‘‘చెప్పలేను! ఎందుకంటే... చెప్పడం మొదలుపెడితే బోలెడు సినిమాల గురించి
చెప్పాలి. అందుకే, నాకు ఆఫర్ చేసిన హిందీ సినిమాల గురించి మాట్లాడం ఇష్టం
లేదు. ఆ లిస్ట్ చాలా పెద్దది’’ అన్నారు ప్రియాంకా చోప్రా. గతేడాది
మార్చిలో విడుదలైన ‘జై గంగాజల్’ తర్వాత ఆమె హిందీ సినిమాలేవీ
అంగీకరించలేదు. ఎప్పుడెప్పుడు ప్రియాంకా చోప్రా హిందీ సినిమా చేస్తారా? అని
ఎదురు చూస్తున్న హిందీ సినిమా ప్రేక్షకుల కోసమే అన్నట్టు... ముంబయ్
మీడియాలో ఓ వార్త షికారు చేస్తోంది. ఉర్దూ రచయిత సాహిర్ లుధియాన్వీ జీవిత
కథతో షారుఖ్‌ఖాన్ హీరోగా సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందనున్న
సినిమాలో ప్రియాంక హీరోయిన్‌గా నటించనున్నారనేది ఆ వార్తల సారాంశం.
నిజమేనా ప్రియాంకా? అనడిగితే... ‘‘హిందీ చిత్రాల గురించి నేనింకా ఏ
నిర్ణయం తీసుకోలేదు. కానీ, నా సినిమాలో నటించమంటూ సంజయ్ సర్ అడిగితే ‘నో’
చెప్పలేను. ఆయన అడిగితే కాదనలేను. ఆయనకు నా బలం ఏంటో.. నేను ఎలాంటి
సినిమాలు చేయాలను కుంటున్నానో తెలుసు. మేమిద్దరం కలుస్తుంటాం. సినిమాల
గురించి డిస్కస్ చేస్తుంటాం’’ అని చెప్పారామె. రెండు మూడు నెలలుగా పలువురు
దర్శక–నిర్మాతలు ప్రియాంకకు కథలు వినిపించారట. అందులో నచ్చినవి చాలా
ఉన్నాయనీ, ఈ నెలాఖరున కొత్త హిందీ సినిమా కబురు చెబుతాననీ ఆమె అన్నారు.Monday, January 2, 2017
Sunday, January 1, 2017
షారూఖ్ రిలీజ్ చేసిన బయోపిక్ పోస్టర్
ప్రస్తుతం సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్ ల
సీజన్ నడుస్తోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవితాలను వెండితెర మీద
ఆవిష్కరించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు ఫిలింమేకర్స్. అదే బాటలో దక్షిణ
భారత క్రీడాకారుడు మరియప్పన్ తంగవేళు జీవిత కథ ఆధారంగా ఓ సినిమా
తెరకెక్కుతుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను బాలీవుడ్ కింగ్ ఖాన్
షారూఖ్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశాడు.
2016 సమ్మర్ లో రియోలో జరిగిన పారాఒలింపిక్స్ లో భారత్ తరుపున హై జంప్ లో స్వర్ణపతకం సాధించిన మరియప్పన్ జీవితకథను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ధనుష్ స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తోంది. ఈ సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేసిన కింగ్ ఖాన్ ' భారత హీరో మరియప్పన్ తంగవేళు జీవితకథతో తెరకెక్కిన మరియప్పన్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్. ఆల్ ద బెస్ట్ ఐశ్వర్య ధనుష్' అంటూ కామెంట్ చేశాడు.

Friday, December 30, 2016
మూడో చిత్రం స్టైలిష్‌గా?
