‘బేఫికర్ ’ సినిమాలో హీరోగా నటించే అవకాశం ముందుగా తనకే
వచ్చిందన్న రూమర్లను బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్
తోసిపుచ్చాడు. ఒకవేళ తనకు అవకాశం వచ్చినా అటువంటి సినిమాలో తాను నటించబోనని
స్పష్టం చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసునని
చెప్పాడు. ‘బేఫికర్ ’ సినిమా వాస్తవానికి దూరంగా ఉందని పేర్కొన్నాడు.
ప్రేమ పట్ల భారతీయ యువత ఆలోచనలను ప్రతిబింబించలేదని వివరించాడు.
సినిమాలు వాస్తవానికి దగ్గరగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని అభిప్రాయపడ్డాడు. పింక్, నీర్జా, ధోని బయోపిక్ చిత్రాలు విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనమని చెప్పాడు. హిట్, మంచి సినిమాకు తేడా ఉందన్నాడు. భారీ అంచనాలతో విడుదలైన బేఫికర్’ బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన సంగతి తెలిసిందే.
రణవీర్ సింగ్ తో తనకు విభేదాలు లేవని స్పష్టం చేశాడు. ఒకే ఏజ్ గ్రూపుకు చెందిన తామిద్దరం తగిన కథలను ఎంపిక చేసుకుని సినిమాలు చేస్తున్నామని చెప్పాడు. రణ్‌వీర్ ప్రస్తుతం సంజయ్‌లీలా భన్సాలీ ’పద్మావతి’ సినిమాలో నటిస్తున్నాడు. సుశాంత్ తాజా చిత్రం ’రబ్తా’ ఫిబ్రవరిలో విడుదలకానుంది.

No comments:
Post a Comment