రాష్ట్ర శాసనసభ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకాగానే.. ఇటీవల మృతిచెందిన మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ కిష్టారెడ్డి మృతికి సభ నివాళులర్పించనుంది. అనంతరం ప్రవేశపెట్టనున్న సంతాప తీర్మానంపై చర్చ జరగనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత సభ వాయిదా పడే అవకాశం ఉంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు, ఏయే తేదీల్లో జరగాలన్న విషయంపై స్పీకర్ మధుసూదనాచారి ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లతో బుధవారం సమావేశం కానున్నారు. ఇందులోనే అసెంబ్లీ సమావేశాల తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు. సభ మొదటిరోజు కావడంతో కిష్టారెడ్డి సంతాప తీర్మానంతోపాటు బీఏసీ సమావేశం మాత్రమే జరగవచ్చని సమాచారం.
Tuesday, September 22, 2015
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

Monday, September 21, 2015
దాల్మియాకు వీడ్కోలు
భారత క్రికెట్ యోధుడు జగ్‌మోహన్ దాల్మియా అంత్యక్రియలు అభిమనులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య అధికార లాంఛనాలతో పూర్తయ్యాయి. దాల్మియా భార్య చంద్రలేఖ, కూతురు వైశాలి, చివరిసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కుమారుడు అభిషేక్ అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు బిసిసిఐ ప్రముఖులు అనురాగ్ ఠాకుర్, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్, సిఎఒ రత్నాకర్ శెట్టి, సౌరవ్ గంగూలీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాలు పలువురు పాల్గొన్నారు.
దాల్మియా అంతిమయాత్ర ఆయన నివాసం నుంచి మధ్యాహ్నం 12.15 నిమిషాలకు ప్రారంభమైంది. 12.50 నిమిషాలకు ఆయన భాతిక కాయాన్ని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) ఆఫీసుకు తీసుకువచ్చారు. అక్కడ ఆయన భౌతిక కాయాన్ని అభిమానుల చివరి చూపు కోసం రెండు గంటలపాటు ఉంచారు. క్యాబ్ ఆఫీసులో మీడియా దిగ్గజం సభాష్ చంద్ర సంతాపం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ 'దాల్మియా భారత క్రికెట్‌నే కాదు ప్రపంచ క్రికెట్‌ను సైతం పాపులర్ చేశాడు. దాల్మియా గైర్హాజరీలో ప్రపంచ క్రికెట్ కూడా కష్టాలు పడింది. ఆయన వల్ల ధన ప్రవాహం భారత క్రికెట్లోకి మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్లోకి కూడా పారింది.
దాల్మియా నేత్రదానం
సమాజసేవకు పాటుపడాలని క్రికెటర్లకు నిత్యం ఉద్భోదించే దాల్మియా ఈ విషయంలోనూ తానే ముందని నిరూపించుకున్నారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన దాల్మియా.. ఇప్పుడూ తానూ నేత్ర దానం చేసి ఆదర్శప్రాయుడయ్యారు. కోల్‌కతాలోని సుస్రుత్ ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని వన్ముక్తా ఐ బ్యాంక్‌కు దాల్మియా తన కళ్లు దానం చేశారు. స్పాట్ ఫిక్సింగ్‌తో మసకబారిన బీసీసీఐ ప్రతిష్ఠను పెంచే బాధ్యతలను అధ్యక్షుడిగా తన భుజానికెత్తుకున్న దాల్మియా.. ఐపీఎల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలని, అంధత్వం నిర్మూలన అనే కార్యక్రమం తరహాలో అలాంటి కార్యక్రమం ఇక్కడా చేపట్టాలని లీగ్‌లో దాల్మియా పిలుపునిచ్చిన సంగతి విదితమే.Sunday, September 20, 2015
అఖిల్ ఈ చిత్రం ఆడియో విడుదల
అఖిల్ అక్కినేనిని హీరోగా పరిచయం చేస్తూ వి.వి.వినాయక్ దర్శకత్వంలో
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్న
చిత్రం 'అఖిల్'. అనూప్ రూబెన్స్, ఎస్.ఎస్.థమన్ సంయుక్తంగా
సంగీతమందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లోని
గచ్చిబౌలి స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగింది. తొలుత థియేట్రికల్
ట్రైలర్‌ను అక్కినేని నాగార్జున, మహేష్ ఆవిష్కరించారు. అనంతరం అక్కినేని
నాగార్జున ఆడియోను రిలీజ్ చేసి విచ్చేసిన అతిథులందరికీ అందజేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ,''అఖిల్ సినిమాలో అంత బాగా కనిపించడానికి కారణం వినాయక్, నితిన్, సుధాకర్‌రెడ్డి సహా అందరి కృషి ఉంది. కృష్ణగారితో 'వారసుడు' సినిమా చేశాను. ఇప్పుడు ఆయన వారసుడు మహేష్ నా వారసుడి సినిమా ఆడియో లాంచ్ చేసినందుకు థ్యాంక్స్. అభిమానులతో అనుబంధం 75 ఏళ్ళ క్రితమే మొదలైంది. విజయదశమి కానుకగా అక్టోబర్ 22న సినిమాను విడుదల చేస్తున్నాం' అని అన్నారు.ఒక హీరోని ప్రెజంట్ చేయడమంటే ఎవరైనా వినాయక్‌గారి తర్వాతే. ఇండిస్టీకి మరో పెద్ద హీరోని ఇచ్చినందుకు వినాయక్ గారికి థ్యాంక్స్. ఏఎన్నార్ లివ్స్ ఆన్. ఈరోజు అక్కినేని నాగేశ్వరావుగారు చాలా హ్యాపీగా ఉండుంటారు. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా' అని మహేష్ చెప్పారు. అఖిల్ మాట్లాడుతూ,'నాకు చీకటిలో టార్చ్‌లైట్‌గా వినాయక్ గారు కనిపించారని నా లాంచింగ్ రోజే చెప్పాను.
అనూప్, థమన్‌లకు చాలా థాంక్స్. అమోల్ రాథోడ్‌గారు ఒక కొత్త యాంగిల్‌లో చూపించారు. నేను కష్టపడలేదు కానీ నా చుట్టూ ఉన్నవారు బాగా కష్టపడ్డారు. ఈ సినిమాకి సుధాకర్‌రెడ్డిగారు బ్యాక్‌బోన్‌లా ఉండి నన్ను హైట్స్‌లో పెట్టి సినిమా తీశారు. వినాయక్ గారు సినిమాకి గుండెలా ఉన్నారు. నితిన్ నా కాలర్ పట్టుకుని ఈ సినిమా చేయిం చాడు. సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్' అని చెప్పారు. ''ఈ సినిమా పెద్ద సెన్సేషనల్ హిట్ అవుతుందని నేను నాగార్జునగారికి ప్రామీస్ చేశాను. ఆ ప్రామీస్‌ను 100% నిలబెట్టుకున్నానని రేపు ప్రేక్షకులు కూడా చెబుతారు. సినిమా తీసిన వాడిగా అఖిల్ సూపర్‌స్టార్ అవుతాడని చెబుతున్నాను' అని వి.వి.వినాయక్ అన్నారు.

