నటుడు, నిర్మాత నాగబాబు తన కుమార్తె నిహారికకు ఆడి కారు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయాన్ని నిహారిక అభిమానులు ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ నిహారిక తండ్రి నాగబాబుతో కారు పక్కన కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే యూట్యూబ్ సిరీస్‌లో నటించింది. ‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించారు. ఈ నెల 24న ‘ఒక మనసు’ చిత్రం విడుదల కానుంది.
Tuesday, June 14, 2016
ఇది నాన్న కానుక: నిహారిక
నటుడు, నిర్మాత నాగబాబు తన కుమార్తె నిహారికకు ఆడి కారు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఈ విషయాన్ని నిహారిక అభిమానులు ఫేస్‌బుక్ ద్వారా తెలుపుతూ నిహారిక తండ్రి నాగబాబుతో కారు పక్కన కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశారు. యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన నిహారిక ‘ముద్దపప్పు ఆవకాయ’ అనే యూట్యూబ్ సిరీస్‌లో నటించింది. ‘ఒక మనసు’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో కథానాయికగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడిగా నటించారు. ఈ నెల 24న ‘ఒక మనసు’ చిత్రం విడుదల కానుంది.
మహేష్ దత్తత గ్రామంలో వైద్య శిబిరం
సూపర్‌స్టార్ మహేష్‌బాబు దత్తత తీసుకున్న గుంటూరు జిల్లా బుర్రిపాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య సర్వే నిర్వహించారు. మహేష్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ... వైద్య విద్యార్థులు గ్రామస్థులను కలిసిన సమయంలో తీసిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఎంతో శ్రమించి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి, అనారోగ్య సమస్యల గురించి తెలుసుకున్న యంగ్ ఇండియా వాలంటీర్ ఆర్గనైజేషన్‌కు మహేశ్ ధన్యవాదాలు తెలిపారు. ఆరోగ్యం పట్ల గ్రామస్థులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో 150 మంది వైద్య విద్యార్థుల బృందం పాల్గొన్నట్లు మహేష్ తెలిపారు.
Monday, June 13, 2016
చిరు చిందేస్తే..!
వెండితెరపై చిరంజీవి స్టెప్పేసి చాలా కాలమైంది. ‘బ్రూస్‌లీ’లో చిరు కనిపించినా అది పోరాట సన్నివేశమే. చిరు స్టెప్పేస్తే చూడాలని ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ చిరంజీవి కాలు కదిపారు. అయితే సినిమా కోసం కాదు. ఓ అవార్డు వేడుకలో! ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో చిరంజీవి స్టెప్పులేసి ఆహూతుల్ని అలరించారు. ‘గ్యాంగ్ లీడర్’లోని ‘చికు చికు చైలం..’ పాటకు చిరు రిథమిక్‌గా చెలరేగిపోవడం అందరినీ ఆకట్టుకొంది. చిరుతో పాటు శ్రీకాంత్, సాయిధరమ్‌తేజ్, సునీల్, నవదీప్ చిందులేశారు. త్వరలోనే చిరంజీవి తన 150వ చిత్రంగా ‘కత్తి’ రీమేక్‌తో తెరపైకి రాబోతున్నారు. ఆ సినిమాలో వేయబోయే స్టెప్పులకు ఇది టీజర్ అన్నమాట! ఇదే వేదికపై అందాల భామలు తమన్నా, రకుల్‌ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, శ్రియ డ్యాన్స్‌లతో అలరించారు.
కథానాయికలు శ్రీయ, తమన్నా, రకుల్ ప్రీత్‌సింగ్, రాశీ ఖన్నా, ప్రగ్యా జైశ్వాల్, ముమైత్‌ఖాన్ ఆటాపాటా ఈ వేడుకకు హైలైట్‌గా నిలిచాయి. ఆసక్తికరంగా జరిగిన ఈ అవార్డు వేడుకను మాటీవీలో ఈ నెల 25, 26 తేదీల్లో సాయంత్రం ప్రసారం చేయనున్నట్లు చానల్ ప్రతినిధులు తెలిపారు.
