Friday, March 4, 2011

అల్లు అర్జున్‌ పెళ్లి ఫోటోస్‌ .......

అల్లు అరవింద్‌ కుటుంబం మీద పోలీస్‌ కేసు

ఈ నెల 6న తేదీన పెళ్లిపీటలపై ఎక్కనున్న సినీ నటుడు అల్లు అర్జున్‌తో సహా మరో ముగ్గురిపై నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అల్లు అర్జున్‌, అల్లు శిరీష్‌ల పేర్లు కూడా వున్నట్లు సమాచారం. అక్రమంగా భూమిని ఆక్రమించారని ఓ న్యావాది కోర్టులో కేసు వేశారు. దీనిపై పోలీసు అధికారి మాట్లాడుతూ కేసు రిజిస్టర్‌ చెయ్యడం జరిగింది. కానీ నిజంగా కబ్జా చేసారా లేదా అనేది విచారణలో తేలుతుంది. అని చెప్పారు.

Thursday, March 3, 2011

పాకిస్థాన్‌ హాట్రిక్‌

 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ వరుసగా మూడో విజయం సాధించింది. మొదటి మ్యాచ్‌ కెన్యా, రెండవ మ్యాచ్‌ శ్రీలంక, ఇంకా మూడో మ్యాచ్‌ కెనడా మూడింట్టిలో విజయం సాధించింది. పాకిస్థాన్‌ కెప్టెన్‌ అఫ్రిధీ తన బౌలింగ్‌లో తన సత్తా చాటాడు. బ్యాటింగ్‌లో విఫలమైనా బౌలింగ్‌లో మాత్రం ఇప్పటికి 14 వికెట్లు తీసుకున్నాడు. మూడో మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 184 పరుగులకు అలౌట్‌ అయ్యింది. అనంతరం బ్యాటింగ్‌ దిగిన కెనడా జట్టు 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పాక్‌ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.

పెళ్లి కాకుండా... బిడ్డకు తల్లైయిందా..?

 టాలీవుడ్‌ సెక్సీ బ్యూటీ త్రిష ఓ బిడ్డకు తల్లి అయ్యిందని వార్తలు కోడైకూస్తున్నాయి. ఓ వ్యాపారవేతతో కలిసి త్రిష ఓశిశువును ప్రసవించదని వదంతులు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై త్రిష ఏమంటుందటే... ఇంతవరకు నాపై బురద చల్లింది సరిపోదా ? ఇక ఎంతకాలం నాతో గేమ్స్‌ ఆడుకుంటారు. ఇదివరకు చాలామంది వ్యక్తులతో పెళ్లి చేశారు. ఇప్పుడు ఏకంగా బిడ్డను కూడా పుట్టించిందని వార్తలు రాస్తున్నారని మీడియాపై చిందులు వేస్తుంది త్రిష ఇంతకుముందు ఓ రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ప్రచారం చేశారు. ఇప్పుడేమో ఓ వ్యాపారవేత్తతో ఓ బిడ్డను కనేసిందని వార్తలు రాస్తున్నారని త్రిష గరంగరం అయిపోతుంది.

ఇలాగైతే కప్‌ గోవిందా !

 ఇలా అడితే కప్‌ గోవిందా ! ఇంగ్లాండ్‌ జట్టు మొదటి మ్యాచ్‌ నుంచి కష్టాలతో ప్రారంభంమైయింది. మొదటి మ్యాచ్‌ నెదర్లాండ్‌పై చాలా కష్టపడి గెలిచింది. ఇంకా రెండో మ్యాచ్‌ భారత్‌తో ' టై ' అయ్యింది. ఇరు జట్టు పరుగుల వరద కురిపించారు. ఇంకా మూడో మ్యాచ్‌ ఐర్లాండ్‌ , ఇంగ్లాండ్‌ మధ్య జరిగిన మధ్య జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఇంకా ఐదు బంతులు మిగిలివుండగానే విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ జట్టు ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లో 300 పైగా పరుగులు చేసింది. ప్రతర్థి జట్టు దీటుగా సమాధానం చేసింది. ఇంగ్లాండ్‌కు ఇంకా మూడు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. వీటిలో తప్పని సరిగా రెండు మ్యాచ్‌లు గెలిచితీరాలి. లేకపోతే కప్‌ గోవిందా !
చిన్నజట్టేనని చిన్నచూపు చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఐర్లాండ్‌ జట్టు ఇంగ్లాండ్‌పై ఘన విజయం సాధించింది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్‌ ఇంకా ఐదు పరుగులు మిగిలివుండగానే ఐర్లాండ్‌ ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. కె విన్‌ఒబ్రెయిన్‌ అద్భుత సెంచరీతో ఐర్లాండ్‌ చిరస్మరణీయ విజయం సాధించి క్రికెట్‌ చరిత్రను తిరగరాసింది. అంతకముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 327 పరుగులు చేసింది. పీటర్సన్‌ 59, ట్రాట్‌ 92, బెల్‌ 81 పరుగులు చేశారు. గత వరల్డ్‌కప్‌ పాక్‌ను కంగుతినింపిచిన ఐర్లాండ్‌ ఈ సారి ఇంగ్లాండ్‌ భరతం పట్టింది.

