బుల్లితెర కార్యక్రమం ‘జబర్దస్త్’ ద్వారా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్న నటుడు చలాకీ చంటి. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నారు.
Wednesday, March 23, 2016
వేడుకగా చలాకీ చంటి నిశ్చితార్థం
బుల్లితెర కార్యక్రమం ‘జబర్దస్త్’ ద్వారా అందరినీ కడుపుబ్బ నవ్విస్తున్న నటుడు చలాకీ చంటి. ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ విషయాన్ని చలాకీ చంటి స్వయంగా సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో ఈ రోజు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు చంటి తెలిపారు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోలను చంటి అభిమానులతో పంచుకున్నారు.
Tuesday, March 22, 2016
మహేశ్‌బాబు కుమార్తె డ్యాన్స్ చూశారా..!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గారాలపట్టి సితార ఇటీవల జరిగిన పాఠశాల
వేడుకలో నృత్యం చేసింది. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఉన్న డ్రెస్‌తో ‘క్లాప్
క్లాప్’ అనే పాటకు ముద్దుముద్దుగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. ‘బ్రహ్మోత్సవం’
చిత్రంతోత్వరలో మహేశ్‌బాబు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీకాంత్
అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్, సమంత, ప్రణీత కథానాయికలు.
Monday, March 21, 2016
పడవ తెచ్చే పిజ్జా ఇది..
మనకు పిజ్జా కావాలంటే ఇలా ఆర్డర్ చేస్తే అలా తెచ్చి ఇచ్చేస్తారు. సమయానికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి రోడ్ల మీద డెలివరీ బాయ్స్ బైక్‌లపై రయ్ రయ్‌మని తిరగడం చూస్తుంటాం. కానీ పడవలో వెళ్లి పిజ్జా డెలివరీ ఇవ్వడం చూశారా.. కరేబియన్ సముద్రంలోని ద్వీపాల మధ్య పడవల్లో వెళ్లే వారికి పిజ్జా బోట్ సౌకర్యం ఉంది తెలుసా. ఆర్డర్ చేస్తే పడవలో వెళ్లి పిజ్జా ఇచ్చేస్తున్నారు అమెరికాకు చెందిన దంపతులు.
సాషా, తారా బోయిస్ అనే దంపతులకు పడవలు అన్నా, పడవ ప్రయాణం అన్నా.. పిజ్జాలు అన్నా చాలా ఇష్టమట. ఈ రెండింటినీ కలిపి ‘పిజ్జా పై’ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం అమెరికాలో ఉద్యోగాలు వదిలేసి కరేబియన్ సముద్రంలో పిజ్జాబోట్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. సాషా కంప్యూటర్ ప్రోగ్రామర్, తారా ఎలిమెంటరీ టీచర్ ఉద్యోగాన్ని వద్దనుకున్నారు. ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బోట్‌నే కిచెన్‌గా మార్చేసి నోరూరించే పిజ్జాలు తయారుచేసి అమ్ముతున్నారు. అదే బోట్‌ను ఇల్లుగా మలుచుకొని ఆనందంగా గడిపేస్తున్నారు.
Sunday, March 20, 2016
ఔను... నేనంతే!
సినిమాల్లో తప్ప నయనతార విడిగా కనిపించరు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో
పాల్గొనరు. యాడ్స్‌లో నటించరు. అప్పుడెప్పుడో ఓ యాడ్‌లో నటించారంతే.
పబ్లిక్ దర్శనాలు ఎక్కువ ఇవ్వకపోవడానికి నయనతార కారణాలు నయనతారకున్నాయి.
అయితే, ఇలా చేయడం వల్ల నయనతార ఫ్రెండ్లీ టైప్ కాదనీ, గర్వం అనీ, పొగరనీ
చాలామంది అనుకుంటారు. ఈ విషయం గురించి నయనతార ప్రస్తావిస్తూ, ‘‘అవును. నేను
పొగరుబోతునే! అహంకారిని కూడా! అయితే, నాతో వేళాకోళంగా ప్రవర్తించే వాళ్ల
దగ్గరే అలా ఉంటాను. మిగతావాళ్ల దగ్గర అలా ఉండాల్సిన అవసరం నాకేంటి?’’
అన్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషా చిత్రాలతో తెగ బిజీగా ఉన్న ఈ మలయాళ
సుందరి తన స్వభావం గురించి ఇంకా చాలానే చెప్పారు.
‘‘నాతో సినిమాలు చేసినవాళ్లకూ, చేసేవాళ్లకూ నేనెంత ఫ్రెండ్లీగా ఉంటానో
తెలుసు! నా గురించి నేను ఎక్కువ చెప్పుకుంటున్నానని అనుకోకపోతే ఒక్క మాట.
