Wednesday, December 23, 2015

ఫిబ్రవరిలో మెకల్లమ్ రిటైర్మెంట్

 న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్... వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు మంగళవారం వెల్లడించాడు. సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్ తనకు చివరిదని తెలిపాడు. ఫిబ్రవరి 12న ఆసీస్‌తో ప్రారంభంకానున్న తొలి మ్యాచ్‌తో మెకల్లమ్ కెరీర్‌లో వందో టెస్టు పూర్తి చేసుకుంటాడు. తర్వాత 20 నుంచి జరిగే రెండో టెస్టు ఆడి రిటైర్ కానున్నాడు. అయితే మార్చి 8 నుంచి జరిగే టి20 ప్రపంచకప్‌కు కేన్ విలియమ్సన్ కివీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
                  రిటైర్మెంట్ గురించి తర్వాత చెప్పాలనుకున్నా ప్రపంచకప్‌కు జట్టు ఎంపిక నేపథ్యంలో ముందుగానే నిర్ణయాన్ని వెల్లడించానని తెలిపాడు. ‘ఆసీస్‌తో తొలి టెస్టు ముగిసే వరకు ఈ విషయాన్ని బహిరంగం చేయొద్దని భావించా. అయితే టి20 ప్రపంచకప్ జట్టులో నా పేరు లేకపోతే చాలా సమస్యలు, ఆందోళనలు ఏర్పడతాయి. దాన్ని తప్పించేందుకే నా నిర్ణయాన్ని ముందుగానే చెప్పేశా. కివీస్ తరఫున ఆడినందుకు చాలా గర్వపడుతున్నా’ అని మెకల్లమ్ వ్యాఖ్యానించాడు.



                   2002లో ఆసీస్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన మెకల్లమ్.. కెరీర్‌లో ఇప్పటి వరకు 99 టెస్టులు ఆడి 11 సెంచరీలతో 6273 పరుగులు సాధించాడు. 254 వన్డేల్లో ఐదు సెంచరీలతో 5909 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, కొచ్చి టస్కర్స్ కేరళ, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇటీవల క్రిస్ కెయిన్స్‌కు సంబంధించిన మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చిన మెకల్లమ్.. తన వీడ్కోలుపై దాని ప్రభావం లేదని స్పష్టం చేశాడు.

Tuesday, December 22, 2015

'నిజమే సినిమా కలెక్షన్ తగ్గింది'

 దేశంలో మత అసహనం పెరిగిపోతుదంటూ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని బాలీవుడ్ టాప్ హీరో షారూఖ్ ఖాన్ స్పష్టం చేశాడు. తన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' సినిమా కలెక్షన్లపై పడడంతో విచారం వ్యక్తం చేశాడు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, వక్రీకరించారని వాపోయాడు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా కోల్ కతా వచ్చిన షారూఖ్ మీడియాతో మాట్లాడాడు. 'అసహనంపై నేను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలనుకోవడం లేదు. వివరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నా. నా కళ్లతో చూసిందే నేను మాట్లాడాను. నా గురించి ప్రజలకు తెలుసు. అయితే నేను మాట్లాడినదాన్ని వారు అర్థం చేసుకోలేదు. నా వ్యాఖ్యలను సరిగా ప్రజెంట్ చేయలేదు. నా మాటలతో ఎవరైనా బాధపడివుంటే విచారం వ్యక్తం చేస్తున్నా' అని షారూఖ్ చెప్పాడు.                    తాను చేసిన వ్యాఖ్యల ప్రభావం 'దిల్ వాలే' కలెక్షన్లపై పడిందని అతడు అంగీకరించాడు. వివాదాల జోలికి పోకుండా తన సినిమాను అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రాతం, కులం, మతం, లింగ వివక్ష లేకుండా అందరూ తనను 25 ఏళ్లుగా ఆదరిస్తున్నారని తెలిపాడు. తన సినిమాల ద్వారానే తన ప్రేమను వారికి తిరిగి ఇవ్వగలనని చెప్పాడు. కొంతమంది దుష్ప్రచారం చేసినంతమాత్రానా తన దేశభక్తిని శంకించాల్సిన పనిలేదన్నాడు.

