Wednesday, February 24, 2016

నామీదే నాకు ఈర్ష్య

 ఇదివరకు కథానాయికల మధ్య నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉండేది. ఒకే సినిమాలో నటించినా సరే... ఒకరి గురించి మరొకరు మాట్లాడేందుకు ఇష్టపడేవాళ్లు కాదు. ఇటీవల మాత్రం దోస్త్‌ మేరా దోస్త్‌ అంటూ ఐక్యతారాగం పాడుతున్నారు. ఎదుటి కథానాయిక ఒక మంచి పాత్ర చేసిందంటే చాలు... వెంటనే వాళ్లని అభినందించే పనిలో పడిపోతుంటారు. అనుష్క అయితే మొదట్నుంచీ తోటి కథానాయిలతో స్నేహంగా మెలుగుతోంది. అందుకే ‘అనుష్క నిజంగా స్వీటీనే’ అంటుంటారు ఆమెతో కలిసి ప్రయాణం చేసిన కథానాయికలు. హిందీ కథానాయిక సోనాక్షి సిన్హా మొదలు తమన్నా వరకు చాలామంది అనుష్కని బహిరంగంగా పొగిడినవాళ్లే. నిజంగా మీకెప్పుడూ, ఏ కథానాయికపైనా ఈర్ష్య పుట్టింది లేదా? అని అనుష్కని అడిగితే... ‘‘మేం స్నేహంగా ఉన్నంతమాత్రాన మామధ్య పోటీ ఉండదనుకోకండి. అసలు పోటీ లేకపోతే ఏ వృత్తినీ ఆస్వాదించలేం. మరింత మంచి పాత్రలు ఎంచుకోవాలి, వేరొకరి కంటే బాగా నటించాలనే తపన మనసులో ఎప్పుడూ ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంటుంది. ఇక ఈర్ష్య, ద్వేషం కలగడం లాంటివంటారా?... ఒక మంచి అవకాశం అందినప్పుడు - ‘ఇలాంటి పాత్ర నాకు కాకుండా వేరొకరికి వెళ్లుంటే, నిజంగా వాళ్లని ద్వేషించేదాన్నేమో కదా. వాళ్లపై నాకు అసూయ పుట్టేదేమో కదా’ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అలాంటి పాత్రలు నాకు చాలాసార్లే లభించాయి. అందుకే పుడితే గిడితే నామీదే నాకు ఈర్ష్య పుట్టాలి తప్ప వేరొకరిపై కాదు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క ‘బాహుబలి- ది కన్‌క్లూజన్‌’లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

Tuesday, February 23, 2016

నేటి నుంచే ఆసియా కప్



ఆఖరి పంచే కాదు, తొలి విజయం మనదైనప్పుడూ ఆ కిక్కు వేరుగా ఉంటుంది. ఆ కిక్కును సొంతం చేసుకోవాల్సిన సమయమిది. టీ20 ఆసియా కప్ మొదలయ్యేది నేడే. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుంది టీమ్ ఇండియా. చలో మరి.. టోర్నీలో శుభారంభం చేద్దాం.. కప్పు వేటను దూకుడుగా మొదలెడదాం.
ఆసియా కప్‌కు సర్వం సిద్ధమైంది. బంగ్లాదేశ్ ఆతిథ్యంలో జరగనున్న ఈ టోర్నీ మొదలయ్యేది బుధవారమే. ప్ర పంచ క్రికెట్లో పసికూన స్థాయి నుంచి పరిణతి గల జట్టు స్థాయికి ఎగబాకుతున్న బంగ్లా జట్టుతోనే టీమ్ ఇండియా తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌కు వేదికగా ఇక్కడి షేర్-ఏ-బంగ్లా స్టేడియం ముస్తాబైంది. టీ20 ఫార్మాట్లో ఇప్పుడు భారత్ తిరుగులేని శక్తి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై క్లీన్‌స్వీప్ చేసి వచ్చి, భారత్‌లో లంకను 2-1తో ఓడించి బలంగా కనిపిస్తున్నది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ ముందు వరకూ కూడా టీమ్ ఇండియా అన్ని అంశాల్లో ఏ లోటూ లేకుండా కనబడింది. అయితే ప్రాక్టీస్‌లో ధోనీ వెన్నుకండరాల గాయానికి గురవడం ప్రస్తుతం జట్టును ఇబ్బంది పెడుతున్న అంశం. అలా అని ఈ మ్యాచ్‌లో ధోనీ ఆడబోడన్నది ఇప్పుడే చెప్పలేంగానీ, అన్ని విధాలుగా ఆసియా కప్‌కు సమాయత్తమైన జట్టుకు ధోనీ గాయం కొద్దిగా ఇబ్బంది పెట్టే అంశమే. ఈ మ్యాచ్‌కు ధోనీ దూరమైనా యువసారథి కోహ్లీ నేతృత్వంలో జట్టు ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతుంది.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ, రైనా, యువరాజ్, ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్)/ పార్థివ్ పటేల్, పాండ్య, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా
బంగ్లా: సౌమ్య సర్కార్, మహ్మద్ మిథున్, సబ్బీర్, మహ్మదుల్లా, ముష్ఫికర్, షకిబల్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మోర్తజా (కెప్టెన్), అరాఫత్, ముస్తఫిజుర్, అల్ అమిన్ హుస్సేన్