హీరోయిన్‌కు విడాకులు మంజూరు
బాలీవుడ్ లో ఓ జంట విడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ఆమె భర్త సంజయ్ కపూర్ విడిపోయారు. సోమవారం ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు చట్టబద్దంగా విడిపోయారు. 2003లో వివాహం చేసుకున్న ఈ జంట గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన విషయం తెలిసిందే.
తామిద్దరం ఇక కలిసి ఉండటం ఏమాత్రం సాధ్యం కాదన్న నిర్ణయం మేరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుంది. రెండు వీకెండ్ లలో మాత్రం సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరిష్మా కపూర్ మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ వాళ్ల సోదరి అనే విషయం తెలిసిందే.
ఈ మొబైల్ వంచితే.. చేతి గడియారం
నేటి ఆధునిక యుగంలో సాంకేతిక
ఎప్పటికప్పుడు కొత్త రూపు సంతరించుకుంటోంది.
వినూత్న ఆవిష్కరణలతో మానవుని
అవసరాలను తీర్చుతోంది. ఇక ప్రస్తుతం
స్మార్ట్‌ఫోన్ వాడని వారు
లేరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు
అది మరింత స్మార్ట్‌గా మన ముందుకు
రాబోతోంది. ఇప్పటిదాకా మనం ఫోన్‌ను
చేతితో పట్టుకుని మాత్రమే ఉపయోగించాం.
కానీ త్వరలో చేతికి వాచీలా ధరించి
ఉపయోగించుకునేలా ఓ కొత్త మొబైల్
రూపుదిద్దుకుంటోంది.
ఇటీవల శాన్‌ఫ్రాన్సికోలో నిర్వహించిన ‘టెక్ వరల్డ్-2016’లో లెనోవా సంస్థ మడతపెట్టుకోగలిగే మొబైల్, ట్యాబ్‌లను ప్రదర్శించింది. ‘సీ-ప్లస్’గా పిలుస్తున్న ఈ మొబైల్‌ను అవసరమైనప్పుడు వాచీలా చేతికి ధరించి ఉపయోగించుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు మరికొంత సమయం పట్టవచ్చు.

Sunday, June 12, 2016
నాకెవరూ పోటీ కాదు
నాకెవరూ పోటీ కాదు అంటున్నారు యువ నటి కీర్తీసురేశ్. తల్లి మేనక
వారసురాలిగా తెరపైకి వచ్చిన ఈ బ్యూటీ ఆదిలోనే అనూహ్య విజయాలను అందుకుని
విజయపథంలో కొనసాగుతున్నారు. కోలీవుడ్‌లో ఇప్పటికి ఈమె నటించిన చిత్రాలు
విడుదలైనవి రెండే రెండు చిత్రాలు. అందులో ఒకటి ఓకే అనిపించుకున్నా, రెండోది
ఘన విజయం సాధించింది. దీంతో కీర్తీసురేశ్ రేంజ్ కోలీవుడ్‌లో ఒక్కసారిగా
పెరిగిపోయింది. నీ నవ్వే చాలు చామంతీ అన్నట్లు కీర్తీసురేశ్ నవ్వే పెద్ద
వశీకరణం అని సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకుంటున్నారు. రాబోయే చిత్రాలు ఈ
సుందరి పేరును మరింత ఇననుమడింపజేస్తాయనే నమ్మకంతో ఉన్నారీమె. కారణం
ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. వాటి గురించి
కీర్తీసురేశ్ తెలుపుతూ తాను ధనుష్‌కు జంటగా నటించిన తొడరి, బాబీసింహా
నటించిన పాంబుసండై చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయన్నారు.