Wednesday, March 2, 2011

మొదలైంది ఫిక్సింగ్‌ గోల ..

లంక క్రికెటర్లు మహేలా జయవర్థనే, సమరవీరపై ఒక టివి ఛానల్‌ చేసిన మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు నిరాధారమైననవి, ఆ ఛానల్‌ ప్రచారం చేసిన కథానాల్లో వాస్తవం లేదని శ్రీలంక క్రికెట్‌ ఆసోసియేషన్‌ పేర్కొంది. ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌- ఎలో పాకిస్థాన్‌, లంక మధ్య ఫిబ్రవరి 26న కొలంబోలో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో లంక 11 పరుగుల తేడాతో ఓడిపాయిన సంగతి తెలిసిందే. 277 పరుగుల లక్ష్య చేదనలో లంక ఇన్నింగ్స్‌ 266/9 వద్ద ముగిసింది. లంక బ్యాట్స్‌మెన్‌ మహేల జయవర్థనే, తిలాన్‌ సమరవీరలు ఉద్వేశపూర్వ కంగానే ఔటయ్యారని లంక అధికారిక టీవీ ఛానెల్‌ ఆరోపించింది. లంక మ్యాచద్‌ ఓడిపోతుందని 18 వేల డాలర్లు పందెం కాశాడని, దీనికి తగ్గట్టుగానే జయవర్థనే 2 పరుగులకు ఔట్‌ కాగానే ఇండిపెండెంట్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ( ఐటీఎస్‌) ఛానెల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణల్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఖండించింది.
ఆస్ట్రేలియా, జింబాబ్వే
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌, హాడిన్‌ తొలి 10 ఓవర్లలో ఆసీస్‌ ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడిన్‌ ఆడిన తీరుపై సందేహాలు నెలకొన్నాయి. ఇద్దరు ఓపెనర్లు కలిసి 11 ఓవర్లలో కేవలం 28 పరుగుల మాత్రమే చేశారు. 15 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 53 మాత్రమే. ఓపెనర్లు నెమ్మదిగా ఆడడంపై సందేహాలు తలెత్తడంతో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం మ్యాచ్‌ను సమీక్షించినట్లు తెలుస్తోంది.

బికినీలో ఇలియానా .!

 ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కిన ' శక్తి' సినిమాలో ఇలియాన హీరోయిన్‌ నటిస్తోన్న సంగతి తెల్సిందే. ఈసినిమాలో ఇలియానా బికినీతో దర్శనమివ్వబోతోందిట. ప్రస్తుతానికి ఈ విషయాన్ని గోప్యంగా వుంచుతున్నా. రిలీజ్‌ నాటికి ఇలియానా బికినీ ఫొటోల్ని విడుదల చేసి, సినిమాపై హైప్‌ని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నారట చిత్ర దర్శక నిర్మాతలు. అప్పుడెప్పుడో ' ఆట' సినిమాలో బికినీతో కన్నించిన ఈ గోవా బ్యూటీ, ఆడపా దడపా చాలీచాలని దుస్తుల్లో తన గ్లామర్‌ని తడి తడిని అరబోసేస్తూనే వుంది వెండితెరపై. చూద్దాం. ' శక్తి ' సినిమా కోసం బికినీలో ఇలియానా, ఎన్టీఆర్‌ని ఏ రెంజ్‌లో వేడెక్కించిందో...!

Monday, February 28, 2011

వెంకటేష్‌తో ' సావిత్రి '

 వెంకటేష్‌ హీరోగా ..... తేజ దర్శకత్వంలో ' సావిత్రి' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. గతంలో లక్ష్మీ, తులసీ, మల్లీశ్వరి, నాగవల్లి వంటి టైటిల్స్‌తో సినిమాలు చేసిన వెంకీ... ఈసారి మాత్రం ' సావిత్రి' టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వెంకటేష్‌, తేజ కాంభినేషన్‌లో వస్తున్న తొలి చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు ఆదివారం వైజాగ్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగినట్లుగా తెలిసింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.