‘ముకుంద’ చిత్రంలో అబ్బాయ్ వరుణ్‌తేజ్‌తో జతకట్టిన గోపికమ్మ పూజా హెగ్డే
తాజాగా బాబాయ్ పవన్ కల్యాణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుందని
ఫిల్మ్‌నగర్ టాక్. పవన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారికా అండ్ హాసినీ
క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఓ చిత్రం నిర్మించనున్న
విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు పవన్‌తో జతకట్టనున్నారు.
ఇప్పటికే కీర్తి సురేశ్ ఓ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. మరో కథానాయికగా పూజా
హెగ్డేను తీసుకోవాలనుకుంటున్నారట.
ఆ సంగతలా ఉంచితే ‘ముకుంద’ తర్వాత హిందీలో ‘మొహెంజోదారో’ చేసిన పూజా హెగ్డే
ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలో
నటిస్తోంది. ఇకపై తెలుగు సినిమాలపై ఆమె ఎక్కువగా దృష్టి
సారించాలనుకుంటున్నారట.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి
ఇంట వైభవంగా నిర్వహించిన కుమార్తె
వివాహంపై ఆదాయ పన్ను శాఖ దాడులు
నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వివాహ వేడుకలో టాలీవుడ్ నటి
రకుల్‌ప్రీత్ సింగ్ డ్యాన్స్
చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్ను
శాఖ అధికారులు రకుల్‌ప్రీత్
ఇంటిపై కూడా దాడి చేశారని ఇటీవల
వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో
నిజంలేదని రకుల్ తాజా ఇంటర్వ్యూలో
చెబుతూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘జనాలు
ఈ విషయాన్ని ఎందుకు వదిలేయరో
నాకు తెలియడం లేదు. తొలుత నేను
డ్యాన్స్ చేయడానికి ఒకటికి
మూడింతలు పారితోషికం తీసుకున్నానన్నారు.
తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం
చేశారు. ఇలా చేయడం చాలా కోపాన్ని
తెప్పిస్తోంది. ఈ పుకార్లతో
మా నాన్న చాలా బాధపడుతున్నారు.
ఎవరూ నిజానిజాలను పరిశీలించడం
లేదు, కనీసం నన్ను అడగడం లేదు.
నేను మీడియాతో చాలా ఓపెన్‌గా
ఉంటాను. నాజీవితానికి సంబంధించిన
ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను’
అని రకుల్ అన్నారు.
జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయి రెండున్నర నెలలు దాటిపోయినా ఎన్టీఆర్ తన
నెక్ట్స్ సినిమాను ఇంత వరకు ఎనౌన్స్ చేయలేదు. జనతా గ్యారేజ్ తో కెరీర్ లో
బిగెస్ట్ హిట్ సాధించిన జూనియర్ నెక్ట్స్ సినిమా ఏ జానర్ లో చేయాలో
తేల్చుకోలేకపోతున్నాడు. దీంతో చాలా మంది దర్శకులు జూనియర్ తో సినిమా
చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నా.. ఎవరికీ ఓకె చెప్పటం లేదు. ఇప్పటికే
ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా డైరెక్టర్స్ లిస్ట్ లో చాలా మంది దర్శకుల పేర్లు
వినిపించగా.. తాజాగా ఓ ఫ్లాప్ సినిమా దర్శకుడితో ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమా
ఉంటుదన్న టాక్ వినిపిస్తోంది.
పవర్ సినిమాతో ఇండస్ట్రీలోకి పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు బాబీ.
తొలి సినిమాతోనే మంచి విజయం సాధించిన బాబీ రెండో సినిమాగా పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ను డైరెక్ట్ చేసే చాన్స్ కొట్టేశాడు. పవన్ హీరోగా సర్థార్
గబ్బర్ సింగ్ సినిమాను తెరకెక్కించిన బాబీ ఆశించిన స్థాయిలో
ఆకట్టుకోలేకపోయాడు. ఆ సినిమాకు డిజాస్టర్ టాక్ రావటంతో బాబీ కెరీర్
కష్టాల్లో పడింది. ఆ సమయంలో తన తొలి సినిమా హీరో రవితేజతో మరో సినిమా
చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు.