'నవమన్మథుడు' మువీ రివ్యూ

రేటింగ్‌ 2.25
  తమిళ స్టార్‌ హీరో ధనుష తెలుగులో సక్సెస్‌ కొట్టేందుకు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురు చూసున్నాడు. కాని ఈయన సస్సెస్‌ను మాత్రం దక్కించుకోలేక పోతున్నాడు. ఇక ఈయన తాజాగా తమిళంలో నటించిన ఈ సిఁమాను అక్కడ ఇక్కడ ఒకేసారి విడుదల చేయాలని భావించారు. కాని తెలుగులో కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యం అయ్యింది.
కథలోకి వెళ్తే....
భరత్‌( ధనుష్‌ ) ఒక మధ్య తరగతి వ్యకి. ఈయన మొదట హేమ ( ఎమీ జాక్సన్‌)ను ప్రేమిస్తాడు. అయితే కొ
న్ని కారణాల వల్ల హేమతో ప్రేమ విఫలం అవుతుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు తేరుకుని ఒక జాబ్‌లో జాయిన్‌ అవుతాడు. అలా కాలం గడుస్తున్న సమయంలో ఈయనకు యమున ( సమంత)తో వివాహం అవుతుంది. భరత్‌ వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో ఆయన తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో సమస్యలు చుట్టు ముడుతాయి. ఆ సమస్యలు ఏంటి? వాటి నుండి భరత్‌ ఎలా తప్పించుకఁన్నాడు ? ఈయన ప్రేమ కథలు ఏంటి ? అనేది వెండి తెరపై సినిమా చూసి తెలుసుకోండి.
ధనుష్‌ ఎప్పటిలాగే మంచి నటనతో మెప్పించాడు. రెండు వైవిధ్యభరిత పాత్రల్లో ఈయన చూపించిన వేరియేషన్స్‌ అద్బుతం అ
ని చెప్పాలి. లవర్‌గా, బాధ్యతగల వ్యక్తిగా ఈయన చూపించిన నటనకఁ ఎక్కడ కూడా లోటు పెట్టేలా లేదు. ఒక మిడిల్‌ క్లాస్‌ అమ్యాయిగా సమంత కఁపించి మెప్పించింది. అమీజాక్సన్‌ సైతం తనదైన శైలిలో నటించి మెప్పించింది. ఈమె అందంతో కూడా ఆకట్టుకఁంది. మిగిలిన వారు పర్వాలేదు. అన్నట్లుగా నటించారు. 






          అనిరుధ్‌ సంగీతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అన్ని పాటలు కూడా సందర్బానుసారంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సన్ని వేశాలకు హైలైట్‌గా నిలిచింది. ఎడిటింగ్‌ యావరేజ్‌గా ఉంది. దర్శకుడు వెల్‌ రాజ్‌ సెకండ్‌ హాఫ్‌ను మరింత బాగా తెరకెక్కించి ఉంటే బాగుండేది. సినిమా ఒక మంచి ఫ్యామిలీ కథాంశంతో దర్శకుడు వెల్‌రాజ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈయన ఫస్ట్‌ హాఫ్‌లో అన్ని వర్గాల ప్రేక్షకఁలను ఆకట్టుకునేలా చూపించాడు. కాని సెకండ్‌ హాఫ్‌లో మాత్రం పెద్దగా మెప్పించడంలో విఫలం అయ్యాడు. చివరిగా 'నవమన్మధుడు' ఆకట్టుకునే స్థాయిలో లేదు.

Monday, December 21, 2015

'బాజీరావ్ మస్తానీ' మూవీ రివ్యూ

 కథ :
పీష్వా బాజీరావ్ గా ప్రసిద్ధి పొందిన బాజీరావ్ బల్లాల భట్ ఓటమే ఎరుగని యుద్ధవీరుడు. దాదాపు 40 యుద్ధాలలో అప్రతిహతంగా విజయాలు సాధించిన ఘనత ఆయనది. ఢిల్లీ సింహాసనం నుంచి మొఘల్ రాజులను దించేశాక.. అఖండ భారతాన్ని పరిపాలించాలని నిశ్చయించుకుంటాడు బాజీరావ్. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో తన కుటుంబసభ్యులతో కూడా పోరాడాల్సి వస్తుంది. సంప్రదాయ కుటుంబంలో పుట్టిన బాజీరావ్.. మస్తానీ అనే ముస్లిం యువతితో ప్రేమలో పడతాడు. బాజీరావ్ కు అప్పటికే కాశీబాయ్ తో పెళ్లవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బాజీరావ్ యుద్ధంతో పాటు తన ప్రేమలోనూ ఎలా విజయం సాధించాడన్నదే మిగతా కథ.