నాది చాలా స్వీట్ నేచర్! షూటింగ్ లొకేషన్లో చాలా సరదాగా ఉంటాను. అందరితోనూ
మాట్లాడుతుంటాను’’ అని ఆమె తన వాదన వినిపించారు. ఇన్నీ చెబుతూనే, ఒక్క
విషయం కుండబద్దలు కొట్టారు. ‘‘ఏమైనా, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి.
నాకు మర్యాద ఇస్తే... నేనూ వాళ్ళకు మర్యాద ఇస్తా. ఒకవేళ నా దగ్గర మర్యాదగా
నడుచుకోకూడదని ఎవరైనా నిశ్చయించుకుంటే, నా నుంచి కూడా ఇక మర్యాద
ఎక్స్‌పెక్ట్ చేయొద్దు’’ అన్నారు.
షారుఖ్.. సన్నీ లైలా ఓ లైలా
80వ
దశకంలో బాలీవుడ్‌ను ఓ వూపు వూపేసిన క్లబ్ పాట ‘లైలా ఓ లైలా...’.
ఫిరోజ్ ఖాన్, జీనత్ అమన్, వినోద్ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన ‘ఖుర్బానీ’లో
పాట అది. ఆ హుషారును మరోసారి బాలీవుడ్ తెరపై చూపించడానికి రంగం
సిద్ధమవుతోంది. షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘రాయీస్’లో
ఈ పాటను రీమేక్ చేయాలని నిర్ణయించారట. ఇందులో షారుఖ్ పక్కన సన్నీ లియోని
స్టెప్పులేయబోతోంది. ‘‘రాయీస్’లో ఓ ప్రత్యేక గీతం పెట్టాలనే ఆలోచన
వచ్చింది. అందులోనూ అది 80వ దశకం నాటి వాతావరణంలో ఉండాలి. అందుకే ‘లైలా
ఓ లైలా..’ పాటను ఎంచుకున్నాం. ఇప్పటికే దీని హక్కుల కొనుగోలు జరిగిపోయింద’’ని
సినిమా వర్గాలు చెబుతున్నాయి. నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ఓ బార్ సెట్ కూడా
వేశారు. ఇందులో రెండు రోజులపాటు చిత్రీకరణ జరుపుతారు. ఇప్పటికే
షారుఖ్, సన్నీ రిహార్సల్స్ మొదలెట్టేశారని తెలుస్తోంది.
ధోనీ భార్యకు కోపం వచ్చింది..
గత రాత్రి ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టి 20 మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై గెలిచిన ఆనందంలో క్రికెట్ అభిమానులంతా సంబరాలు జరుపుకోగా ధోనీ సతీమణి సాక్షికి మాత్రం చిరు కోపం వచ్చిందట.. అది కూడా భారత్ అభిమానులపై! అంత చిరాకు పెట్టేలా అభిమానులు ఏం చేసుంటారనుకుంటున్నారా ? ధోనీ గారాల పట్టి జీవాకు నిద్రా భంగం కలిగించారు. భారత్ మ్యాచ్ గెలిచిన సంబరంలో కొందరు అభిమానులు ధోనీ ఇంటి ముందు బాణా సంచా పేల్చి హంగామా చేయడం మొదలుపెట్టారు.అప్పటికే బాగా పొద్దు పోవడంతో సాక్షి కాస్త ఇబ్బంది పడ్డారు. పాప నిద్ర లేస్తుందని చెప్తూ చిరు కోపాన్ని ట్విట్టర్ లో ప్రదర్శించారు! టీం ఇండియాకు శుభాకాంక్షలు చెబుతూనే.. ఇంటి ముందు హంగామాను కూడా వివరించారు. 'మీరంతా కలిసి నా చిన్నారిని నిద్ర లేపేలా ఉన్నారు. నేను తప్పకుండా ఏదో ఒక రోజు భారత్-పాక్ మ్యాచ్ గురించి పాపకు చెప్తాను, కానీ ఇప్పుడు తను చాలా చిన్నపిల్ల కదా.. ఏం జరుగుతుందో, వాళ్ల నాన్న ఎవరో .. ఇవేమీ పాపకు అర్థం కావు' అంటూ ట్వీట్ చేశారు సాక్షి సింగ్ ధోనీ.
Saturday, March 19, 2016
ఈ డ్రెస్‌కు బాలీవుడ్ స్టార్స్ ఫిదా అయ్యారట!
పరిణితీ చోప్రా ధరించిన దుస్తులకు
బాలీవుడ్ స్టార్స్ ఫిదా అయ్యారట.
