గ్లోబల్‌స్టార్
ప్రియాంక చోప్రా నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ‘బేవాచ్’. ఇందులో ప్రియాంక
విలన్‌గా కీలక పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. దేశీగర్ల్
ప్రియాంక ట్రైలర్‌లో ఎలా కన్పించబోతోందోనని అభిమానులు ఎంతో ఆతృతగా
ఎదురుచూశారు కానీ వారి ఆశ అడియాసైంది. ఎందుకంటే ట్రైలర్‌లో ప్రియాంక
అర సెకనుకు మించి కన్పించలేదు. దాంతో అసలు ప్రియాంక సినిమాలో ఉందా..
లేదా.. అతిథిగా అలా వచ్చి వెళ్లిపోతుందా.. అంటూ అభిమానులు సోషల్‌మీడియాలో
కామెంట్స్ చేశారు.
ఈ విషయమై ప్రియాంక తల్లి మధు చోప్రా స్పందిస్తూ.. ఇదంతా చిత్రబృందం పబ్లిసిటీ కోసం చేసిందేనని సినిమాలోని బెస్ట్ పార్ట్‌ను ముందే చూపించేస్తే అంత పబ్లిసిటీ ఉండదని వారు ఇలా చేశారని పేర్కొన్నారు. సినిమాలో ప్రియాంకదే బెస్ట్ పార్ట్ అని మధు అన్నారు. ఇంతకుముందు తన కుమార్తెపై వచ్చే నెగెటివ్ వార్తల గురించి ఎక్కువగా టెన్షన్ పడేదాన్నని, ఇప్పుడు అసలు పట్టించుకోవడంలేదని, ఎందుకంటే ప్రియాంక గురించి తల్లిగా తనకే బాగా తెలుసన్నారు. ప్రియాంకపై ఎవరైనా తప్పుగా రాసినా నమ్మనని, ఆమె చాలా నిజాయతీగా ఉంటుందని చెప్పారు. అలా అని ప్రియాంక ఏ విషయంలోనూ పొరపాటు చేయదని తాను అనడంలేదు కానీ, తప్పు మాత్రం చేయదని కుమార్తెను వెనకేసుకొచ్చారు మధు. సేథ్ గోర్డాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ప్రియాంక క్రిస్మస్ సందర్భంగా ఇండియాకి వచ్చింది. కొద్దిరోజులు కుటుంబంతో గడిపి తిరిగి అమెరికా వెళ్లిపోతుంది.

No comments:
Post a Comment