విశ్లేషణ :
రామ్ లీలా సినిమాలో సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్న రణవీర్, దీపికాల జంట మరోసారి ఆకట్టుకుంది. బాజీరావ్ గా రణవీర్ అద్భుతమైన నటన కనబరిచాడు. హావభావాలతో పాటు మరాఠీ యాసలో డైలాగ్ లను చెప్పి మెప్పించాడు. తొలిసారిగా మేకప్ లేకుండా నటించిన దీపికా కూడా నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది. గ్లామరస్ గా కనిపిస్తూనే నటనతోనూ ఆకట్టుకుంది. పాత్రపరంగా పెద్దగా అవకాశం లేకపోవటంతో ప్రియాంక చోప్రా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తన ప్రతి సినిమాలో చూపించినట్టే గ్రాండ్ విజువల్స్ తో కనికట్టు చేసే ప్రయత్నం చేశాడు సంజయ్ లీలా బన్సాలీ. విజువల్ గా  ఆకట్టుకున్నా.. కథా కథనాల పరంగా మాత్రం ఆశించిన స్థాయి అందుకోలేకపోయాడు. హిస్టారికల్ వార్ డ్రామాకు కావాల్సిన వేగం ఈ సినిమాలో కనిపించలేదు. ఇలాంటి చిత్రాలకు ప్రాణం పోయాల్సిన మ్యూజిక్ విషయంలో కూడా బాజీరావ్ మస్తానీ తీవ్రంగా నిరాశపరిచింది.

Sunday, December 20, 2015

‘జబర్దస్త్’ శేషుకు గాయాలు

 జబర్దస్త్ ప్రోగ్రామ్ కామెడీయన్ షేకింగ్ శేషు గాయాలపాలయ్యాడు. రాజస్థాన్ లో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ లో భాగంగా కారు చేజింగ్ సీన్ లో అతడు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో శేషు ఎడమ చేతికి గాయమైంది. ప్రస్తుతం శేషు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా షేకింగ్ శేషుగా అతడు పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రంగనాథ్‌కు ప్రముఖుల నివాళి

  సీనియర్ నటుడు రంగనాథ్ మృతితో తెలుగు సినీ ప్రరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. శనివారం సాయంత్రం ముషీరాబాద్‌ పరిధిలోని గాంధీనగర్‌లో అద్దె ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ రంగనాథ్‌కు ఆదివారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు బాధాతప్త హృదయాలతో కన్నీటి నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో రంగనాథ్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌కు తీసుకువచ్చారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు చిరంజీవి, మురళీ మోహన్, జమున, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, గిరిబాబు, శివాజీరాజా, పలువురు నివాళులు అర్పించారు. రంగనాథ్ మృతి తెలుగుసినీ పరిశ్రమకు తీరనిలోటని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

Saturday, December 19, 2015

'దిల్ వాలే' సినిమా రివ్యూ




 
రేటింగ్‌ 3 /5
చాలా కాలం తరువాత బాలీవుడ్ రొమాంటిక్ కపుల్ షారూక్ ఖాన్, కాజోల్ కలిసి నటించిన సినిమా దిల్ వాలే. మాస్ కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ రోహిత్ శెట్టి తన పంథా మార్చి రొమాంటిక్ జానర్ లో తెరకెక్కించిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు నుంచే భారీ హైప్ క్రియేట్ చేసింది. సావరియా, ఓం శాంతి ఓం సినిమాల సమయంలో వెండితెర మీద పోటీపడిన షారూఖ్, సంజయ్ లీలా బన్సాలీలు మరోసారి దిల్ వాలే, బాజీరావ్ మస్తానీ సినిమాలతో ఢీకొన్నారు. మరి ఈ పోటిలో దిల్ వాలే విజయం సాదించిందా..?
కథ:
రాజ్ (షారూక్ ఖాన్), వీర్ (వరుణ్ ధవన్)లు కార్లను మోడిఫికేషన్ చేసే గ్యారేజ్ నడుపుతుంటారు. వీర్ తన కార్ లో లిఫ్ట్ తీసుకున్న ఇషిత (కృతిసనన్)తో ప్రేమలో పడతాడు. అయితే తమ ప్రేమకు తన అన్నను ఒప్పించే ప్రయత్నం చేయాలనుకుంటాడు. అదే సమయంలో రాజ్ గతం తెలుస్తుంది. రాజ్ అసలు పేరు కాళీ, 15 ఏళ్ల కిందట బల్గేరియాలో ఓ మాఫియా డాన్. తన తండ్రితో కలిసి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ఈ వ్యాపారపరంగా మరో డాన్ తో వీరికి శతృత్వం ఏర్పాడుతుంది. కానీ షారుఖ్ అనుకోకుండా ప్రత్యర్థి కూతురు మీరా(కాజోల్)తో ప్రేమలో పడతాడు. తండ్రుల మధ్య ఉన్న వైరం ఆ ప్రేమికులను విడదీస్తుంది. 15 ఏళ్ల తరువాత వీర్, ఇషితల ప్రేమ కారణంగా మరోసారి రాజ్, మీరా కలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజ్ తిరిగిన తన ప్రేమను గెలుచుకున్నాడా.. అన్నదే అసలు కథ.


