Thursday, September 29, 2011

అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ ఫోటో గ్యాలరీ


అజారుద్దీన్‌ కుమారుడు అయాజుద్దీన్‌ మృతి చెందాడు.అజ్మలుద్దీన్‌ మృతదేహాన్ని జూబ్లీహిల్స్‌లోని వారి నివాసానికి తరలించారు. మృతదేహాం ఇంటికి చేరుకోగానే కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు. ఈనెల 11న పుప్పాలగూడ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో గాయపడి అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయాజ్‌తోపాటు గాయపడిన అజ్మల్‌ ప్రమాదం జరిగిన రోజు సాయంత్రమే మరణించాడు. డాక్టర్లు ఆయనకు ఆరు రోజులపాటు కాపాడడానికి సకల ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అజ్మల్‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
 

Friday, September 23, 2011

ఇంటివాడవుతున్న గంభీర్‌

 భారత జుట్టు ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ తర్వలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడు. ఢిల్లీ 29 ఏళ్ల గంభీర్‌ నగరానికి చెందిన వ్యాపారవేత్త కుమారై నటాషా జైన్‌ వివాహం చేసుకోనున్నాడు. అక్టోబరు నెలాఖరుకు లేదా నవంబరు మొదటి వారంలో పెళ్లి జరిగే అవకాశముంది.

దూకుడు రివ్యూ





Thursday, September 22, 2011

మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడి కన్నుమూత

 ప్రముఖ భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మన్పూర్‌ అలీఖాన్‌ పటౌడి గతకొద్ది రోజులుగా ఊపిరితిత్తుల నొప్పితో భాధపడుతున్నారు. అయితే ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్‌ చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. పటౌడి భార్య ఫర్మీలా ఠాగూర్‌ బాలీవుడ్‌ సినీ నటి. పటౌడికి ముగ్డురు సంతానం. సైఫ్‌ అలీఖాన్‌, సోహా అలీఖాన్‌, సోబాలీఖాన్‌. గతంలో 1965-1975 వరకు పటౌడి భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌గా ప్రాతినిథ్యం వహించాడు. పటౌడి 21 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్‌ కెప్టేన్‌గా మారాడు. 46 టెస్టులు ఆడినా పటౌడీ 2793 పరుగుల చేస్తాడు.

Wednesday, September 21, 2011

అక్కినేని నాగేశ్వరరావు ఆయన 88వ పుట్టినరోజు వేడుక సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఇంకా సినిమాలకు దూరం కాను అని చెప్పాడు ( నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ఫోటో గ్యాలరీ )

 అక్కినేని మాట్లాడుతూ...'అభిమానుల ఆదరాభిమానాలే ఇంతటి వాడిని చేసింది. నేను చనిపోయేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఈరోజు రాష్ట్రం అంతా గందరగోళంగా ఉన్నా మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.
ఆయన 88వ పుట్టినరోజు వేడుక మంగళవారంనాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'అభిమానుల ఆనందం కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నాన్నగారు...నిండునూరేళ్లూ బతకాలని కోరుకుంటున్నా'నని అన్నారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులు బాగుండాలని, వారి కుటుంబాలు కూడా బాగుండాలని' అక్కినేని అమల ఆకాంక్షించారు. అమ్మ పేరుతో ఉన్న ఈ స్టూడియోలో ఈరోజు పండుగ వాతావరణ నెలకొందని అభిమానులనుద్దేశించి నాగసుశీల వ్యాఖ్యానించారు. సుమంత్‌, సుశాంత్‌ తదితరులు తాత అక్కినేని గురించి మాట్లాడారు.

Tuesday, September 20, 2011

అన్న కూతురుని పెళ్లి చేసుకుంటున్న తమ్ముడు

టాటీవుడ్‌లో పెళ్లి వయసు దాటిపోతున్న కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోల్లో గోపీచంద్‌ మొదటి స్థానంలో ఉంటాడు. అయితే ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్తంలో తెరకెక్కుతున్న ' మొగుడు ' చిత్రంలో నటిస్తు, తాప్పీని తన భార్యగా ఊహించుకుంటున్న ఈ హీరో, తర్వలోనే నిజమైన పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ' లక్ష్యం' అనే చిత్రంలో గోపీచంద్‌, ప్రముఖ హీరో జగపతిబాబులు కలిసి అన్నదమ్ములుగా నటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. అయితే తాజాగా జగపతిబాబు, తన కూతురుని గోపిచంద్‌కు ఇచ్చి వివాహం చేయనున్నాడని తెలిసింది.

తండ్రి కాబోతున్న వరుడు

 ' వరుడు' చిత్రం తర్వాత నిజమైన వరుడుగా మారి, తన ప్రియురాలు స్నేహారెడ్డిని వివాహం చేసుకున్న స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ త్వరతలోనే తండ్రి కాబోతున్నట్లు సమాచారం. ఇటీవలే బన్నీ తన భూజానికి గాయం కోసం ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే బన్నికి తన భార్య స్నేహ గర్భవతి అని విషయం తెలిసింది. ఈ విషయాన్ని వెంటనే తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి తెలిపాడంట. అయితే ఈ విషయాన్ని బయట తెలియనివ్వకుండా చాలా జాగ్రత్త పడాలనుకున్పప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఈ వార్త తెలియడంతో మెగా అభిమానుల్లో ఒక పండగ వాతావరణం నెలకొంది. ప్రసుత్తం స్నేహారెడ్డికి మూడో నెల అని తెలిసింది. స్నేహా తల్లి కాబోతున్న విషయం తెలుసుకున్న తరువాత నుంచి బన్ని స్నేహారెడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడంట. ఈ విషయం తెలిసిన బందువులు, ప్రెండ్స్‌ అందరూ కూడా బన్నికి శుబాకాంక్షలు తెలియజేస్తున్నారట.

Friday, September 16, 2011

చివరి వన్డేకు కెప్టెన్‌గా రావుల్‌ ద్రావిడ్‌... ?

 భారత్‌, ఇంగ్లాండ్‌ చివరి వన్డేకు కెప్టెన్‌గా ద్రావిడ్‌ అనే సమాచారం. ఇంగ్లాండ్‌ పర్యటనలో భారత్‌ కనీసం ఒక మ్యాచ్‌ కూడా గెలవలేదు. నేడు జరగబోయే మ్యాచ్‌లో రావుల్‌ ద్రావిడ్‌ కెప్టెన్‌గా ఉన్నట్లు సమాచారం. ద్రావిడ్‌కు ఇదే చివరి వన్డే.