తెలుగు చిత్రసీమలో స్టైలిష్ దర్శకుడిగా పేరు తెచ్చుకొన్నాడు సురేందర్‌రెడ్డి. ఆయన ఎవరితో సినిమా చేసినా సరే, ఆ కథానాయకుడు స్టైలిష్‌గా కనిపించబోతున్నాడని ఖచ్చితంగా ఫిక్స్ అయిపోతారు ప్రేక్షకులు. నిజంగానే సురేందర్ రెడ్డి కథానాయకుల్ని అలా ఆవిష్కరిస్తుంటారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమాతోనూ అదే రుజువైంది. రామ్‌చరణ్ ఇన్నాళ్లూ తెరపై కనిపించింది ఒకెత్తైతే, ‘ధృవ’ సినిమాలో కనిపించింది మరో ఎత్తు అన్నట్టుగా ఆ సినిమా అభిమానుల్ని అలరిస్తోంది. విజయోత్సాహంలో ఉన్న సురేందర్ రెడ్డి తదుపరి అఖిల్ అక్కినేనితో సినిమా చేయబోతున్నాడనే ప్రచారం వూపందుకొంది. అఖిల్ ప్రస్తుతం తన రెండో చిత్రంపై దృష్టిపెట్టారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఆ తర్వాత సినిమా సురేందర్‌రెడ్డితోనే అని, సూరి స్టైలిష్ హీరోల జాబితాలో అఖిల్ కూడా చేరబోతున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు గట్టిగానే చెప్పుకొంటున్నాయి. అదంతా ఒకెత్తైతే, ఆ చిత్రాన్ని రామ్‌చరణ్ నిర్మించబోతున్నారనే ప్రచారం మరో ఎత్తు. రామ్‌చరణ్, అఖిల్ మంచి స్నేహితులు. వాళ్లిద్దరి కలయికలో సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. మరికొన్ని రోజులు తర్వాత ఆ చిత్రంపై స్పష్టమైన సమాచారం వచ్చే అవకాశాలున్నాయి.
Thursday, December 29, 2016
ఎక్కడైనా స్టార్ కానీ..అక్కడ కాదు!
‘ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో... ఆ ఇంటికి ఈ ఇల్లూ అంతే దూరం’ అనే సామెత
ఉన్న విషయం తెలిసిందే. సినిమా పరిశ్రమలో చాలామంది ఈ విధంగానే ఉంటారన్నది
కొందరి ఊహ. ముఖ్యంగా పెద్దింటి కుటుంబాలకు చెందిన హీరోలు అంత ఫ్రెండ్లీగా
ఉండరని ఊహించుకుంటారు. అయితే ఆ ఊహ నిజం కాదని కొన్ని సంఘటనలు చెబుతుంటాయ్.
తాజాగా, ఓ ఫొటో ఆ విషయాన్ని మరింత బలంగా చూపించింది. సూపర్ స్టార్
మహేశ్‌బాబు, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ చిరునవ్వులు చిందిస్తూ, దిగిన ఈ
ఫొటో ఇక్కడిది కాదు. భార్యాపిల్లలతో కలసి కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్
చేసుకోవడానికి మహేశ్ విదేశాలు వెళ్లారు.
ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరంలో ఉన్నారు. రామ్‌చరణ్ కూడా అక్కడే ఉన్నారు. ఈ ఇండియన్ స్టార్స్ అక్కడ సందడి చేశారు. ఫొటో దిగి, ‘బియాండ్ బౌండరీస్... హ్యాపీ హాలీడేస్’ అని మహేశ్, చరణ్ సోషల్ మీడియాలో పెట్టారు. ఎక్కడైనా స్టార్ కాని ఫ్రెండ్‌షిప్ విషయంలో స్టార్ కాదన్నట్లుగా మహేశ్ – చరణ్ చెబుతున్నట్లుంది కదూ. అనుకోకుండా కలిసినా స్టార్ స్టేటస్‌ని పక్కన పెట్టి, ఇలా కాసేపు ఫ్రెండ్లీగా హాలిడేస్‌ని ఎంజాయ్ చేయడం స్నేహపూరిత వాతావరణాన్ని తెలియజేస్తోంది.

మరో రెండు రోజుల్లో కోహ్లి నిశ్చితార్థం!
గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో మునిగితేలుతున్న భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు మరో రెండు రోజుల్లో నిశ్చితార్థం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారా?అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో న్యూఇయర్ వేడుకల్ని సెలబ్రెట్ చేసుకోబోతున్న ఈ జంట.. జనవరి 1వ తేదీన నిశ్చితార్థం చేసుకునే యోచనలో ఉన్నారు. 2017లో జీవితంలో స్థిరపడాలని భావిస్తున్న విరాట్-అనుష్కలు.. కొత్త ఏడాది ఆరంభపు కానుకగా నిశ్చితార్థాన్ని చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు.
ఇందుకు ఉత్తరాఖండ్ లోని నరేంద్ర నగర్ లోని హోటల్ ఆనందాలో నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి అనుష్క శర్మ తరపున కొంతమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు హాజరుకాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో ఇరు కుటుంబాల పెద్దలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై విరాట్ కోహ్లి కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. నూతన సంవత్సరం సందర్భంగా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి-బాలీవుడ్ నటి అనుష్క శర్మలు ఉత్తరాఖండ్ విహారానికి బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట... శనివారం ఉత్తరాఖండ్ ఎయిర్ పోర్ట్ ల దర్శనిమిచ్చింది.
ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ ముగిసి విరాట్ కోహ్లికి కావాల్సిన విశ్రాంతి దొరకడంతో ప్రియురాలు అనుష్కతో కలిసి న్యూ ఇయర్ వేడుకల్ని జరుపుకోనున్నాడు. దీనిలో భాగంగానే ఈసారి ఆ జంట ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని న్యూఇయర్ వేడుకలకు ఎంచుకుంది. గతేడాది నూతన సంవత్సర వేడుకల్ని విరాట్-అనుష్కలు విదేశాల్లో జరుపుకున్నారు.
Wednesday, December 28, 2016
పండగ సందడికి సై
తాతా మనవళ్ల అనుబంధం, కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ‘‘శర్వానంద్‌కి 25వ చిత్రమిది. ఇటీవల విడుదలైన మిక్కి జె.మేయర్ స్వరాలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ బోర్డు నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ లభించింది’’ అని దర్శకుడు తెలిపారు. ప్రకాశ్‌రాజ్, జయసుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా: సమీర్‌రెడ్డి.
స్పీడు స్పీడులే... ఇది సూపర్ స్పీడులే!
‘నరసింహ’ సినిమా క్లైమాక్స్‌లో రజనీకాంత్ ఫైట్ చేస్తుంటే కారులో
కూర్చున్న నటుడు అబ్బాస్ ‘ఆహా.. మీకింకా వయసు అవ్వలేదు’ అనే డైలాగ్
చెబుతాడు. ‘నరసింహ’లోని ఒక్క ఫైట్ మాత్రమే కాదు.. సినిమాల్లోనూ, నిజ
జీవితంలోనూ రజనీ స్పీడ్ చూసి అభిమానులు ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడీ
సూపర్‌స్టార్ స్పీడ్ చూసి ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి
ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో
రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా ‘2.0’కి ఈయనే సౌండ్ డిజైనర్‌గా పని
చేస్తున్నారు. సోమవారం నుంచి రజనీకాంత్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం
ప్రారంభించారు. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్ చెప్పేశారని రసూల్
పూకుట్టి ట్వీట్ చేశారు. ‘‘వృత్తి పట్ల తలైవా (రజనీకాంత్) అంకితభావం,
నిబద్ధత అసమానం.
ఆయనకు ఆయనే సాటి. ఒక్క రోజులో మూడు రీళ్లకు డబ్బింగ్ చెప్పారు. ఆయన వర్క్ చూసి నేను ఆశ్చర్యపోయా’’ అని రసూల్ అన్నారు. రసూల్ మాటలు వింటుంటే, ‘బాషా’లో సూపర్ స్టార్ సై్టల్‌ను ఉద్దేశించి రాసిన ‘సై్టలు సై్టలులే.. ఇది సూపర్ సై్టలులే...’ పాటను ఆయన స్పీడుకి ఆపాదించి, ‘స్పీడు స్పీడులే.. ఇది సూపర్ స్పీడులే’ అని కూడా అనొచ్చేమో అనిపిస్తోంది. అమీ జాక్సన్ హీరోయిన్‌గా, హిందీ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సిని మాకు రెహమాన్ సంగీత దర్శకుడు.

ఖుషీ కాంబినేషన్ లో మరో మూవీ
పెళ్లి తరువాత సినిమాకు దూరమైన జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతోంది. ఒకప్పుడు దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ బ్యూటీ., ఆరేళ్ల పాటు వెండితెరకు దూరమైంది. తరువాత 2015లో 36 వయొనిథిలే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, ఇప్పుడు మరో లేడి ఓరియంటెడ్ సినిమాలో నటిస్తోంది. అయితే రీ ఎంట్రీలో గ్లామర్ రోల్స్ కు మాత్రం కాస్త దూరంగానే ఉంటోంది.
తాజాగా జ్యోతిక., ఓ స్టార్ హీరోకు జోడిగా నటించేందుకు ఓకె చెప్పిందన్న టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 61వ సినిమాగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కబోయే మూవీలో జ్యోతిక, విజయ్ కు జోడిగా కనిపించనుందట. సమంత, కాజల్ అగర్వాల్ లు గ్లామర్ రోల్స్ లో నటిస్తుండగా మరో కీలక పాత్రకు జ్యోతిక ఓకే చెప్పిందన్న ప్రచారం జరుగుతోంది.
దాదాపు 14 ఏళ్ల క్రితం తమిళ సినిమా ఖుషీలో విజయ్, జ్యోతికలు జంటగా నటించారు. ఇన్నేళ్ల తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో కోలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతానికి యూనిట్ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా విజయ్, జ్యోతికల కాంబినేషన్ సినిమాకు ప్లస్ అవుతుందన్న టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది.

Subscribe to:
Posts (Atom)