విశ్లేషణ:
ఈ సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది కాజోల్ నటన గురించి. లాంగ్ గ్యాప్ తరువాత వెండితెర మీద కనిపించిన ఈ డస్కీ బ్యూటీ గ్లామరస్ అపియరెన్స్ తో పాటు యాక్టింగ్ తోనూ ఆడియన్స్ ను కట్టిపడేసింది. డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో షారూఖ్ మరోసారి మెప్పించాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో షారూక్ నటన అద్భుతం. ఈ ఇద్దరి కెమిస్ట్రీ.. సినిమానే కాదు.. ఆడియన్ మూడ్ ను 1990ల లోకి తీసుకెళ్తుంది. ముఖ్యంగా రొమాంటిక్ సీన్స్ తో మరోసారి బాలీవుడ్ బెస్ట్ కపుల్ అనిపించుకున్నారు షారూఖ్, కాజోల్. వరుణ్, కృతి కూడా తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఇతర పాత్రల్లో నటించిన జానీ లీవర్, బొమన్ ఇరానీ, వరుణ్ శర్మ, సంజయ్ మిశ్రాల కామెడీ ఆకట్టుకుంది.

పైసా వసూల్ సినిమాలను తెరకెక్కించటం బాగా తెలిసిన రోహిత్ శెట్టి మరోసారి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా తను ఎంచుకునే యాక్షన్ కామెడీకి తోడు ఈసారి కాస్త రొమాంటిక్ టచ్ కూడా ఇచ్చాడు. అయితే ఆ జానర్ ను ఆశించిన స్థాయిలో ప్రజెంట్ చేయటంలో ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా షారూఖ్, కాజోల్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా రొటీన్ గా అనిపిస్తాయి. యాక్షన్ కామెడీ కూడా రెగ్యులర్ రోహిత్ శెట్టి సినిమాల తరహాలోనే సాగిపోతుంది. భారీ ఛేజ్ లు, కార్ బ్లాస్ట్ లు, పంచ్ డైలాగులు ఇలా అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ ట్రీట్ ఇచ్చాడు రోహిత్.

Thursday, December 17, 2015

రివ్యూ: లోఫర్‌

రేటింగ్‌: 2.5/5 


కథేంటంటే: కృష్ణ (పోసాని కృష్ణమురళి) పక్కా లోఫర్‌. భార్య లక్ష్మమ్మ (రేవతి)తో గొడవ పడి ఇంటి నుంచి వచ్చేస్తాడు. వస్తూ.. వస్తూ ఉయ్యాల్లోని నెలల పసికందు రాజా (వరుణ్‌తేజ్‌)ని ఎత్తుకు వచ్చేస్తాడు. ‘నీ చిన్నప్పుడే అమ్మ పచ్చ కామెర్లొచ్చి చచ్చిపోయింది’ అంటూ నమ్మిస్తాడు. రాజా కూడా దొంగగా మారి జోథ్‌పూర్‌లో సెటిల్‌ అవుతాడు.
         తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో ఇంట్లోంచి పారిపోయి జోథ్‌పూర్‌ వస్తుంది పారిజాతం (దిశాపటాని). ఆమెను చూసి ప్రేమిస్తాడు రాజా. పారిజాతం ఎవరో కాదు.. స్వయానా తన మామ (ముఖేష్‌రుషి) కూతురేనని తెలుసుకుంటాడు. అంతేకాదు.. తన అమ్మ బతికే ఉందన్న నిజం పారిజాతం ద్వారా తెలుసుకొంటాడు రాజా. అయితే ఈలోగా పారిజాతాన్ని ఇంట్లోవాళ్లు విశాఖపట్నం తీసుకెళ్లిపోయి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తారు. మరి.. పారిజాతాన్ని రాజా ఎలా కాపాడాడు? తన తల్లికి ఎలా దగ్గరయ్యాడు? అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.