ప్రస్తుతం భరతన్ దర్శకత్వంలో విజయ్‌కు జంటగా నటిస్తున్న చిత్రం, శివకార్తికేయన్ సరసన నటిస్తున్న రెమో చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయని చెప్పారు. తొడరి చిత్రంలో తనది చాలా ముఖ్యమైన పాత్ర అన్నారు. ఈ పాత్రకు అవార్డు వస్తుందని అంటున్నారని, అలా వస్తే సంతోషమేనని అన్నారు. ప్రస్తుతానికి మలయాళం, కన్నడం చిత్రాల్లో నటించడం లేదని చెప్పారు. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయని అయితే అధిక చిత్రాల్లో నటించాలనే ఉద్దేశమేమీ తనకు లేదని పేర్కొన్నారు. నటనకు అవకాశం ఉన్న మంచి బలమైన పాత్రల కోసం ఎదురు చూస్తున్నానన్నారు. ఇకపోతే తాను ఇతర హీరోయిన్లను పోటీగా భావించడం లేదన్నారు. తన ముందు చిత్రాల్లో పాత్రలనే పోటీగా తీసుకుని నటిస్తానని నటి కీర్తీసురేశ్ తెలిపారు.

‘ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లో క్వీన్ సైనా నెహ్వాల్
హైదరాబాదీ స్టార్ షట్లర్, ఏడో సీడ్ సైనా నెహ్వాల్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్‌ను గెలుచుకుంది. ఫైనల్లో అన్‌సీడెడ్ చైనా ప్లేయర్ సున్ యుపై 11-21, 21-14, 21-19 తేడాతో సైనా విజయం సాధించింది. తొలి గేమ్‌లో తడబడి సునాయాసంగా తలవంచిన సైనా.. రెండో గేమ్ నుంచి అనూహ్యంగా పుంజుకుంది. రెండో గేమ్ మొదటి నుంచీ దూకుడుగా ఆడిన సైనా.. ఆ గేమ్‌ను 21-14తో సొంతం చేసుకుంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్ హోరాహోరీగా సాగింది. ఇద్దరు ప్లేయర్స్ నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. చివరికి గంటా పదకొండు నిమిషాలు పోరాడిన సైనా టైటిల్ ఎగరేసుకుపోయింది. సైనా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవడం ఇది రెండోసారి. 2014లోనూ ఈ సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలిచింది సైనా. ఆమెకు ఈ ఏడాది ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.
ప్రధాని మోదీ, ప్రముఖుల అభినందనలు
సైనా కెరీర్‌లో ఈ విజయం మరో మైలురాయి అని, 2016 రియో ఒలింపిక్స్‌కు ఈ విజయం ప్రేరణ కలిగిస్తుందని భారత బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా అన్నారు. సైనా కోచ్ విమల్ కుమార్, సిబ్బందిని అభినందించారు. ‘ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌లో అద్భుత విజయం సాధించిన సైనాకు అభినందనలు. నీ క్రీడా విజయాలతో దేశం యావత్తూ గర్విస్తోంది’ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్లో అభినందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, శిఖర్‌ధావన్, వీవీఎస్ లక్ష్మణ్, సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తదితరులు సైనాకు శుభాకాంక్షలు తెలిపి ఒలింపిక్స్ మంచి ప్రదర్శన కనబరచాలని ఆకాంక్షించారు.
ఆ హీరో ని పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి?
తెలుగు ఇండస్ట్రీ లో అందాల రాక్షసి సినిమా తో పరిచయమయ్యి తన నటన తో అందం తో
అందరిని ఆకట్టుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి.అందాల రాక్షసి సినిమా
తర్వాత వచ్చిన దుసుకేల్తా,భలే భలే మగాడివోయి,సోగ్గాడు సినిమా లతో బాక్స్
ఆఫీసు వద్ద హిట్స్ అందుకుంది లావణ్య.తర్వాత వచ్చిన లచ్చిందేవికి ఒక
లేక్కుంది సినిమా నిరాశపరిచిన లావణ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.లావణ్య ఒక
తెలుగు హీరో ని పెళ్లి చేసుకోబోతుందంట్ట్ట.
Subscribe to:
Posts (Atom)