Tuesday, January 18, 2011

మరి మిరపకాయ ఎంత ఘాటు

 సంక్రాంతికి రిలిజ్‌ అయిన మూడు సినిమాలో ఏది హిట్‌ అయ్యింది. పరమవీరచక్ర, మిరపకాయ, అనగనగా ఓ ధీరుడు మూడు సినిమాలు సంక్రాంతి విడుదల చేశారు. ఒకటి గ్రాఫిక్స్‌ పరంగా బాగుంటే, మరోకటి విలువలు పరంగా స్కోర్‌ చేసింది.దాంతో మాస్‌ జనానికి కేవలం ' మిరపకారు' మాత్రమే ఘూటుగా అనిపించింది. అంతే రవితేజ పంట పడింది. రవితేజ ఎనర్జిటిక్‌ కామెడీ, తమన్‌ సంగీతం ఈ చిత్రంలో హైలైట్స్‌. ఒకే తరహా నటనే అయినప్పటికీ రవితేజ ప్రేక్షకులను ఎప్పటిలానే వినోదపరుస్తారు. యాక్షన్‌, డాన్స్‌లు కూడా బాగా చేశాడు. ఈ సినిమాలో రవితేజ పోలీసు అధికారిగా పనిచేస్తాడు.

మూడు పాత్రలు చేసినా లాభం ఏమిటి ?

బాలకృష్ణ గారు మీరు ఎన్ని పాత్రాలు వచ్చిన లాభం లేకపోయింది. జనాలలో మీకు పోత్రహం లేకపోయింది. అందుకు మీరు ఇంకోసారి సమరసింహ రెడ్డి, లక్ష్మీనారాయణ లాంటి సినిమాలు తీసుకోగలరు. అంతే తప్ప మీరు ఎన్ని పాత్రాలు వచ్చిన లాభము లేదు. కనుక మీరు గెటపు మార్పు చేయవలేను అని కోరుకుంటున్నాను. అభిమానులను రంజింప చేసే అన్ని సినిమా తీయగలరు. మీరు తీసే సినిమాలో ఫ్యామిలి, కామేడీ, అలాగే పాటలు మంచి హిట్టుకోట్టే సినిమా తీసి మళ్లీ మీరు నందమూరి వంశం పేరు ప్రతిష్ఠ నిలబెట్టగలరు. ప్రతి సినిమాలో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయ పాత్రలు చేస్తు ప్రేక్షకులను అభిమానులకు రోతపుట్టించవద్దు.

Monday, January 17, 2011

ఓపెనరు ఎవరు ?

రెండో వన్డేలో అనూహ్య విజయం సాధించి సిరీస్‌ సమం చేసింది. ఈ రోజు మూడో వన్డేకు భారత జట్టు సిద్దం కానున్నంది. గంభీర్‌, సెహ్వాగ్‌ ఇంతక ముందే జట్టు దూరం అయ్యారు. అలాగే సచిన్‌ కూడా రెండో వన్డే మ్యాచ్‌లో గాయపడ్డాడు. విజరుకి తోడుగా మరో ఓపెనర్‌ ఎవరు అనేది సమస్య వచ్చింది. రోహిత్‌ శర్మకు అవకాశం దక్కవచ్చంటున్నారు. ఇంకా మూడో వన్డే ఈ రోజు సాయంత్రం ప్రారంభంమవుతుంది. మూడో వన్డే మ్యాచ్‌లో అందరు రాణిస్తేనే విజయం లేకపోతే పరాజయం అప్పటికి 2-1 తేడాతో వుంటుంది.

5 రోజుల్లోనే రవితేజ సినిమా

సంక్రాతిని మిరపకారు చిత్రంలో అభిమానులను అలరించిన రవితేజ త్వరలో సినిమా తీయనున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఈ చిత్రంలో నటిస్తున్నందుకుగాని రవితేజగానీ, చార్మిగానే రెమ్యూనేషన్‌ తీసుకోవటం లేదు. అయితే ఈ చిత్రాన్ని ఐదు రోజుల్లో పూర్తి చేయడానికి దర్శకులు రామ్‌ గోపాల్‌వర్మ ఆలోచిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందంట. ఈ చిత్రానికి దొంగల ముఠా అనే పేరును ఖరారు.

