిసి ఓ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై స్పందిస్తూ బిగ్‌బితో
నటించేందుకు ఆతృతగా ఉన్నానంటోంది రెజీనా.
అమితాబ్‌బచ్చన్..
అక్షయ్‌కుమార్ ప్రధానపాత్రలో 2002లో వచ్చిన ‘ఆంఖేన్’ బాక్సాఫీసు వద్ద
హిట్ సాధించింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆంఖేన్-2’ వస్తోంది. ఇందులో
నటించడంపై మాట్లాడిన రెజీనా.. ‘‘ అమితాబ్‌బచ్చన్‌తో నటించడానికి
భయపడటం లేదు. సినీ ఇండస్ట్రీలో సీనియర్ నటుల నుంచి చాలా విషయాలు
నేర్చుకోవచ్చు. అందుకే ఈ సినిమాలో నటించేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నా.
కాకపోతే ఇక్కడ ఇదే నా మొదటి చిత్రం కాబట్టి అందరి దృష్టి నాపై ఉంటుంది.
వారంతా నా నటనపై దృష్టిపెడతారు.. కాబట్టి వారిని మెప్పించగలగాలి.
ఇక్కడ నాకంటూ గుర్తింపు తెచ్చుకోగలగాలి. ఆ విషయంలోనే కొద్దిగా భయంగా
ఉంది.’’ అని చెప్పుకొచ్చింది.

‘బర్మా’, ‘జాక్సన్ దురై’ ఫేమ్
ధరణిధరన్ దర్శకత్వంలో తాజాగా
తెరకెక్కుతున్న చిత్రం ‘రాజా
రంగుస్కి’. ‘మెట్రో’ ఫేమ్ హిరీష్,
‘విల్ అంబు’ నాయిక శాంథిని
జంటగా నటిస్తున్నారు. శక్తివాసన్,
బర్మా టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న
ఈ చిత్రానికి యువన్ శంకర్‌రాజా
సంగీతం సమకూరుస్తున్నారు. ఇటీవలే
తొలిషెడ్యూల్ చిత్రీకరణను
పూర్తి చేశారు. సోమవారం నుంచి
రెండో షెడ్యూల్ చిత్రీకరణ
ప్రారంభం కానుంది. ఇందుకోసం
తరమణిలో ప్రత్యేక సెట్‌ను సిద్ధం
చేశారు. సినిమా గురించి దర్శకుడు
మాట్లాడుతూ మేం అనుకున్నదానికన్నా
సినిమా చిత్రీకరణ శరవేగంగా
సాగుతోంది. 50 శాతం పైచిలుకు చిత్రీకరణ
పూర్తయింది. ఇదేవేగంతోనే సినిమా
చిత్రీకరణ పూర్తవుతుందని భావిస్తున్నాం.
కథా నాయకుడు హిరీష్ తన పాత్రను
అద్భుతంగా పోషిస్తున్నారు.
ప్రేమ సన్నివేశాల్లో కూడా మేం
ఆశించినట్లుగానే నటించారు.
కానీ కథానాయికకు ముద్దుపెట్టే
సన్నివేశంలో మాత్రం ఆయన చాలా
ఇబ్బందికరంగా నటించారు. కానీ
మేం అనుకున్నట్లుగా రాలేదు.
అందువల్ల ముద్దు సన్నివేశానికి
ఏకంగా 19 టేకులు తీసుకున్నారు.
ఇతర సన్నివేశాలకు సంబంధించిన
పనులన్నీ సిద్ధమయ్యాయి. రెండో
షెడ్యూల్ కోసం వేచి చూస్తున్నామన్నారు.
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్
లీగ్(ఐపీఎల్)లో తాను పాల్గొనాలని అనుకోవడం లేదని ఇంగ్లండ్ మాజీ ఆటగాడు
కెవిన్ పీటర్సన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన క్రికెట్ షెడ్యూల్ బిజీగా
ఉండటంతో, ఐపీఎల్ కు దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నాడు. గతేడాది రైజింగ్
పుణె సూపర్ జెయింట్స్ తరపున ఆడిన పీటర్సన్.. ఆ ఏడాది నాలుగు మ్యాచ్ లు ఆడిన
తరువాత గాయం కారణంగా దూరమయ్యాడు.
అయితే గత డిసెంబర్ లో పీటర్సన్ ను పుణె సూపర్ జెయింట్స్ విడుదల చేసింది. ఈ
నేపథ్యంలోనే ఐపీఎల్లో ఆడాలంటే ఫిబ్రవరి నెలాఖరున జరిగే వేలంలో ఏదొక
ప్రాంఛైజీ పీటర్సన్ ను కొనుగోలు చేయాల్సి ఉంది. కాగా, తాను ఐపీఎల్ కు
సిద్ధంగా లేనని పీటర్సన్ ముందుగానే ఓ ప్రకటన విడుదల చేశాడు.
'ఐపీఎల్ వేలానికి నేను రావాలని అనుకోవడం లేదు. ఈ శీతాకాలపు సీజన్ లో అనేక
మ్యాచ్ లతో బిజీగా ఉన్నా. ఒకవైపు ప్రయాణాలు, మరొకవైపు మ్యాచ్ లతో తీరిక
లేకుండా ఉన్నా. దాంతో వచ్చే వేసవిలో ప్రయాణాలకు దూరంగా ఉండి విశ్రాంతి
తీసుకుంటా' అని పీటర్సన్ తెలిపాడు.