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..?

  చిట్టి గౌను ధరించి చేతిలో పువ్వు పట్టుకుని కూర్చున్న ఈ చిన్నారి ఎవరో తెలుసా?... ‘లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి కాజల్‌. ఆమె తన చిన్ననాటి మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ఫొటోను సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ‘చిన్నప్పటినుంచే పోజులిచ్చేదాన్ని... నా చేతిలో ఆ పువ్వు ఎందుకు పట్టుకున్నానో తెలియట్లేదు’ అంటూ పోస్ట్‌ చేశారు. దీనికి అభిమానులు తెగ లైక్‌లు కొట్టేస్తూ... బోలెడన్ని కామెంట్స్‌ పెట్టేస్తున్నారు. చిన్నప్పటికీ ఇప్పటికీ కాజల్‌ ఏమీ మారలేదని, తన కళ్లు చాలా అందంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు కాజల్‌ చేతిలోని ఆ పువ్వు తమ కోసమేనంటూ అభిమానులు సరదాగా కామెంట్స్‌లో పేర్కొన్నారు.

Monday, February 22, 2016

సీక్రెట్ చెవిలో కాదు.. బయటికే చెప్పేస్తా!

 తమన్నాలా తెల్లగా ఉండాలంటే ఏం చేయాలి? పాలతో స్నానం చేయాలా? పన్నీటితో జలకాడాలా? అసలు ఆమె ఎలాంటి సౌందర్య సాధనాలు వాడుతుంది... అని అనుకోని వాళ్లుండరు. తెల్లగా ఉండటం ఆ దేవుడు ఇచ్చిన వరం అంటారు తమన్నా. మరి.. చర్మం తళతళలకు మీరేం చేస్తారు? అనే ప్రశ్న తమన్నా ముందుంచితే.. పెరుగు, శెనగపిండి కలిపి పేస్ట్‌లా చేసుకుని, రాసుకుంటా అంటారామె. ఇది మాత్రమే  కాదు.. మరో సీక్రెట్ కూడా ఈ మిల్క్ బ్యూటీ చెప్పారు. అదే ‘అలోవెరా’. దాని గురించి తమన్నా మాట్లాడుతూ- ‘‘రోజంతా షూటింగ్ చేసి, ఇంటికి రాగానే నా స్కిన్ చూసుకుంటే కొంచెం కంగారుగా ఉంటుంది.
         
కానీ, ఆలోవెరా ఉంది కదా అని సరిపెట్టుకుంటాను. బాగా తీరిక చిక్కినప్పుడల్లా ఆ మొక్కలోంచి వచ్చే గుజ్జుని ఒంటికి పట్టించేస్తా. మన చర్మం పసిపిల్లలాంటిది. దాన్ని ఎంత గారాబం చేస్తే అంత అందంగా ఉంటుంది. నేను అలోవెరాతో గారాబం చేస్తాను. మీరు కూడా చేసి చూడండి. అలోవెరాకి మించిన మంచి సౌందర్య సాధనం లేదు. మన ఒంటి మీదకు వయసొచ్చినా అది కనపడనివ్వకుండా చేస్తుంది ’’ అని చెప్పుకొచ్చారు.