దెబ్బమీద మరో దెబ్బ

భారత్‌ జట్టుకు కష్టాలమీద కష్టాలు వచ్చినవి. సెహ్వాగ్‌, గంభీర్‌, ప్రవీణ్‌ కుమార్‌, సచిన్‌ ఇల్లా ఒకరి తరువాత ఒకరు గాయపడుతున్నారు. దక్షిణాఫ్రికా మంచి ఫామ్‌లో ఉంది. టీమిండియా గాయాలతో బాదపడుతున్నారు. ప్రపంచకప్‌ ఇంకా సమయం కొద్ది దూరంలో వుంది. భారత్‌ జట్టు ఇప్పటికే నలుగురు గాయాలతో బాదపడుతున్నారు. దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో రెండో వన్డేలలో సచిన్‌ గాయంతో మిగిలిన మూడు మ్యాచ్‌లలో అదుబాటులో ఉండబోడన్న విషయం. దక్షాణాఫ్రికాతో జరుగుతన్న వన్డే మ్యాచ్‌లలో మురళీ విజరు తోడుగా మరో ఓపెనర్‌గా ఎవరు వస్తారు.

ప్రపంచకప్‌కు టీమిండియా రెడీ : ఇద్దరికి నిరాశ


ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో జట్టు
 ప్రపంచకప్‌కు భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. జట్టు కెప్టెన్‌గా ధోని,వైస్‌ కెప్టెన్‌గా వీరేంద్ర సెహ్వాగ్‌ను కొనసాగిస్తూ ముగ్గురు స్పీన్‌, నలుగురు పేస్‌ బౌలర్లతో జట్టుర కూర్పు చేశారు. శ్రీశాంత్‌, ఇషాంత్‌ శర్మ, రోహిత్‌ శర్మ, పార్థివ్‌ పటేల్‌కు వరల్డ్‌కప్‌లో చోటు దక్కలేదు.ముగ్గురు స్నిన్నర్లు, ఇద్దరు ఆల్‌ రౌండర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.
టీమిండియా జట్టు : మహేంద్రసింగ్‌ ధోనీ ( కెప్టెన్‌ ) వీరేంద్ర సెహ్వాగ్‌ ( వైస్‌ కెప్టెన్‌ ), సచిన్‌ టెండూల్కర్‌, గౌతమ్‌ గంహీర్‌, విరాట్‌ కోహ్లీ, యువరాజ్‌ సింగ్‌, సురేష్‌ రైనా, యూసుఫ్‌ పటాన్‌, హర్బజన్‌ సింగ్‌, జహీర్‌ఖాన్‌, నెహ్రా, ప్రవీణ్‌ కుమార్‌, మూనాఫ్‌ పటేల్‌, ఆశ్విన్‌, పీయూష్‌ చావ్లా

Sunday, January 16, 2011

ఒకటి - ఒకటి సమానం

భారత్‌, దక్షిణాఫ్రికా మద్య జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌లో 1-1 సమానంగా ఉన్నాయి. తొలి వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇంకా రెండో వన్డేలో భారత్‌ విజయం సాధించింది. తొలి వన్డేలో అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో సౌతాఫ్రికా పైచెయి సాధించింది. ఇంకా రెండో వన్డేలో బారత్‌ 190 పరుగులకే అలౌట్‌ అయ్యింది. దీనికి బదులు సౌతాఫ్రికా 189 పరుగులు చేసింది. స్మిత్‌ 77 పరుగులు చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. భారత్‌ బౌలర్లలు విజృబించి మ్యాచ్‌ విజయం సాదించారు. ముఖ్యంగా మునాఫ్‌ పటేల్‌ నాలుగు వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ తీసుకున్నాడు. భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ప్రారంభించింది. మురళీ విజరు 16, సచిన్‌ 24, విరాట్‌ కోహ్లీ 22, యువరాజ్‌ సింగ్‌ 53, ధోని 38, రైనా 11, రోహిత్‌ శర్మ 9, హర్భజన్‌ సింగ్‌ 3, ఖాన్‌ 0, నెహ్రా 6 పరుగులు చేశారు. మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అర్థ సెంచరీ చేశాడు. ఇంకా రెండో వన్డేలో యువరాజ్‌ సింగ్‌ అర్థ సెంచరీ చేసి టాప్‌ స్కోరుగా నిలిచాడు. మూడో వన్డేలో అర్థ సెంచరీ లేక సెంచరీ ? ఈసారి వంతు ఎవరిది. రైనా, రోహిత్‌ శర్మ, దోని, విజరు విలలో ఎవరు ?

తీర్పు మార్పు ....

 ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మద్య జరుగుతున్న ఏడు వన్డే సిరీస్‌లో మొదటి వన్డేలో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. టెస్టు సిరీస్‌, టి20 మ్యాచ్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టు వన్డే సిరీస్‌లో రుచి చూపించింది. వాట్సన్‌ తన సత్తా వన్డేలో చూపించాడు. వాట్సన్‌ 150 బంతులలో 4 సిక్స్‌లు, 12 ఫోర్లు సహాయంతో 161 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. తొలి వన్డేలో ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్‌ ఇచ్చింది.