రవితేజ ప్రస్తుతం సినిమా చేసే మూడ్ లో లేకపోవటంతో ఎన్టీఆర్ తో సినిమా
చేయడానికి ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఎన్టీఆర్ కు లైన్ కూడా వినిపించిన
బాబీ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేసే పనిలో ఉన్నాడు. జనతా
గ్యారేజ్ లాంటి భారీ హిట్ తరువాత జూనియర్, బాబీతో సినిమాకు
అంగీకరిస్తాడా..? లేక ఇది కూడా గతంలో వచ్చిన వార్తల్లాగే గాసిప్ అని కొట్టి
పారేస్తారా..? చూడాలి.
నోట్ల కష్టాలు తొలగించేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) మరిన్ని
ఉపశమన చర్యలు ప్రకటించింది. కరెంట్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్
ఖాతాలు కలిగిన వారికి నగదు విత్ డ్రా పరిమితిని వారంలో రూ. 50 వేలకు
పెంచింది. వీరికి రూ. 2 వేల నోట్లు ఇస్తారు. కనీసం మూడు నెలల నుంచి ఈ
ఖాతాలు నిర్వహిస్తున్న వారికే వారంలో రూ. 50 వేలు తీసుకునే అవకాశం
కల్పిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. వ్యక్తిగత ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాలు
కలిగిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది.
రైతులకు కూడా ఊరట కల్పించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దుకాణాల్లో రద్దు
చేసిన పాత 500 నోట్లతో రైతులు విత్తనాలు కొనుగోలు చేసేందుకు అనుమతి
ఇచ్చింది. ధ్రువీకృత గుర్తింపు కార్డు చూపించి అన్నదాతలు విత్తనాలు
కొనుగోలు చేయొచ్చు. కేంద్ర, రాష్ట్ర విత్తన సంస్థలు, వ్యవసాయ
యూనివర్సిటీలు, ఐసీఏఆర్ సంస్థల నుంచి విత్తనాలు కొనుక్కోవచ్చు. వివాహాలకు
రేపటి నుంచి రూ. 2.5 లక్షల విత్ డ్రా సదుపాయం కల్పించనున్నట్టు ఆర్బీఐ
తెలిపింది. ఇంతకుముందే ఈ ప్రకటన చేసినప్పటికీ నగదు లేకపోవడంతో ఇప్పటివరకు
ఇది అమలు కాలేదు. కాగా, నవంబర్ 10 నుంచి 18 వరకు బ్యాంకు ఖాతాల నుంచి
ప్రజలు 1.03 లక్షల కోట్లు విత్ డ్రా చేశారని ఆర్బీఐ వెల్లడించింది.
తమిళనాట త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఓ చిన్న సినిమాతో హీరోయిన్ గా
పరిచయం అవుతుంది మేఘా ఆకాష్. ఒరు పాక్క కథై అనే సినిమాతో తొలిసారిగా
వెండితెర మీద మెరిసేందుకు ప్లాన్ చేసుకుంది. ఈ సినిమా ఇంకా రిలీజ్ కూడా
కాకుండానే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మను క్రేజీ ఆఫర్స్ ఉక్కిరి బిక్కిరి
చేస్తున్నాయి. ఇప్పటికే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా
తెరకెక్కుతున్న తమిళ సినిమాకు మేఘాను హీరోయిన్ గా తీసుకున్నారు.
అదే సమయంలో నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న
సినిమాకు కూడా మేఘానే హీరోయిన్ అంటూ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో
భారీ చిత్రంలో అమ్మడి ఛాన్స్ వచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని
నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న రెండో సినిమాలో మేఘాను హీరోయిన్ గా
తీసుకోవాలని భావిస్తున్నారట. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ
రొమాంటిక్ ఎంటర్ టైనర్ జనవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. అఖిల్ సినిమా కూడా
మేఘా ఖాతాలో పడితే ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోవడం
ఖాయం.