పరిణితీ తన ట్విట్టర్ ఖాతాలో
ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్
అవార్డుల కార్యక్రమంలో దిగిన
ఓ ఫొటోను పోస్ట్ చేశారు. అందులో
ఆమె ధరించిన బ్లూ లాంగ్ ఫ్రాక్‌ను
బాద్‌షా షారుక్ ఖాన్, జాక్వెలిన్
ఫెర్నాండెజ్, రణ్‌వీర్ సింగ్,
వరుణ్ ధావన్‌లు సరదాగా పట్టుకుని
ఉన్నారు. వీరంతా తన డ్రెస్‌కు
ఫ్యాన్స్ అయిపోయారంటూ... పరిణితీ
తనదైన స్టైల్‌లో ఫన్నీగా ట్వీట్
చేశారు. ఇలా స్టార్స్ అంతా
ఒకే చోట సరదాగా ఉన్న ఫొటోకు
అభిమానులు నుంచి తెగ లైక్‌లు
వస్తున్నాయి. నిజంగానే ఆమె డ్రెస్
చక్కగా ఉందని అభిమానులు కామెంట్స్
పెట్టారు.
Thursday, March 17, 2016
బుర్రిపాలెంలో నమ్రత
ప్రభుత్వ పథకాల వల్లె వేయడంతో గ్రామస్తుల నిరాశ
రెండునెలల్లో మహేష్ వచ్చి ప్రణాళికను వెల్లడిస్తాడని ప్రకటన
బ్రహ్మరథం పట్టిన బుర్రిపాలెం గ్రామస్తుల కోలాహాలం మధ్య సినీ నటుడు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ గ్రామంలో గురువారం పర్యటించారు. తెనాలి మండలం బుర్రిపాలేన్ని మహేష్‌బాబు ఆన్‌లైన్ ద్వారా దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రామ స్థితిగతులు తెలుసుకునేందుకు మహేష్‌బాబు భార్య నమ్రతా శిరోద్కర్, అతని సోదరి, ఎంపి గల్లా జయదేవ్ భార్య పద్మావతి బుర్రిపాలెంలో పర్యటించారు. పలు ప్రార్థనా మందిరాలను సందర్శించినానంతరం సూపర్‌స్టార్ కృష్ణ తల్లి నాగరత్నమ్మ నిర్మించిన జడ్‌పి పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభకు ఎంపిడిఒ బి.శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. నమ్రతా మాట్లాడుతూ గ్రామీణుల్లో చైతన్యం తెచ్చి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచ్చేందుకు సిఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. సిఎం స్ఫూర్తితో స్మార్ట్ గ్రామాలకు తామూ ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. పలు ప్రభుత్వ పథకాలను ఆమె ఇక్కడే ఉదహరించారు. సిఎం, పిఎం పాలనపై ప్రశంసలు కురిపించిన ఆమె ప్రతిఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకుంటే ప్రభుత్వాలే ప్రత్యేక గ్రాంటులు విడుదల చేస్తాయని చెప్పారు. మహేష్‌బాబు సోదరి, ఎంపి గల్లా జయదేవ్ భార్య పద్మావతి మాట్లాడుతూ తన తండ్రి సొంతూరు బుర్రిపాలెం, అమ్ముమ సొంతూరు కంచర్లపాలెం అంటే తనకు అమితమైన మక్కువన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించారు. తమ గ్రామంలోని మూడు అంగన్వాడీ కేంద్రాలూ పాఠశాలల్లోనే కొనసాగుతున్నాయని, ప్రత్యేక భవనాలు నిర్మించాలని కార్యకర్త కోరారు. అయితే వారి నుండి మాత్రం సరైన స్పందన వ్యక్తమవ్వలేదు. ఈ సందర్భంగా జడ్‌పి పాఠశాల నేతృత్వంలో రూపొందించిన కృష్ణ, మహేష్‌బాబు కుటుంబ సభ్యుల డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం కృష్ణ నివాసంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ పై అంశాలనే ప్రస్తావించారు. ఎంపి గల్లా జయదేవ్ నిధుల నుండి రూ.27లక్షలతో సిసి రోడ్లు నిర్మిస్తారని రెండురోజుల కిందటి నాటి అంశాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపిపి ఎస్.వెంకట్రావు, జడ్‌పిటిసి ఎ.జయలక్ష్మి, సర్పంచ్ కె.సామ్రాజ్యం, ఎంపిటిసి ఎస్.రామ్మోహనరావు, హెచ్‌ఎం లలితప్రసాద్, గ్రామ కార్యదర్శి కిషోర్ పాల్గొన్నారు.
కంచెర్లపాలెంలో పద్మావతి..
అనంతరం ఎంపి గల్లా జయదేవ్ భార్య పద్మావతి తాను దత్తత తీసుకున్న కంచర్లపాలెంలో పర్యటించారు. అభివృద్ధి పనులపై అధికారుల నుండి వివరాలు సేకరించారు. స్థానిక ప్రజలతో సమావేశం కాగా సిసి రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ హాలు, బస్సు ఏర్పాటు అంశాలను గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయని కోరారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ గ్రామాభివృద్దికి రూ.27లక్షలతో డ్రెయిన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఉపాధి హామీ, రూ.60 లక్షల ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ కె.నిర్మలాకుమారి, తహశీల్దార్ జివి సుబ్బారెడ్డి, ఎంపిపి, జడ్‌పిటిసి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Subscribe to:
Posts (Atom)