Sunday, February 21, 2016

రూ.251 ఫోన్ పై.. రూ.31 లాభం!

 అత్యంత చౌక స్మార్ట్ ఫోన్ 'ఫ్రీడం 251' గురించి రింగింగ్‌ బెల్స్ కంపెనీ నుంచి ప్రకటన వెలువడగానే సంభ్రమాశ్చర్యంతో పాటు సందేహాలు, విమర్శలు వెల్లువెత్తాయి. సామాన్య జనం ఆశ్చర్యపోగా, మార్కెట్ వర్గాలు విమర్శలు గుప్పించాయి. ప్రభుత్వ వర్గాలు కూపీ లాగే పనిలో పడ్డాయి. ఇంత జరుగుతున్నా రూ.251 కే స్మార్ట్ ఫోన్ అందించి తీరతామని రింగింగ్‌ బెల్స్ డైరెక్టర్‌ మోహిత్ గోయల్‌ బల్లగుద్ది చెబుతున్నారు. అంతేకాదు ప్రతిఫోన్ పై తమకు రూ.31 లాభం వస్తుందని లెక్కలు వేసి మరీ చూపిస్తున్నారు. ఏప్రిల్ 15 నుంచి ఫోన్లు డెలివరీ చేస్తామని ప్రకటించారు.
ఫిబ్రవరి 18న ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన వెంటనే 7 కోట్ల రిజిస్ట్రేషన్లు వచ్చినట్టు వెల్లడించారు. మొదటి విడతగా 25 లక్షల ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు మాత్రమే ఆమోదిస్తామని తెలిపారు. మరో 25 లక్షల ఫోన్లు ఆఫ్ లైన్ డిస్ట్రిబ్యూటర్లకు జూన్ 30లోపు అందజేస్తామన్నారు. ఆన్ లైన్ కోనుగోలుదారుల నుంచి పేవ్ మెంట్ గేట్ వే ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేక ఖాతాలో ఉంచుతామని, ఫోన్లు డెలివరీ చేసిన తర్వాతే ఆ డబ్బు ముట్టుకుంటామని ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్యూలో గోయల్ స్పష్టం చేశారు.

తాము ఎంతో కసరత్తు చేసిన తర్వాతే  'ఫ్రీడం 251' గురించి ప్రకటించామని, మోసం చేసే ఉద్దేశం తమకు లేదని అన్నారు. 'నేను, నా కంపెనీ ఆదాయపన్ను ఎగేసినట్టు ఒక్క ఫిర్యాదు లేదు. నాపై ఎటువంటి కేసులు లేవు. ఎందుకు నన్ను మోసగాడిగా చిత్రీకరిస్తున్నారు. నైతిక విలువలతో కూడిన వ్యాపారానికి కట్టుబడ్డా' అని గోయల్ పేర్కొన్నారు.

కనీస ధరకు కంటే తక్కువకు అమ్మితే వచ్చే నష్టాన్ని తాము స్థాపించబోయే మార్కెటింగ్ వేదిక ద్వారా కవర్ చేస్తామని, ఈ మార్కెట్‌లో కొనుగోళ్ల ద్వారా లభించే లాభాలను తమ వినియోగదారుడికి బదిలీ చేయడం ద్వారా దీనిని అధిగమిస్తానని రింగింగ్‌ బెల్స్ ప్రెసిడెంట్ అశోక్ చద్దా అంతకుముందు వివరించారు.

మిల్కీబ్యూటీ ప్రేమలో పడిందా!

 నటి తమన్నా బాలీవుడ్ దర్శకుడు షాజిత్‌ఖాన్ ప్రేమలో పడ్డారని,త్వరలోనే వీరు పెళ్లి పీటలెక్కబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. తమన్న హిందీలో షాజిత్‌ఖాన్ దర్శకత్వం వహించిన హిమ్మత్‌వాలా చిత్రం ద్వారా పరిచయం అయ్యారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సన్నిహితం ప్రేమగా మారిందని,దీంతో తరచూ రహస్యంగా కలుసుకుంటూ ప్రేమలో మునిగితేలుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని తమన్నా ఖండించారు.