ఎలా ఉందంటే: తనకు అలవాటైన కథకు.. ‘అమ్మ’ సెంటిమెంట్‌ అద్దాడు. అదే.. తనను ఆదుకుంటుందని పూరి నమ్మినట్లు కనిపిస్తుంది. కొడుకు దూరమైన బాధలో తల్లి. కళ్ల ఎదుటే అమ్మ ఉన్నా.. ‘నేను నీ కొడుకుని’ అని చెప్పుకోలేని బిడ్డ. వీరి మధ్య భావోద్వేగాలను పూరి పండించాడు. తండ్రిగా పోసాని పాత్రని రాసుకున్న తీరు.. వినోదాన్ని పండిస్తుంది. తండ్రీ కొడుకుల మధ్య నడిచిన ఓ రకమైన కెమిస్ట్రీ ఈ సినిమాకి బలం.
దీనికి తోడు పూరి శైలి హీరోయిజం.. అతని టేకింగ్‌.. పోరాట దృశ్యాల్ని తెరకెక్కించిన పద్ధతి.. ఇవన్నీ ‘లోఫర్‌’కి కాస్తంత మెరుగ్గా ఉండేలా చేశాయి. సున్నితమైన ఈ కథని.. మరికాస్త పద్ధతిగా తెరకెక్కిస్తే మరింతగా ఆకట్టుకునేదేమో? అరుపులు.. కేకలు.. ఏమాత్రం మానవత్వం లేని విలన్‌ ముఠాల మధ్య అమ్మ సెంటిమెంట్‌ నలిగిపోయింది.
కడుపున పుట్టిన బిడ్డే తల్లిని కిరాతకంగా చంపుతుంటే.. ఆ మారణ కాండని చూసే మరో కొడుకు పైశాచికత్వం లాంటి సన్నివేశాలు ఇబ్బంది కలిగించేవే. సినిమాలో విలనిజం.. రక్తపాతం కాస్తంత తగ్గిస్తే బాగుండేదన్న అభిప్రాయం కలుగుతుంది. అలీ.. బ్రహ్మానందం ట్రాక్‌ ఆకట్టుకుంటుంది. 

ఎవరేం చేశారంటే: తొలి రెండు చిత్రాల్లో క్లాస్‌గా కనిపించిన వరుణ్‌తేజ్‌ తొలిసారి మాస్‌ పాత్ర పోషించాడు. ఇలాంటి తరహా పాత్రల్లోనూ తాను రాణించగలనని నిరూపించుకున్నాడు. ఎమోషన్‌ సన్నివేశాల్లో వరుణ్‌ నటన బాగుంది. ఫైట్స్‌ చాలా ఈజ్‌తో చేశాడు. దిశాపటాని అందంగా కనిపించింది. ఆమె పాత్ర పరిధి అంతంతే. రేవతికి ఎక్కువ మార్కులు పడతాయి. తన అనుభవాన్నంతా రంగరించి నటించింది. ఇక పోసాని కృష్ణమురళి.. ఈ కథని వెన్నుదన్నుగా నిలిచాడు.

 
సాంకేతికంగా..: సునీల్‌ సంగీతంలో ప్రతి పాటా ఒకేలా వినిపించింది. ‘సువ్వి సువ్వాలమ్మా’ పాట మాత్రం ఆకట్టుకొంది. నేపథ్య సంగీతంలో హోరు ఎక్కువైంది. సెంటిమెంట్‌ పరమైన సన్నివేశాలు పూరి బాగా తీశాడు. పెప్పర్‌ స్ప్రే డైలాగ్‌ పేలుతుంది.  

చివరిగా.. కాస్త సెంటిమెంట్‌.. మరికాస్త హింస కలిపితే.. ‘లోఫర్‌’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఈ సమీక్ష సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.