శ్రీదేవి
మృతితో ఆమె ఇద్దరు కుమార్తెలు
జాన్వి, ఖుషి గురించి దిగులు పడుతున్నానని నటి షాలినీ కపూర్ ఆవేదన
వ్యక్తం చేశారు. జాన్వి కథానాయికగా నటిస్తున్న తొలి సినిమా ‘దఢక్’.
ఇందులో షాలినీ కపూర్ ఆమె తల్లి పాత్ర పోషిస్తున్నారు. శ్రీదేవి మరణవార్త విని
దిగ్భ్రాంతికి గురయ్యానని ఆమె చెప్పారు.
‘అద్భుతమైన నటి శ్రీదేవి మృతి నన్ను
చాలా బాధించింది. ఆమె చక్కటి నటన, విభిన్నమైన పాత్రలు
ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటాయి. నా ఆలోచనలన్నీ ఆమె కుటుంబ
సభ్యులు, శ్రేయోభిలాషుల చుట్టూ తిరుగుతున్నాయి. నేను అన్నింటి కంటే ఎక్కువగా
ఆమె ఇద్దరు కుమార్తెల గురించి బాగా దిగులుపడుతున్నా’.
‘‘దఢక్’లో జాన్వి తల్లి పాత్రలో
నటిస్తున్నారు. ఆమెకి, శ్రీదేవికి మధ్య ఉన్న ప్రేమ గురించి నాకు బాగా
తెలుసు. ఆ అనుబంధాన్ని మాటల్లో వివరించలేం. ఆమె గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా
ఉంది. శ్రీదేవి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’ అని ఆమె
పేర్కొన్నారు.