హీరోగా మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో నాని, త్వరలో పర్సనల్ లైఫ్ లో కూడా
ప్రమోషన్ పొందబోతున్నాడు. ఇటీవల వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో
పర్సనల్ లైఫ్ లో అంతకన్నా ఎక్కువ ఆనందంగా ఉన్నాడు. ప్రస్తుతం నేను లోకల్
సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఈ నేచ్యురల్ యాక్టర్ త్వరలో తండ్రిగా
ప్రమోషన్ తీసుకుంటున్నాడు.
ఈ జనరేషన్ హీరోల్లో అల్లు అర్జున్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, ఆది లాంటి
హీరోలు ఇప్పటికే ఫాదర్స్ లిస్ట్ లో చేరిపోగా తాజాగా నాని కూడా ఆ లిస్ట్ లో
అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. మరికొద్ది నెలల్లో నాని భార్య అంజన
తొలి బిడ్డకు జన్మనివ్వబోతోంది. నాని, అంజనాల కుటుంబ సభ్యులు తన
కుటుంబంలోకి రానున్న కొత్త వెలుగుకు స్వాగతం పలకటానికి ఇప్పటినుంచే
ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆలియా భట్.. చిన్న
వయసులోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి అనతికాలంలోనే అభిమానుల్ని సంపాదించుకుంది.
అయితే.. తోటి నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు బీటౌన్‌లో
వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన టీనేజీ లవ్ బ్రేకప్ గురించి.. ఆసక్తికరమైన
విషయాలు చెప్పుకొచ్చింది.
‘‘నేను పదహారేళ్ల
వయసులో ఉన్నప్పుడు ప్రేమలో విఫలమయ్యా. ఆ బ్రేకప్ బాధలోంచి తేరుకోవడానికి
స్నేహితులతో ఎక్కువగా గడిపేదాన్ని. కానీ ఇప్పుడు అలాంటిది జరిగితే విహార
యాత్రలకు వెళ్తా లేదా నా పనిపై ఇంకాస్త ఎక్కువ దృష్టిపెడతా. ఓ వ్యక్తి
నాకోసమే ఎక్కడైనా ఉంటే.. ఎప్పటికైనా తిరిగొస్తాడని నమ్ముతా. నా దృష్టిలో
ప్రేమ అనే భావన రోజూ మారుతుంటుంది. ప్రేమ అనేది ఇద్దరు ప్రేమికుల మధ్యలో
ఉన్నదే కాదు. స్నేహితుల మధ్య ఉండొచ్చు. నాకు నా పెంపుడు పిల్లిపై..
కాఫీపై కూడా ప్రేమ ఉంది’’ అంటూ తనదైన ప్రేమపాఠాలు చెప్పుకొచ్చింది
ఆలియా.
‘‘బైబిల్ కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే
చిత్రం అవుతుందనుకుంటున్నా. ‘కరుణామయుడు’ రేంజ్‌లో ఈ చిత్రం ఆడాలి’’ అని
నటుడు, ఎమ్మెల్యే బాబూమోహన్ అన్నారు. సీనియర్ నటి దివ్యవాణి ప్రధానపాత్రలో
‘తొలి కిరణం’ జాన్‌బాబు దర్శకత్వంలో డి.శ్రీధర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘నీ
దేవుడే నా దేవుడు’ చిత్రం ఇటీవల ప్రారంభమైంది.
‘‘చారిత్రక చిత్రమిది. క్రీస్తు పూర్వం ఇజ్రాయిల్ దేశంలో జరిగిన
అత్తాకోడళ్ల కథ’’ అని దర్శకుడు అన్నారు. ‘‘పదిహేనేళ్ల వయసు నుంచి
సినిమాల్లో నటిస్తున్న నేను పెళ్లయ్యాక ఏడేళ్లు గ్యాప్ తీసుకున్నా.
నాకిష్టమైన ఈ రంగానికి దేవుడు నన్ను మళ్లీ ఆహ్వానించాడు. నయోని అనే పాత్రలో
కనిపిస్తా’’ అని దివ్యవాణి చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: స్రవంతి.