 షాజిత్‌ఖాన్ దర్శకత్వంలో తాను హిందీలో హిమ్మత్‌వాలా చిత్రంలో నటించానని, ఆ చిత్రం పరాజయం పాలైనా తదుపరి హమ్‌షకల్స్ చిత్రంలో అవకాశం కల్పించారన్న గౌరవం షాజిత్‌ఖాన్‌పై ఉందని పేర్కొన్నారు. అలా తమ మధ్య స్నేహమే తప్ప ప్రేమ లేదని స్పష్టం చేశారు. షూటింగ్‌లో తనకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకున్నారని, షాజిత్‌ఖాన్ అంటే ఆ కృతజ్ఞత కూడా ఉందని అన్నారు. ఇది తెలియని వారు తమ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు. నా జీవితంలో బాహుబలి చిత్రాన్ని మరచిపోలేనని, ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి తనకు దేవుడిలా కనిపిస్తున్నారని పేర్కొన్నారు.

 తాను ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన నటినని, మంచి కథా పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్నానని అన్నారు. ఇందుకు అదృష్టం కూడా తోడయ్యిందని, అందుకే మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. అదేవిధంగా హిందీలోనూ వైవిధ్యభరిత కథా పాత్రల్లో నటించి అక్కడ కూడా నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నానన్నారు. ఎంత కష్టపడి నటించినా మంచి కథల్లో నటించే అవకాశాల అమరాలన్నారు. కాలం కలసిరావాలని, అన్నిటికీ మించి అభిమానుల ఆదరణ చాలా అవసరం అని మిల్కీబ్యూటీ అన్నారు.

Saturday, February 20, 2016

ప్రభాస్‌ ఫియాన్సీ ఆమెనా.. కాదా?

 'బాహుబలి' ప్రభాస్ పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమా పూర్తవ్వగానే ఈ యంగ్ రెబల్‌ స్టార్ పెళ్లిపీటలు ఎక్కుతాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ అమ్మాయి ఫొటో ఆన్‌లైన్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఈమేనంటూ ఈ ఫొటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో ఒక్కసారిగా ఇది వైరల్‌ గా మారిపోయింది. అయితే ఈ వార్త ఎంతవరకు నిజమన్నది మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు.
గులాబీ రంగు చీర కట్టుకొని ఓ భారీ వస్త్రనిలయంలో ఈ అమ్మాయి ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఈ అమ్మాయి ప్రస్తుతం బీటెక్ చదువుతున్నదని, 2016లో ఆమె గ్రాడ్యుయేషన్‌ పూర్తవుతుందని అంటున్నారు. అయితే, ప్రభాస్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రులు మాత్రం ఈ కథనాలను కొట్టిపారేస్తున్నారు. ప్రభాస్‌కు కాబోయే వధువు అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో నకిలీదని, ఆ వార్తలను నమ్మవద్దని చెబుతున్నారు.

Wednesday, February 17, 2016

వాళ్ల బాటలోనే... అలీ కూడా

 ఈ జనరేషన్ నటులు కేవలం నటులగానే మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఇతర రంగాల మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యం మన హీరోలు హీరోయిన్లు అప్పుడప్పుడు సింగర్ అవతారం ఎత్తుతూ గాయకులకు పోటీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే  ఈ విషయంలో కామెడీ స్టార్ లు కూడా వెనక్కి తగ్గటం లేదు. ఇటీవల 'లచ్చిందేవి ఓ లెక్కుంది' సినిమా కోసం జయప్రకాష్ రెడ్డి పాట పాడగా ఇప్పుడు ఈ లిస్ట్ లో అలీ కూడా చేరిపోయాడు.              మరో అడుగు ముందుకేసిన అలీ పాడ పాడటమే కాదు, తన పాడే పాటను తానే రాశాడు కూడా. ఎందుకంటే ఆ పాట తను మాత్రమే రాయగలడు. ఎంద చాట అంటూ విచిత్రమైన పదాలతో అలరించే అలీ అదే భాషలో పాట పాడాడు. అక్కినేని ఫిలిం స్కూల్ స్టూడెంట్ చునియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పడేసావే సినిమా కోసం అలీ పాట రాసి, పాడాడు. అనూప్ రుబెన్స్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన ఈ పాటను ఇప్పటికే రికార్డ్ చేశారు.