Monday, September 7, 2015
కొండారెడ్డి పల్లిని దత్తత తీసుకోనున్న ప్రకాశ్‌రాజ్
ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ రాష్ట్రంలో ఓ గ్రామాన్ని దత్తత
తీసుకునేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ
మంత్రి కే తారకరామారావును కలిశారు. ప్రకాశ్ రాజ్ మహబూబ్‌నగర్ జిల్లా
కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా చేపడుతున్న చర్యల్లో భాగంగా
గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు ముందుకొచ్చిన ప్రకాశ్‌రాజ్‌కు మంత్రి
కేటీఆర్ అభినందనలు తెలిపారు.
గ్రామాన్ని దత్తత తీసుకునే ఇతివృత్తంతో తెరకెక్కిన శ్రీమంతుడు సినిమా ఇన్‌స్పిరేషన్‌తో ఆ సినిమా స్టార్ మహేశ్‌బాబు తెలంగాణలో ఓ గ్రామాన్ని, ఏపీలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు శ్రీమంతుడు హీరోయిన్ శృతిహాసన్ కూడా తమిళనాడులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకొని మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని తెలిపారు.

Monday, August 31, 2015
80వ దశకంలో అగ్ర తారలు
80వ దశకంలో దక్షిణాది ప్రేక్షకుల్ని అలరించిన అగ్ర తారలందరూ శనివారం చెన్నైలోని ఓ అతిథి గృహంలో కలుసుకున్నారు. అప్పటి మధుర స్మృతుల్ని గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. అందరూ ఎరుపురంగు వస్ర్తాల్ని ధరించి సందడి చేశారు. ఈ తారా సమ్మేళనంలో చిరంజీవి, మోహన్ లాల్, వెంకటేష్, ప్రభు, సత్యరాజ్, సుమన్, నరేష్, రాధా, సుహాసిని, శోభన, సుమలత, జయసుధ, రమ్యకృష్ణ, రేవతి, ఖుష్భూ, లిజీ, సరిత, భాగ్యరాజా, రఘు, భానుచందర్, జాకీష్రాష్ తదితరులు పాల్గొన్నారు. 80వ దశకం నాటి తారలందరూ కలిసి ఆరేళ్ల కిత్రం మొదలుపెట్టిన ఈ పునః కలయిక సంప్రదాయాన్ని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పాటిస్తుండటం విశేషం
Thursday, August 20, 2015
నార్వేలో శివమ్
రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శివమ్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ నిర్మిస్తున్నారు. రాశిఖన్నా కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం నార్వేలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభిస్తోంది. పవర్‌ఫుల్ యాక్షన్ అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. నా పాత్ర చిత్రణ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది అన్నారు. నార్వే, స్వీడన్‌లోని సుందరమైన లొకేషన్లలో పాటల్ని చిత్రీకరిస్తామని, వచ్చే నెలలో పాటల్ని విడుదల చేసి అక్టోబర్ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తామని నిర్మాత తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ఫ్యామిలీ సెంటిమెంట్, లవ్, యాక్షన్ అంశాలు మేళవించిన చిత్రమిది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగే ఈ చిత్రంలోని ప్రతి మలుపు ఆసక్తికరంగా వుంటుంది.
Wednesday, August 19, 2015
మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని : మహేశ్‌బాబు
రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతిలో భాగంగా ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని కేటీఆర్ కోరారని మహేశ్‌బాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు త్వరలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని మహేశ్ ట్వీట్ చేశారు. దత్తత తీసుకునే గ్రామం వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని ప్రకటించారు.
Subscribe to:
Posts (Atom)